హైదరాబాద్: నిబంధనలకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుని మార్చి17లోపు నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, పోలీసు కమిషనర్‌లకు హెచ్‌ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్న నగరంలోని పలు కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది సోమరాజు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. ఫంక్షన్‌హల్, షాపింగ్‌మాల్స్‌లో తరగతులు నిర్వహిస్తూ, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సహాయంతో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. నిబంధనలు వ్యతిరేకంగా కోచింగ్ సెంటర్‌లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకునేలా జీహెచ్‌ఎంసీ కమిషనర్, సిటీ పోలీసు కమిషనర్ ఆదేశించాలని ఆయన హెచ్‌ఆర్సీని కోరారు. దీంతో హెచ్‌ఆర్సీ స్పందించి ఈ ఆదేశాలు జారీచేసింది.