Regularization
-
కాంట్రాక్టు లెక్చరర్లపై కక్ష!
‘కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధికరించి వారి సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తీసుకుంటా..’ – 2024 ఏప్రిల్ 28న కోడుమూరు నియోజకవర్గం గూడూరు ప్రజాగళం సభలో బాబు హామీ! ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసేలా పోరాడతా’.. – 2017 డిసెంబర్లో కాంట్రాక్టు లెక్చరర్లతో ముఖాముఖీలో పవన్ కళ్యాణ్ హామీ! సాక్షి, అమరావతి: తమ జీవితాలను మార్చే హామీని అమలు చేయాలని వేడుకుంటే.. ‘కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ మేనిఫెస్టోలో లేదు కాబట్టి అమలు చేయలేం’ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కుండ బద్ధలు కొడుతున్నారని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు వీలుగా గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని అయినా అమలు చేయాలని కోరితే.. ‘ఆ చట్టాన్ని తాము అమలు చేయాలన్న రూల్ లేదు’ అని లోకేశ్ తేల్చి చెబుతుండటంతో తీవ్ర మానసిక సంఘర్షణతో ఇటీవల నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు ప్రాణాలు విడిచారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక మృతుల కుటుంబాలు వీధిన పడ్డాయి. 2000లో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 7 వేల మందిని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించగా తెలంగాణలో 2021లో కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించారు. ఒకే జీవో ద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా చేరిన వారు తెలంగాణలో రెండేళ్లుగా రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంకా కాంట్రాక్ట్ సిబ్బందిగానే కొనసాగుతున్నారు. ఏపీలోనూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2023 అక్టోబర్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది.దీని ప్రకారం 2014 జూన్‌కు ముందు విధుల్లో చేరిన 10,117 మంది అర్హులను గుర్తించి క్రమబద్ధీకరించాలని జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో వైద్య, అటవీ, గిరిజన సంక్షేమ తదితర శాఖల్లో పని చేస్తున్న 3 వేల మంది రెగ్యులరైజ్ కావడంతోపాటు గతేడాది ఏప్రిల్ నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. మిగిలిన వారి క్రమబద్ధీకరణ మాత్రం ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయింది. వీరిలో 20 ఏళ్లకు పైగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. అర్హులైన అందరి వివరాలు ఆర్థికశాఖ ‘నిధి పోర్టల్’లో ఉన్నా కూటమి ప్రభుత్వం తొక్కిపెడుతోంది.కాంట్రాక్టు జేఎల్స్‌కు తీవ్ర అన్యాయంగత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అధికారంలోకి వచ్చాక వారిని రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. కాంట్రాక్టు ఉద్యోగులపై గత ప్రభుత్వాలు వివిధ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘాలను నియమించినా వారి కల సాకారం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వారి సమస్యలపై చర్చించి 30/23 చట్టం తెచ్చింది. దీని ప్రకారం మిగతా శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారు.ప్రాణాలు పోతున్నా పట్టదా..!తెలంగాణలో ఎలాంటి చిక్కులు లేకుండా విద్యాశాఖలో కాంట్రాక్ట్ లెక్చరర్లు రెండేళ్ల క్రితమే రెగ్యులర్ అయ్యారు. 30/23 ద్వారా ఏపీలోనూ రెగ్యులర్ కావాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం మాత్రం వారి పట్ల కక్షగట్టినట్టు ప్రవర్తిస్తోంది. ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న వారే ఉన్నారు. ఇంటర్ విద్యలో 3,618 మంది, డిగ్రీ కాలేజీల్లో 695 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 309 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. మరణించిన కాంట్రాక్ట్ లెక్చరర్ల కుటుంబాలకు పరిహారం, మట్టి ఖర్చులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఉన్నా అమలు కావడం లేదని బాధిత కుటుంబాలు కన్నీరు పెడుతున్నాయి. -
శ్రమదోపిడీకి గురవుతున్నాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: విద్యాభివృద్ధి కోసం ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తాము శ్రమదోపిడీకి గురవుతున్నామని సర్వశిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేత నం కూడా లేకుండా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయా లని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన సమ్మె బాట పట్టా రు. రాష్ట్రవ్యాప్తంగా 19,325 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకమైనప్పటి కీ మెరిట్, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంలోనే నియమితులయ్యామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతో తాము ఉద్యోగ భద్రతకు అర్హత కలిగి ఉన్నామని, వెంటనే తమ ఉద్యోగాలను క్రమబదీ్ధకరించాలని కోరుతున్నారు. కనీస వేతనాలు సైతం కరువు.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు సైతం అమలు చేయడంలేదని సర్వశిక్ష ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టమ్ అనలిస్ట్‌లు, టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్స్, డీఎల్‌ఎంటీ, మెసెంజర్స్, మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఐఈఆర్‌పీఎస్, మెసెంజర్స్, సీజీవీలు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో స్పెషల్ ఆఫీసర్లు (పీజీ హెచ్ఎం హోదా), కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్స్ (స్కూల్ అసిస్టెంట్ హోదా), పీఈటీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్స్, క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, కుక్స్, వాచ్ఉమెన్స్, స్వీపర్లు, స్కావెంజర్లు, పాఠశాల స్థాయిలో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్స్(ఆర్ట్, పీఈటీ, వర్క్ ఎడ్యుకేషన్), భవిత కేంద్రాల్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్లుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వీరికి కేవలం రెగ్యులర్ ఉద్యోగుల వేతనాల్లో నాలుగోవంతు జీతం మాత్రమే ఇస్తున్నారు. మెసెంజర్లకు రూ.11వేలు, సీఆర్పీలకు రూ.19,350 (ఏపీలో మాత్రం రూ.26వేలు), పీజీ హెచ్ఎం స్థాయిలో ఉన్న స్పెషల్ ఆఫీసర్లకు రూ.32 వేలు వేతనంగా ఇస్తున్నారు. టీఏ, డీఏలు ఇవ్వడంలేదు. పైగా ఏడాదిలో 10 నెలలు మాత్రమే వేతనాలు అందుతున్నాయి. సర్వ శిక్షలో ఇప్పటివరకు 119 మంది మరణిస్తే కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. తమను రెగ్యులరైజ్ చేయాలని, రూ.10 లక్షల బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని, మహి ళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 ప్రసూతి సెలవులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం, 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ. 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. -
సింగరేణిలో 2,364 ఉద్యోగాల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్/ గోదావరిఖని: సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించేందుకు ఆమోదం లభించింది. సంస్థలో చేరిన తర్వాత ఒక కేలండర్ సంవత్సరంలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, ఇతర విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.బలరాం వెల్లడించారు.ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించబోతున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో బలరాం తెలిపారు. సింగరేణిలో సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినందున మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, డ్యూటీలకు గైర్హాజరు కావొద్దని, సమయ పాలన పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఆయన కోరారు. వీరు ఎవరంటే..!సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా నియమిస్తారు. వీరు ఏడాది కాలం పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తి చేస్తే జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తారు. వీరిలో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉంటే పదోన్నతులు పొందడానికి అర్హులవుతారు. క్వార్టర్ల కేటాయింపులో కూడా ఈ జనరల్ మజ్దూర్లకు ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి క్రమబద్ధీకరణ ద్వారా 234 మంది మహిళలు శాశ్వత ఉద్యోగాలు పొందనున్నారు. ఏరియాల వారీగా పరిశీలిస్తే కార్పొరేట్ ఏరియా (25), కొత్తగూడెం (17), ఇల్లందు (9), మణుగూరు (21), భూపాలపల్లి (476), రామగుండం–1 (563), రామగుండం–2 (50), రామగుండం–3, అడ్రియాల ప్రాజెక్టు (240), శ్రీరాంపూర్ (655), మందమర్రి (299), బెల్లంపల్లి (9) మంది రెగ్యులరైజ్ కానున్నారు. -
నోటరీ ‘క్రమబద్ధీకరణ’పై సర్కారుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరించడంపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్లను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలోని నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలువురు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇలాంటి భూములను క్రమబద్ధీకరణ చేయించుకునే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కష్టపడి డబ్బు కూడబెట్టుకుని తక్కు వ మొత్తంలో భూమి కొన్న పేదలకు ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలనిస్తాయన్నారు. 125 చదరపు గజాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన ఆస్తులకు స్టాంప్ డ్యూటీ, పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే రాష్ట్ర ఖజానా ఆదాయం కోల్పోతుందని చెప్పారు. నోటరీ భూ విక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సంబంధించి జూలై 26న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 84 కొట్టివేయాలని ‘ది భాగ్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్’పిల్లో కోరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఈ సడలింపు అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించే వారికి మార్గం సుగమం చేస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. -
AP: కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరో శుభవార్త
సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. క్రమబద్దీకరణకు ఐదేళ్ల నిబంధన తొలగించనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సీఎం జగన్ అంగీకరించారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయనుంది. కొద్దిరోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన.. సీఎం నిర్ణయంతో అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది కలగనుందని ఏపీజీఈఏ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. కాగా, విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో విద్యుత్ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: చంద్రబాబు కొత్త రాగం.. అదో దిక్కుమాలిన విజన్: పేర్ని నాని ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది. -
70 శాతం మార్కులు వస్తేనే.! జేపీఎస్ రెగ్యులరైజేషన్‌లో సర్కార్ మెలిక
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమై, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపులో 70 శాతం మార్కులు వచ్చిన వారినే క్రమబద్దికరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ అధికారిక మెమోను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని జేపీఎస్‌ల పనితీరును సమీక్షించి మార్కులు ఇస్తున్నాయని, కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో 70శాతం, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని క్రమబద్దికరిస్తూ నియామక ఉత్తర్వులు అందజేయాలని ఈ మెమో లో స్పష్టం చేశారు. ఒకవేళ 70శాతం మార్కులు రాకపోతే ఆయా జేపీఎస్‌లకు మరో ఆరునెలల గడువు ఇవ్వాలని, అప్పుడు మరోమారు పనితీరు మదింపు చేసి అప్పటి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలి జిల్లా స్థాయిలో ఆయా కమిటీల మదింపు నివేదికలను గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని, పనితీరు సంతృప్తిగా ఉన్న జేపీఎస్‌లకు ఇచ్చే నియామక ఉత్తర్వులను కూడా ఇదే యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు అప్పగించారు. అర్హత పొందిన జేపీఎస్‌లకు ఇవ్వాల్సిన నియామక ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదాను కూడా ఈ మెమోతో జతచేసి జిల్లాలకు పంపారు. ప్రభుత్వ నిర్ణయం విడ్డూరం: టీపీఎస్ఏ పనితీరు మదింపులో 70శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే క్రమబద్దికరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విడ్డూరంగా ఉన్నా యని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) వ్యాఖ్యానించింది. డైరెక్ట్‌గా రిక్రూట్ అయి మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, ఇ. శ్రీనివాస్‌లు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామీ ణాభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో అనేక గందరగోళాలకు తావిస్తోందని, తమ డిమాండ్ ప్రకారం అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయకుంటే పోరాటా నికి దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
జీవో ఆర్టీ ప్రామాణికమా లేక మెమోనా?
సాక్షి, హైదరాబాద్: సర్విసుల రెగ్యులరైజేషన్ ప్రక్రియపై జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో (జేపీఎస్) ఆందోళన వ్యక్తమౌతోంది. ఉద్యోగాలు క్రమబద్ధీకరించేందుకు ఐదేళ్ల కిందట అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన జీవో ఆర్టీ ప్రామాణికమా? లేక తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన మెమో ప్రామాణికమా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసి మూల్యాంకనం చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తాజాగా జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా ఎస్పీ, జిల్లా అటవీ అధికారులతో ఒక కమిటీని నియమిస్తూ మెమోను జారీచేశారు. వివిధ అంశాల ప్రాతిపదికన... ఆయా విధుల నిర్వహణకు అనుగుణంగా వందమార్కులు కేటాయించి, నాలుగేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌ల పనితీరు మదింపు ఆధారంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఉంటుందని స్పష్టంచేశారు. జీవో ఆర్టీలో ఏముంది? జిల్లా ఎంపిక కమిటీల ద్వారా జేపీఎస్‌ల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించి 2018 ఆగస్టు 30న అప్పటి పీఆర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ జీవో ఆర్టీ నెంబర్ 617ను జారీచేశారు. ప్రభుత్వం జేపీఎస్‌ల పోస్టులను మంజూరు చేసినందున, మూడేళ్ల సర్విసు పూర్తిచేసుకున్నాక సంతృప్తికరమైన పనితీరు కనబరిచిన జేపీఎస్‌లను గ్రేడ్–4 పంచాయతీ సెక్రటరీలుగా రెగ్యులరైజ్ చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. అయితే వీరి క్రమబద్ధికరణను పరిగణనలోకి తీసుకునేందుకు జేపీఎస్‌ల మూడేళ్ల సర్విసు కాలాన్ని నాలుగేళ్లకు పెంచుతూ గతేడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత మార్చినెలతో వారి నాలుగేళ్ల సర్విసు కూడా పూర్తయ్యింది. క్రమబద్ధికరణ ప్రక్రియ మాత్రం మొదలుకాలేదు. దీంతో జేపీఎస్‌లు నిరవధిక సమ్మెకు దిగి 16 రోజుల తర్వాత విర మించుకున్నారు. జేపీఎస్‌లు విధుల్లో చేరేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నపుడే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పలేదని, మెరుగైన పనితీరు ఆధారంగా నిపుణుల కమిటీ నివేదిక మేరకు జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టంచేసింది. కొన్నిరోజుల తరువాత జేపీఎస్‌ల సర్విసులను క్రమబద్ధిక రించే చర్యలు చేపడతామని అధికారులు ప్రకటించారు. సీఎస్ దృష్టికి... ఈ నేపథ్యంలో తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి జారీచేసిన మెమో నేపథ్యంలో జేపీఎస్‌ల విధులు, బాధ్యతల పట్ల ఏమాత్రం సంబంధం లేని జిల్లా ఎస్పీలు, జిల్లా అటవీ అధికారులతో మూల్యాంకనం చేయించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. వివిధ విభాగాల పీఆర్ ఉద్యోగులు, సంఘాలు సైతం ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల గురించి త్వరలోనే సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉద్యోగ సంఘాలున్నాయి. -
జేపీఎస్‌ల పనితీరు మదింపునకు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్విస్ రెగ్యులరైజేషన్ కసరత్తులో భాగంగా వారి పనితీరు మదింపునకు జిల్లా స్థాయి పనితీరు మూల్యాంకన కమిటీ (డిస్ట్రిక్ట్ లెవల్ పెర్ఫార్మన్స్ ఎవాల్యూయేషన్ కమిటీ)లను రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసింది. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఎస్పీ లేదా ఎస్పీ నామినీగా డీఎస్పీ కంటే తక్కువ ర్యాంక్ కాని అధికారి, జిల్లా అటవీ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ కమిటీ జేపీఎస్‌ల పనితీరును మదింపు చేస్తుంది. ఈ మేర కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం ఆదేశాలు జారీ చేశారు. నాలుగేళ్ల సర్విస్ పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేసే క్రమంలో ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు పలు మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 100 పాయింట్లతో మదింపు ♦ జిల్లా కమిటీకి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ♦ కమిటీ గ్రామ పంచాయతీలను సందర్శించి, ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్ల ఆధారంగా 4 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన జేపీఎస్‌ల పనితీరు అంచనా వేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తుంది. ♦ ఈ డేటాను, మదింపునకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను పంచాయతీరాజ్ కమిషనర్ (పీఆర్) ఓ మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. ♦ జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు కమిటీలిచ్చే నివేదికలను పరిశీలించి జేపీఎస్‌ల సర్విసు రెగ్యులరైజైన్ ప్రతిపాదనలను పీఆర్ కమిషనర్‌కు సమర్పిస్తారు. ♦ ఈ నివేదికలపై పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ♦ రోడ్లు, మురుగు కాల్వల శుభ్రత, దోమల నివారణ, వైకుంఠధామాల నిర్వహణ, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, ప్రకృతి వనాలు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ..తదితర అంశాలకు వేర్వేరుగా పాయింట్లు ఇవ్వడం ద్వారా, మొత్తం వంద పాయింట్లుగా మదింపు చేస్తారు. -
AP: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి అయిదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కాగా, మంత్రి బొత్స సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని అన్నారు. అలాగే, తర్వలోనే కొత్త పీఆర్సీ కమిటీ నియామకం ఉంటుందని వెల్లడించారు. కొత్త పెన్షన్ విధానంపై కేబినెట్లో చర్చించి మెరుగైన విధానం తీసుకొస్తాం. ఉద్యోగులకు ఖచ్చితంగా పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు నాలుగేళ్లలో 16 వాయిదాల్లో మొత్తం పీఆర్సీ బకాయిలు చెల్లించడానికి అంగీకరించినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రేపు సీఎం జగన్ పోలవరం పర్యటన.. -
అంతులేని వ్యథ! 30 ఏళ్ళు పనిచేసినా మారని కథ.. చదువు చెప్పినవాళ్లేమో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు వెయ్యి మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఎన్నో ఏళ్లుగా క్రమబద్ధీకరణకు నోచుకోవడం లేదు. రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇంతవరకూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తాము చదువు చెప్పిన వాళ్ళు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినా, తమ పరిస్థితిలో మాత్రం మార్పు లేదని అధ్యాపకులు వాపోతున్నారు. వీరిలో పదవీ విరమణకు దగ్గరపడుతున్న అధ్యాపకులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు సైతం ఉండటం గమనార్హం. కాగా 60 ఏళ్ళు దాటిన కారణంగా రెండేళ్ళలో 11 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగించారు. వీళ్ళంతా దాదాపు 30 ఏళ్ళుగా పనిచేస్తున్నవారు కావడం విశేషం. అయితే పర్మినెంట్ కాకపోవడంతో వీరికి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. మరోవైపు గత ఏడాది కాలంలో సర్వీస్‌లో ఉన్న ఏడుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మృతి చెందారు. వీరు కనీసం ఎక్స్‌గ్రేషియాకు కూడా నోచుకోలేదు. 11 వర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీల్లో ఖాళీలు, ప్రస్తుతం పని చేస్తున్న అధ్యాపకుల తాజా లెక్కలను విద్యాశాఖ తేల్చింది. 2021 జనవరి 31వ తేదీనాటికి 11 వర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉంటే అందులో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 968 మంది (34.12 శాతం) మాత్రమే రెగ్యులర్ ఆధ్యాపకులు ఉన్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా, 781 పోస్టులు, 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. అయితే 1869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు భర్తీ చేయలేదు. 61.65% ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ.. – ఉన్నత విద్యాశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని వర్సిటీలు ఆరు ఉన్నాయి. శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. ఇక మెుత్తంగా చూస్తే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న ఓయూలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేయూలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ వర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరు లేరు. యూజీసీ పే కమిషన్ అమలు చేయాలి కాంట్రాక్టు అధ్యాపకులతోనే ఓయూ విద్యా వ్యవస్థ నడుస్తోంది. యూజీసీ నిబంధనల ప్రకారం మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి 7వ పే కమిషన్ వేతనాలు ఇవ్వాలి. – డాక్టర్ డి.ధర్మతేజ (ఓయూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షుడు) నా బిడ్డ కోసమైనా ఉద్యోగం ఇవ్వండి పదేళ్ళు ఓయూలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా పనిచేసిన నా భర్త గత ఏడాది చనిపోయారు. ఇప్పటికీ ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. నాకు ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. పర్మినెంట్ అయితే ఇవన్నీ లభించేవి. నాకు రెండేళ్ళ పాప ఉంది. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. నా బిడ్డ మొఖం చూసైనా ఉద్యోగం ఇస్తారని ఆశ పడుతున్నా. – రాజేశ్వరి (చనిపోయిన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీకాంత్ భార్య) 24 ఏళ్ల సర్వీసుకు గుర్తింపు లేదు.. కాంట్రాక్టు అధ్యాపకురాలిగా 24 ఏళ్ళుగా పనిచేస్తున్నా. రీసెర్చ్‌లో 25 ఏళ్ళ అనుభవం ఉంది. పరీక్షల నిర్వహణలో 15 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఎప్పటికప్పుడు పర్మినెంట్ అవుతుందని ఎదురుచూస్తుండగానే రిటైర్మెంట్ దగ్గర (సెప్టెంబర్‌లో) పడింది. నా సర్వీస్‌కు ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం దురదృష్టకరం. – డాక్టర్ అనిత కుమారి (నిజాం కాలేజీ జువాలజీ డిపార్ట్మెంట్ అధ్యాపకురాలు) -
Fact Check: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఈనాడు అబద్ధపు రాతలు
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా ఈనాడు అడ్డగోలుగా అబద్ధాలను వండివార్చడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మడత పేచీ.. శీర్షికతో ఈనాడులో సోమవారం అబద్ధపు కథనం ప్రచురితమైంది. క్రమబద్దీకరించే కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నింస్తోందని, ఇందుకోసం పలు నిబంధనలు పెట్టిందని అబద్ధాలను అచ్చోసింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అధ్యయనం చేసి ఇదే అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత దానిపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా నడుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి జీవో విడుదల కాలేదు. క్రమబదీ్ధకరణకు ఎలాంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను సేకరించేందుకు ఒక ఫార్మాట్ ఇచ్చారు. దానిప్రకారం వివరాలు సేకరించే పని జరుగుతోంది. కానీ ఈనాడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం అభూత కల్పనలతో కథనం రాసింది. నిజానికి కాంట్రాక్టు ఉద్యోగుల కోసం ఐదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు ఏమీ చేయలేదు. అప్పుడు వారు చేయలేనిదాన్ని, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తుంటే అడ్డగోలుగా వక్రీకరణలకు దిగుతోంది. దోచుకో పంచుకో తినుకో పద్ధతిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం, ఎల్లోమీడియా సిండికేట్‌గా మారి దొంగల ముఠాలా రాష్ట్రాన్ని దోచుకుతిన్నాయి. ఆ ముఠాకు నాయకత్వం వహించిన చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపారు. దీంతో ఇప్పుడు దోచుకోవడానికీ, పంచుకోవడానికి వారికి ఏమీ లేదు. ఎప్పుడెప్పుడు తమ వాడిని ఆ సీటులో కూర్చోబెడదామా? మళ్లీ దోపిడీ మొదలుపెడదామా అని ఈ సిండికేట్ ఆత్రుతపడుతోంది. అందుకోసమే ప్రజలను ఏమార్చేందుకు అబద్ధాల కథనాలను అదేపనిగా ప్రచురిస్తోంది. -
ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ: 80 శాతంపైగా తిరస్కరణ?
సాక్షి, హైదరాబాద్: సర్కారు అక్రమిత నివాస స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులో సుమారు 80 శాతం పైగా తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. మిగతా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. గత మూడు నెలల క్రితమే జీవో 58 కింద దరఖాస్తులపై విచారణ పూర్తి కాగా, తాజాగా జీవో 59 కింద దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. ప్రతి మండలానికీ ఒక జిల్లా స్థాయి అధికారిని కేటాయించడం ద్వారా క్రమబద్దీకరణ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను వేగవంతంగా కొనసాగుతోంది.గతంలో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మరోసారి పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే క్రమబద్దీకరిస్తారు. చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు ప్రభుత్వ విలువ ఆధారంగా.. 59 జీవో కింద అక్రమిత స్థలాలను ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువ ఆధారంగా క్రమబద్దీకరించనున్నారు. 126 నుంచి 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువలో 25 శాతం.. 251 నుంచి 500 గజాల వరకు 50 శాతం.. 500 నుంచి 100 గజాల వరకు 75 శాతం.. 1000 గజాలపైన పూర్తి విలువను దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంటుంది. రెండు నెలల క్రితమే.. జీవో 58 కింద ఉచిత క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులపై రెండు నెలల క్రితమే క్షేత్ర స్థాయి విచారణ పూర్తయింది. ప్రతి 250 దరఖాస్తులకు ఒక బృందం చొప్పున రంగంలో దిగి క్షేత్రస్థాయిలో వివరాలు, ఫొటోలు, తదితర ఆధారాలు ప్రత్యేక రూపొందించిన ‘జీవో 58 మొబైల్ యాప్’లో నమోదు చేశారు.అనంతరం సమగ్ర నివేదికను అధికార యంత్రాంగాలకు సిఫార్సు చేశారు. దరఖాస్తుల సంఖ్య 1.14 లక్షలపైనే ప్రభుత్వం అక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు మరో అవకాశం కల్పిస్తూ పాత జీవో 58, 59లకు అనుబంధంగా కొత్త జీవోలను జారీ చేసంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు సుమారు 1.14 లక్షల పైన కుటుంబాలు ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 71,316, ఆతర్వాత రంగారెడ్డి జిల్లాలో 31,830, హైదరాబాద్ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచి్చనట్లు రెవెన్యూ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
దివాలా చర్యల ప్రక్రియ ఇక మరింత వేగవంతం
న్యూఢిల్లీ: దివాలా పక్రియలో ఆలస్యాన్ని నివారించడం, మెరుగైన విలువను సాధించడం, ఇందుకు సంబంధించి లిక్విడేషన్ పక్రియ క్రమబద్దీకరణ ప్రయత్నాల్లో భాగంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నిబంధనలను సవరించింది. దివాలా పక్రియలో భాగస్వాములు చురుగ్గా పాల్గొనడానికి కూడా తాజా నిబంధనల సవరణ దోహదపడుతుందని ఒక అధికారికలో ఐబీసీ (ఇన్సాలెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్– అమలు సంస్థ ఐబీబీఐ పేర్కొంది. సవరణలలో భాగంగా కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) సమయంలో ఏర్పడిన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (సీఓసీ), మొదటి 60 రోజులలో వాటాదారుల సంప్రదింపుల కమిటీ (ఎస్సీసీ)గా పని చేస్తుంది. క్లెయిమ్‌ల తుది నిర్ణయం (తీర్పు) తర్వాత (ప్రక్రియ ప్రారంభించిన 60 రోజులలోపు) అంగీకరించిన క్లెయిమ్‌ల ఆధారంగా ఎస్సీసీ పున ర్నిర్మితమవుతుంది. వాటాదారుల మెరుగైన భాగస్వామ్యంతో నిర్మాణాత్మకంగా, సమయానుగుణంగా ఎస్సీసీ సమావేశాలను నిర్వహించే బాధ్యతలు లిక్విడేటర్పై ఉంటాయి. అలాగే, ఎస్సీసీతో లిక్విడేటర్ తప్పనిసరి సంప్రదింపుల పరిధి పెరుగుతుంది. -
క్రమబద్ధీకరణ పరిశీలన.. పొరుగింటికి..!
సాక్షి, హైదరాబాద్: జీవో 58, 59 కింద ప్రభుత్వ స్థలాల్లో నివాసాల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఈ దరఖాస్తులను స్థానిక రెవెన్యూ వర్గాలతో కాకుండా రెవెన్యూతో సంబంధం లేని అధికారులతో పరిశీలన జరిపించాలని నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. ప్రతి 250 దరఖాస్తులకు టీమ్‌లు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ వర్గాలే కాకుండా వీలును బట్టి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈ బృందాలను ఏర్పాటు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్లను సర్కారు ఆదేశించింది. దీంతో కొన్ని జిల్లాల్లో ఇతర శాఖల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందికి ఈ బాధ్యతలు అప్పగించారు. మరికొన్ని జిల్లాల్లో అసలు రెవెన్యూతో సంబంధం లేని వ్యవసాయం, ఉద్యాన, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో బృందాలను నియమించారు. వీరి నేతృత్వంలో స్థానిక డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్లతో కూడిన బృందాలు ఈ దరఖాస్తులను పరిశీలించి నివేదికలు తమకు పంపాలని కలెక్టర్లు ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల అటు రెవెన్యూ వర్గాలు, ఇటు దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పరిష్కారం.. పరేషాన్! గతంలో క్రమబద్ధీకరణ దరఖాస్తులను స్థానిక తహసీల్దార్ నేతృత్వంలో పరిశీలించి సిఫారసు చేస్తే ఆర్డీవోలు పరిష్కరించారని, దీంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి. భూములు లేదా ఇళ్ల క్రమబద్ధీకరణలో రెవెన్యూ అంశాలు సంక్లిష్టంగా ఉంటాయని, రెవెన్యూ చట్టాలపై అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నాయి. ఇప్పుడు రెవెన్యూతో సంబంధం లేని అధికారులు తీసుకునే నిర్ణయాలకు ఎవరు బాధ్యులవుతారని రెవెన్యూ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే తాము చేయని తప్పునకు బాధ్యత వహించాల్సి వస్తుందని వాపోతున్నారు. జీవో 58, 59 దరఖాస్తుల పరిష్కారానికి ఉన్న నిబంధనలు పూర్తిగా రెవెన్యూతో సంబంధం ఉన్నవే కాబట్టి పూర్తిస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ద్వారానే పరిశీలన జరిపించి పరిష్కరించే బాధ్యతలు అప్పగించాలని, అప్పుడే ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అంటున్నారు. ఇక, దరఖాస్తుదారుల్లో సైతం ఈ నిర్ణయం ఆందోళన రేపుతోంది. ప్రభుత్వ భూముల్లో చాలాకాలంగా నివాసం ఉంటున్నందున తమకు ఆ భూములను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించారని, తెలిసీ తెలియక రెవెన్యూయేతర అధికారులు తమ దరఖాస్తులను ఏం చేస్తారోనని, అన్యాయం జరిగితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. అదీగాక, ఈ దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు ఇచ్చిన ప్రభుత్వం అందులో కనీస కాలపరిమితి విధించలేదు. వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలని మాత్రమే పేర్కొనడంతో అసలు పరిశీలన ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఎప్పటికి ఈ ప్రక్రియ ముగుస్తుందోననే చర్చ జరుగుతోంది. -
ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు మరోమారు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం
-
క్రమబద్ధీకరణతో అడవుల ఆక్రమణకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోడు క్రమబద్ధీకరణ పేరిట మళ్లీ అటవీ ఆక్రమణలకు అవకాశం ఇవ్వొద్దని పర్యావరణ నిపుణులు, జంతు ప్రేమికులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు సూచిస్తున్నారు. గతంలో చేసిన ఆక్రమణలను కొత్తగా క్రమబద్ధీకరిస్తామంటే అడ్డూ అదుపూ లేకుండా అటవీ విధ్వంసం జరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు హరితహారం పేరిట గత ఏడేళ్లుగా చేపట్టిన బృహత్ కార్యక్రమం ద్వారా సాధించిన మంచి ఫలితాలు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో పోడు సమస్య అధ్యయనానికి, క్షేత్ర స్థాయి వాస్తవాల సేకరణను అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు చేపడుతున్నారు. పోడు సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ వంటి ప్రధాన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 23న జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. సరైన దిశలో నిర్ణయాలు తీసుకోవాలి.. మొత్తంగా అటవీ ఆక్రమణలను పోడుగా పరిగణించకుండా, అటవీ భూమిని సాగుచేసే నిజమైన ఆదివాసీ గిరిజనులను గుర్తించాలి. ఏళ్లకొద్దీ సాగుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించడం మంచిదే. అయితే ఈ దిశలో సర్కారు తీసుకునే నిర్ణయాలు అటవీ హక్కులు, అటవీ పరిరక్షణ చట్టాలు, భారత అటవీ చట్టం వంటి చట్టపరమైన సమీక్షకు నిలబడలేవు. అదీగాక పోడును క్రమబద్ధీకరిస్తామనే ప్రభుత్వ సంకేతాలతో అటవీ భూములను ఆక్రమించి వ్యవసాయం చేస్తే వాటిపై ఎప్పటికైనా హక్కులు లభించొచ్చుననే దురాశతో ఇబ్బందులు తలెత్తుతాయి. హరితహారం పేరిట సాధించిన ఫలితాలు, ప్రయోజనాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. – ఇమ్రాన్ సిద్దిఖీ, జంతు ప్రేమికుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పోడు పేరిట విధ్వంసం.. ఆదివాసీలు, గిరిజన జనాభా లేని చోట్ల కూడా ఆదివాసీ చట్టాన్ని అమలు చేస్తామనడం సరికాదు. అడవిని విధ్వంసం చేసి గిరిజనేతరులకు కూడా పునరావాసం కల్పించాలనేది కూడా మంచిది కాదు. 2006లో కేంద్రం సవరించిన అటవీహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం.. పోడు, అటవీ ఆధారిత గిరిజన , ఆదివాసీలకు మాత్రమే మెరుగైన జీవితం కోసం కొంత పోడు చేసిన అటవీ ప్రాంతం విధ్వంసానికి గురికాకుండా చేయాలి. అందువల్ల పోడు అంశాన్ని మళ్లీ పునఃసమీక్షించడం సరికాదు. ఇది పూర్తిగా అశాస్త్రీయం. అటవీ చట్టమనేది పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలోనిది. రిజర్వ్ ఫారెస్ట్‌ను డీరిజర్వ్ చేయడానికి కూడా రాష్ట్రానికి అధికారం లేదు. 15 ఏళ్ల సుదీర్ఘకాలం దాటాక కూడా (2006లో కొత్త చట్టం అమల్లోకి వచ్చాక) పునర్ సమీక్షించి, 2000 చట్టాన్ని అమలు చేస్తామనడం సమర్థనీయం కాదు. వాస్తవానికి ఇప్పటిదాకా ఎంత మంది గిరిపుత్రుల కుటుంబాలకు ఎన్ని లక్షల ఎకరాల్లో పోడు పట్టాలిచ్చారు. పోడు పేరిట సహజసిద్ధమైన అటవీ వనరులకు నష్టం చేసే ప్రయత్నాలు కూడా చేయకూడదు. – పోట్లపల్లి వీరభద్రరావు, పర్యావరణవేత్త, న్యాయవాది గిరిపుత్రులకు నిజమైన లబ్ధి చేకూరుతోందా? అడవుల పరిరక్షణ, అభివృద్ధి, పోడు భూములకు పట్టాలు వంటి అంశాల విషయంలో ప్రభుత్వం, పౌరసమాజం తాము అనుసరిస్తున్న విధానాలు, పద్ధతులను సమీక్షించుకోవాలి. అభివృద్ధి పేరిట అడవులకు, పోడుభూముల పేరిట ఆదివాసీ, గిరిపుత్రులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తున్నామనేది ఆత్మపరీక్ష చేసుకోవాలి. పోడు చేసుకునే వారికి పట్టాల అందజేతకు మళ్లీ కొత్తగా అవకాశాలిస్తామంటే ఈ నెపంతో జరిగే విధ్వంసం ఇక్కడితో ఆగదు. దీనివల్ల మళ్లీ కొత్తగా పోడు కొట్టే ప్రమాదం ఉంది. రాజకీయ నేతల అండదండలున్న వారికి, గిరిజనేతరులకే ఈ ప్రయోజనాలు దక్కుతాయి – సరస్వతి రావుల, పర్యావరణవేత్త, నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ (ఎన్ఏపీఎం) పూర్వ కన్వీనర్ -
ఎల్ఆర్‘ఎస్’ !
పురపాలక సంఘాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్)ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు మంత్రివర్గం సైతం ఆమోదించింది. కొవ్వూరు: ఎల్.ఆర్.ఎస్. అమలుకు విధి, విధానాల ఖరారుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారులు ముమ్మరంగా కుస్తీ చేస్తున్నారు. రెండు, మూడు వారాల్లో ఉత్తర్వులు సైతం వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న లేవుట్లకు మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. ఈ పథకం ద్వారా జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, ఎనిమిది పురపాలక సంఘాలకు సుమారు రూ.100 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 1997లో ఎల్ఆర్ఎస్ ప్రారంభమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మరోసారి 2007లో అనుమతి ఇచ్చారు. 2012 వరకు ఈ పథకం కొనసాగింది. అనంతరం వచ్చిన ప్రభుత్వా లు ఎల్ఆర్ఎస్ను పట్టించుకోలేదు. మళ్లీ ఇన్నేళ్లకు సీఎం జగన్మోహన్రెడ్డి దీనిపై దృష్టి సారించారు. పట్టణాల్లో మరింతగా విస్తరించి.. జిల్లావ్యాప్తంగా 2015 నాటికి 38 అనధికారిక లేఅవుట్లను అధికారులు గుర్తించారు. వీటిలో భీమవరంలో 19, తాడేపల్లిగూడెంలో ఏడు, జంగారెడ్డిగూడెంలో మూడు, నిడదవోలులో తొమ్మిది లేఅవుట్లు ఉన్నాయి. కొవ్వూరు, నరసాపురం, తణుకు, పాలకొల్లు, ఏలూరులో నిల్ చూపించారు. ఇదిలా ఉండగా 2014 నాటికి ఏలూరు నగరపాలక సంస్థ ఊడా పరిధిలో రూరల్ ప్రాంతాల్లో 162 అనధికార లేఅవుట్లను గుర్తించారు. అయితే నాలుగైదేళ్లలో జిల్లావ్యాప్తంగా పట్టణాలు విస్తరించాయి. జనాభా కూడా పెరిగింది. రియల్ వ్యాపారం ఆ స్థాయిలోనే విస్తరించింది. ఈ నేపథ్యంలో పల్లెల్లో సైతం లేఅవుట్లు వెలిశాయి. వీటిలో అనధికారిక లేఅవుట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా ఇటువంటి లేఅవుట్లన్నీ క్రమబద్ధీకరించుకునే అవకాశం వచ్చింది. దీనిద్వారా ఆయా పురపాలక సంఘాలకు భారీగా ఆదాయం సమకూరనుంది. 2015 నాటికి ఉన్న లెక్కల ప్రకారం చూస్తే రూ.40 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం, అయితే ప్రస్తుతం పెరిగిన లేఅవుట్లను కలుపుకుంటే ఆదాయం రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ అమలు ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల వరకు పురపాలక సంఘాలకు ఆదాయం సమకూరవచ్చని అంచనా వేస్తున్నారు. గైడ్‌లైన్స్‌పై అధికారుల కసరత్తు.. ఎల్ఆర్ఎస్ విధివిధానాల ఖరారుపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీప్లానింగ్ అధికారులు ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 మంది రియల్టర్ల వివరా లు సేకరించారు. ఆయా పురపాలక సంఘాల పరిధిలో ఉండే రియల్టర్లు, ప్లాట్లు విక్రయించే వ్యక్తులు, మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ప్రతిని«ధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి ఫోన్ నంబర్లు, వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్ అమలులో తలెత్తే ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. గైడ్‌లైన్స్ ఖరారులో వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మునిసిపాలిటీల్లో వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం నూతనంగా నియమించిన ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులకు సైతం ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో మినహా మిగిలిన అన్ని పురపాలక సంఘాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించారు. ముందుగా ఆయా వార్డు సచివాలయ ఉద్యోగుల పరిధిలో మ్యాప్‌లు తయారు చేయిస్తున్నారు. త్వరలో ఎల్ఆర్ఎస్ జీఓ పురపాలక సంఘాల్లో అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రియల్టర్స్ వివరాలు, ఫోన్ నంబర్లను అధికారులు సేకరిస్తున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు సైతం తీసుకుంటున్నారు. వచ్చే నెలలో ఎల్ఆర్ఎస్ జీఓ విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. పురపాలక సంఘాల వారీగా ఉన్న అక్రమ లేవుట్ల వివరాలు సేకరిస్తున్నాం. ఈ మేరకు సచివాలయ పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బందికి అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నాం. 2015 నాటికి 38 అనధికారిక లేఅవుట్లు ఉన్నట్టు గుర్తించాం. ఈ సంఖ్య రెండింతలు పెరిగే అవకాశం ఉంది. – వైపీ రంగనాయకులు, పట్టణ ప్రణాళిక విభాగం ఉపసంచాలకులు -
విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త!
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ల(ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు) సర్వీసును క్రమబద్దీకరించడానికున్న న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోయాయి. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో విద్యుత్ శాఖలోని జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలలో పనిచేసే 23వేల మంది ఆర్టిజన్లను క్రమబద్దీకరించడానికి మార్గం సుగమమైంది. విద్యుత్ సంస్థలలో ఎంతో కాలంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విద్యుత్ శాఖ అధికారులను గతంలో ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 23వేల మంది ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరిస్తూ గత ఏడాది నాలుగు విద్యుత్ సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. ఆర్టిజన్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆర్టిజన్ల క్రమబద్ధీకరణ అంశంపై విచారణ కొనసాగించింది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని విద్యుత్ శాఖ తరుఫున వాదించే లాయర్లు హైకోర్టుకు వివరించారు. ప్రమాదపుటంచుల్లో ప్రతీ దినం విధులు నిర్వహిస్తున్నారని, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి సర్వీసులు క్రమబద్ధీకరించకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తెచ్చారు. వారిని క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ మానవీయ దృక్పథాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. మెరుగైన విద్యుత్ సరఫరాకోసం కష్టపడుతున్న ఆర్టిజన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగానే ఉంటున్నారని, ఉద్యోగ భద్రత లేదని వివరించారు.విద్యుత్ శాఖ వాదనలను హైకోర్టు సమర్థించింది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను రద్దు చేసింది. ముఖ్యమంత్రి హర్షం, పీఆర్సీ అమలుకు హామీ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సేవలను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆర్జిజన్లను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం ఎంతో మానవీయతతో నిర్ణయం తీసుకున్నదని, దాన్ని హైకోర్టు సమర్థించడం ఆనందకరమని సిఎం చెప్పారు. 23 వేల మంది ఆర్టిజన్లకు ఇంది పండుగ రోజని ముఖ్యమంత్రి అభివర్ణించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురికావద్దని, మంచి జీవన ప్రమాణాలతో వారి జీవించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని సిఎం అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావుతో సిఎం మాట్లాడారు. సమర్థంగా వాదనలు వినిపించి ఆర్టిజన్ల జీవితాల్లో వెలుగులు నింపారని అభినందించారు. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్ నిర్ణయించాలని, వారికి పి.ఆర్.సి.అమలు చేయాలని సిఎండిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెగ్యులర్ కాబోతున్న ఆర్టిజన్లకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇక వారు రెగ్యులర్ ఉద్యోగులే : సీఎండీ ప్రభాకర్ రావు హైకోర్టు తీర్పు పట్ల సీఎండీ ప్రభాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని, ఇవాళ కోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సీఎండీ అన్నారు. విద్యుత్ శాఖకు ఇది ఎంతో శుభ దినమని ఆయన అన్నారు. ఇప్పటి నుంచి ఆర్టిజన్లు కూడా రెగ్యులర్ ఉద్యోగులే అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారికి పే స్కేలు నిర్ణయిస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని వెల్లడించారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించే విషయంలో సహకరించిన వారందరికీ సిఎండి ప్రభాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న ఫలితాన్ని ఆర్జిజన్లు రెగ్యులరైజ్ కావడం వల్ల పొందగలిగారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఐటీడీఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
సాక్షి, హైదరాబాద్: ఐటీడీఏ(సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ)ల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ఐటీడీఏ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. దాదాపు 25 ఏళ్లుగా ఐటీడీఏల్లో పనిచేస్తున్నప్పటికీ అరకొర వేతనాలు ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల విడుదలలో జాప్యం చేయడంతో సిబ్బందికి నెలవారీ వేతనాలు అందడం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వేతనాల పెంపుతో పాటు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు కాంట్రాక్టు సిబ్బంది సోమవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.లక్ష్మణ్‌ను కలసి వినతిపత్రం అందించారు. సిబ్బంది డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. -
తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
-
హోంగార్డుల జీవితాల్లో వెలుగు
♦ సీఎం ప్రకటనతో 19వేల కుటుంబాల్లో సంతోషం ♦ రెగ్యులర్ ఉద్యోగాలిస్తామన్న ముఖ్యమంత్రి ♦ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. ఏళ్లపాటుగా చాలీచాలని జీతాలతో కష్టాలు పడుతున్న హోంగార్డుల కుటుంబాల్లో ముఖ్యమంత్రి ప్రకటన సంతోషం నింపింది. హోంగార్డులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తామని సోమవారం అసెంబ్లీలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో కొన్ని నెలల నుంచి జరుగుతున్న హోంగార్డుల పోరాటం ఫలించినట్టు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 19వేల మంది హోంగార్డులు పోలీస్ శాఖలోని 14 విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరందరినీ రెగ్యులరైజ్ చేయడంతోపాటు జీతభత్యాల పెంపు విషయంలోనూ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవలే పోలీస్ శాఖ పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. బేసిక్ రూ.13 వేలు, డీఏ రూ.2384, హెచ్ఆర్ఏ రూ.3900, సీసీఏ 600, మొత్తంగా రూ.19,884 జీతం వచ్చేలా చర్యలు చేపట్టాలని డీజీపీ అనురాగ్ శర్మ జనవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఉన్న 19201 మంది హోంగార్డులను స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లుగా గుర్తించి రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై సీఎం కేసీఆర్ రెండుసార్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న దానికంటే మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి హోంగార్డుల జీతం రూ.6వేలు ఉండగా, ప్రస్తుతం రూ.12వేల జీతభత్యాలను అందుకుంటున్నారు. ప్రసూతి సెలవులు, ఆరోగ్య భద్రత... హోంగార్డులను రెగ్యులర్ చేసేందుకు ఎదురవుతున్న న్యాయ సమస్యలపై ప్రభుత్వం కసరత్తుచేస్తోం దని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే పోలీస్ శాఖలో జరిగే నియామకాల్లో హోంగార్డులకు 5శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది. ఈ రిజర్వేషన్‌ను మరో 5శాతం పెంచాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా మహిళలకు జీతభత్యాలతో కూడిన ప్రసూతి సెలవులు, హోంగార్డులందరికీ ఆరోగ్య భద్రత స్కీం అమలుచేసేందుకు కూడా పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
‘దయచేసి ప్రతిపాదనలు పంపకండి’
హైదరాబాద్: ‘దశలవారీగా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తాం.. అంతేకాదు ఇంటికొక ఉద్యోగం కల్పిస్తాం.. ఉద్యోగాలు కల్పించలేక పోతే ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలు ఇస్తాం...’ సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు. వీటిని మర్చిపోక ముందే 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కల చెదిరిపోయింది. నాలుగు రోజుల కిందట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు ఎవరినీ రెగ్యులరైజ్ చెయ్యలేమని చెప్పటం ఇందుకు కారణం. ఆర్థిక శాఖే తిరస్కరించింది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రతిపాదనను స్వయానా ఆర్థిక శాఖే తిరస్కరించిందంటే ప్రభుత్వమే వెనుక నుంచి ఇలా చేయించినట్లు అవగతమవుతుంది. కొన్ని నెలల క్రితం ఆరోగ్యశాఖ నుంచి 3500 మంది ఉద్యోగులకు సంబంధించి రెగ్యులరైజేషన్ ప్రతిపాదన ఆర్థిక శాఖకు పంపిస్తే ఫైలును తిరస్కరించారు. ఆ తర్వాత మళ్లీ ఒకసారి ప్రతిపాదన పంపినా వెనక్కే వచ్చింది. పదే పదే ప్రతిపాదనలు పంపించవద్దని, రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ లేనప్పుడు మీరు ప్రతిపాదనలు పంపించడంలో అర్థం లేదని చెప్పింది. దీంతో ఇక ఏ శాఖ నుంచి కూడా ఉద్యోగుల వివరాలు, వారి వేతనాల వివరాలు, సర్వీసు, తదితర వివరాలేవీ పంపించడం లేదు. మంత్రులే నాన్నెళ్లకోసారి మీటింగు పెట్టి ఏదో ఒకటి మాట్లాడి వెళ్లిపోతున్నారు. కేబినెట్ సబ్‌కమిటీ ఓ ఎత్తుగడే..! కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం కేబినెట్ సబ్‌కమిటీని వేయడం కూడా ఓ ఎత్తుగడగానే ఉన్నట్టు కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2014 సెప్టెంబర్ 9న నలుగురు మంత్రులతో కేబినెట్ సబ్‌కమిటీ వేస్తే..ఇప్పటి వరకూ ఏమీ తేల్చలేదు. సాంకేతిక కారణాలని, సుప్రీం మార్గదర్శకాలు అడ్డొస్తున్నాయని చెప్పి తప్పించుకుంటున్నారు. ఓవైపు స్వయానా హైకోర్టే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను నియమించుకోవద్దని, శాశ్వత ప్రాతిపదికన నియమించుకోవాలని చెబుతున్నా ప్రస్తుతం ఉన్న వారికి హామీ ఇవ్వడం లేదు. వేతనాలు కూడా లేవు.. రాష్ట్రంలో 40 వేల మంది వరకూ కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు రాక మూడు నెలలయింది. పశ్చిమ గోదావరి లాంటి కొన్ని జిల్లాల్లో 5 నెలల దాటినా జీతాలు లేవు. కాంట్రాక్టు వేతన జీవులు నెలకు రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే తీసుకునే వారున్నారు. ఆ ఇచ్చే వేతనం కూడా నెలల తరబడి రాకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. 2016 ఆగస్ట్ 31తో వీరి పదవీకాలం ముగిసింది. అయినా ఇప్పటివరకూ కొనసాగింపు ఉత్తర్వులివ్వలేదు. -
‘సాదా బైనామా’ క్రమబద్ధీకరణకు ఓకే
♦ జిల్లా కలెక్టర్లకు అధికారాలిస్తూ సర్కారు ఉత్తర్వులు ♦ క్లెయిముల స్వీకరణకు ఆఖరు తేదీ జూన్ 15 సాక్షి, హైదరాబాద్: తెల్లకాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల క్రమబద్ధీకరణకు సర్కారు పచ్చజెండా ఊపింది. సెక్షన్ 22(2) ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టం మేరకు సాదా బైనామాపై ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ విన్నపం మేరకు జూన్ 2, 2014లోపు తేదీలు ఉన్న సాదా బైనామాలను రాష్ట్ర వ్యాప్తంగా క్రమబద్ధీకరిచేందుకు అనుమతించింది. క్లెయిమ్‌ల వన్‌టైమ్ సెటిల్మెంట్ అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకు అప్ప గించింది. క్లెయిమ్‌ల స్వీకరణకు గడువును జూన్ 15గా నిర్ణయించింది. ఐదెకరాలలోపు భూమికి సంబంధించి సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీనీ మినహాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హక్కు బదిలీ, కేటాయింపు కోరుకునే సాదాబైనామా జూన్ 2, 2014కు ముందు రాసుకున్నదై ఉండాలి. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని భూములకు వర్తించదు. ఉత్తర్వుల అమలుపై తగిన చర్యలు చేపట్టాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ , అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రిజిస్ట్రేషన్లు ఇలా... రిజిస్ట్రేషన్ కోరుకునేవారు ఫారమ్ 10తో పాటు సాదా బైనామా జిరాక్స్ ప్రతిని జతచేసి సంబంధిత మండల తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలన అనంతరం ఫారమ్ 11 ద్వారా నోటీసులుచ్చి తహసీల్దారు సదరు ఆస్తిపై విచారణ చేయిస్తారు. అనంతరం ఫారమ్ 10లో కోరిన భూమిని దరఖాస్తుదారుని పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఆ ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్‌కు తహసీల్దారు సిఫారసు చేస్తా రు. రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓనరుతో ఎంతమాత్రం పనిలేదు. లబ్ధిదారులు ఒక్క రూపాయి చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన సాదాబైనామా క్రమబద్ధీకరణ అవకాశం ద్వారా ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని సుమారు లక్షన్నర మంది వ్యవసాయదారులకు తాజా ప్రక్రియ ద్వారా లబ్ధిచేకూరనుంది. -
ఉపాధి హామీ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
ఆదిలాబాద్ : తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల నాటి హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. -
'కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి'
హైదరాబాద్: కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించేలా మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి విన్నవించారు. ఈమేరకు మంత్రివర్గం ఉపసంఘం సభ్యులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాధరెడ్డిలను ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి కలిశారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు గత 15 ఏళ్లుగా ప్రభుత్వ కాలేజీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఎయిడెడ్, సంస్కృత పాఠశాలల సిబ్బంది వేతనాల కోసం బడ్జెట్‌ను విడుదల చేసినందున మూడు నెలల వేతనం ఆంక్షలు లేకుండా చెల్లించాలని కోరారు. ఈ విషయాలపై మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గాంధీ, మాణిక్యం తదితరులు మంత్రులను కలిశారు -
టీడీపీనేత భూ దందా
గ్యాస్ గోదాం పేరిట స్థలం కొట్టేసిన ఘనుడు ఇప్పుడు ఫంక్షన్‌హాల్ నిర్మాణం రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు ప్రణాళిక కళ్లెదుటే జరుగుతున్నా స్పందించని అధికారులు ఒక అక్రమం.. ఒక మోసం కలిసికట్టుగా అమీన్పూర్లో ఓ అధునాతన ఫంక్షన్ భవనం రూపుదిద్దుకుంటోంది. గ్యాస్ గోదాం కోసం కారు చౌకగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి పొందిన ఓ టీడీపీ నాయకుడు.. ఇప్పుడు రూట్ మార్చారు. కొట్టేసిన భూమికి మరికొంత స్థలం కబ్జాచేసి మొత్తం రూ. 3 కోట్ల విలువైన భూమిలో శరవేగంగా ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నారు. భవన నిర్మాణం పూర్తి చేసుకుని రెగ్యులైజేషన్ పథకం కింద స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. సంగారెడ్డి : ‘బక్క’చిక్కిన సామాన్యునికి ఇంటి స్థలం కోసం 60 గజాలు ఇవ్వమని అడిగితే 120 ఆంక్షలు పెట్టే అధికారులు, పలుకుబడి ఉన్న వ్యక్తులకు మాత్రం ప్రత్యేక జీఓలు తెచ్చి అప్పనంగా 20 గుంటల స్థలాన్ని కట్టబెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలుగుదేశం పార్టీ నాయకునికి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఉంది. ఈ ఏజెన్సీకి జోగిపేట పట్ణణంలో గ్యాస్ గోదాం ఉంది. ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. అయితే తాను పటాన్చెరు మండలం అమీన్పూర్లో గ్యాస్ గోదాం నిర్మాణం చేసుకుంటానని, ఇందుకు స్థలం కేటాయించాలని టీడీపీ నాయకుడు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రస్తుత ఏపీ సీఎం హవా నడవడంతో ఆయన సిఫార్సు మేరకు పటాన్చెరు మండలం అమీన్‌పుర్‌లోని సర్వే నంబర్ 993లో 20 గుంటల స్థలాన్ని నామమాత్రపు రుసుంతో కేటాయిస్తూ 2011లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై అప్పట్లోనే నిరసనలు వ్యక్తం అయ్యాయి. రెవెన్యూ నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీ సంస్థ నుంచి గోదాం బదిలీకి ఎలాంటి అనుమతి లేకుండానే భూమి కేటాయించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గోదాంను జోగిపేట నుంచి అమీన్‌పూర్‌కు తరలించేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. పైగా ఒక ప్రైవేటు ఏజెన్సీకి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం నిబంధనలు అంగీకరించవు. అయినా అప్పటి ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా భూమిని ఆయనకు దారాదత్తం చేసింది. శరవేగంగా నిర్మాణం తాజాగా ఇదే భూమిలో సదరు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆధునిక సౌకర్యాలు, అదనపు హంగులతో ఓ పంక్షన్‌హాల్ నిర్మాణం చేస్తున్నారు. గ్యాస్ గోదాం నిర్మాణం పేరుతో గ్రామ పంచాయతీ అనుమతి పొందిన ఆయన, ఏకంగా ఫంక్షన్ హాల్ కడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన 20 గుంటల స్థలానికే ఆనుకొని ఉన్న మరికొంత ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి శరవేగంగా భవన నిర్మాణం చేస్తున్నారు. ప్రజల ఫిర్యాదుల మేరకు భవన నిర్మాణాన్ని తనిఖీ చేసిన రెవిన్యూ అధికారులు కూడా ఫంక్షన్ హాల్ కడుతున్నట్లు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని పటాన్చెరు తహశీల్దారు జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. మండల స్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారికి, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదికలు అంది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలోపే భవన నిర్మాణం పూర్తి చేసుకుని రెగ్యులైజేషన్ స్కీం కింద దరఖాస్తు చేసుకోవడానికి సదరు నాయకుడు పథకం వేసినట్లు సమాచారం. అదే జరిగితే దాదాపు రూ 2.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి టీడీపీ నాయకుని చేతిలోకి వెళ్లిపోయినట్లేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పటాన్చెరు తహశీల్దారు మహిపాల్‌రెడ్డిని వివరణ కోరగా, సదరు టీడీపీ నేత కడుతున్న భవన నిర్మాణంపై ఆరోపణలు రావడంతో ప్రాథమిక విచారణ జరిపించామని, తమ విచారణలో అతను ఫంక్షన్ హాల్ కడుతున్నట్లు తేలిందన్నారు. ఈమేరకు నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఆయన వివరించారు. -
జనమే ఎజెండా
వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు న్యూస్‌లైన్ నెట్వర్క్ :అన్నదాతకు బాసట.. చేనేతలకు చేయూత.. ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నెరవేర్చే ప్రణాళిక.. పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టే ఆలోచన.. ఆంక్షల్లేని ఆరోగ్య శ్రీ.. మహిళా సంఘాలకు రుణాల నుంచి విముక్తి.. వెరసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. జనమే ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని ‘అనంత’ ప్రజానీకం స్పష్టం చేస్తున్నారు. తాను కలలు కంటున్న సువర్ణ యుగాన్ని తెచ్చేలా.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్ మేనిఫెస్టో ఉందని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోతో జిల్లాలోని వివిధ వర్గాల వారికి లబ్ధి చేకూరనుంది. ‘అమ్మ ఒడి’తో ఉన్నత చదువులు నిరు పేద తల్లిదండ్రులు వారి పిల్లలను కూలి పనులకు పంపకుండా బడికి పంపాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టనున్నారు. ఒకటి నుంచి పదో తరగతి పిల్లలకు నెలకు రూ.500 చొప్పున.. ఇద్దరు పిల్లలుంటే నెలకు రూ.1000 చొప్పున తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ఇంటర్ విద్యార్థికి రూ.700, డిగ్రీ, ఆపై చదువులకు రూ.1000 ఇస్తారు. ఈ పథకం వల్ల జిల్లాలో లక్షలాది మంది పిల్లలకు మంచి విద్య అందనుంది. కాగా, ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. రైతన్నకు బాసట ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న సమయంలో.. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించని సందర్భాల్లో రైతులను ఆదుకునేదుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేశారు. కొత్త ్యవసాయ కళాశాలలు, వెటర్నరీ యూనివర్సిటీలు ఏర్పాటు కానున్నాయి. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఫోన్ చేసిన 20 నిమిషాల్లో రావడానికి మండలానికో 102 మొబైల్ సర్వీస్.. పాడి రైతులు, గొర్రెలు, మేకల కాపరుల సమస్యల పరిష్కారం కోసం 103 మొబైల్ సర్వీస్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీనివల్ల జిల్లాలోని సుమారు 7 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు. జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జిల్లా కేంద్రంలో ఉన్న సర్వజనాస్పత్రిలో ప్రస్తుతం రోగుల బాధలు వర్ణణాతీతం. 500 పడకల ఆస్పత్రిగా జీవో జారీ అయినా అందుకు తగ్గ సౌకర్యాలు లేవు. కార్డియాలజీ, యూరాలజీ, న్యూరోలకు ఇక్కడ వైద్యం అందని పరిస్థితి. రక్తమోడుతూ ఎవరైనా ఆస్పత్రికి వెంటనే.. కర్నూలుకో, బెంగళూరుకో రెఫర్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని జగన్ ప్రకటించడంతో జిల్లాలోని లక్షలాది మంది సామాన్యుల కష్టాలు తప్పనున్నాయి. నో గ్యాస్‘ట్రబుల్’ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఏడాదికి 12 సిలిండర్లు ఇవ్వడంతో పాటు ఒక్కో సిలిండర్‌పై రూ.100 సబ్సిడీ ఇస్తామని జననేత ప్రకటించారు. జిల్లాలో 5,75,391 లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 441. జగన్ ముఖ్యమంత్రి కాగానే ఈ ధరపై రూ.100 తగ్గుతుంది. కడుపు నిండా భోజనం పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కిలో రూ.2 కే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. 2009లో అధికారంలోకి రాగానే కుటుంబానికి రూ.30 కిలో అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ హామీని తుంగలో తొక్కింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ప్రతి మనిషికి రూ.1కే ఆరు కిలోల బియ్యం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ నిర్ణయంతో జిల్లాలో 11,53,718 మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. బకాయిల నుంచి విముక్తి డ్వాక్రా రుణాల మాఫీ నిర్ణయంతో జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల్లో హర్షం వ్యక్తం అవుతోంది. జగన్ నిర్ణయంతో జిల్లాలోని 50 వేల స్వయం సహాయక సంఘాలకు దాదాపు రూ.885 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. దీనివల్ల 5.2 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. అభాగ్యులకు ఆసరా ఆదరణకు నోచుకోని అభాగ్యులకు ఆసరాగా ఉండేందుకు పింఛన్ మొత్తాన్ని పెంచాలని జననేత నిర్ణయించారు. జిల్లాలో వివిధ పింఛన్లు అందుకుంటున్న వారు 4,22,808 మంది ఉన్నారు. వీరిలో 2,30,830 మంది వృద్ధులు. వితంతువులు 1,07,298 మంది ఉన్నారు. చేనేత కార్మికులు 11,966 మంది, గీత కార్మికులు 131 మంది ఉన్నారు. వీరందరికీ నెలకు రూ. 200 పింఛన్ వస్తోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఈ పింఛన్ రూ.700 అవుతుంది. జిల్లాలో వికలాంగులు 55,268 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరికి నెలకు రూ.500 వస్తోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే వీరికి నెలకు రూ.1000 పింఛన్ లభిస్తుంది. 47,782 మంది వికలాంగులకు రూ.500లు చొప్పున ప్రస్తుతం పింఛన్ పంపిణీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.1000 చొప్పున పింఛన్ అందనుంది. రెగ్యులరైజేషన్‌తో ఉద్యోగ భద్రత ఏళ్ల తరబడి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు భధ్రత కలగనుంది. జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో దాదాపు 4 వేల మంది ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వీరందరూ శాశ్వత ఉద్యోగులుగా మారనున్నారు. ప్రజల ముంగిట్లో ప్రభుత్వ కార్యాలయాలు రేషన్, ఆధార్ కార్డుల కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి విసిగిపోతున్నారు. ఈ జన్మలో తమకు కార్డు రాదని, ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీపై నిత్యావసర సరుకులు తీసుకోలేమని భావిస్తున్న కుటుంబాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ఇలాంటి వారికి భరోసానిచ్చేలా అన్ని రకాల కార్డులను పంపిణీ చేయడానికి ప్రతి గ్రామంలో ఒక ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంతో బాధిత ప్రజలంతా తమ కష్టాలు తీరినట్లేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆధార్‌కార్డు కోసం 42 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకా కార్డు తీసుకోని వారు దాదాపు 6 లక్షల మంది ఉంటారు. వీరందరికీ స్థానిక కార్యాలయాల్లో ఉపశమనం కలగబోతోంది. చేనేతలకు చేయూత వ్యవసాయం, చేనేత రంగం రెండు కళ్లుగా గుర్తించిన వైఎస్ జగన్మోహనరెడ్డి తన మేనిఫెస్టోలో చే నేత రంగానికి పెద్దపీట వేశారు. అధికారంలోకి రాగానే ప్రతి చేనేత కుటుంబానికి మగ్గాల ఏర్పాటుకు షెడ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. బ్యాంకుల్లో తీసుకున్న వ్యక్తిగత రుణాలను మాఫీ చేసి.. ప్రతి చేనేత కుటుంబానికి వడ్డీలేని వ్యక్తిగత రుణాలను అందజేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు ఇస్తున్న రూ.200 పించన్‌ను రూ.1.000 చేస్తానన్నారు. ప్రస్తుతం ముడిసరుకుపై చేనేత కార్మికులకు రూ.600 సబ్సిడీ ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచడంతోపాటు, అన్ని రకాల సబ్సిడీలను పెంచుతామని హామీ ఇచ్చారు. జనతా వస్త్రాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. చేనేత వస్త్రాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారు ధరించేలా ప్రోత్సాహం అందిస్తామని, మరమగ్గాలకు కరెంట్ చార్జిలు యూనిట్‌కు రూ. 1.50 మాత్రమే వసూలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో జిల్లాలో సుమారు 2 లక్షల మందికి లబ్ధి కలగనుంది.