సుల్తాన్‌బజార్: తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని కోరుతూ 104 కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ క్యాంపస్‌లో ధర్నా చేపట్టారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో వందలాది మంది 104 సిబ్బంది పాల్గొన్నారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఈ సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాఖలో పనిచేస్తున్న 104 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు నెలలుగా 104 కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
గత 15 ఏళ్లుగా 104 ఉద్యోగులకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా చాలీ చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధర్నాలో 104 ఉద్యోగ నాయకులు సుభాష్‌చందర్, గాదె శ్రీనివాస్, వెంకన్న, నవీన్, రచ్చ రవీందర్, విద్యాసాగర్, సతీష్ కృష్ణప్రసాద్, ఎండీ మాజిద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment