వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలతో కూడిన అకడమిక్ కేలండర్ రూపకల్పనకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
మార్చి 15 నుంచి ఒంటి పూట బడుల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలతో కూడిన అకడమిక్ కేలండర్ రూపకల్పనకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. నెలవారీ విద్యా కార్యక్రమాలు, సాధించాల్సిన లక్ష్యాలు, సెలవులు తదితర వివరాలతో కూడిన కేలండర్‌ను రూపొందిస్తోంది. జూన్‌లో ప్రారంభించాల్సిన పైతరగతుల బోధనను ఈసారి సీబీఎస్‌ఈ స్కూళ్ల తరహాలో మార్చి 21 నుంచే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. వేసవి ఎండల నేపథ్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రతి ఏటా నిర్వహించే ఒంటి పూట బడుల విధానం లేకుండా చూడాలని భావిస్తోంది. ఆయా తేదీల్లోనూ రెండు పూటల బడులు నిర్వహిం చేలా కసరత్తు చేస్తోంది. పైతరగతుల బోధనను మార్చి 21 నుంచి ప్రారంభించి.. ఏప్రిల్ 23 వరకు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఆలోచనకు వచ్చింది. ఇక వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఇచ్చేలా కేలండర్‌లో పొందుపరుస్తోంది.