సాక్షి, హైదరాబాద్: సర్కారు అక్రమిత నివాస స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులో సుమారు 80 శాతం పైగా తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. మిగతా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. గత మూడు నెలల క్రితమే జీవో 58 కింద దరఖాస్తులపై విచారణ పూర్తి కాగా, తాజాగా జీవో 59 కింద దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. ప్రతి మండలానికీ ఒక జిల్లా స్థాయి అధికారిని కేటాయించడం ద్వారా క్రమబద్దీకరణ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను వేగవంతంగా కొనసాగుతోంది.గతంలో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మరోసారి పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే క్రమబద్దీకరిస్తారు.
చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు
ప్రభుత్వ విలువ ఆధారంగా..
59 జీవో కింద అక్రమిత స్థలాలను ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువ ఆధారంగా క్రమబద్దీకరించనున్నారు. 126 నుంచి 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువలో 25 శాతం.. 251 నుంచి 500 గజాల వరకు 50 శాతం.. 500 నుంచి 100 గజాల వరకు 75 శాతం.. 1000 గజాలపైన పూర్తి విలువను దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంటుంది.
రెండు నెలల క్రితమే..
జీవో 58 కింద ఉచిత క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులపై రెండు నెలల క్రితమే క్షేత్ర స్థాయి విచారణ పూర్తయింది. ప్రతి 250 దరఖాస్తులకు ఒక బృందం చొప్పున రంగంలో దిగి క్షేత్రస్థాయిలో వివరాలు, ఫొటోలు, తదితర ఆధారాలు ప్రత్యేక రూపొందించిన ‘జీవో 58 మొబైల్ యాప్’లో నమోదు చేశారు.అనంతరం సమగ్ర నివేదికను అధికార యంత్రాంగాలకు సిఫార్సు చేశారు.
దరఖాస్తుల సంఖ్య 1.14 లక్షలపైనే
ప్రభుత్వం అక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు మరో అవకాశం కల్పిస్తూ పాత జీవో 58, 59లకు అనుబంధంగా కొత్త జీవోలను జారీ చేసంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు సుమారు 1.14 లక్షల పైన కుటుంబాలు ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 71,316, ఆతర్వాత రంగారెడ్డి జిల్లాలో 31,830, హైదరాబాద్ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచి్చనట్లు రెవెన్యూ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment