ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు   | Only One Teacher For Five Classes In School At Jagtial District | Sakshi
Sakshi News home page

ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు  

Published Sun, Jul 2 2023 7:35 AM | Last Updated on Sun, Jul 2 2023 3:39 PM

Only One Teacher For Five Classes In School At Jagtial District - Sakshi

వందమంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు.

కథలాపూర్‌ (వేములవాడ): వందమంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దుస్థితి ఇది. ఇక్కడి ఐదు తరగతుల్లో 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఒక్క ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. 

ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయిని అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. దీంతో వల్లంపెల్లి పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను డిప్యుటేషన్‌పై నియమించారు. ఉపాధ్యాయులను నియమించాలని ఎనిమిదేళ్లుగా జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన కరువైందని ఎస్‌ఎంసీ చైర్మన్‌ కొక్కుల శంకర్, సర్పంచ్‌ సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి తెలిపారు.   

ఇది కూడా చదవండి: ఆధునిక హంగులతో.. పర్యాటక కేంద్రాల అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement