హోంశాఖ మంత్రిత్వ కార్యాలయంలోని నార్త్ బ్లాక్ లో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013కు కీలక సవరణలకు మంత్రుల బృందం (జీవోఎం( ఆమోదముద్ర వేసింది. పోలవరం ముంపు ప్రాంతాలన్నీ సీమాంధ్రలోనే ఉంటాయని, భద్రాచలం పట్టణం మాత్రం తెలంగాణలోనే ఉండేలా బిల్లకు సవరణలు చేశారు. అలాగే రాయలసీమలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని, కొత్త రాష్ట్రానికి పదేళ్లపాటు పన్నుల మినహాయింపు ఇవ్వాలని జీవోఎం బిల్లులో చేర్చింది. ఫిబ్రవరి 5 తేదిన ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో 7 తేదిన తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 12న రైల్వేబడ్జెట్, 17న సాధారణ బడ్జెట్‌లను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 21 వరకూ పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి.
Published Tue, Feb 4 2014 6:58 PM | Last Updated on Wed, Mar 20 2024 12:42 PM
Advertisement
Advertisement
Advertisement