amendment
-
నిర్ధారిత ధరతో ఇక డీలిస్టింగ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా స్వచ్చంద డీలిస్టింగ్ నిబంధనలను సవరించింది. దీనిలో భాగంగా నిర్ధారిత(ఫిక్స్డ్) ధర విధానం ద్వారా షేర్ల డీలిస్టింగ్‌కు వీలు కలి్పంచనుంది. వెరసి రివర్స్ బుక్బిల్డింగ్(ఆర్బీబీ) పద్ధతిలో ప్రత్యామ్నాయానికి తెరతీసింది. దీంతో లిస్టెడ్ కంపెనీలకు సులభతర బిజినెస్ నిర్వహణలో మరింత తోడ్పాటు లభించనుంది. ఆర్బీబీ విధానంలో ఏదైనా సంస్థ షేర్లను డీలిస్ట్ చేయదలచుకుంటే తలుత పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇందుకు తప్పనిసరిగా కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించవలసి ఉంటుంది. తదుపరి వాటాదారులు షేర్లను ఆఫర్ చేసేందుకు వీలుంటుంది. తాజా నోటిఫికేషన్లో సెబీ ఫిక్స్డ్ ధర విధానం ద్వారా ఆర్బీబీ విధానంలో ప్రత్యామ్నాయానికి వీలు కలి్పంచింది. తరచుగా ట్రేడయ్యే షేర్లను స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి డీలిస్టింగ్ చేసేందుకు కంపెనీలు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంను ఆఫర్ చేయవలసి ఉంటుంది. మరోపక్క ఆర్బీబీ పద్ధతిలో చేపట్టే డీలిస్టింగ్‌కు సంబంధించి కౌంటర్ ఆఫర్ విధానంలోనూ సెబీ సవరణలు చేసింది. పబ్లిక్ వాటాలో కనీసం 50 శాతం టెండర్ అయితే ప్రస్తుత 90 శాతానికికాకుండా 75 శాతానికి కౌంటర్ ఆఫర్ ప్రకటించవచ్చు. అయితే కౌంటర్ ఆఫర్ ధర టెండర్ అయిన షేర్ల సగటు పరిమాణ అధిక ధర కంటే తక్కువగా ఉండటాన్ని అంగీకరించరు. వెరసి కొనుగోలుదారుడు ఆఫర్ చేసిన సంకేత ధరను మించి ప్రకటించవలసి ఉంటుంది. ఆఫర్ తదుపరి కొనుగోలుదారుడి వాటా 90 శాతానికి చేరుకుంటేనే డీలిస్టింగ్‌కు అనుమతిస్తారు. ఎక్సే్చంజీల్లో 1 నుంచి లావాదేవీ చార్జీల్లో మార్పులు మార్కెట్ ఇన్ఫ్రా సంస్థల సభ్యులందరికీ ఒకే రకమైన రుసుముల విధానాన్ని అమలు చేయాలంటూ సెబీ ఆదేశించిన నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా క్యాష్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ల ట్రేడింగ్‌పై లావాదేవీ ఫీజులను సవరించాయి. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో సెన్సెక్స్, బ్యాంకెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌లపై ట్రాన్సాక్షన్ ఫీజును రూ. 1 కోటి ప్రీమియం టర్నోవరుపై రూ. 3,250గా బీఎస్ఈ నిర్ణయించింది. అయితే, ఈక్విటీ డెరివేటివ్స్‌లోని మిగతా కాంట్రాక్టులకు చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవు. మరోవైపు ఎన్ఎస్ఈలో క్యాష్ మార్కెట్‌కి సంబంధించి రూ. 1 లక్ష విలువ చేసే ట్రేడ్‌కి చార్జీలు రూ. 2.97గా ఉంటాయి. ఈక్విటీ ఫ్యూచర్స్కి ఈ రుసుము రూ. 1 లక్షకి రూ. 1.73గాను, ఈక్విటీ ఆప్షన్ల విషయంలో రూ. 1 లక్ష ప్రీమియం విలువపై రూ. 35.03గాను ఉంటుంది. కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో ఫ్యూచర్స్కి సంబంధించి లక్ష ట్రేడ్ వేల్యూకి రూ. 0.35 ఫీజు ఉంటుంది. రంగు చూసి ఫండ్స్‌లో రిస్క్ తెలుసుకోవచ్చుఈ దిశగా కొత్త ప్రతిపాదనలు తెచి్చన సెబీవివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక ముందు ఇన్వెస్టర్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా సెబీ కొన్ని కీలక ప్రతిపాదనలు రూపొందించింది. ఒక మ్యూచువల్ ఫండ్ పథకానికి సంబంధించి రిస్‌్కను సూచించే ‘రిస్్క–ఓ–మీటర్’ రంగుల థీమ్‌తోనూ ఉండాలన్నది సెబీ ప్రతిపాదన. మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించి రిస్్క–ఓ–మీటర్‌ను ఆరు స్థాయిల్లో తెలియజేయడం తప్పనిసరి. ప్రస్తుతం లో(తక్కువ), లో టు మోడరేట్ (తక్కువ నుంచి మోస్తరు), మోడరేట్ (మోస్తరు), మోడరేట్లీ హై (కొంచెం ఎక్కువ), హై (ఎక్కువ), వెరీ హై (మరీ ఎక్కువ)గా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు/ఫండ్స్ నిర్వహణ సంస్థలు) తెలియజేస్తున్నాయి. ఇప్పుడు తక్కువ రిస్క్‌కు ఆకుపచ్చ, తక్కువ నుంచి మోస్తరు రిస్‌్కకు ముదురు చిలకపచ్చ, మోస్తరు రిస్‌్కకు లేత చిలకపచ్చ (నియాన్ ఎల్లో), కొంచెం ఎక్కువ రిస్‌్కకు కాఫీ రంగు (క్యారామెల్), అధిక రిస్క్‌కు చిక్కటి నారింజ రంగు, అధిక రిస్‌్కకు ఎర్రటి రంగును సూచించాలన్నది సెబీ ప్రతిపాదన. ఎక్స్పెన్స్ రేషియో, రాబడులు అన్నవి ఒకే పథకానికి సంబంధించి డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో వేర్వేరుగా ఉండడంతో.. ఈ రెండు రకాల ప్లాన్లకు సంబంధించి అన్ని వివరాలు ప్రదర్శించాలంటూ సెబీ మరో ప్రతిపాదన చేసింది. వీటిపై అక్టోబర్ 18 వరకు ప్రజల నుంచి సలహా, సూచనలను సెబీ ఆహా్వనించింది. -
మణిపూర్: ఎస్టీ జాబితా నుంచి మైతేయిల తొలగింపు
ఇంఫాల్: మణిపూర్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాలైన కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణకు దారితీసిన తమ వివాదాస్పద ఉత్తర్వులో సవరణ చేసింది. మైతేయి వర్గాన్ని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)ల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2023 మార్చి 27న జారీ చేసిన ఉత్తర్వులో ఒక పేరాను తొలగించింది. అప్పట్లో కోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ గిరిజనులైన కుకీలు ఆందోళన ప్రారంభించారు. క్రమంగా పెద్ద ఘర్షణగా మారింది. రాష్ట్రంలో నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో దాదాపు 200 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. హైకోర్టు ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆల్ మణిపూర్ ట్రైబల్ యూనియన్ గతేడాది అక్టోబర్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివాదాస్పద ఉత్తర్వులో రెండు తెగల మధ్య శత్రుత్వానికి కారణమైన ఒక పేరాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. . గిరిజనులను జాబితాలో చేర్చడం, మినహాయించడం అనే ప్రక్రియలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి గతేడాది కుకీ తెగ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఎస్టీ జాబితాను కోర్టులు సవరించడం, మార్పులు చేయడం కుదరదని పేర్కొంది. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసింది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని గతేడాది కేంద్ర గిరిజన శాఖకు కోర్టు ప్రతిపాదించింది. దీనిపై నాగా, కుకీ-జోమి తెగలు రిజర్వేషన్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశాయి. వారికి రిజర్వేషన్లు దక్కితే అటవీ ప్రాంతాల్లో తమ నివాసాలు, ఉద్యోగాల వాటా తగ్గిపోతాయని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వివాదాస్పద పేరాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. -
మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. మహిళలకు హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పాయింట్ల పట్టికలో ఎలాంటి ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 (33.3) శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ గతంలో జీఓ ఎంఎస్ 3ను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఉద్యోగాల భర్తీ క్రమంలో నిర్దేశించిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేనిపక్షంలో వాటిని క్యారీఫార్వర్డ్ చేసే పద్ధతి (ఖాళీని అలాగే ఉంచడం) ఇకపై ఉండబోదు. దీనికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996 లోని రూల్ 22, 22ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది. తాజా సవరణలో భాగంగా ప్రస్తుతం మహిళలకు 33.3 శాతం రిజర్వు చేస్తున్నప్పటికీ.. కమ్యూనిటీ రిజర్వేషన్ల కేటగిరీల్లో అర్హులైన మహిళా అభ్యర్థులు లేనప్పుడు ఆయా ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓఎంఎస్ 35 జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు, ఉద్యోగ నియామక సంస్థలైన టీఎస్పీఎస్సీతో పా టు ఇతర బోర్డులకు పంపించారు. దీంతో ఏదైనా నోటిఫికేషన్లో నిర్దేశించిన అన్ని ఖాళీలను అదే సమయంలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు లేని సందర్భంలో, అదే కమ్యూనిటీకి చెందిన పురుషులతో భర్తీ చేయ డం వల్ల పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఉత్పన్నం కాదు. మహిళలకు నిర్దేశించిన పోస్టులు పురుషులతో భర్తీ చేస్తే... మహిళలకు దక్కాల్సిన 33.3% దక్కకుండా పోతాయనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. నియామకాల ప్రక్రియలో దీర్ఘకాలికంగా ప రిస్థితిని పరిశీలిస్తే మహిళలకు అతి తక్కువ సంఖ్య లో పోస్టులు దక్కుతాయనే వాదన వినిపిస్తోంది. -
సినిమా అంటే హీరో ఒక్కడే కాదు: రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: సినిమా అంటే హీరో ఒక్కడే కాదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని అభిప్రాయపడ్డారు. సినిమా బడ్జెట్లో అధికభాగం హీరోల రెమ్యునరేషన్లేనని గుర్తుచేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ వంటి బడా హీరోలు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నారని చెప్పారు. సినిమా కోసం పనిచేసిన కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలేనని తెలిపారు విజయసాయి రెడ్డి. కష్టపడిన అందరికీ సముచిత ప్రయోజనం చేకూరాలని ఆయన కోరారు. ఈ మేరకు చట్టాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. హీరో కొడుకులే హీరోలు ఎందుకు అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదీ చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? -
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీఆర్గనైజషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేసింది. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు 85శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ఎంబిబిఎస్ సీట్లు పొందేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేర్చించింది తెలంగాణ ప్రభుత్వం. నాడు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది. చదవండి: సీఎం కేసీఆర్ టూర్.. ఎస్సై గంగన్నతో మామూలుగా ఉండదు మరి! తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. ఇందులో 15శాతం అన్ రిజర్వుడు కోటాగా 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ఇదే విధానం కొనసాగితే, పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభిస్తున్నాయి. ఇప్పటికే ఎంబీబీఎస్ బి కేటగిరి సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 1820 సీట్లు ప్రతి ఏటా దక్కనున్నాయి. 1820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తో సమానం. ప్రతి ఏటా కాలేజీలు పెరిగినా కొద్ది ఈ సీట్ల మరింత పెరగనుంది. కొత్త మెడికల్ కాలేజీలలో అల్ ఇండియా కోట 15% సీట్లు యధాతదం గా ఉంటాయి. దీనిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు. తెలంగాణ విద్యార్థుల డాక్టర్ కల సాకారం దిశగా.. తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఏండ్ల కాలం నుంచి వైద్య విద్యకు దూరమైన తెలంగాణ బిడ్డలు సీఎం కేసీఆర్ ఆలోచనతో అమలు చేస్తున్న నిర్ణయాలు దగ్గర చేస్తున్నాయి. తెలంగాణ సోయితో ఆలోచించిన ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1820 మెడికల్ సీట్లు వచ్చేలా చేసింది. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ వైద్యారోగ్య రంగం గణనీయమైన వృద్ది సాధించింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకవైపు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
ఊగిసలాట కొనసాగుతుంది
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే జరిగే ఈ వారంలోనూ స్టాక్ సూచీల ఊగిసలాట కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ(బుధవారం) నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహించవచ్చు. అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక బిల్లు సవరణ మార్కెట్లలో ఒడిదుడుకులకు ప్రధాన కారణమయ్యాయి. మార్కెట్ అధిక అమ్మకాల స్థాయిలో (ఓవర్ సోల్డ్) ఉండటం వాస్తవం. ఇదే సమయంలో అనూహ్యంగా ఆర్థికపరమైన సమస్యలు తెరపైకి రావడంతో సెంటిమెంట్ బలపడలేకపోతుంది. అమ్మకాలు కొ నసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 16,600–16,800 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు నెలకొంటే ఎగువ స్థాయిలో 17,200 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఐటీ, ఆటో, మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో గతవారంలో సెన్సెక్స్ 463 పాయింట్లు నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయాయి. ఇరుసూచీలకిది వరుసగా మూడోవారమూ నష్టాల ముగింపు. బుధవారమే ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో బుధవారమే నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకునే స్క్యేయర్ ఆఫ్ లేదా రోలోవర్ అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. నిఫ్టీ స్వల్పకాలం పాటు 16,800–17,200 శ్రేణిలో ట్రేడవ్వొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. బ్యాంకింగ్ సంక్షోభం గత వారాంతాన జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ సంక్షోభ ఉదంతం తెరపైకి వచ్చింది. బ్యాంక్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ (సీడీఎస్) ప్రీమి యం ఒక్కసారిగా పెరగడంతో ఈ బ్యాంక్ సైతం దివాలా బాట పటొచ్చని ఊహాగానాలు నెలకొన్నాయి. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ వ్యవస్థలు వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ రంగంలో జరిగే ప్రతి పరిణామాన్ని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఎఫ్ఐఐల బేరీష్ వైఖరి దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఎఫ్ఐఐలు ఈ మార్చి 20–24 తేదీల మధ్య రూ.6,654 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే ఈ మార్చిలో సంస్థాగత ఇన్వెస్టర్లు మొతం్త రూ.9,430 కోట్ల షేర్లను కొనుగోలు చేసి దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. -
ఎంఎఫ్ లావాదేవీలపై సెబీ కన్ను
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమ పటిష్టతపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఎంఎఫ్ యూనిట్లలో లావాదేవీలను ఇన్సైడర్ నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చింది. ఇందుకు నిబంధనలను సవరించింది. వెరసి ఫండ్ యూనిట్ల కొనుగోళ్లు, అమ్మకం తాజా నిబంధనలలోకి రానున్నాయి. ప్రస్తుతం లిస్టెడ్ కంపెనీల సెక్యూరిటీలలో లావాదేవీలకు మాత్రమే ఇన్సైడర్ నిబంధనలు వర్తిస్తున్నాయి. ధరలను ప్రభావితం చేయగల రహస్య(వెల్లడికాని) సమాచారం ఆధారంగా లావాదేవీలు చేపట్టి లబ్ది పొందడాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్‌గా పిలిచే సంగతి తెలిసిందే. సెక్యూరిటీలకు వర్తించే ఈ నిబంధనల నుంచి ఎంఎఫ్ యూనిట్లకు ప్రస్తుతం మినహాయింపు ఉంది. అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు తెరతీసింది. ఎంఎఫ్‌లో ఇన్సైడర్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫండ్ హౌస్‌కు చెందిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లు వివిధ పథకాలలోగల తమ హోల్డింగ్స్‌ను అక్రమ పద్ధతిలో ముందుగానే రీడీమ్ చేసుకున్నారు. ఆరు డెట్ పథకాలు రిడెంప్షన్ ఒత్తిళ్లలో మూతపడకముందే రీడీమ్ చేసుకోవడంతో సెబీ తాజా మార్గదర్శకాలను ముందుకు తీసుకువచ్చింది. ఇకపై ఎంఎఫ్ పథకాల యూనిట్లలో బయటకు వెల్లడికాని సమాచారం ఆధారంగా లావాదేవీలు చేపట్టేందుకు వీలుండదు. పథకం నికర ఆస్తుల విలువ(ఎన్ఏవీ)పై లేదా యూనిట్‌దారులపై ప్రభావం చూపే సమాచారంతో ట్రేడ్ చేయడాన్ని నిబంధనలు అనుమతించవని నోటిఫికేషన్ ద్వారా సెబీ స్పష్టం చేసింది. వివరాలన్నీ వెల్లడించాలి.. తాజా నిబంధనల ప్రకారం ఆస్తుల నిర్వహణా కంపెనీ(ఏఎంసీ)లు స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఫండ్ పథకాలకు సంబంధించిన యూనిట్ల హోల్డింగ్స్ వివరాలను వెల్లడించవలసి ఉంటుంది. ఏఎంసీ, ట్రస్టీలు, దగ్గరి సంబంధీకులు తదితర హోల్డింగ్స్ వివరాలు తెలియజేయవలసి ఉంటుంది. సొంతం ఎంఎఫ్‌ల యూనిట్లలో యాజమాన్యం, ట్రస్టీలు, సంబంధీకుల లావాదేవీలను వెనువెంటనే ప్రకటించవలసి ఉంటుంది. ఏఎంసీ కంప్లయెన్స్ ఆఫీసర్‌కు రెండు పనిదినాల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
-
దివాలా చర్యల ప్రక్రియ ఇక మరింత వేగవంతం
న్యూఢిల్లీ: దివాలా పక్రియలో ఆలస్యాన్ని నివారించడం, మెరుగైన విలువను సాధించడం, ఇందుకు సంబంధించి లిక్విడేషన్ పక్రియ క్రమబద్దీకరణ ప్రయత్నాల్లో భాగంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నిబంధనలను సవరించింది. దివాలా పక్రియలో భాగస్వాములు చురుగ్గా పాల్గొనడానికి కూడా తాజా నిబంధనల సవరణ దోహదపడుతుందని ఒక అధికారికలో ఐబీసీ (ఇన్సాలెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్– అమలు సంస్థ ఐబీబీఐ పేర్కొంది. సవరణలలో భాగంగా కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) సమయంలో ఏర్పడిన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (సీఓసీ), మొదటి 60 రోజులలో వాటాదారుల సంప్రదింపుల కమిటీ (ఎస్సీసీ)గా పని చేస్తుంది. క్లెయిమ్‌ల తుది నిర్ణయం (తీర్పు) తర్వాత (ప్రక్రియ ప్రారంభించిన 60 రోజులలోపు) అంగీకరించిన క్లెయిమ్‌ల ఆధారంగా ఎస్సీసీ పున ర్నిర్మితమవుతుంది. వాటాదారుల మెరుగైన భాగస్వామ్యంతో నిర్మాణాత్మకంగా, సమయానుగుణంగా ఎస్సీసీ సమావేశాలను నిర్వహించే బాధ్యతలు లిక్విడేటర్పై ఉంటాయి. అలాగే, ఎస్సీసీతో లిక్విడేటర్ తప్పనిసరి సంప్రదింపుల పరిధి పెరుగుతుంది. -
ఈ లెక్క సరైనదేనా?
వివాదం ముందు పుట్టి కశ్మీర్ తర్వాత పుట్టిందంటే అతిశయోక్తి కాదేమో! స్వతంత్ర భారతదేశంలో విలీనం దగ్గర నుంచి ఇవాళ్టి దాకా జమ్మూ – కశ్మీర్‌ను చుట్టుముట్టినన్ని వివాదాల కథ అలాంటిది మరి. జమ్మూ – కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రద్దు తర్వాత గత మూడేళ్ళలోనూ ఇదే వరుస. ఓటర్ల జాబితా సవరణ అంశం ఆ జాబితాలో తాజాగా వచ్చి చేరింది. దేశంలోని ఈ అతి పిన్న వయసు కేంద్ర పాలిత ప్రాంతంలో ‘సాధారణంగా నివసిస్తున్నవారు’ సైతం ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చంటూ జమ్మూ – కశ్మీర్ ఎన్నికల ప్రధానాధికారి ఆగస్ట్ 17న ప్రకటించారు. బీజేపీ మినహా అక్కడి రాజకీయ పార్టీలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజా అనుమతితో గేట్లు ఎత్తేసినట్టేననీ, చివరకు స్థానిక ప్రజలు ఎన్నికల మైనారిటీగా మారిపోతారనీ రచ్చ రేగుతోంది. మునుపటి జమ్మూ– కశ్మీర్ రాష్ట్రంలో శాశ్వతవాసులే ఓటర్లుగా అర్హులు. అలా కానివారు సైతం ఇప్పుడు ఓటు వేయడానికి అర్హులే అన్నది ఎన్నికల ప్రధానాధికారి మాట. ఆర్టికల్ 370 రద్దుతో 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం అందుకు అవకాశమిస్తోందనేది ప్రాతిపదిక. దీని వల్ల జమ్మూ – కశ్మీర్ తుది ఓటర్ల జాబితాలో 20 – 25 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరతారని అంచనా. అలాగే, ఆ ప్రాంతంలో నియుక్తులైన దాదాపు 7 లక్షల భద్రతా దళ సిబ్బందీ ఓటర్లుగా నమోదు చేసుకొని, సరి కొత్త కేంద్రపాలిత ప్రాంతపు తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనవచ్చు. ఈ వైఖరే ఇప్పుడు స్థానిక ప్రధాన పార్టీల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఇది స్థానికేతరుల్ని ఓటర్లుగా చేర్చి, వారికి ఓటుహక్కు కల్పించే పన్నాగమనీ, స్థానికులు మైనారిటీగా మారిపోతారనీ, ఎన్నికల్లో వారి ప్రాధా న్యం తగ్గిపోతుందనీ నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ, సీపీఎం వగైరాల ఆరోపణ. దాదాపు దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా ఎన్నికల దిశగా వెళుతున్న కశ్మీర్లో 2019 ఆగస్ట్ 5న ఆర్టికల్ 370 రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడమే పెను వివాదమైంది. ఆ పైన ప్రధాన పార్టీల నేతల్ని నిర్బంధంలో ఉంచడం మరో వివాదం. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపైనా ఆరోపణలొచ్చాయి. ఏడు అసెంబ్లీ స్థానాలు సృష్టిస్తే, 6 జమ్మూకు, ఒకటే కశ్మీర్‌కు దక్కాయి. ముస్లిమ్‌ల మెజారిటీ ఉన్న కశ్మీర్‌ను తగ్గించి, హిందూ మెజారిటీ జమ్మూకు రాజకీయ ప్రాధాన్యం దక్కేలా ఈ ప్రక్రియ సాగిందనే విమర్శ ఎదురైంది. తీరా ఎన్నికలకు వెళ్ళే ముందు ఆఖరు పనిగా 25 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చుకొనే తాజా ప్రతిపాదన అగ్నికి ఆజ్యం పోసింది. అయితే, ఈ కొత్త ఓటర్లలో అధిక శాతం మంది మునుపటి ఓటర్ల జాబితా సవరణ తర్వాత 18 ఏళ్ళు నిండినవారన్నది కశ్మీర్ ఎన్నికల యంత్రాంగం చెబుతున్న వివరణ. ఆ మాటతో స్థానిక పార్టీలు ఏకీభవించడం లేదు. 1987 నాటి తప్పులడక కశ్మీర్ ఎన్నికల లానే, ఇప్పుడీ తాజా నిర్ణయం తీసుకున్నారని పోలికలు తెస్తున్నాయి. అప్పట్లో అలా తప్పుదోవలో ఎన్నికల వల్లే, ఆ వెంటనే 1990లలో కశ్మీర్లో తీవ్రవాదం చెలరేగిందని పార్టీల వాదన. ఇప్పటికీ ఆ దెబ్బ నుంచి కశ్మీర్ కోలుకోలేదు. మళ్ళీ అదే 1987 నాటి వ్యవహారశైలిలో వెళితే ఉపద్రవమే అని హెచ్చరిస్తున్నాయి. యువతలో నిరుద్యోగం, స్థానికంగా పెరుగుతున్న అశాంతి సహా కశ్మీర్లో అనేక సమస్యలున్నాయి. 20 – 29 ఏళ్ళ మధ్య వయస్కుల్లో 55 శాతం మంది నిరుద్యోగులే. జాతీయ సగటుతో పోలిస్తే ఇది రెట్టింపు. నిరుద్యోగ యువతకు ఆర్థిక అవకాశాల కల్పన, కశ్మీర్‌ను మళ్ళీ పర్యాటక స్వర్గంగా మార్చడం లాంటి అనేక సవాళ్ళు రానున్న సర్కారుకున్నాయి. వీటన్నిటినీ పరిష్కరించడానికి ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం కావాలి. కశ్మీర్ ఎన్నికల నిర్వహణ ఓ బృహత్తర కార్యం అంటున్నది అందుకే! ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం నిష్పాక్షిక అంపైర్‌లా వ్యవహరించడమే కాదు... కనిపించాలి, అందరికీ అనిపించాలి కూడా! ప్రస్తుతం ప్రత్యేక ప్రతిపత్తి లేనందు వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లానే జమ్మూ– కశ్మీర్‌లోనూ మామూలుగా నివసిస్తున్న వారందరికీ ఓటు హక్కునివ్వడం సరైన చర్యే కావచ్చు. అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికే ఈ చర్యలనీ చెప్పవచ్చు. అయితే, ఆలోచనతో పాటు ఆచరణలోనూ చిత్తశుద్ధి, ముందు జాగ్రత్త అవసరం. కశ్మీర్లో రాజకీయ ప్రక్రియకు ఊతమివ్వడానికే ఈ ఓటర్ల జాబితా సవరణ అనుకున్నా, అందుకు సంబంధిత వర్గాలన్నిటినీ ఒప్పించి, ఒక్క తాటి పైకి రప్పించడం కీలకం. రేపు ఎన్నికల ఫలితాలకు జనామోదం ఉండాలంటే, సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే, శాంతి నెలకొనాలంటే అది తప్పనిసరి. 2014 తర్వాత ఎన్నికలే జరగని కశ్మీర్ మెరుగైన ప్రాథమిక వసతులు, జీవన ప్రమాణాల కోసం ఎదురు చూస్తోంది. రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని స్థానిక ప్రజల, పార్టీల దీర్ఘకాలిక డిమాండ్. కేంద్రం సైతం కశ్మీర్‌ను మళ్ళీ పట్టాలెక్కించేందుకు కంకణబద్ధులమై ఉన్నామంటూ పార్లమెంట్లో చాలాకాలం క్రితమే రోడ్ మ్యాప్ ప్రకటించింది. అపనమ్మకాన్ని పోగొట్టి, ఆ మార్గాన్ని సుగమం చేయడం అటు కేంద్రం, ఇటు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా పారదర్శకంగా ఉండాలి. స్థానిక ప్రజల, పార్టీల అనుమానాలన్నిటినీ ముందే నివృత్తి చేయాలి. మూడేళ్ళలో 25 లక్షల్లో పెరిగాయంటున్న ఈ ఓటర్ల లెక్కను చర్చకు పెట్టి, అవసరమైతే ప్రక్రియలోనూ, లెక్కల్లోనూ తప్పులు సరిదిద్దుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే అన్ని పక్షాల నమ్మకం చూరగొనడం సాధ్యం. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయంగా ఉంటేనే, ఎన్నికైన ప్రభుత్వానికీ విశ్వసనీయత. అదే లేకుంటే, ఎన్నికలు పెట్టినా మిగిలేది అనుమానాలు, ఆరోపణలే! -
కేంద్రం కఠిన నిర్ణయం..అక్రమ ‘నిధి’ సమీకరణలకు చెక్
న్యూఢిల్లీ: ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, అక్రమంగా నిధుల సమీకరణను కట్టడి చేసేందుకు ‘నిధి’ కంపెనీల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ తరహా కంపెనీలు (కొన్ని తరగతులకే) నిధి కంపెనీలుగా వ్యాపారం ప్రారంభించాలంటే ముందస్తు ధ్రువీకరణను తప్పనిసరి చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో పలు కంపెనీలు మోసపూరితంగా ప్రజల నుంచి నగదు సమీకరణ చేసి బోర్డు తిప్పేస్తున్న ఘటనలు వెలుగు చూసిన క్రమంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిబంధనల్లో సవరణలు తీసుకురావడం గమనార్హం. కంపెనీల చట్టం 1956 కింద దేశవ్యాప్తంగా 390 కంపెనీలు ‘నిధి’ కంపెనీలుగా అర్హత సంపాదించాయి. కానీ, కంపెనీల చట్టం 2013ను 2014 ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత నిధి కంపెనీల సంఖ్య పెరిగింది. ‘‘2014 నుంచి 2019 మధ్య కాలంలో పది వేల కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఎన్‌డీహెచ్–4 ధ్రువీకరణ కోసం కేవలం 2,300 కంపెనీలే దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కంపెనీల ఎన్‌డీహెచ్–4 పత్రాలను పరిశీలిస్తే ‘నిధి నిబంధనలు, 2014 (సవరించిన)’ను పాటించడం లేదని తెలిసింది’’ అని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనాల రీత్యా నిధి కంపెనీగా ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ పొందడాన్ని తప్పనిసరి చేసినట్టు పేర్కొంది. నిధి కంపెనీగా ఏర్పడేందుకు సంస్థ షేర్ క్యాపిటల్ రూ.10లక్షలు ఉంటే అప్పుడు నిధి కంపెనీ గుర్తింపు కోసం ఎన్‌డీహెచ్–4 కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఏర్పాటైన 120 రోజుల్లోపు కంపెనీలో సభ్యులు 200 మంది, సంస్థ పరిధిలో రూ.20 లక్షల నిధి అయినా ఉండాలి. చదవండి: టెలికం సంస్థల విమర్శలు..గట్టి కౌంటర్ ఇచ్చిన ట్రాయ్ -
AP: కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. 13 కొత్త జిల్లా కేంద్రాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ వర్తిస్తుంది. కొత్త జిల్లా కేంద్రాల ఆస్తుల విలువ పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్బన్, రూరల్ ప్రాంతాల మార్కెట్ విలువ సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు: సీఎం జగన్ కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలికింది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రారంభించారు. చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరగనుంది. పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయొచ్చు. అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసంతో పాటు సుస్థిర ప్రగతికి బాటలు వేస్తుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి మైళ్ల కొద్దీ తిరిగే దుస్థితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం కనీసం 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో పది కాలాలపాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగనుంది. -
5జీ సర్వీసు కావాలంటే.. ఈ సవరణలు కావాలి - టెల్కోలు
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో 5జీ నెట్‌వర్క్‌ను పరిచయం చేసేందుకు భారతదేశం సన్నద్ధం అవుతున్నందున.. స్మాల్ సెల్ విస్తరణకై రైట్ ఆఫ్ వే నిబంధనలకు సవరణ చేయాలని టెలికం పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ‘స్మాల్ సెల్స్ విషయంలో నియంత్రణ వ్యవస్థ లేదు. టవర్లు, కేబుల్స్ ఏర్పాటుకు అనుమతులు దక్కించుకోవడంలో సవాళ్లు ఉన్నాయి. రాష్ట్రాన్నిబట్టి విధానాలు వేర్వేరుగా అమలవుతున్నాయి. అడ్డంకులు తొలగితేనే స్మాల్ సెల్ విస్తరణకు ఆస్కారం ఉటుంది’ అని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. 5జీ నెట్‌వర్క్స్‌లో స్మాల్ సెల్స్ (మొబైల్ బేస్ స్టేషన్స్) అత్యంత కీలకం. -
మరోసారి జీఎస్టీ సమీక్షకు కేంద్రం రెడీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ సమీక్షకు రాష్ట్రాల మంత్రులతో కూడిన రెండు కీలక కమిటీలను కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. ఒక కమిటీకి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వం వహిస్తారు, మరొక కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యం వహిస్తారు. వీటిపైనే దృష్టి రేట్ స్లాబ్‌లు– విలీనం, జీఎస్టీ మినహాయింపు వస్తువుల సమీక్ష, పన్ను ఎగవేతల గుర్తింపు, ఎగవేతలు నివారించడానికి మార్గాల అన్వేషణ, ట్యాక్స్ బేస్ పెంపు తత్సంబంధ అంశాలపై ఈ కమిటీలు సమీక్ష జరపనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. క్లిష్టమైన పరోక్ష పన్ను రేట్ల వ్యవస్థలు అన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకువస్తూ, నాలుగేళ్ల క్రితం (2017 జూలై నుంచి) జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థను మరింత సరళతరం చేయడంపై కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కమిటీలు ఇలా... బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీలో పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిశ్రా, కేరళ ఆర్థికమంత్రి కేఎన్ బాలగోపాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ తదితరులు సభ్యులుగా ఉంటారు. మరో ఎనిమిది సభ్యులతో కూడిన కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వం వహిస్తారు. వీరిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగ రాజన్, ఛత్తీస్‌గఢ్ ఆర్థికమంత్రి టీఎస్ సింగ్ డియో ఉన్నారు. ఈ నెల 17న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ ఈ కమిటీల ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత రేట్ల వ్యవస్థ ఇదీ... ప్రస్తుతం ప్రధానంగా నాలుగు జీఎస్టీ రేట్ల వ్యవస్థ అమలవుతోంది. నిత్యావసరాలపై కనిష్టంగా 5 శాతం పన్ను అమలవుతుండగా, కార్లపై అత్యధికంగా 28 శాతం పన్ను విధింపు ఉంది. 12 శాతం, 18 శాతం పన్ను స్లాబ్స్ కూడా ఉన్నాయి. లగ్జరీ, పొగాకు వంటి డీమెరిట్, సిన్ గూడ్స్‌పై ఉన్న అత్యధిక 28 శాతంపై సెస్ విధింపు కూడా అమలు జరుగుతోంది. 12 శాతం 18 శాతం శ్లాబ్‌లను ఒకటిగా చేయాలన్న డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తోంది. మినహాయింపుల కేటగిరీ నుంచి కొన్ని ఉత్పత్తులను తొలగించి, స్లాబ్‌ల హేతుబద్ధీకరణ వల్ల జరిగే రెవెన్యూ నష్టాలను పూడ్చుకోవాలని కూడా కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక తుది వస్తువులపై దాని ఇన్పుట్లపై విధించే పన్ను కంటే తక్కువ రేటును విధింపు (ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్) విషయంలో పన్ను వ్యత్యాసాలను ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ తొలగించింది. మొబైల్ హ్యాండ్సెట్, పాదరక్షలు, వస్త్రాల విషయంలో ఈ రేటు వ్యత్యాసాలను సరిచేస్తూ సవరణలు జరిగాయి. పెట్రోలు విషయంలో.. జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువు, క్రూడ్ ఆయిల్‌ను ఈ విధానం నుంచి మినహాయించారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కొనసాగించడానికి ఈ విధానం దోహదపడుతోంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోనికి తీసుకుని రావాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి విధాయక మండలి అసలు ఆ అంశంపైనే చర్చించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనివల్ల ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండడమే కౌన్సిల్ నిర్ణయానికి కారణం. చదవండి : సెప్టెంబర్ వరకూ కేంద్ర రుణం రూ.7.02 లక్షల కోట్లు -
చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. జీఎస్టీకి మినహాయింపునిస్తూ ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకుని చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరు నిబంధనలు సవరించడం హర్షణీయమని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ వెన్ను శనివారం పేర్కొన్నారు. చదవండి: పెదకాకానిలో అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ విచారణ -
ట్రంప్‌ని గడువుకు ముందే తప్పిస్తారా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని గడువుకి ముందే గద్దె దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీనికి గల మార్గాలను అన్వేషిస్తోంది. ట్రంప్‌ని ఎలాగైనా తప్పించాలని సభ్యుల్లో చర్చ జరుగుతోంది. అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ ఈలోగా అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధికరణం ద్వారా ట్రంప్‌ని తొలగించడానికి గల అవకాశాలను కాంగ్రెస్ సభ్యులు పరిశీలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అభిశంసన తీర్మానం కాగా, రెండోది 25వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన అధికరణం. దేశ ఉపాధ్యక్షుడు, మంత్రి మండలి సభ్యులు కలిసి ఈ అధికరణాన్ని ప్రయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఏమిటీ సవరణ? రాజ్యాంగంలోని 25వ సవరణలో నాలుగు సెక్షన్లు ఉన్నాయి. అమెరికా అ«ధ్యక్షుడు పదవిలో ఉండగానే మరణిస్తే దీనిలో మొదటి సెక్షన్ ద్వారా ఉపాధ్యక్షుడు పదవి బాధ్యతలు చేపడతారు. రెండో సెక్షన్ ఉపాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి సంబంధించినది కాగా, మూడోది అధ్యక్షుడెవరైనా తనంతట తానుగా పదవిలో కొనసాగలేనని, తప్పుకుంటానని చెప్పినప్పుడు ఉపాధ్యక్షుడికి అధికారాన్ని అప్పగించడానికి వినియోగిస్తారు. ఇక అధ్యక్షుడు పాలనా వ్యవస్థపై నియంత్రణ కోల్పోతే ఉపాధ్యక్షుడు, కేబినెట్ సభ్యుల ఆమోదంతో నాలుగో సెక్షన్ ద్వారా అధ్యక్షుడిని తొలగించవచ్చు. అభిశంసన చేయొచ్చా? ట్రంప్‌ని అభిశంసన ద్వారా కూడా పదవి నుంచి తొలగించవచ్చు. అయితే ఇది ప్రతినిధుల సభ ద్వారా జరగాలి. మూడింట రెండు వంతుల మెజార్టీతో ప్రతినిధుల సభ ఆమోదిస్తే, దానిని సెనేట్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఒకే రోజులో ఈ ప్రక్రియని ముగించేలా వెసులుబాటు ఉంది. గత ఏడాది ట్రంప్‌పై అభిసంశన తీర్మానం పెట్టినా సెనేట్‌లో వీగిపోయింది. -
సరిహద్దు వివాదం.. నేపాల్ మరింత ముందుకు
ఖాట్మండు: భారత్‌తో సరిహద్దు వివాదాన్ని నేపాల్ మరింత ముందుకు తీసుకువెళుతోంది. మన దేశ భూభాగాలను తమ దేశంలో చూపిస్తూ రూపొందించిన కొత్త మ్యాప్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. నేపాల్‌లో ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించిన ఒక్క రోజు తర్వాత న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ్యా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారత్ భూభాగానికి చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను వ్యూహాత్మకంగా తమ దేశ భూభాగాలుగా పేర్కొంటూ సవరించిన మ్యాప్‌లను నేపాల్ విడుదలచేయడం తెల్సిందే. ఈ మ్యాప్‌కు చట్టబద్ధత రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 3లో కొత్త సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను చేర్చాలని ప్రధాని కేపీ శర్మ ఓలి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చారు. చదవండి: సరిహద్దుల్లో తొలగని ప్రతిష్టంభన -
అకౌంట్లతో పనిలేదు..
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ జూలై 5వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2019–20 వార్షిక బడ్జెట్లో ఒక లొసుగును సవరించారు. తన బడ్జెట్ ప్రతిపాదనకు ఒక కీలక సవరణను గురువారం తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే... ఒక సంవత్సరంలో ‘ఒక అకౌంట్’ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్‌డ్రాయెల్స్ జరిపితే 2 శాతం మూలం వద్ద పన్ను (టీడీఎస్) విధించాలని జూలై 5 బడ్జెట్ ప్రతిపాదించింది. అయితే ‘రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్ల నుంచి కోటి పైబడిన విత్‌డ్రాయెల్స్ చేస్తే 2 శాతం టీడీఎస్ ఉండదా’ అనే సంశయం పలు వర్గాల నుంచి వ్యక్తమయ్యింది. బడ్జెట్లో ఈ లొసుగును సవరిస్తూ ఆర్థిక మంత్రి 2019 ఫైనాన్స్ బిల్లుకు ఒక సవరణను తీసుకువచ్చారు. దీని ప్రకారం .. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్ నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. భారీ నగదు లావాదేవీల నిరోధం లక్ష్యంగా బడ్జెట్లో ఆర్థిక మంతి ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. 28 ఇతర సవరణలతోపాటు ఈ ప్రతిపాదనకూ లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. మొత్తం పన్ను బకాయిల్లో ఈ టీడీఎస్ కూడా భర్తీ అయ్యే అవకాశాన్నీ తాజా బడ్జెట్ ప్రతిపాదన కల్పిస్తోంది. -
‘ఆధార్’ సవరణకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఆధార్, రెండు అనుబంధ చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ కనెక్షన్ పొందేందుకు పౌరులు ఆధార్ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు. మొబైల్, బ్యాంకు సేవలకు ఆధార్ తప్పనిసరి కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చట్టంలో ఈ సవరణ చేశారు. ఆధార్‌తో పాటు టెలిగ్రాఫ్, మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టాల్లో సవరణలు చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తన ఆధార్ కార్డు చూపుతూ ‘ నా ఆధార్ కార్డులో నా పేరు, చిరునామా, నా తండ్రి పేరు మాత్రమే ఉన్నాయి. నా కులం, మతం, ఆరోగ్య పరిస్థితి ఇందులో లేవు. భారతీయులందరి ఆధార్ సురక్షితం. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాం’ అని భావోద్వేగంతో మాట్లాడారు. సవరణ చట్టంలో ఏముందంటే.. ► 18 ఏళ్లు నిండిన తరువాత ఆధార్‌ను రద్దుచేసుకునేందుకు మైనర్లకు అవకాశం. ► ఆధార్ వినియోగంలో నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ► పౌరులు స్వచ్ఛందంగా సమకూర్చిన బయోమెట్రిక్ వివరాలు, ఆధార్ సంఖ్యను సర్వీస్ ప్రొవైడర్లు భద్రపరచరాదు ► ఆధార్ లేని కారణంగా బ్యాంక్, మొబైల్ సేవల్ని నిరాకరించరాదు ► వినియోగదారుల ఐడీ ధ్రువీకరణ కోసం మొబైల్ కంపెనీలు ఆధార్‌తో పాటు పాస్‌పోర్ట్ లేదా కేంద్రం జారీచేసే ఇతర పత్రాల్ని కూడా పరిశీలించొచ్చు -
సోషల్ మీడియాకు సంకెళ్లు
గత ఏడాది ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో షికార్లు చేసిన పుకార్లు.. దేశంలో పలుచోట్ల అల్లర్లు, మూక హత్యలకు అసలు కారణంగా నిలిచాయి. దీంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పుకార్లను కట్టడిచేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదిలింది. కొత్త సంవత్సరంలో ఈ దిశగా ఐటీ చట్టాన్ని సవరిస్తోంది. భారీగా జరిమానాలు వేసి అసత్యవార్తలు, అశ్లీల సమాచారాన్ని వ్యాప్తి చేసే మాధ్యమాలను నియంత్రించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలకు భారత్‌లో ఖాతాదారులు చాలా ఎక్కువ. గత ఏడాది అనుభవాలతో ఇవి కొన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఫేక్ న్యూస్‌పై ప్రజలకు అవగాహన కలిగిస్తూ, హెచ్చరిస్తూ భారీస్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. అసభ్య, అసత్య సందేశాలు, సమాచారం పంపకుండా ఖాతాదారులను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నాయి. కేంద్రం హెచ్చరికలు ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించి తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి రవి శంకర్ ఫేస్బుక్, వాట్సాప్‌లను హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో తమ మాధ్యమం ద్వారా అనైతిక సమాచారం వ్యాప్తి కాకుండా ఫేస్బుక్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో ఎన్నికల ప్రకటనలు పోస్టుచేసే వారు వారి వివరాలు, ఎక్కడ నుంచి పోస్టు చేస్తున్నారనేవి విధిగా వెల్లడించాల్సిందే. 15 కోట్ల వరకు జరిమానా వదంతులు, అశ్లీల సమాచారాన్ని, దృశ్యాలను నియం త్రించడంలో విఫలమైన వెబ్సైట్లు, యాప్‌లపై భారీ జరిమానా విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ‘ డేటా ప్రొటెక్షన్ బిల్లు’ పేరుతో ముసాయిదాను ఖరారు చేసింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్ వంటి సోషల్ మీడియా, ఇంటర్నెట్ సంస్థల అధిపతులతో ఐటీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టి, వాటి జవాబుదారీతనాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. ‘అసత్య, అశ్లీల సమాచా రం సోషల్ మీడియాలోకి ఎక్కడ నుంచి వస్తోందో గుర్తించాలి, దాన్ని తొలగించాలి. ఈ దిశగా ప్రభుత్వం చట్టాన్ని సవరించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండాలి’ అని ఓ ఉన్నతాధికారి అన్నారు. నిబంధలను ఉల్లంఘించిన కంపెనీలపై రూ. 15 కోట్లు లేదా వాటి ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 4శాతం ఈ రెండింటిలో ఏది ఎక్కువయితే దాన్ని జరిమానాగా విధించాలని ప్రతిపాదించారు. -
పాసైతేనే పైతరగతికి..!
శ్రీకాకుళం: విద్యా ప్రమాణాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యా హక్కు చట్టం కింద ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుంటే అదే తరగతిలో కొనసాగించడానికి (డిటైన్) వీల్లేదు. వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా వారిని పైతరగతికి పంపాల్సిందే. అయితే ఇకమీదట ఇటువంటి పరిస్థితి ఉండదు. తాజాగా విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి నో–డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సవరణకు ఇటీవలే లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఉత్కంఠ చెందుతున్నారు. నోడిటెన్షన్ విధానం రద్దుకు సవరణ బిల్లు గత నెల 18న లోక్‌సభకు రాగా, అక్కడ ఆమోదం లభించింది. విద్యార్థులు 5, 8 తరగతుల్లో ఉత్తీర్ణులు అయితేనే తరవాత తరగతికి వెళ్తారు. లేదంటే మళ్లీ చదివి ఉత్తీర్ణత కావలసి ఉంటుంది. అయితే ఫలితాలు వచ్చిన వారంలో 10, ఇంటర్ తరహాలో అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. దీనిపై ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అభ్యంతరా లు తెలుపుతుండడంతో దీనిని అమలు చేయాలా, లేదా అన్నది రాష్ట్రాల విచక్షణకే వదిలివేస్తున్నట్టు కేంద్రమంత్రి లోక్‌సభలో ప్రకటించారు. ఈ విధానం వల్ల పాఠశాల విద్య బలోపేతం అవడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికంటే నాణ్యమైన విద్య అందుతుందని కేంద్ర భావన అని మంత్రి లోక్‌సభలో తెలిపారు. అయితే ఉపాధ్యాయులు మాత్రం దీనివల్ల డ్రాపౌట్స్ పెరిగిపోతాయని విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. కార్పొరేట్ పాఠశాలల విషయాన్ని పక్కన పెడితే ప్రైవేటు పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదరుపాయాలు లేవు. దీనివలన బోధన కొంత వెనుకబడి ఉంటుందనడంలో సందేహం లేదు. డిటెన్షన్ విధా నం అమలైతే ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో అయితే తమ పిల్లలు తప్పనిసరిగా ఏదోలా ఉన్నత తరగతికి వెళ్తారని తల్లిదండ్రుల్లో అభిప్రాయం కలగవచ్చని విద్యావేత్తలు వాదిస్తున్నారు. విద్యాహక్కు చట్టం సవరణపై అభిప్రాయ సేకరణసమయంలో 90 శాతం మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు వ్యతిరేకించినా ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకోకుండా బిల్లును ఆమోదించి అమలు విషయాన్ని రాష్ట్రాలకు వదిలేసింది. డిటెన్షన్ విధానం అమలులో లేకపోవడం విద్యార్థుల ప్రయోజనానికి విఘాతమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పçష్టం చేస్తూ తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిబంధన ఉంటే విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యం, వికాసం వంటివి అభివృద్ది చెందుతాయని పేర్కొంది. 8వ తరగతి వరకు డిటెన్షన్ విధానం లేకపోవడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు నివేదిక కూడా సమర్పించింది. గతంలో 7వ తరగతికి కామన్, పదో తరగతికి పబ్లిక్ పరీక్ష ఉండేది. 7వ తరగతి కామన్‌పరీక్షను తీసేయడంతో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థికి పరీక్షలలో ఫెయిల్ అయినా 9వ తరగతి వరకు విద్యకు ఆటంకం లేకుండా వెళ్లిపోయేవారు. దీనివలన పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం సాధించలేకపోవడం వంటివి జరిగేవి. ప్రస్తుతం అమలు చేయాలనుకుంటున్న డిటెన్షన్ విధానం మంచిదే అయినప్పటికీ ఉపాధ్యాయులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అంతు చిక్కడం లేదు. బాలల హక్కుల చట్టం ప్రకారం డిటెన్షన్ విధానం విరుద్ధమని విద్యావేత్తలు వాదిస్తున్నారు. రాష్ట్రంలో 2012 నుంచి సీసీఈ విధానం అమలవుతుండగా డిటెన్షన్ విధానం అమలైతే సీసీఈ విధానం నిర్వీర్యమవుతుంది. సీసీఈ విధానం వలన పరీక్షల విధానంలో పలు మార్పులు చేశారు. సీసీఈ విధానంలో ఇంటర్నల్ మార్కులు కూడా ఉండేవి. డిటెన్షన్ విధానం అమలైతే సీసీఈ విధానానికి పూర్తిగా తూట్లు పడతాయి. సీసీఈ విధానంపై ఎన్నో అభ్యంతరాలు వచ్చినా కొన్ని రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించి అమలు చేయకపోయినా మన రాష్ట్రంలో మాత్రం సీసీఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు డిటెన్షన్ విధానం వస్తే మరోసారి పరీక్షల నిర్వహణ విధానాన్ని సమూలంగా మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
30 వరకు ఇంటింటా ఓటర్ల గణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటా ఓటర్ల గణన చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ప్రకటించారు. 2019 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జూన్ 30 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన పోలింగ్ కేంద్రంలో బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి సవరణ పక్కాగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. -
ఇక ప్రతి నెలా ఆస్తి పన్ను సవరణ!
సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో ఇకపై ప్రతి నెలా ఆస్తి పన్ను సవరణలు జరపాలని మునిసిపాలిటీలను పురపాలక శాఖ ఆదేశించింది. కొత్తగా నిర్మించిన, పునర్ నిర్మాణం చేసిన, విస్తరించిన భవనాలు, కట్టడాలను ఎప్పటికప్పుడు పన్ను పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. భవనాల నిర్మాణం పూర్తయితే 30 రోజుల్లోగా, పూర్తికాకున్నా గృహ ప్రవేశం చేస్తే తక్షణమే పన్ను పరిధిలోకి తీసుకురావాలని తెలిపింది. భవన యజమాని మారినా, భవన వినియోగం (గృహ, వాణిజ్య) మారినా సవరణలు జరపాలని పేర్కొంది. పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి అధ్యక్షతన ఇటీవల సమావేశమైన తెలంగాణ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు.. ఆస్తి పన్ను వసూళ్లలో మునిసిపాలిటీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పన్ను సవరణల కోసం బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, క్షేత్ర స్థాయిలో పని చేసే ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని సూచించింది. మునిసిపాలిటీల్లోని అన్ని గృహాలు, భవనాలకు సంబంధించిన ఆస్తి పన్నుల జాబితాలను యజమానుల ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ను ఆదేశించింది. మునిసిపాలిటీలకు జారీ చేసిన ఆదేశాలివే.. కొత్తగా ఏర్పాటైన బాదెపల్లి మునిసిపాలిటీలో ఆస్తి పన్ను పెంపును ఏప్రిల్ 1 నుంచి, దుబ్బాక మునిసిపాలిటీలో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలి. కొత్తగా ఏర్పాటవనున్న 68 పురపాలికల పరిధి లో వసూలు చేస్తున్న ఆస్తి పన్నుల వివరాలను ఆయా గ్రామ పంచాయతీల నుంచి పు రపాలక శాఖ పన్నుల విభాగం ముందస్తుగా సేకరించాలి. (మునిసిపాలిటీలుగా ఏర్పడిన తర్వాత ఆ చట్టాలకు అనుగుణంగా ఆస్తి పన్నుల పెంపును చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు) 72 పురపాలికల్లో ఉన్నఆస్తులను జీఐఎస్ పరిజ్ఞానంతో మ్యాపింగ్ జరిపించి ఆస్తి పన్నుల జాబితాలోని ఆస్తుల సమాచారాన్ని పోల్చి చూడగా 50% తక్కువగా పన్నులు వసూలైనట్లు వెల్లడైంది. దీంతో ఈ నెల 15 లోగా ఆస్తి పన్నుల జాబితాను సవరించాలని మునిసిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే సమయంలోనే బిల్డింగ్ నమూనా ఆధారంగా ఆస్తి పన్ను గణన చేసేందుకు కొత్త విధానం తీసుకురావాలి. ఆస్తి పన్నుల సవరణలపై భవన యజమానుల నుంచి వచ్చిన 4,292 అభ్యంతరాలు ముని సిపల్ కమిషనర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని తక్షణమే పరిష్కరించాలి. అనుమతి లేకుండా నిర్మించిన.. ప్రైవేటు, ప్రభు త్వ, వక్ఫ్, దేవాదాయ, ఇతర భూములను కబ్జా చేసి నిర్మించిన భవనాలపై అదనంగా 100% ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని గతం లో ఇచ్చిన ఉత్తర్వులను మునిసిపాలిటీలు అమ లు చేయాలి. పన్నుల డిమాండ్ నోటిసులో ‘భవ న యజమాని’పేరుకు బదులు ‘భవనాన్ని అధీనంలో పెట్టుకున్న వ్యక్తి పేరు’అని రాయాలి. -
యుగాంతానికి 2 నిమిషాలే!
వాషింగ్టన్: ప్రపంచ వినాశనం అత్యంత దగ్గరపడుతోందనడానికి సూచికగా డూమ్స్‌డే క్లాక్‌లో నిమిషాల ముల్లును మరో 30 సెకన్లు ముందుకు జరిపారు. ప్రస్తుతం డూమ్స్ డే క్లాక్‌లో సమయం రాత్రి 11.58 గంటలు. అంటే డూమ్స్ డే గడియారం ప్రకారం వినాశనానికి (12 గంటల సమయాన్ని వినాశనానికి గుర్తుగా భావిస్తారు) మనం రెండే నిమిషాల దూరంలో ఉన్నామన్నమాట. డూమ్స్ డే గడియారం ఎవరు నిర్వహిస్తారు, వినాశనానికి ఎంత దూరంలో ఉన్నామనేవి ఆసక్తికరంగా మారాయి. 1947లో ఏర్పాటు... మానవాళి తన మతిలేని చర్యల వల్ల ప్రపంచ వినాశనానికి చేజేతులా ఎంత దగ్గరగా వెళుతోందో హెచ్చరించేందుకు ఏర్పాటు చేసిందే ఈ డూమ్స్‌డే గడియారం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మొదటిసారిæ అణ్వాయుధాలను తయారుచేసిన మాన్‌హట్టన్ ప్రాజెక్టులో భాగస్వాములైన అమెరికా సైంటిస్టులు 1945లో ‘బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్’ అనే జర్నల్ను ప్రారంభించారు. ఈ జర్నల్ను శాస్త్రవేత్తలే నిర్వహిస్తున్నారు. వారే 1947లో తొలిసారిగా డూమ్స్ డే గడియారం విధానాన్ని ఏర్పాటు చేశారు. తొలుత అణ్వాయుధాలు, అణు యుద్ధాల వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రమే డూమ్స్‌డే గడియారం ద్వారా హెచ్చరించేవారు. 2007 నుంచి వాతావరణ మార్పుల వల్ల కలిగే ముప్పును కూడా దీని ద్వారా హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రి 12 అంటే వినాశనమే గడియారంలో సమయం అర్ధరాత్రి 12 గంటలు అయ్యిందంటే ప్రపంచం అంతమైపోయినట్లే లెక్క. దీనిలో సమయం అర్ధరాత్రి 12కు ఎంత దగ్గరగా ఉంటే ప్రపంచం అంత ప్రమాదంలో ఉందని అర్థం. ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. 1947 నుంచి ఇప్పటి వరకు ఈ గడియారంలో సమయాన్ని 20 సార్లు మార్చారు. మానవాళి వినాశనానికి ఎంత దూరంలో ఉందన్న దానిని బట్టి సమయాన్ని ముందుకు, వెనక్కు మారుస్తూ ఉంటారు. 1991లో అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక గడియారంలో సమయాన్ని రాత్రి 11.43కు మార్చారు. అంటే నాడు ప్రపంచం వినాశనానికి 17 నిమిషాల దూరంలో ఉందని అర్థం. రెండోసారి రెండు నిమిషాల వ్యవధి ప్రపంచం వినాశనానికి అత్యంత దగ్గరగా ఉన్నట్లు తొలిసారిగా 1953లో ఈ గడియారం చూపించింది. ఆ ఏడాది అమెరికా, సోవియట్ యూనియన్లు హైడ్రోజన్ బాంబులు పరీక్షించడంతో సమయాన్ని 11.58కి మార్చారు. అంటే వినాశనానికి రెండు నిమిషాల దూరంలో ప్రపంచం ఉందని అర్థం. మళ్లీ ఈ ఏడాది, ఈ నెలలోనే దీనిని 11.58కి మార్చారు. అణ్వాయుధాలు, వాతావరణ మార్పులకు సంబంధించి రేకెత్తుతున్న ఆందోళనలపై ప్రపంచ దేశాల అధినేతలు సరైన విధంగా స్పందించడం లేదంటూ ఈ నెలలో సమయాన్ని 11.58కి మార్చారు. ఉత్తర కొరియాపై అణు దాడికి సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ పరోక్షంగా ప్రకటించడం, పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయం తీసుకోవడం తదితరాలను ఇందుకు కారణాలుగా భావించవచ్చు. గడియారంలో ముఖ్య ఘట్టాలు ► 1947లో ఏర్పాటు చేసినప్పుడు సమయం రాత్రి 11:53. అంటే వినాశనానికి ఏడు నిమిషాల దూరం. ► 1949లో సోవియట్ యూనియన్ తొలి అణుపరీక్ష. సమయం 4 నిమిషాల ముందుకు. అంటే 11:57 ► 1953లో అమెరికా తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష. మరో నిమిషం ముందుకు. అంటే 11:58. ► 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో 14 నిమిషాలు వెనక్కు జరిపారు. అంటే11:43గా మార్చారు. ► 1998లో భారత్, పాక్‌లు అణ్వాయుధాలను పరీక్షించడంతో ఎనిమిది నిమిషాలు ముందుకు జరిపారు. అంటే 11:51 ► 2016– తీవ్రమైన వాతావరణ మార్పులు, భారీ అణ్వాయుధ పరీక్షలు. 2 నిమిషాలు ముందుకు–11:57 ► 2017– అణ్వాయుధాల ఆధునికీకరణ, వాతావరణ మార్పులతో సమయం 30 సెకన్లు ముందుకు–11:57:30 -
న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు దహనం
బార్ కౌన్సిల్ సభ్యులు విధుల బహిష్కరణ జేసీ-2కి వినతిపత్రం అందజేత రాజమహేంద్రవరం క్రైం, కాకినాడ లీగల్ : న్యాయవాదులు, ప్రజల హక్కులను హరించేలా రూపొందించిన 1961 న్యాయవాదుల చట్ట సవరణ బిల్లును నిరసిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించారు. ఈ బిల్లును ప్రతిపాదించిన లా కమిషన్ చైర్మన్ బల్బీర్ సింగ్ చౌహాన్‌ను తక్షణమే ఆపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బల్బీర్ సింగ్ చౌహాన్ దిష్టిబొమ్మను, న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు కాపీలను దహనం చేశారు. రాజమహేంద్రవరంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలోను, కాకినాడలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రాజేష్, కార్యదర్శి గెద్దాడ వెంకటేశ్వరరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు గోకుల్ కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద ఆందోళన చేశారు. అలాగే అమలాపురం, మండపేట, తుని, పిఠాపురం, పెద్దాపురం తదితర కోర్టులలో న్యాయవాదులు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ – 2 రాధాకృష్ణకు మెమొరాండం సమర్పించారు. రాజమహేంద్రవరంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు వలన కక్షిదారులు వారికి కావలసిన న్యాయవాదులను నియమించుకునే హక్కును కోల్పోతారన్నారు. అదే విధంగా న్యాయవాదులు కూడా స్వేచ్ఛగా తమ వద్దకు వచ్చిన కేసులను వాదించడానికి సాధ్యం కాదన్నారు. న్యాయవాదుల మీద దాడులు జరిగినా, లేదా ప్రజా ప్రయోజనాల దృష్టా ్య ఆందోళన చేసే హక్కును కూడా ఈ సవరణలతో న్యాయవాదులు కోల్పోతారన్నారు. ఈ సవరణలు రాజ్యాంగ విరుద్ధమైనవని ఆయన పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి పీఆర్ఎస్ మిత్రా, ఉపాధ్యక్షుడు ఎ. వెంకట రాజు, ట్రెజరర్ కె. బాల భాస్కర్, సీనియర్ న్యాయవాది తవ్వల వీరేంద్ర, మహిళా రిప్రజెంటేటివ్ దాసరి అమ్ములు, జేవీవీ రమణ, పెల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాకినాడలో జరిగిన ఆందోళనలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చిక్కాల అబ్బు, దేశి, న్యాయవాదులు పాల్గొన్నారు.