
న్యూఢిల్లీ: దివాలా పక్రియలో ఆలస్యాన్ని నివారించడం, మెరుగైన విలువను సాధించడం, ఇందుకు సంబంధించి లిక్విడేషన్ పక్రియ క్రమబద్దీకరణ ప్రయత్నాల్లో భాగంగా ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నిబంధనలను సవరించింది. దివాలా పక్రియలో భాగస్వాములు చురుగ్గా పాల్గొనడానికి కూడా తాజా నిబంధనల సవరణ దోహదపడుతుందని ఒక అధికారికలో ఐబీసీ (ఇన్సాలెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్– అమలు సంస్థ ఐబీబీఐ పేర్కొంది.
సవరణలలో భాగంగా కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) సమయంలో ఏర్పడిన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (సీఓసీ), మొదటి 60 రోజులలో వాటాదారుల సంప్రదింపుల కమిటీ (ఎస్‌సీసీ)గా పని చేస్తుంది. క్లెయిమ్‌ల తుది నిర్ణయం (తీర్పు) తర్వాత (ప్రక్రియ ప్రారంభించిన 60 రోజులలోపు) అంగీకరించిన క్లెయిమ్‌ల ఆధారంగా ఎస్‌సీసీ పున ర్నిర్మితమవుతుంది. వాటాదారుల మెరుగైన భాగస్వామ్యంతో నిర్మాణాత్మకంగా, సమయానుగుణంగా ఎస్‌సీసీ సమావేశాలను నిర్వహించే బాధ్యతలు లిక్విడేటర్‌పై ఉంటాయి. అలాగే, ఎస్‌సీసీతో లిక్విడేటర్ తప్పనిసరి సంప్రదింపుల పరిధి పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment