
బీచ్ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా పోరాటం
విజయవాడ : పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం వైగాగ్‌లో ఏర్పాటు చేయదలచిన బీచ్ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ బాలికల విభాగం నగర కమిటీ తీర్మానించింది. ఆదివారం యూటీఎఫ్ భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు హాజరై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ అధ్యక్షుడు టి. కోటి, బాలికల విభాగం రాష్ట్ర కో–కన్వీనర్ టి. రాణి పాల్గొన్నారు.