ఆదిలాబాద్ : తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల నాటి హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.