రెగ్యులర్ చేయాలని సర్వశిక్ష ఉద్యోగుల డిమాండ్
10వ తేదీ నుంచి సమ్మెబాటలోనే ఉద్యోగులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: విద్యాభివృద్ధి కోసం ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తాము శ్రమదోపిడీకి గురవుతున్నామని సర్వశిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేత నం కూడా లేకుండా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయా లని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన సమ్మె బాట పట్టా రు. రాష్ట్రవ్యాప్తంగా 19,325 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకమైనప్పటి కీ మెరిట్, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంలోనే నియమితులయ్యామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతో తాము ఉద్యోగ భద్రతకు అర్హత కలిగి ఉన్నామని, వెంటనే తమ ఉద్యోగాలను క్రమబదీ్ధకరించాలని కోరుతున్నారు.
కనీస వేతనాలు సైతం కరువు..
సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు సైతం అమలు చేయడంలేదని సర్వశిక్ష ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టమ్ అనలిస్ట్‌లు, టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్స్, డీఎల్‌ఎంటీ, మెసెంజర్స్, మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఐఈఆర్‌పీఎస్, మెసెంజర్స్, సీజీవీలు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో స్పెషల్ ఆఫీసర్లు (పీజీ హెచ్‌ఎం హోదా), కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్స్ (స్కూల్ అసిస్టెంట్ హోదా), పీఈటీలు, ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్స్, క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్స్, కుక్స్, వాచ్‌ఉమెన్స్, స్వీపర్లు, స్కావెంజర్లు, పాఠశాల స్థాయిలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్స్(ఆర్ట్, పీఈటీ, వర్క్ ఎడ్యుకేషన్), భవిత కేంద్రాల్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్లుగా పనిచేస్తున్నారు.
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వీరికి కేవలం రెగ్యులర్ ఉద్యోగుల వేతనాల్లో నాలుగోవంతు జీతం మాత్రమే ఇస్తున్నారు. మెసెంజర్లకు రూ.11వేలు, సీఆర్‌పీలకు రూ.19,350 (ఏపీలో మాత్రం రూ.26వేలు), పీజీ హెచ్‌ఎం స్థాయిలో ఉన్న స్పెషల్ ఆఫీసర్లకు రూ.32 వేలు వేతనంగా ఇస్తున్నారు. టీఏ, డీఏలు ఇవ్వడంలేదు. పైగా ఏడాదిలో 10 నెలలు మాత్రమే వేతనాలు అందుతున్నాయి. సర్వ శిక్షలో ఇప్పటివరకు 119 మంది మరణిస్తే కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.
తమను రెగ్యులరైజ్ చేయాలని, రూ.10 లక్షల బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని, మహి ళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 ప్రసూతి సెలవులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం, 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ. 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment