private coaching centers
-
Delhi: 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవద్దు
న్యూఢిల్లీ: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసేందుకు, వాటిని చట్టపరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు ప్రకటించింది. 16 ఏళ్లలోపు విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవద్దని, ర్యాంకులు, మంచి మార్కులు గ్యారెంటీ అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలివ్వరాదని గురువారం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కోచింగ్ కేంద్రాల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, అగ్ని ప్రమాదాలు, అసౌకర్యాలు, విద్యాబోధన విధానాలకు సంబంధించిన పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్న నేపథ్యంలో వీటిని ప్రకటించింది. ‘గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ అర్హత కలిగిన వారిని ట్యూటర్లుగా పెట్టుకోరాదు. విద్యార్థులను ఆకర్షించేందుకు మంచి మార్కులు, ర్యాంకు గ్యారెంటీ అంటూ వారి తల్లిదండ్రులకు తప్పుడు హామీలు ఇవ్వకూడదు. 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోరాదు. సెకండరీ స్కూలు పరీక్ష రాసిన వారిని మాత్రమే తీసుకోవాలి’అని తెలిపింది. కోచింగ్ నాణ్యత, వారికి కల్పించే సౌకర్యాలు, సాధించిన ఫలితాల గురించి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తప్పుదోవ పట్టించే ఎలాంటి ప్రకటనలను కోచింగ్ సంస్థలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి తక్షణమే అవసరమైన సాయం అందించే యంత్రాంగం ఉండాలి. సైకాలజిస్టులు, కౌన్సిలర్ల పేర్లను విద్యార్థులు, తల్లిదండ్రులకు అందజేయాలని కేంద్ర విద్యాశాఖ ఆ మార్గదర్శకాల్లో వివరించింది. -
స్టడీ మెటీరియల్స్ దండగ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు సిఫార్సు చేస్తున్న స్టడీ మెటీరియల్స్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతలేని మెటీరియల్‌ను విద్యార్థులకు అంటగడుతున్నారని నిపుణుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మెటీరియల్‌తో లాభం కన్నా నష్టమే ఎక్కువని, క్లిష్టమైన ప్రశ్నలకు సమా ధానాలు రాయడం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. మూస విధానంలో, షార్ట్ కట్ పద్ధతిలో మెటీరియల్స్ ఉంటున్నాయని చెబుతున్నారు. కొన్ని మెటీరియల్స్ అడ్డగోలుగా, తప్పులతడకగా ఉంటున్నాయని.. అకడమిక్ పాఠ్య పుస్తకాల్లో చదివిన దానికి, మెటీరియల్స్‌లో ఇచ్చే దానికి పోలిక ఉండటం లేదని, దీనిపై వివరణ అడిగినా కోచింగ్ సెంటర్స్ సరిగా స్పందించట్లేదని అభ్యర్థులు అంటున్నారు. అంటగట్టేస్తున్నారు.. గ్రూప్స్‌కు ఉన్న డిమాండ్, అభ్యర్థుల్లో ఆత్రుతను కోచింగ్ కేంద్రాలు సొమ్ము చేసుకుంటున్నాయి. వాటిని ఎవరు రాశారు, రచయిత ప్రొఫైల్ ఏంటి అనే విషయాలను వెల్లడించలేదు. చరిత్ర మెటీరియల్స్‌లో చారిత్రక తేదీలు కూడా తప్పుగా ఇస్తున్నారని, అభ్యర్థులు గుర్తించి చెబితే అచ్చు తప్పులని దాటేస్తున్నారని అంటున్నారు. కోచింగ్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ఎక్కడ మెటీరియల్ కొనాలో నిర్వాహకులు సూచిస్తున్నారని, ఇదంతా వ్యాపారంగా సాగుతోందని నిపుణులు అంటున్నారు. డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులతో ముందే మాట్లాడుకుని, వారికి నెలకు కొంత ముట్టజెప్పి మెటీరియల్ రాయిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రూప్స్ ప్రకటన విడుదలైన మర్నాటి నుంచి ఈ ప్రక్రియ మొదలైందని, ఎక్కడా నిష్ణాతులైన అధ్యాపకులను ఎంపిక చేసుకోలేదనే వాదన వినిపిస్తోంది. ఒక్కో అభ్యర్థి కేవలం మెటీరియల్ కోసమే రూ. 7 వేల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అకాడమీ దగ్గర బారులు.. తెలుగు అకాడమీ స్టడీ మెటీరియల్‌లో నాణ్యత ఉందని, చాప్టర్లలో లోతైన విధానం కనిపిస్తోందని అన్ని వర్గాలు అంగీకరిస్తున్నా యి. నిష్ణాతులైన అధ్యాపకులతో గ్రూప్స్ సిలబస్ ప్రకారం మెటీరియల్ సిద్ధం చేయించినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే తగినవిధంగా పుస్తకాలు అందుబాటులో లేవు. మెటీరియల్ ముద్రణ, పంపిణీలో జరిగిన జాప్యమే దీనికి కారణమని అకాడమీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే మెటీరియల్ విడుదలవగా విక్రయ కేంద్రం వద్ద అభ్యర్థులు బారులు తీరుతున్నారు. లాభాలే కొలమానంగా.. ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు లాభాలే కొలమానంగా పనిచేస్తున్నాయి. అభ్యర్థులకు ఇచ్చే మెటీరియల్‌లో నాణ్యత కనిపించట్లేదు. ఇది వ్యాపారమైనప్పుడు నాణ్యత ఉంటుందని ఆశించడం కూడా సరికాదు. తెలుగు అకాడమీ లాభాపేక్ష లేకుండా పుస్తకాలు ముద్రిస్తుంది. కాబట్టి నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పని ఓపెన్ వర్సిటీ కూడా చేయాలి. అక్కడ అవసరమైన వనరులున్నాయి. – ప్రొఫెసర్ హరగోపాల్ (సామాజిక వేత్త) ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బెస్ట్ ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివిన అభ్యర్థి గ్రూప్స్‌లో ఎలా ప్రశ్న వచ్చినా సమాధానం రాయగలడు. ప్రైవేటు స్టడీ మెటీరియల్ ఫాలో అయితే ప్రధాన పరీక్షలో తికమకపడటం ఖాయం. నాణ్యత కన్పించని ప్రైవేటు మెటీరియల్‌కు దూరంగా ఉండటమే మంచిది. – దండెబోయిన రవీందర్ (ఉస్మానియా వర్సిటీ వీసీ) డెప్త్ ఉండట్లేదు కోచింగ్ కేంద్రం వాళ్లు తాము చెప్పిన చోట మెటీరియల్ కొనాలని చెప్పారు. అకాడమీ మెటీరియల్‌కు, ప్రైవేటు స్టడీ మెటీరియల్‌కు అస్సలు పోలిక ఉండట్లేదు. లోతైన అవగాహన కనిపించట్లేదు. కొన్న తర్వాత గానీ ఈ విషయం తెలియట్లేదు. హిస్టరీలోనైతే సంఘటన తేదీలు కూడా తప్పుగా ముద్రించారు. చరిత్రలో వరుస సంఘటనల్లో కొన్ని తప్పించారు. దీంతో సబ్జెక్టు పూర్తిగా అర్థం కావట్లేదు. – సబ్బతి రమ్య (గ్రూప్స్ అభ్యర్థిని) -
ప్రశ్నపత్రం ఫొటో తీసి వాట్సప్‌లో..
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఆర్థికశాస్త్రం ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు. వీరిలో రిషబ్(29), రోహిత్(26)లు ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్లుగా పనిచేస్తుంటే.. తౌకీర్(26) ప్రైవేటు కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. ‘పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాన్ని ఉదయం 9.45 గంటలకు బయటకు తీయగానే రిషబ్, రోహిత్‌లు వాటి ఫొటోలు తీసి తౌకీర్‌కు పంపారు. అతను వాటిని తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు వాట్సప్ ద్వారా చేరవేశాడు. లీకైన ఆర్థికశాస్త్రం పేపర్‌ను అందుకున్న ఓ విద్యార్థితో పాటు సీబీఎస్ఈ ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్ నంబర్ల ఆధారంగా తౌకీర్‌ను అదుపులోకి తీసుకున్నాం’ అని కుమార్ తెలిపారు. రిషబ్, రోహిత్, తౌకీర్లు గత ఐదేళ్లుగా స్నేహితులనీ, తౌకీర్ ప్రోద్బలంతోనే ఇద్దరు నిందితులు ప్రశ్నపత్రం లీక్‌కు పాల్పడ్డారన్నారు. పేపర్ లీక్‌కు ప్రతిఫలంగా తౌకీర్ వీరిద్దరికీ రూ.2,000 నుంచి రూ.5,000 వరకూ ఇచ్చాడన్నారు. -
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోండి: హెచ్ఆర్సీ ఆదేశం
హైదరాబాద్: నిబంధనలకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుని మార్చి17లోపు నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్న నగరంలోని పలు కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది సోమరాజు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఫంక్షన్‌హల్, షాపింగ్‌మాల్స్‌లో తరగతులు నిర్వహిస్తూ, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సహాయంతో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. నిబంధనలు వ్యతిరేకంగా కోచింగ్ సెంటర్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకునేలా జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ పోలీసు కమిషనర్ ఆదేశించాలని ఆయన హెచ్ఆర్సీని కోరారు. దీంతో హెచ్ఆర్సీ స్పందించి ఈ ఆదేశాలు జారీచేసింది.