regular
-
ఢిల్లీ లిక్కర్ కేసు: రౌస్ అవెన్యూ కోర్టుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. గురువారం కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పరిగణనలోకి తీసుకునే అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు.మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను విచారించే అవకాశం లేదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని తెలిపింది. అందుకే ఈ పిటిషన్ విచారణార్హమైనది కాదని పేర్కొంది.ఈ నెల మొదట్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం కోసం షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. జూన్ 2న మళ్లీ తిరిగి తిహార్ జైలులో లొంగిపోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. గడవు దగ్గర పడుతున్న సమయంలో అనారోగ్యానికి సంబంధించి మరో ఏడు రోజులు బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణార్హమైనది కాదని సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
అక్టోబరులో ఆరంభం
వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ చిత్రం రూ΄పొందుతున్న సంగతి తెలిసిందే. మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటివారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని, ఈ తొలి షెడ్యూల్ దాదాపు ఇరవై రోజుల పాటు హైదరాబాద్‌లోని విభిన్నమైన లొకేషన్స్‌లో జరుగుతుందని సమాచారం. వైజాగ్ నేపథ్యంలో 1958 – 1982 టైమ్ పీరియడ్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ‘మట్కా’ చిత్రం తెరకెక్కనుంది. కథానుగుణంగా అప్పటి వైజాగ్‌ను తలపించేలా సెట్‌ను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
హోం గార్డులను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి: సీపీఐ నేతలు
-
104 కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
సుల్తాన్‌బజార్: తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని కోరుతూ 104 కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం కోఠిలోని డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లో ధర్నా చేపట్టారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో వందలాది మంది 104 సిబ్బంది పాల్గొన్నారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాఖలో పనిచేస్తున్న 104 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు నెలలుగా 104 కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత 15 ఏళ్లుగా 104 ఉద్యోగులకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా చాలీ చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధర్నాలో 104 ఉద్యోగ నాయకులు సుభాష్‌చందర్, గాదె శ్రీనివాస్, వెంకన్న, నవీన్, రచ్చ రవీందర్, విద్యాసాగర్, సతీష్ కృష్ణప్రసాద్, ఎండీ మాజిద్ పాల్గొన్నారు. -
ఏపీలో ఈ నెల 16 నుంచి ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు
-
ఏపీ: 16 నుంచి ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గత నెల 12 వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది. -
చెప్పు..నీకు జీతం వేలల్లో కావాలా,లక్షల్లో కావాలా?!
సాక్షి, అమరావతి:ఎయిడెడ్ కాలేజీల్లో అవసరం లేకపోయినా బోధన, బోధనేతర సిబ్బందిని అన్ ఎయిడెడ్ ప్రాతిపదికన నియమించారు. ఆ సందర్భంలో పెద్దఎత్తున పైరవీలు నడిచాయి. సొమ్ములు కూడా చేతులు మారాయి. తాజాగా ఆ పోస్టులను క్రమబద్ధీకరణ (రెగ్యులర్) చేయిస్తామని.. నెలకు ఇచ్చే రూ.15 వేల నామమాత్రపు వేతనాన్ని రూ.లక్షకు పైగా ఇప్పించేలా చూస్తామంటూ సదరు కళాశాలల యాజమాన్యాలు వసూళ్ల పర్వానికి తెరలేపాయి. కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించైనా ఆ పోస్టులను రెగ్యులర్ చేయిస్తామని నమ్మబలుకుతూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఉన్నత విద్యాశాఖలోని కొందరు కిందిస్థాయి అధికారుల ఆశీస్సులతో రూ.కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నత విద్యా శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు సైతం అందుతున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం జీతాలొస్తాయంటూ.. రాష్ట్రంలో 137 ఎయిడెడ్ కాలేజీలు ఉండగా.. అందులో దేవదాయ శాఖకు చెందినవి 4, మైనార్టీ స్టేటస్‌లో 16 కాలేజీలు ఉన్నాయి. మిగిలినవి వివిధ యాజమాన్యాల్లో నడుస్తున్నాయి. వీటిలో ఎయిడెడ్ సెక్షన్లలో మొత్తంగా 1,02,234 సీట్లు ఉండగా.. 51,085 మంది విద్యార్థులున్నట్టు యాజమాన్యాలు చూపిస్తున్నాయి. అదే అన్ ఎయిడెడ్ సెక్షన్లలో 1,54,350 సీట్లున్నాయి. ఇక్కడ కూడా సగం మాత్రమే సీట్లు భర్తీ కాగా.. మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ కాలేజీల్లోని ఎయిడెడ్ విభాగాల్లో 1,303 మంది బోధనా సిబ్బంది, 1,422 మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. వీటిలో అన్ ఎయిడెడ్ విభాగంలో 1,621 మంది బోధనా సిబ్బంది, 909 మంది బోధనేతర సిబ్బంది కలిపి 2,530 మంది పని చేస్తున్నారు. వీరికి ఆయా యాజమాన్యాలు నెలకు రూ.15 వేల వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ పోస్టుల్ని క్రమబద్ధీకరణ చేయిస్తే యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికీ రూ.లక్షకు పైగా వేతనం అందుతుంది. దీనిని ఆశగా చూపి యాజమాన్యాలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. అన్ ఎయిడెడ్ సిబ్బందిని రెగ్యులర్ చేయించేందుకు పకడ్బందీగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. గతంలో ఇలాంటి వారిలో కొందరికి అనుకూలంగా ఉన్నత విద్యాశాఖలోని కొందరు అధికారుల సహకారంతో కోర్టు ఉత్తర్వులు జారీ చేయించి మరీ రెగ్యులర్ చేయించారు. ఆ ఉత్తర్వులను ఆధారం చేసుకుని ఇప్పుడు మొత్తం అందరినీ రెగ్యులర్ చేయిస్తామంటూ తెరవెనుక వ్యవహారం నడిపిస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా.. ఉన్నత విద్యాసంస్థల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన యాక్ట్–1994కు వ్యతిరేకంగా ఈ వ్యవహారానలు నడిపిస్తున్నారు. ఆ చట్టం ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లోని కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్‌లుగా తాత్కాలిక ప్రాతిపదికన చేస్తున్న వారి రెగ్యులరైజేషన్‌కు గతంలో ఒక అవకాశం ఇచ్చారు. 1993 నవంబర్ 25 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని మాత్రమే రెగ్యులర్ చేయాలని అప్పటి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వారికి యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉండి, ఎయిడెడ్ పోస్టుల్లో ఖాళీలు ఉంటే రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు. వారినీ తప్ప వేరెవరిని రెగ్యులర్ చేయడానికి వీల్లేదు. అలా చేయడం చట్ట వ్యతిరేకం. కానీ.. కోర్టుల నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చి గతంలో కొందరిని రెగ్యులర్ చేయించారు. ఇప్పుడు వాటినే చూపిస్తూ అందరినీ రెగ్యులర్ చేయిస్తామని కొన్ని యాజమాన్యాలు, ఉన్నత విద్యాశాఖలోని కొంతమంది అధికారులు పావులు కదుపుతున్నారు. చదవండి : ఉత్పత్తి ఉరకలెత్తేలా, రాష్ట్రానికి క్యూ కడుతున్న ఉక్కు కంపెనీలు -
ఆ 3 లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి కేంద్రానికి బదలాయింపులు జరుగుతాయని భావిస్తున్న రూ.3 లక్షల కోట్ల వినియోగంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిమాణంలో అధిక భాగం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొముర అంచనా వేసింది. నొముర దీనిపై ఒక నివేదిక విడుదల చేస్తూ, ఆర్బీఐ నుంచి నిధుల బదలాయింపు ఒకేసారి జరక్కపోవచ్చని, వరుసగా మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అందివచ్చే నిధుల్లో 45 శాతం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని, 20 శాతాన్ని బ్యాంకుల మూలధన పెట్టుబడులకు వినియోగించుకునే వీలుందని నొముర పేర్కొంది. ప్రభుత్వ రుణభారం 25 శాతానికి తగ్గించుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. వచ్చిన మొత్తంపై ఆధారపడి మిగిలిన 10 శాతం వ్యయాలు ఉంటాయని పేర్కొంది. బ్యాంకులకిస్తే బెటర్: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరతతో ఇబ్బందులు పడుతున్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ ఇప్పటికే అభిప్రాయపడింది. ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై సిఫారసులకు గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే కమిటీ సభ్యుల్లో వ్యక్తమవుతున్న విభేదాల కారణంగా నివేదిక ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి. జూలైలో నివేదిక సమర్పించవచ్చని సమాచారం. ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మూడు లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించవచ్చని ఈ కమిటీ సిఫారసు చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ తాజా నివేదిక అంచనా వేసింది. ఆర్బీఐ నిధులపై ఆధారపడక తప్పదా? కేంద్రం ద్రవ్యలోటును ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10న వ్యక్తిగత కారణాలతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా ప్రకటించారు. శక్తికాంత్ దాస్ గవర్నర్ అయ్యాక డిసెంబర్లో జలాన్ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఇప్పటికే మూడు కమిటీలు... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై 3 కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) వీటికి నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12% వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, థోరట్ కమిటీ 18%గా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారులకు ఓకే చెప్పింది. లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28% నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14% నిధులు సరిపోతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. -
ఉద్యోగ భద్రత కోసం వినూత్న నిరసన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్ట్ అధ్యాపకులు, పార్ట్‌టైం పీఈటీలు బుధవారం వినూత్న నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు నోటికి నల్లగుడ్డను ధరించి కలెక్టరేట్ వరకు మౌన ర్యాలీని నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని జేఏసీ నాయకులు ఎంఏ నవీన్‌కుమార్, చాంద్‌బాషా, రఫీవుద్దీన్, మల్లికార్జున, సోమేష్ కోరారు. రిలే నిరాహార దీక్షలో మత్తయ్య, వెంకటశివుడు, మోహన్, బాయ్యరెడ్డి, నరసింహులు కూర్చున్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం కాంట్రాక్ట్ అధ్యాపకులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో కేవీఆర్ కళాశాల నుంచి రాజ్‌విహార్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ సీఎం చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మిల, జిల్లా కార్యదర్శి అలివేలు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, రాజ్‌కుమార్ మాట్లాడారు. మోకాళ్లపై నిలబడి.. తమను రెన్యువల్ చేయాలని పార్ట్‌టైం పీఈటీలు బుధవారం..వినూత్నంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వీరికి సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, రాధాకృష్ణ, ఆనంద్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రంగమునినాయుడు, నక్కలమిట్ట శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు. దీక్షల్లో పార్ట్‌టైం పీఈటీలు ఏ.షాఫైజల్, టి.వేణుగోపాల్‌రెడ్డి, వి.శివరామ్, ఎన్వీఆరుణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి
– ఆర్ఐఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా కర్నూలు సిటీ: జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ చేయాలని ఏఐఎస్ఎఫ్, పీడీయస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థాని ఇంటర్‌బోర్డు ప్రాంతీయ కార్యాలయం అధికారి కార్యాయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, శేఖర్ నాయుడు, భాస్కర్, ఆనంద్, రాజ్‌కూమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, ఇవ్వలేక పోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీల గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు కూడా కార్పొరేట్ కాలేజీలతో సమానంగా ఫలితాలు తీసుకువస్తున్నారనే విషయం గుర్తించాలన్నారు. ప్రభుత్వ చర్యలు చూస్తుంటే భవిష్యత్తులో ప్రభుత్వ విద్య పేదలకు అందనంత దూరం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. అనంతర డీవీఈఓ సుబ్రమణ్యేశ్వరరావుకు వినతి పత్రం ఇచ్చారు. ధర్నాలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ నాయకులు పాల్గొన్నారు. -
ధర్మవరానికి రెగ్యులర్ తహశీల్దార్
సాక్షి ఎఫెక్ట్ అనంతపురం అర్బన్: ధర్మవరం మండలానికి రెగ్యులర్ తహశీల్దార్ ని నియమిస్తూ కలెక్టర్ కోన శశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మవరంలో అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా రెగ్యులర్ తహశీల్దార్లు విధులు నిర్వర్తించలేని పరిస్థితి నెలకొంది. రెగ్యులర్ తహశీల్దార్‌ని నియమించినా ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి సెలవుపై వెళ్లేలా చేయడం పరిపాటిగా మారింది. ఏడాదిన్నరగా ఇక్కడ ఇన్చార్జి పాలన కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై సాక్షిలో ఈ నెల 4న ''అధర్మ రాజ్యం'' శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఇందులో భాగంగానే విడపనకల్లు తహశీల్దారుగా పనిచేస్తున్న శంకరయ్యని ధర్మవరం తహశీల్దారుగా నియమించారు. గతంలో ధర్మవరం తహశీల్దారుగా నియమించిన నాగరాజు జాయిన్ అయిన వెంటనే సెలవుపై వెళ్లారు. దీంతో ఆయనను యల్లనూరు తహశీల్దారుగా అప్పట్లో నియమించారు. అప్పటి వరకు అక్కడ తహశీల్దారుగా ఉన్న అన్వర్ హుసేన్ వీఆర్‌లో ఉన్నారు. ఈ క్రమంలో అన్వర్హుసేన్ని డ్వామాలో సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఇక్కడున్న తహశీల్దారు శివయ్యని విడపనకల్లు తహశీల్దారుగా నియమించారు. ఇదిలా ఉండగా ధర్మవరానికి రెగ్యులర్ తహశీల్దారు నియామకం అధికార పార్టీ నేతల సిఫారసు ద్వారానే జరిగిందనే చర్చ రెవెన్యూ శాఖలో వినిపిస్తోంది. -
కాంట్రాక్ట్ లెక్చరర్ల వినూత్న నిరసన
- కరుణించాలని ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని 11 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు సోమవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగు్యలరైజేషన్ కోసం నియమించిన ఉపసంఘం సభ్యులైన మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణ,, కామినేని శ్రీనివాస్, పల్లె రగునాథరెడ్డి పటాలకు పాలాభిషేకం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై కరుణ చూపాలంటూ రాష్ట్ర ఐక్య కార్యచరణ సమితి సభ్యుడు ఎన్.బ్రహ్మేశ్వర్లు, జిల్లా సంక్షేమ సంఘం సభ్యుడు పి.రంగస్వామి వేడుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. పదకొండో రోజు దీక్షకు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.శ్రీనివాసులు, ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.బలరాం, జేఏసీ జిల్లా కన్వీనర్ వీఎం వెంకటేశ్వర్లు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు ఎంఏ నవీన్‌కుమార్, సునీత, కె.శ్రీనివాసులు, ఈశ్వర్, అప్పాంజినేయులు, సోమేష్, చాంద్‌బాషా, లక్ష్మీప్రసాద్‌రెడ్డి, నాగరాజు, రవి, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ఓపెన్ విద్య రెగ్యులర్ విద్యతో సమానం
నల్లగొండ రూరల్ : ఓపెన్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యతో సమానమని డీఈఓ వై.చంద్రమోహన్ అన్నారు. శనివారం స్థానిక లెక్చరర్ భవన్లో 2016–17 నూతన అడ్మిషన్లపై ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లకు ఓరియెంటేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని ఉద్యోగాలకు, ఉన్నత విద్యకు ఓపెన్ విద్యా సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానమన్నారు. రాష్ట్ర కోఆర్డినేటర్ సుజాత శేఖర్ మాట్లాడుతూ అడ్మిషన్లను మీ సేవా ద్వారా కూడా పొందవచ్చని అన్నారు. ఈ నెల 9లోపు అడ్మిషన్లకు చివరి గడువు అని తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్ మంగళ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఓపెన్ స్కూల్ స్టడి సెంటర్ ఉన్నందున మహిళలు వివిధ రకాల వృత్తుల్లో వున్న వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల డిప్యూటీ డీఈఓలు పి.మదన్మోహన్, హిర్యానాయక్, పాండు తదితరులున్నారు. -
లస్కర్ పోస్టుల రెగ్యులర్ నియామకాల్లో అక్రమాలు
– సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశం – న్యాయం చేయాలంటున్న బాధితులు కర్నూలు సిటీ: శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన లస్కర్ పోస్టుల నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ నిర్వాసితులకు 1986లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జీఓ 98ను అమలుకు 25 ఏళ్ల తర్వాత కదలిక వచ్చింది. రెగ్యులర్ నియమాకాలు లేకపోవడంతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రాజెక్టుల్లో దాదాపు 962 మంది ముంపు బాధితుల్లో 80 శాతం మందిని తాత్కాలిక లస్కర్లుగా నియమించారు. వీరిలో సీనియారిటీ ఉన్న వారికి విద్యా అర్హతతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీల్లో కొంత మందిని ప్రస్తుతం రెగ్యులర్ పోస్టుల్లో నియమిస్తున్నారు. ఇందులో భాగంగా గత నెల 30వ తేదీన 15 మంది తాత్కాలిక లస్కర్లను రెగ్యులర్ చేస్తూ చీఫ్ ఇంజనీర్ చిట్టి్టబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో టెక్నికల్ అసిస్టెంట్ నియామకాల్లో ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్ చేసిన వారితో భర్తీ చేయాలి. అయితే ఇక్కడ నిబంధనలను ఉల్లఘించి జూనియర్లను రెగ్యులర్ చేశారనే విమర్శల ఉన్నాయి. – టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రిషన్, మెకానిక్ అర్హత ఉన్న వారితో భర్తీ చేశారు. దీంతో బీటెక్ చేసిన శ్రీనివాసులు, ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్ చేసిన శేషన్నకు అన్యాయం జరిగిందని అధికారుల దృష్టికి తెచ్చారు. – ఆఫీస్ సబార్డినేట్ కింద ఎంపికైన ఓ మహిళకు ఇంటిగ్రేటేడ్ సీనియార్టీ జాబితాలో నంబర్ 797. సినియార్టీ జాబితాలో గుంపుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ముందున్నా అతనికి అన్యాయం జరిగింది. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం: శ్రీశైలం ముంపు బాధితుల్లో తాత్కాలిక లస్కర్లుగా పని చేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తూ ఇచ్చిన జాబితాలో అక్రమాలు జరిగాయని బాధితులు ఆరోపిస్తున్నారు. సీనియర్లను కాదని, జూనియర్లను రెగ్యులర్ చేయడంపై కొందరు బాధితులు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ నియామకాలపై కొందరు తాత్కాలిక లస్కర్లు జిల్లా కలెక్టర్, డిప్యూటీ సీఈలను కలిసి విన్నవించారు. ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తాం: తాత్కాలిక లస్కర్లుగా పని చేస్తున్న వారిలో 15 మందికి రెగ్యులర్ చేశాం, ఇందులో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఒక వేళ తప్పులు జరిగాయని ఫిర్యాదులు వస్తే పరిశీలించి సరి చేసేందుకే నోటీసు బోర్డులో వివరాలు ఉంచాం. రెగ్యులర్ చేసేందుకు సీనియారీటికి ప్రాధాన్యత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాం. జూనియర్లలో ఉన్నత విద్య చదివిన వారు ఉన్నా సీనియర్లకు అన్యాయం చేయకూడదు. – చిట్టిబాబు, సీఈ, జల వనరుల శాఖ ప్రాజెక్టు -
బోధకుల బాధలు..!
అక్షరాలతో ఆనకట్టలు కట్టిస్తారు.. భవంతుల నిర్మాణం నేర్పిస్తారు.. మనుషులకు ప్రాణం ఎలా పోయూలో.. చావుబతుకుల్లో ఉండేవారిని ఎలా బతికించాలో కళ్లకు కట్టి చూపిస్తారు. ఏది న్యాయం.. ఏది అన్యాయమో చెప్పే న్యాయమూర్తులను సృష్టిస్తారు. మనిషిలో నైతిక విలువలు ఎలా ఉండాలో.. అసలు జనం ఎలా బతకాలో నేర్పిస్తారు. సమాజ ఆర్కిటెక్ట్‌లుగా.. దైవాంస సంభూతులుగా మనం గౌరవించుకొనే గురువులు నేడు అన్నం కోసం అలమటిస్తున్నారు. అందరి కంచాల్లో రుచికరమైన వంటలు ఉండేలా ఆశీర్వదించిన వారు నేడు ఖాళీ కంచాల్లో కన్నీటి బొట్లు రాల్చుతున్నారు. ఐటీఐ కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను నేటి ప్రభుత్వం మానసికంగా వేధిస్తోంది. ‘గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః’ ఇది కేవలం పుస్తకాలకే పరిమితమా? - కందుకూరు రూరల్ ‘నిత్యం విద్యార్థుల అభ్యున్నతి కోసం శ్రమించే మా గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రెగ్యులర్ చేయకపోయినా పర్వాలేదు. ఉన్న ఉద్యోగం ఊడగొట్టకుండా నెలనెలా జీతం ఇస్తే చాలు’ - ఐటీఐ కళాశాల కాంట్రాక్ట్ ఉద్యోగులు టీడీపీ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోరుుంది. ఓ వైపు ఉన్న ఉద్యోగులను వరుసగా తొలగిస్తుంటే.. మరో వైపు ఉన్నవారికి సంవత్సరాల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఒక్క నెల జీతం అందకుంటేనే విలవిల్లాడే ఉద్యోగులు.. నెలల తరబడి జీతాలు లేకపోతే ఎలా ఉంటుందో ప్రభుత్వానికి అర్థం కాకపోవడం శోచనీయం. ఎన్నికల హామీల్లో భాగంగా ఇలాంటి ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న బాబు మాటలు నమ్మూతూ ఇంకా ఊడిగం చేస్తూనే ఉన్నారు. నాలుగు కళాశాలలు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కాంట్రాక్టర్ పద్ధతిన అధ్యాపకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్మెన్లు పని చేస్తుంటారు. ఈ కళాశాలల్లో శిక్షణ పొందిన విద్యార్థులు ఉపాధి పొందుతుంటే.. వారికి శిక్షణ ఇచ్చే గురువులు మాత్రం మూడు పూట్లా అన్నం తినేందుకే అల్లాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నారుు. జిల్లాలో నాలుగు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలుండగా ప్రతి చోటా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. తక్కువ వేతనాలూ ఇవ్వలేరా? ఒంగోలులో ఉన్న రెండు కళాశాలలకు నాన్‌ప్లాన్ బడ్జెట్ కింద రెండు నెలలకొకసారి జీతాలు వస్తుంటాయి. అయితే కందుకూరు, మార్కాపురం కళాశాల్లో పని చేసే ఉద్యోగులకు ప్లాన్ బడ్జెట్ కింద మంజూరు అవుతారుు. ప్లాన్ బడ్జెట్ ప్రత్యేకం.. కాంట్రాక్టర్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంటాడు. కందుకూరు ఐటీఐ కళాశాలలో పని చేస్తున్న ఉద్యోగులకు 18 నెలల నుంచి, మార్కాపురం ఐటీఐ కళాశాలలో పని చేస్తున్న ఉద్యోగులకు 13 నెలల నుంచి జీతాలు అందలేదు. అధ్యాపకులకు రూ. 11500, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ. 9500, అటెండర్లు, వాచ్మెన్లకు రూ. 6700 చొప్పున జీతాలు చెల్లించాలి. ఒక్కొక్క కళాశాలలో ఎనిమిది మంది అధ్యాపకులు, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు అంటెండర్లు, వాచ్మెన్లు పని చేస్తున్నారు. వీరందరికీ జీతాలు అందక.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మూగగా రోదిస్తున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేసి చిత్తవుతున్నారు. అందరిలానే విద్యావంతులనూ మోసగించిన బాబు వాగ్దానాల నావ ఎక్కి ఒడ్డు చేరుకున్న బాబు.. ఇప్పుడు ఆయన మాటల్ని పూర్తిగా మరిచారు. ఓట్ల కోసం ఆ రోజు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఇప్పటికీ అతీగతీ లేదు. ఉన్నత డిగ్రీలు ఏం చేయను? ఐటీఐ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులంతా ఉన్నత చదువులు చదివినవారే. కానీ వీరి ప్రతిభకు.. క్వాలిఫికేషన్‌కు తగిన జీతాలు అందడంలేదు. కేటారుుంచిన తక్కువ జీతాలను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడం అత్యంత దారుణం. ఇటు ఉద్యోగాలు మానేయలేక.. జీతాలు లేక.. కుటుంబాలు గడవక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
పదవుల పందేరానికి సర్వం సిద్ధం
► నేడు వెటర్నరీ వర్సిటీ పాలకమండలి సమావేశం ► పాతవారిని కొనసాగించేందుకు యత్నాలు ► పదవులపై పలువురు ఔత్సాహికుల ఆశలు చిత్తూరు: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పాలకమండలి తొలి సమావేశం మంగళవారం జరగనుంది. సభ్యులందరూ ఇందులో పాల్గొననున్నారు. ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న పాలకమండలిని గత నెల 20వ తేదీన పునరుద్ధరించారు. అయితే వీరు ఇంకా అధికారికంగా బాధ్యతలు స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే బోర్డు మీటింగ్‌లో పదవుల పంపకంపైనే ప్రధానంగా చర్చ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూనివర్సిటీక్యాంపస్: వెటర్నరీ యూనివర్సిటీలో ఐదేళ్ల తర్వ తా తొలిసారిగా మంగళవారం పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో పదవుల పంపిణీపైనే ప్రధానంగా చర్చ సాగునుంది. ప్రస్తుతం వెటర్నరీ యూనివర్సిటీలో పరిశోధన డీన్, విస్తరణ డీన్, డెయిరీ డీన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీ 11 అధికార పదవుల్లో మూడు ఖాళీగా ఉండ గా, మిగిలిన 8 మంది అధికారుల పదవీ కాలం ఈ నెల 24తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే బోర్డు పాలకమండలి సమావేశంలో పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వారిని కొనసాగించేందుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పదవుల కోసం ఆశలు పెట్టుకున్న కొందరు ఔత్సాహికులు నిరాశకు గురవుతున్నారు. మరికొందరు ఎలాగైనా పాగా వేసేం దుకు పావులు కదుపుతున్నారు. ఐదేళ్ల పాటు పని చేసిన వారినే మళ్లీ పదవుల్లో కొనసాగించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్ వీసీ నియామకం జరిగి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని చెబుతున్నారు. ఆ అధికారిపై చర్యలేవి? శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అతిథి గ ృహంలో నిధుల గోలుమాల్కు బాధ్యుడైన అధికారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని పలువురు విమర్శిస్తున్నారు. కేవలం విచారణ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగిని బలి చేసి, సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోకపోవడం దురుణమని చెబుతున్నారు. అంతేకాకుండా సదరు అధికారి పదవీ కాలాన్ని పొడగిస్తుస్తారన్న ప్రచారం సాగుతుండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై నూతన పాలక మండలి సభ్యులు ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి నెలకొంది. -
ఈ కుటుంబాలకు దిక్కెవరు!
మున్సిపాలిటీల్లో 4,822 మందిపై వేటు! హౌసింగ్‌లో 150 మంది తొలగింపు 160 మంది ఆరోగ్య మిత్రలు అవుట్ 476 మంది ఆశా వర్కర్ల తొలగింపు 19 నెలల్లో జిల్లాలో ఒక్క నియామకం లేదు ఒక్కసారిగా రోడ్డునపడ్డ సిబ్బంది విజయవాడ : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తమను రెగ్యులర్ చేస్తారని, మెరుగైన వేతనాలు కల్పిస్తారని ఆశపడిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రస్తుత ప్రభుత్వం షాకిచ్చింది. అధికారంలోకి రాగానే వరుసగా కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. దీంతో కుటుంబానికి ఆధారంగా ఉన్న ఉద్యోగం కోల్పోయి వేలాదిమంది ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో సతమతమవుతున్నారు. గృహనిర్మాణ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 8,400 మంది కార్మికులను తొలగించగా, అందులో జిల్లాకు చెందినవారు 150 మంది ఉన్నారు. వారిలో ఏఈలు 130 మంది ఉండగా, కంప్యూటర్ ఆపరేటర్లు 20 మంది ఉన్నారు. ఆ తరువాత ఐకేపీలో, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని తొలగిస్తూ జీవో ఇచ్చారు. ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో ఎన్ఆర్హెచ్ఎం పథకం కింద పనిచేస్తున్న 476 మంది ఆశా వర్కర్లను తొలగించారు. హక్కులు హరించేందుకు దొడ్డిదారిన జీవో... తాజాగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు గత డిసెంబరు 31న జీవో 279ని దొడ్డిదారిన తీసుకొచ్చారు. జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో కలిపి 4,822 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ జీవో ప్రకారం అర్బన్, స్థానిక సంస్థల్లో (నగర పంచాయతీ, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో) పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు ఎలాంటి సంబంధం లేకుండా పని నిర్వహణ టెండర్లు పిలవనున్నారు. ఆ పని నిర్వహణకు ఎన్ని నిధులు అవసరమో పొందుపరుస్తూ మాత్రమే టెండర్లు పిలుస్తారు. ఇందులో ఎంతమంది కార్మికులు కావాలనే ప్రస్తావన రాదు. టెండర్లో కార్మికుడు అనే పదం ఎక్కడా ఉండదు. దీనివల్ల కార్మికులు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, పనిగంటలు, ప్రభుత్వ సెలవు దినాలు, సంక్షేమం వంటి సౌకర్యాలన్నీ కోల్పోతారు. ‘ఆశ’ అడియాసే... క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లను తొలగిస్తూ కలెక్టర్ బాబు.ఎ గత డిసెంబర్లో తీసుకున్న నిర్ణయంతో వందల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు జరగటం లేదని, మాతా శిశు మరణాల రేటు జిల్లాలో పెరిగిందనే కారణం చూపి 476 మందిని ముందస్తు హెచ్చరికలు లేకుండా తొలగించటం అమానవీయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నెలకు రూ.500 నుంచి రూ.1000 గౌరవ వేతనంగా ఇస్తున్నారని, అయినా పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటున్నారని పేర్కొంటున్నారు. తొలగించినవారిని విధుల్లోకి తీసుకోవాలని, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పారితోషికాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 160 మంది ఆరోగ్య మిత్రల తొలగింపు జీవో నంబరు 28 ద్వారా జిల్లాలోని 160 మంది ఆరోగ్య మిత్రలను కూడా తొలగించారు. వారి స్థానంలో వేరే వారిని తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2007 నుంచి విధుల్లో ఉన్న వీరిని ఒక్కసారిగా తొలగించటంతో ఇప్పటికిప్పుడు వేరే ఉద్యోగాలు వెతుక్కోవాలంటే ఎలాగని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి జీతంమీదనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా ఉండటంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. కాంట్రాక్టు సిబ్బందిని వరుసగా తొలగిస్తున్న ప్రభుత్వం గత 19 నెలల పాలనా కాలంలో జిల్లాలో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవటం గమనార్హం. -
‘డీఎస్సీ’ బాధితులపై తర్జనభర్జన!
♦ నష్టపోయినవారికి ఉద్యోగాలిచ్చే అంశంలో గందరగోళం ♦ రెగ్యులర్‌గా నియమించడమా, ప్రత్యేక పరీక్ష నిర్వహించడమా? ♦ కన్సాలిడేటెడ్ పే చెల్లించవచ్చా?.. సాధ్యాసాధ్యాలపై సర్కారు పరిశీలన సాక్షి, హైదరాబాద్: వివిధ డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థులకు ఎలా న్యాయం చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. వారికి రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వవచ్చా, లేక ప్రత్యేక పరీక్ష నిర్వహించి తాత్కాలిక ఉద్యోగాలు కల్పించడమా అన్న అంశాలపై పరిశీలన జరుపుతోంది. 1998 నుంచి ఇప్పటివరకు 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో ప్రభుత్వ నిర్ణయాల కారణంగా దాదాపు 6,907 మంది ఉపాధ్యాయ అభ్యర్థులు నష్టపోయినట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. వారి సమస్యను పరిష్కరిస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం సూచనల మేరకు ఈ అంశంపై ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రత్యేకంగా సమీక్షించారు కూడా. అయితే 1998 డీఎస్సీ జరిగి 18 ఏళ్లు అవుతోందని, అప్పుడు నష్టపోయినవారు ఇప్పుడు రిటైర్మెంట్ వయసుకు సమీపంలో ఉన్నారని విద్యాశాఖ అధికారులు తేల్చారు. పైగా అప్పటి ఉపాధ్యాయ ఖాళీలు ఇప్పుడు లేవని, వారికి ఉద్యోగాలు దాదాపు సాధ్యం కాదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. దీంతో వారికి రూ. 14 వేలు కన్సాలిడేటెడ్ వేతనంతో తాత్కాలిక ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో నష్టపోయిన ఉపాధ్యాయ అభ్యర్థులకు స్పెషల్ డీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతారని, త్వరలో నోటిఫికేషన్ ఇస్తారని మంగళవారం ప్రచారం జరిగింది. కానీ అదేమీ లేదని విద్యాశాఖ అధికారులు కొట్టిపారేశారు. కాగా.. ఈ అంశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పరిశీలన జరపాలని, అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకున్నా.. తుది నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఆందోళనల బాటలో ఆర్టీసీ కార్మిక సంఘాలు
విజయవాడ: ఏపీఎస్ఆర్టీసీ యూనియన్లు సోమ, మంగళవారాల్లో ఆందోళన బాట పట్టనున్నాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 4న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వై.వి.రావు ప్రకటించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని, ఆర్టీసీ ఆసుపత్రి నిర్మించాలనే డిమాండ్స్‌పై ఈ ధర్నాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 5 నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల ప్రక్రియ మొదలుకానుండటంతో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) ఆందోళనలకు పిలునిచ్చింది. ఈ నెల 5న రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ రీజినల్ సెంటర్లలో ధర్నా నిర్వహించనున్నట్టు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ సుందరయ్య ఆదివారం సాక్షికి చెప్పారు. -
ఉపాధి పోయింది
- 171 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు - టార్గెట్ పూర్తి చేయలేదనే సాకుతో వేటు - త్వరలో కొత్త వారికి అవకాశం - బాబు సర్కార్‌పై మండిపడుతున్న బాధితులు సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తాత్కాలిక ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిని రెగ్యులర్ చేయడంతో పాటు కొత్త వారికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమంటూ ఊరూరా ఊదరగొట్టి.. తీరా అధికారంలోకి వచ్చాక త ద్భినంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఆదర్శ రైతులను ఇంటికి పంపించిన బాబు సర్కారు.. తర్వాత హౌసింగ్ శాఖలో పని చేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లతోపాటు మెడికల్ డిపార్టుమెంట్‌లోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపింది. తాజాగా జిల్లాలో ఉపాధి హామీ పథకంలో కీలకంగా పని చేస్తున్న 171 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంటికి పంపడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. జిల్లాలో ఉపాధి హామి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా 692 మంది పని చేస్తున్నారు. ఈ ఏడాది టార్గెట్లు పూర్తి చేయలేదన్న సాకు చూపి 171 మందిని తాజాగా తొలగించారు. గ్రామాల వారీగా కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని నెపం పెట్టి వారిని ఇంటికి పంపించారు. ఇందులో దాదాపు 2006 నుంచి పని చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ప్రభుత్వం ఏ ఏడాది కాఏడాది ఫీల్డ్ అసిస్టెంట్ల కాంట్రాక్టును రెన్యూవల్ చేస్తూ వస్తోంది. ఇపుడు వీరిని తొలగించి టీడీపీకి అనుకూలురైన వారిని నియమించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకోవడం కోసమే ఉన్న వారిని టార్గెట్ పేరుతో తొలగిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టార్గెట్లు పూర్తి చేయనందునే తొలగించాం జిల్లాలో చాలా మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ఏడాది వారికి ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయలేదు. దీంతో 171 మందిని తొలగించాం. ఇతర జిల్లాల్లో 300 నుంచి 500 మంది వరకు తొలగించారు. వైఎస్సార్ జిల్లాలోనే అతి తక్కువ మంది టార్గెట్లు పూర్తి చేయలేకపోయారు. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వారిని తొలగించాము. - బాలసుబ్రమణ్యం, ప్రాజెక్టు డెరైక్టర్, డ్వామా -
ఇక... మన మండలం/జిల్లా
* ప్రణాళికలు రూపొందించాలంటూ ఆదేశాలు జారీ * మండల స్థాయిలో ఇలా... మండల స్థాయిలో 16 అంశాలకు సంబంధించిన వివరాలు పొందుపరచాలి. మండల పరిషత్ పరిధిలోని ప్రజాప్రతినిధుల వివరాలు, సిబ్బంది వివరాలు (రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్), వివిధ ప్రభుత్వ కార్యాలయాల మౌలిక సదుపాయాల వివరాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్తులు, నిధులు, వ్యయం, ఆదాయ వనరులు, స్వయం సహాయక సంఘాల వివరాలు, మండల పరిషత్‌లోని మొదటి పది ప్రాధాన్యత పనులు, మండల స్థాయిలో శాఖల వారీగా 2013-14, 2014-15 సంవత్సరంలో చేపట్టిన పనుల వివరాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలి. మండల స్థాయి సమావేశాలు 21వ తేదీన ప్రారంభించి, 24లోగా పూర్తి చేయాలి. ఇక్కడ రూపొందించిన ప్రణాళికలను మండల సర్వసభ్యసమావేశంలో ఆమోదించాలి. నీలగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘మనఊరు-మన ప్రణాళిక’’ గ్రామసభలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ‘‘మన మండలం- మన జిల్లా’’ ప్రణాళికలు తయారు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మనఊరు-ప్రణాళిక గ్రామసభలు ఈ నెల 13వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఆదివారంతో ముగియనున్నాయి. రెండు, మూడు మండలాలు మినహా దాదాపు అన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తిచేశారు. ఈ సభల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున విన్నపాలు వెల్లువెత్తాయి. వీటిని అధికారులు క్రోడీకరించి అంచనాలు సిద్ధం చేస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రామస్థాయి ప్రణాళికలను రెండు, మూడురోజుల్లో ఆన్లైన్లో నమోదు చేస్తారు. కాగా గ్రామ ప్రణాళిక ముగింపు దశకు చేరుకోవడంతో ‘మన మండలం-మన జిల్లా ప్రణాళిక’ సిద్ధం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి జిల్లాకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓవైపు గ్రామ ప్రణాళికల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూనే...మరోవైపు మండల, జిల్లా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి శనివారం రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో, జిల్లా స్థాయిలో ఏవిధంగా వివరాలు సేకరించాలనే అంశంపై అన్ని మండలాలకు నమూనా (ఫార్మాట్) పత్రాలను పంపారు. ఇంటెలీజెన్స్ ఆరా... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై ఇంటెలీజెన్స్ సైతం ఆరా తీస్తోంది. ఇంటెలీజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బందితో ఫోన్లో మాట్లాడుతున్నారు. నేరుగా గ్రామసభలకు వెళ్లి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గ్రామసభలు ఏ విధంగా జరుతున్నాయి..? అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారా..? ప్రజల స్పందన ఏవిధంగా ఉంది..? ప్రణాళికలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారా..? అనే అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. -
ఇష్టారాజ్యం
ఆమె ఓ మండల విద్యాశాఖాధికారిణి. వంద మందికి పైగా ఉపాధ్యాయులు ఆమె పర్యవేక్షణలో పనిచేస్తుంటారు. ప్రతినెల రూ. 25 లక్షల సర్కారు ధనం ఆమె చేతుల మీదుగా పంపిణీ అవుతుంటుంది. అంతటి గురుతర బాధ్యతను ప్రభుత్వం ఆమె నెత్తిన పెడితే బాధ్యత మరిచిన ఆ అధికారిణి ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అక్రమార్కులకు అండగా నిలిచి నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఫలితంగా ఆ మండలంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తొండూరు మండల విద్యాశాఖలో రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమాలు ఒక్కొక్కటే చీకటిమాటు నుంచి వెలుగులోకి వస్తున్నాయి. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా అక్కడి అధికారిణి ఒక్కొక్కరికి ఒక్కో రూల్ వర్తింపజేస్తుండటం ఆ శాఖలో అసంతృప్తికి దారితీసింది. తనకు నచ్చని ఉపాధ్యాయుల తప్పులను అదే పనిగా వెతికి పట్టుకుని వారికి మెమోలు పంపించడం, తరచూ వారి పాఠశాలలు తనిఖీ చేయడం, వారిపై ఉన్నధికారులకు ఫిర్యాదు చేయడంలాంటి కక్షసాధింపు చర్యలు అక్కడి ఉపాధ్యాయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇదే సమయంలో తన అడుగులకు మడుగులొత్తే కొందరు అయ్యవార్లు నెలల తరబడి బళ్లకు ఎగనామం పెడుతున్నా వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడం, వారి నెలసరి జీతాలు రెగ్యులర్‌గా మంజూరు చేయడంలాంటి అంశాలు కూడా వివాదాస్పదంగా మారాయి. ఈ వివాదాలు మండలం దాటి జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. తొండూరు మండలం పాలూరు ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మొలకల శ్రీనివాసమూర్తికి మానసిక ఆరోగ్యం సరిగా లేదు. బడికి వెళ్లి పిల్లలకు పాఠాలు బోధించే స్థితిలో ఆయన లేరు. నెలకు అక్షరాలా అరలక్ష రూపాయలు జీతం తీసుకునే ఆయన నిత్యం పులివెందుల పురవీధుల్లో సంచరిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వారిచే జీతనష్టంపై సెలవు పెట్టించడం గానీ,స్వచ్చంద పదవీ విరమణ గానీ చేయిస్తుంటారు. అయితే తొండూరు ఎంఈఓ ఆ పని చేయలేదు. అతని స్థానంలో ఓ బినామీ వ్యక్తి పని చేయడానికి అంగీకారం తెలిపారు. తన వాటా తీసుకుంటూ క్రమం తప్పకుండా నెలసరి వేతనం శ్రీనివాసమూర్తి అకౌంట్లో జమ చేస్తోంది. ఆశ్చర్యమేమిటంటే ఆ బినామీ వ్యక్తే సాక్షాత్తు ఉపాధ్యాయుల హాజరుపట్టిలో రెండేళ్లుగా శ్రీనివాసమూర్తి సంతకాన్ని ప్రతిరోజూ ఫోర్జరీ చేస్తుండటం చూస్తే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను మ్యూచువల్ డిప్యూటేషన్‌పై ఒకచోట నుంచి మరోచోటికి పంపించే అధికారం ఎంఈఓలకు లేదు. డీఈఓ, ఆర్జేడీ లాంటి ఉన్నతాధికారులు సైతం ఇలాంటి సాహసం చేయలేరు. అయితే ఈ అధికారిణి గంగనపల్లెలో పనిచేసే అయ్యవారును పోతులపల్లెకు, పోతులపల్లెలో పనిచేసే ఉపాధ్యాయురాలిని గంగనపల్లెకు మ్యూచువల్ డిప్యూటేషన్‌పై పంపించి నిబంధనలకు నీళ్లు వదిలింది. తొండూరు జెడ్పీ హెస్కూల్ ప్రధానోపాధ్యాయురాలికి రెండేళ్ల క్రితం మండల విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె సభలు, సమావేశాలకు వెళుతున్నప్పుడల్లా ఉన్నత పాఠశాల బాధ్యతను సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించకుండా ఓ జూనియర్ అయ్యవారుకు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై సదరు సీనియర్ ఉపాధ్యాయుడు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తొండూరు ఉన్నత పాఠశాలకు వచ్చిన నిధుల విషయంలో కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా టీచర్ల గ్రాంట్లను అక్కడి ఉపాధ్యాయులకు అందజేయనట్లు సమాచారం. ఈ విషయం కూడా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ప్రాథమిక పాఠశాలల్లో డుమ్మారాయుళ్లు ఇటీవలి కాలంలో అధికమయ్యారు. ఓ ఉపాధ్యాయుడు తనకు పక్షవాతం సోకిందని నెలల తరబడి ఎలాంటి సెలవు పెట్టకుండా బడికి డుమ్మా కొడుతున్నా అడిగే వారే కరువయ్యారు. మరొక సీనియర్ ఉపాధ్యాయుడు వారానికోరోజు బడికెళ్లి సంతకాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. గతంలో ఎంఆర్పిగా పనిచేసిన ఓ అయ్యవారు రోజంతా ఎంఆర్సిలోనే కాలక్షేపం చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం లేదు. వీరంతా అధికారిణి అండతోనే బళ్లకు ఎగనామం పెడుతున్నారని ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై డీఈఓ అంజయ్య వివరణ కోరగా తన దృష్టికి ఈ విషయాలు రాలేదన్నారు. అయినప్పటికీ ఆరోపణలపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నా