కరీంనగర్ : పెట్టుబడి అవసరం లేని ప్రకృతి వ్యవసాయంపై గ్రామ భారతి(ఎన్‌జీవో) తెలంగాణ రాష్ట్ర సంస్థ ఆధ్వర్యంలో జూన్ 1, 2, 3వ తేదీల్లో స్థానిక పద్మనాయక కల్యాణ మంటపంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కోసం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1500 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామ భారతి రాష్ట్ర అధ్యక్షుడు స్తంభాద్రి రెడ్డి తెలిపారు. పేర్లు నమోదు చేయించుకున్న వారు ఉదయం 8 గంటలకే హాజరు కావాలని ఆయన సూచించారు. ఉచిత అల్పాహారం, భోజన వసతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్ హాజరుకానున్నారు.