శెట్టూరు: ఈ చిత్రంలో ఒకే గదిలో ఇరుకుగా కూర్చున్నది శెట్టూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే ఆరో తరగతి విద్యార్థులు. హైస్కూల్ అంటున్నారు గదులు లేవా... అనే సందేహం కలగవచ్చు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. పాఠశాలలో తరగతులు 14 ఉన్నాయి. అయితే గదులు మాత్రం తొమ్మిదే ఉన్నాయి. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 483 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులతో పాటు పాఠశాల కార్యాలయం, ఉపాధ్యాయుల విశ్రాంతి గది కూడా ఇందులోనే ఉన్నాయి. ఈ సమస్యను పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నించినా అదనపు గదులు మంజూరు కాలేదు. మండలంలో అవసరం లేని చోట్ల అదనపు గదులు అనవసరంగా నిర్మిస్తున్నా, అవసరం ఉన్న చోట మాత్రం నిర్మించడానికి అధికారులు, పాలకులు ఎందుకు ఆసక్తి చూపించడం లేదో మరి.