ఆన్‌లైన్‌ క్లాసెస్‌.. ఫోన్‌ సిగ్నల్‌ కోసం 5 కిలో మీటర్లు! | Girl Travels 5kms On Bike Daily To Get Mobile Signal For Online Classes | Sakshi
Sakshi News home page

చదువుల తల్లికి ఎంత కష్టం..

Published Tue, Mar 2 2021 1:39 PM | Last Updated on Tue, Mar 2 2021 6:33 PM

Girl Travels 5kms On Bike Daily To Get Mobile Signal For Online Classes - Sakshi

పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన మొర్రిగూడలో ఏ మొబైల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ అందవు. దీంతో సరస్వతి విద్యను..

తిర్యాణి (ఆసిఫాబాద్‌): ఈ చిత్రంలోని చిన్నారి పేరు సరస్వతి విద్య. ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం మొర్రిగూడలోని గిరిజన కుటుంబానికి చెందిన కుడిమెత భగవంతరావు కూతురు. సరస్వతి మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. సాక్షాత్తూ చదువుల తల్లిని తన పేరులో నిలుపుకొన్న ఈ చిన్నారికి చదువంటే అమితమైన ఇష్టం. కానీ, కరోనా వల్ల తను చదివే పాఠశాలను మూసివేసి, ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. అయితే, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన మొర్రిగూడలో ఏ మొబైల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ అందవు. దీంతో సరస్వతి విద్యను తండ్రి ఇదిగో ఇలా ప్రతిరోజూ ఐదు కిలోమీటర్ల దూరంలో.. సిగ్నల్‌ వచ్చే ప్రాంతానికి బైక్‌పై తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement