శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్ క్యాంపస్ కళాశాలల్లో జులై 17 నుంచి పీజీ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ సీఎన్ కృష్ణా నాయక్, ప్రొఫెసర్ రంగస్వామి తెలిపారు.
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్ క్యాంపస్ కళాశాలల్లో జులై 17 నుంచి పీజీ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ సీఎన్ కృష్ణా నాయక్, ప్రొఫెసర్ రంగస్వామి తెలిపారు. జులై 3 నుంచి తరగతులు పునప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, వర్సిటీలో ఏర్పడిన తాగునీటి ఎద్దడి నేపథ్యంలో వాయిదా వేశామన్నారు. బోధన సిబ్బంది మాత్రం జులై 3 నుంచే హాజరు కావాలన్నారు. ఇదిలా ఉండగా, హాస్టళ్లలో చేపడుతున్న మరమ్మతులను ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్, రిజిస్ట్రార్ కె.సుధాకర్‌బాబు పరిశీలించారు. గడువులోపు చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు.