సాక్షి,హైదరాబాద్:నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. తాజాగా ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ (Tgsrtc) యాజమాన్యానికి సమ్మె నోటీసు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలు సోమవారం(జనవరి27) ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందజేయనున్నారు.
కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది.
2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ను ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండడం చర్చనీయాంశమవుతోంది.
ఇదీ చదవండి: నేడు ఇండోర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం
Comments
Please login to add a commentAdd a comment