హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్త బంద్‌ను పాటించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నాంపల్లిలోని 21 సెంచరీ బిల్డింగ్‌లోని టీపీజేఎంఏ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్త బంద్ పోస్టర్ ఆవిష్కరణ సభ జరిగింది. వి.నరేందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గౌరి సతీశ్, ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్‌రెడ్డిలతో కలసి పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ప్రైవేట్ జూనియర్ కళాశాలల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రైవేట్ కళాశాలల సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఇంటర్ బోధన రుసుమును పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment