చార్మినార్: అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జెమ్స్ అండ్ జువెల్లర్స్ ఫెడరేషన్-జీజేఎఫ్) పిలుపు మేరకు పాతబస్తీలోని బంగారం వ్యాపారస్తుల బంద్ ఈనెల 17 వరకు కొనసాగనుంది. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన బంద్ మొదట్లో మూడు రోజుల వరకు మాత్రమేనని ప్రకటించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాకపోవడంతో ఈ నెల 7వ తేదీ వరకు బంద్‌ను పొడిగించారు. అప్పటికీ... ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఈ నెల 17వ తేదీ వరకు ఆందోళన కొనసాగించాలని జీజేఎఫ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం కూడా పాతబస్తీలోని బంగారం వ్యాపారస్తులు బంద్ పాటించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపును పాతబస్తీ బంగారు ఆభరణాల వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
17వరకు బంగారు దుకాణాలు బంద్
Published Wed, Mar 9 2016 7:35 PM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
Advertisement
Advertisement