
సాక్షి, అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలన్న డిమాండ్‌తో బుధవారం జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు జరగనున్నాయి.
మరణించిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాలు చేపట్టాలని, పీఆర్సీ వేసి, ఐ ఆర్ ప్రకటించాలని, సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన 90 శాతం డీఏ బకాయిలు, సీపీఎస్ మినహాయింపు మొత్తం వారివారి ఖాతాల్లో జమచేయాలని, సీపీఎస్, జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, పెండింగులో ఉన్న సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఉపాధ్యాయులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.