
విద్యార్థులచే పరీక్షలు రాయిస్తున్న నారాయణ కళాశాల సిబ్బంది
ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ మహేంద్ర మాట్లాడుతూ..నిబంధనలను ఉల్లంఘించిన నారాయణ కళాశాలలను సీజ్ చేయాలన్నారు. సెలువుల్లోనూ తరతగతులు, పరీక్షలు నిర్వహించి విద్యార్థులపై ఒత్తిడిని పెంచి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నా ఇంటర్ బోర్డు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మంత్రి నారాయణ అండతో నారాయణ కళాశాలల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని, వారిని అదుపు చేసే అధికారులే కరువయ్యారని ఆరోపించారు.
నారాయణ కళాశాలల్లో ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విద్యార్థులపై కమిటీలు వేయడమే తప్ప ఒక్కదానిలో నివేదిక ఇవ్వలేదన్నారు. పరీక్షను జరపబోమని ప్రిన్సిపాళ్లతో సంతకాలు తీసుకొని విద్యార్థులకు ఇళ్లకు పంపడంతో వారు ఆందోళనను విరమించారు. అనంతరం ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ..సెలవు దినాల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే ఇంటర్ బోర్డుకుకళాశాల సీజ్‌కు నివేదిక ఇస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు సుమన్, గణేష్, ఎల్లయ్య, గోపీ, జయసింహ, సాయి, పవన్ తదితరులు పాల్గొన్నారు.