Roundtable Meeting
-
రేపు ‘కులగణన’ సదస్సుకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటన కోసం టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల ఐదో తేదీన సాయంత్రం బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించనున్న కులగణన సంప్రదింపుల సదస్సుకు రాహుల్ హాజరు కానున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఇందిరాభవన్‌లో కుల సంఘాల నేతలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్లు విశ్వేశ్వరరావు, సింహాద్రి, వెంకటనారాయణ, భూక్య, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ తదితరులు పాల్గొని కులగణన సంప్రదింపుల సదస్సులో చర్చించాల్సిన అంశాల గురించి సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ గంటపాటు అన్ని వర్గాలతో భేటీ అయ్యి అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు.కులగణనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కులగణన దేశానికే ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పీసీసీ సమావేశంలో ఏఐసీసీ నేత కొప్పుల రాజు, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ నేతలు రోహిణ్‌రెడ్డి, కోట నీలిమ, పవన్ మల్లాది, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, మెట్టు సాయికుమార్, చరణ్ కౌశిక్ యాదవ్, మల్రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ టీసీని తరలిస్తే ఉద్యమం
కడప కార్పొరేషన్: ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కొప్పర్తిలో కొనసాగించకపోతే ఉద్యమం తప్పదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో అఖిలపక్ష పార్టీ నేతలు, ప్రజా సంఘాలతో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళిత ఫోరం జిల్లా చైర్మన్ కిశోర్ బూసిపాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గాలిచంద్ర, జి.చంద్రశేఖర్, ఏఐసీసీ కో–ఆర్డినేటర్ ఎస్ఏ సత్తార్, బీఎస్పీ జిల్లా ఇన్చార్జి ఎస్.గుర్రప్ప, వైస్సార్‌ఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.250కోట్లతో కొప్పర్తిలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి తరలించడం దారుణమన్నారు. దీనివల్ల ఈ ప్రాంత యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పెద్ద దెబ్బ పడుతుందని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కూడా నష్టం జరుగుతుందన్నారు. వైఎస్సార్ జిల్లాపై కక్షసా«ధించడానికే సీఎం చంద్రబాబు ఇలా చేశారని మండిపడ్డారు. కలెక్టర్ లోతేటి శివశంకర్‌కు వినతిపత్రం సమరి్పంచారు. -
ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
కృష్ణలంక (విజయవాడ తూర్పు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పని చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలును సాధించటం కూడా ప్రాధాన్యతా అంశాల్లో చేర్చాలన్నారు. హోదా సాధనకు ఇదే సరైన సమయమన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్లో ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పదేళ్లుగా బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేదని, ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం సీఎం చంద్రబాబు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకోవాల్సి ఉందన్నారు. హోదా ముగిసిన అధ్యాయం కాదుసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, అది సజీవ సమస్యగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి ఏపీకి ప్రత్యేక హోదా గురించి చర్చిస్తామన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో హోదాపై తీర్మానం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడాలని, దానికి ప్రతిపక్షం కూడా సానుకూలంగా స్పందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. హోదా కోసం 2014 నుంచి పోరాటం జరుగుతోందని, చంద్రబాబు, జగన్ ఇద్దరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీ సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూగతంలో చంద్రబాబు, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని, వాటిని మరోసారి కేంద్రానికి పంపించాలని కోరారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉందన్నారు. మీడియాపై అప్రకటిత నిషేధాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, జై భారత్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మళ్లీ జగనే అవసరం
సాక్షి, విశాఖపట్నం: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా అభివృద్ధి జరిగింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పౌర సేవలు దేశానికే ఆదర్శం. అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందుతోంది. విద్య, వైద్య రంగాల్లో పశ్చిమ దేశాలకు దీటుగా ఏపీ అభివృద్ధి చెందింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ జగనే అవసరం. ఆయన గెలిస్తే ఏపీ మరో సింగపూర్‌గా మారుతుంది’ అంటూ పలువురు ప్రవాసాంధ్రులు కొనియాడారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన – ప్రవాసాంధ్రుల స్పందన’ అనే అంశంపై శనివారం విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 దేశాల నుంచి 50 మందికి పైగా ప్రవాసాంధ్రులు ప్రత్యక్షంగా, మరికొన్ని దేశాల నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమంపైప్రవాసాంధ్రులు రూపొందించిన అభివృద్ధి నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల భవనాలు, వాటిలో మౌలిక సదుపాయాలు పశ్చిమ దేశాల్లో స్కూళ్లను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. విలువైన ట్యాబ్‌లు, అత్యుత్తమ సిలబస్‌ను ఆ దేశాల్లో ఏ ప్రభుత్వమూ విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడంలేదన్నారు. ఏపీలో మాత్రం లక్షలాది విద్యార్థులు వీటిని ఉచితంగా పొందుతున్నారన్నారు. సుమారు కోటీ నలభై లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతున్నాయని, ఇలాంటి సదుపాయం అగ్రదేశం అమెరికాలో కూడా లేదని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా 12 కోట్ల పౌర సేవలు అందడం విశేషమని చెప్పారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు గణాంకాలతో సహా వివరించారు. సీఎం జగన్ రాష్ట్రంలో సుమారు 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని, వీటి విలువ రూ.7.75 లక్షల కోట్లని చెప్పారు. నిరుద్యోగం 4.5 శాతానికి తగ్గిందని, కొత్త పరిశ్రమల ద్వారా గతేడాది 14 లక్షల పీఎఫ్ ఖాతాలు కొత్తగా చేరాయని, 18 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదార్లు పెరిగారని తెలిపారు. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రవాసాంధ్రులు ఏమన్నారంటే.. ముందు చూపు ఉన్న నేత జగన్ విద్యారంగంలో వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలతో విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించే నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. నైపుణ్య వనరులుంటే పెట్టుబడులకు ముందుకు వస్తారు. అలాంటి వనరులను సీఎం జగన్ ఏపీలో సమకూర్చారు. ఇలాంటి ముందు చూపు అంబేడ్కర్‌కే సొంతం. మళ్లీ ఇప్పుడు జగన్‌లో అంబేడ్కర్‌ను చూస్తున్నా. రాష్ట్రంలో రూ.10 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు ఐటీ కంపెనీలు, అమెరికాలో మాదిరిగా రూ.2 వేల కోట్ల విలువైన ఎంఎస్ఎంఈలు వస్తున్నాయి. తీరప్రాంతంలో కొత్తగా పోర్టులు, హార్బర్లు నిర్మిస్తున్నారు. – శివ, టెక్సాస్ స్వాతంత్య్రం వచ్చాక ఇంతలా అభివృద్ధి లేదు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలోకి చాలా పరిశ్రమలు వస్తున్నాయి. నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారాయి. స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ఇంతలా అభివృద్ధి జరగలేదు. వైఎస్ జగన్‌కు మళ్లీ అవకాశం ఇస్తే ఈ అభివృద్ధి కొనసాగుతుంది. ఈ బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. – వెంకట్ కల్లూరి, కాలిఫోర్నియా సీఎం విప్లవాత్మక మార్పులు తెచ్చారు వైద్య రంగంలో సీఎం విప్లవాత్మక మార్పులు తెచ్చారు. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. వనరులు తక్కువ ఉన్నా కోవిడ్ సమయంలో సమర్థవంతంగా మరణాల సంఖ్యను బాగా తగ్గించగలిగారు. అగ్రదేశం అమెరికాలో సైతం ఇంతలా చేయలేకపోయారు. మరో పదేళ్లు వైఎస్ జగన్ సీఎంగా కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. – డాక్టర్ పవన్ పాముకుర్తి, టెక్సాస్ మరే నాయకుడైనా ఇలా పాలించాడా? ఏపీలో నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. పేద విద్యార్థులను అమ్మ ఒడి ద్వారా ఆదుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యకు దోహదపడుతున్నారు. మరే నాయకుడైనా ఇలా పరిపాలన చేశారా? ఏపీని ముందుకు తీసుకెళ్తున్న జగన్‌ను మరోసారి సీఎంగా ఎన్నుకోవాలి. – కార్తీక్ ఎల్లాప్రగడ, నెదర్లాండ్స్ సామాజిక న్యాయం చేసి చూపారు సామాజిక న్యాయం నినాదం కాదు.. చేతల్లో చూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అన్ని పార్టీలు ధనవంతులకే అవకాశాలు కల్పిస్తే.. జగన్ మాత్రం పేదలు, సామాన్యులకు టికెట్లు ఇచ్చారు. బీసీ ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేశారు. బీసీ ముస్లింలకు వైఎస్ రాజశేఖర్రెడ్డికంటే మిన్నగా ఆయన తనయుడు జగన్ ఎన్నో మేళ్లు చేస్తున్నారు. –ఇలియాస్, కువైట్ మహిళా సాధికారిత భేష్ ముఖ్యమంత్రి జగన్ మహిళా సాధికారితకు పెద్దపీట వేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా అన్నింటా అవకాశాలు కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. – పాలకుర్తి నీలిమ, యూఏఈ ప్రతి స్కూలూ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీనే ఏపీ సీఎం జగన్ 40 వేల ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ స్కూళ్లలో పేద, ధనిక తేడా లేకుండా అందరూ వారి పిల్లల్ని చదివించుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాల స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగానే చెప్పవచ్చు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆయన్నే మరోసారి గెలిపించుకోవలసిన బాధ్యత అందరికీ ఉంది. – కోటిరెడ్డి, సింగపూర్ అవినీతి గురించి విన్నామా? విద్యావంతులు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కాంలు, ఆశ్రిత పక్షపాతం గురించే వినే వాళ్లం. ఈ ఐదేళ్లలో ఒక్క అవినీతి గురించైనా విన్నామా? వలంటీర్ల వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన అందుతోంది. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి మద్దతు అవసరం. సీఎంగా మళ్లీ జగన్నే గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రజలకు ఉంది. – వెంకట్ ఇక్కుర్తి, యూఎస్ సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తోంది ఏపీలో సంక్షేమం, అభివృద్ధి విశేషంగా జరిగింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 280 కొత్త కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు ఎంతో గొప్ప విషయం. కొత్తగా 4 లక్షల ఎంఎస్ఎంఈలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. – వెంకట్ మేడపాటి, అమెరికా -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..
పంజగుట్ట (హైదరాబాద్): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి దీని వెనుక ఎవరెవరున్నారో మొత్తం బయటకు తీయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ఏపీపీఎస్సీ పేపర్లు లీకేజీ కాలేదని, తొలిసారి తెలంగాణలో లీకేజీ కావడం రాష్ట్ర చరిత్రలోనే ఇదొక దుర్దినమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో కవిత ఉందా లేదా అనేదానికన్నా ఇది చాలా పెద్ద కేసని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం ఈ వ్యవహారంపై నోరువిప్పకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ నిరుద్యోగ జాక్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై బుధవారం ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన చోట ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్‌ను టీఎస్పీఎస్సీలో పెట్టడం దారుణమన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ..తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి లీకేజీలు చూడలేదన్నారు. ఓఎమ్ఆర్ షీట్ నింపలేని వాడికి 103 మార్కులు వచ్చాయంటే కచ్చితంగా లీకేజీ జరిగిందని అర్థమవుతుందన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అతడితోపాటు సీఎం కేసీఆర్ కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ..ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తాను మాజీ సభ్యుడినని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందన్నారు. కనీసం సెక్రటరీకి కూడా చెప్పకుండా చైర్మన్ గోప్యతను పాటించాలని కానీ, ఒక సెక్షన్ ఆఫీసర్ చేతికే పేపర్లు వెళ్లిపోవడం దారుణమన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ విశ్వసనీయత, పేరు ప్రతిష్టలు దిగజారిపోయాయన్నారు. సమావేశంలో ఈడబ్ల్యూఎస్ జాతీయ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సీపీఐ యువజన నేత ధర్మేంద్ర, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, చెరుకు సుధాకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, సీనియర్ జర్నలిస్టు విఠల్ పాల్గొన్నారు. -
మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి
కడప కార్పొరేషన్: మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యపడుతుందని వివిధ ప్రజాసంఘాల నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చెందాలంటే పాలన వికేంద్రీకరణ కావడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందించి పోరాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మూడు రాజధానులకు మద్దతుగా కడపలోని సప్తగిరి కల్యాణ మండపంలో బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జీవీ రాఘవరెడ్డి, ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏపీ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యానాదయ్య, ఎస్సీ సఫాయి కర్మచారీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గుండ్లపల్లి గరుడాద్రి, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ, రెడ్డి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లెక్కల కొండారెడ్డి, బీసీ, బెస్త, బలిజ సంక్షేమ సంఘాల నాయకులు హాజరై ప్రసంగించారు. రాయలసీమ ఏపీలో భాగమే.. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఏపీలో రాయలసీమ ఒక భాగమనే విషయాన్ని ఉమ్మడి రాష్ట్రంలోను, రాష్ట్ర విభజన తర్వాత కూడా పాలకులు మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒడంబడికను పక్కన పెట్టారన్నారు. టీడీపీ హయాంలో అసెంబ్లీ తీర్మానం ప్రకారమే అమరావతిని రాజధానిగా ప్రకటించారని, ఇప్పుడు కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే మూడు రాజధానుల నిర్ణయం చేశారన్నారు. బిల్లు పాసైన తర్వాత కూడా దానిని అమల్లోకి తెచ్చుకోలేకపోతే భవిష్యత్ అంధకారమవుతుందని హెచ్చరించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో న్యాయవాదులు ఎన్ని ఉద్యమాలు చేసినా, సీజేలకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటుపై న్యాయమూర్తుల వ్యాఖ్యలు దురదృష్టకరమని, వీటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెనుకబడిన ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సీజే వ్యాఖ్యలు చేశారన్నారు. కొందరు న్యాయమూర్తులకు రాజధానిలో భూములు ఉన్నాయని, ఆ కేసు వారి వద్దకు వచ్చినప్పుడు నాట్ బిఫోర్ అని చెప్పకుండా, ఇంకో బెంచ్‌కు బదిలీ చేయకుండా తామే విచారణ చేస్తామనడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు. రాయలసీమ ప్రజలు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించి పోరాడాలన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వారికి భూములిప్పించి తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆస్తులు దోచుకుని ఏర్పాటు చేసిన అమరావతి ఎట్టిపరిస్థితుల్లో ప్రజా రాజధాని అనిపించుకోదని స్పష్టం చేశారు. అక్కడ అణగారిన వర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే వారు తమతో సమానమా అంటూ కోర్టులకు వెళ్లి అడ్డుకున్న వారు, అదే ప్రాంతం రాజధానిగా ఉంటే ఇతరులను అక్కడ కాలు మోపనిస్తారా అని ప్రశ్నించారు. అమరావతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కోర్టుల ద్వారా అడ్డుకుని, పెయిడ్ ఆర్టిస్టులతో పోరాటం చేయిస్తున్నారని తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాటమార్చి అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు పలకడం దారుణమన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు కోసం కార్యాచరణ సిద్ధం చేసి పోరాడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. -
‘ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు’
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో మద్యపాన నిషేదంపై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్యపానం వల్ల లక్షలాది ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. మద్యపాన నిషేదంపై అన్ని పార్టీలు తమ వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ఆంశంపై స్పష్టమైన హామీని ప్రజలకు ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. -
ఉద్యోగాలు సాధించేదాకా ఉద్యమం ఆపేది లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా నిరుద్యోగుల సమస్య పరిష్కారమయ్యేదాకా వెనుదిరిగేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న నిరుద్యోగుల పోస్టుకార్డుల ఉద్యమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ జేఏసీ నిర్వహించిన ఈ ఉద్యమంలో మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం సభకు, ర్యాలీకి ప్రభుత్వం అనుమతించకుండా నిర్బంధం విధించిం దన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా నిరుద్యోగుల పక్షాన పోరాడి తీరుతామన్నారు. నిరుద్యోగ సమస్యపై రౌండ్‌టేబుల్, అఖిలపక్ష భేటీలు నిర్వహించామని, ఇప్పుడు పోస్టుకార్డుల ఉద్యమం సాగుతోందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ప్రకటించాలని, కేలండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని, నిరుద్యోగులకు భృతిఇవ్వా ల న్నారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు, నిరుద్యోగులను సమీకరించి పోరాడుతామన్నారు. పోటీ పరీక్షల కోసం ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రంథాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకుంటే ఉద్య మం తప్పదని హెచ్చరించారు. ఉద్యోగం గాని, లేదా నిరుద్యోగ భృతి గాని ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్రమైన పోరా టాలకు ప్రభుత్వం సిద్ధం కావాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జేఏసీ అధ్యక్షుడు మాదు సత్యంగౌడ్, జేఏసీ నేతలు గోపాలశర్మ, భైరి రమేశ్, నిజ్జన రమేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. సమావేశం ముగిశాక ఎర్రమంజిల్‌లోని పోస్టుడబ్బాలో స్వయంగా రాసిన పోస్టుకార్డును సీఎం కేసీఆర్‌కు కోదండరాం పోస్టు చేశారు. -
ఆ ఆలోచనను చంద్రబాబు మానుకోవాలి!
సాక్షి, విజయవాడ: భూసేకరణ సవరణ బిల్లు ఆలోచనను చంద్రబాబు మానుకోవాలని భూహక్కుల పరిరక్షణ సమితి సూచించింది. రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న ఈ బిల్లును తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చి చెప్పింది. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించవద్దని డిమాండ్ చేస్తూ భూ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ వేత్త శ్రీమన్నారాయణ మాట్లాడుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు కారణంగా 25వేల ఎకరాల సాగుభూమిని కాపాడామని తెలిపారు. వరదప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఎన్జీటీ స్పష్టం చేసిందని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రస్తుతం నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ కూడా వరద ప్రభావిత ప్రాంతంలోనే ఉన్నాయని తెలిపారు. స్టార్టప్ ఏరియాపైనా ఎన్జీటీ తీర్పు ప్రభావముందని శ్రీమన్నారాయణ తెలిపారు. కొండవీటి వాగు ప్రవాహాన్ని మార్చొద్దని ట్రిబ్యునల్ చెప్పిందని, ఈ విషయంలో ఏపీ సర్కారు భిన్నంగా వ్యవహరిస్తే మళ్లీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు. -
పరకాలకు అన్యాయం
♦ జిల్లా కేంద్రం ఏర్పాటుతోనే న్యాయం ♦ రౌండ్‌టేబుల్ సమావేశంలో ♦ అఖిలపక్ష నాయకులు, పట్టణ ప్రముఖుల అభిప్రాయం పరకాల: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా పరకాలను చేయడం తప్పా మరో మార్గం లేదని అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీ య నాయకులు, ప్రముఖులు, వ్యాపారస్తులు, విద్యార్థి, సంఘాల నాయకులు అభిప్రాయపడ్డాయి. పరకాలతో వ్యాపార వాణిజ్య సంబం ధాలు కలిగిన మండలాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలపడం వల్ల ఇప్పటికే వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడిందని ఆందో ళన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు జిల్లా కేంద్రం కోసం అఖిలపక్షం పిలుపునిచ్చే ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుండి పోరాడుతామని స్ప ష్టం చేశారు. పరకాల పట్టణంలోని స్వర్ణగార్డెన్లో మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి రాజకీయ పార్టీలు నాయకులు, వ్యాపారస్తులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రముఖులు హాజరై జిల్లాల పునర్విభజన తర్వాత పరకాల స్థితిగతులపై చర్చించారు. పరకాల పాత తాలూకాలతో కలిపి రెవెన్యూ డివిజన్ చేయాలని కోరగా పాలకులు ఏకపక్షంగా రూపురేఖలు లేని వరంగల్ రూరల్ జిల్లాలో కలిపి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. జిల్లాల పునర్విభజనలో పరకాల అత్యధికంగా నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేం ద్రం చేయడం తప్పా మరో మార్గం లేదని, పరకాల ఉనికి కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ, టీడీ పీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, వైఎస్సార్ సీపీ, లోక్‌జనశక్తి పార్టీల నాయకులతోపాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగబండి విద్యాసాగర్, డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ ఏరుకొండ సాంబమూర్తి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండి ఆగయ్య, లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీణవంక రాజు, కిరాణ వర్తక సంఘం నాయకులు చంద్రశేఖర్, శివకృష్ణ, బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు పిట్ట వీరస్వామి, వీరేశం, ఫర్టిలైజర్స్ సంఘం నాయకులు సూర్యదేవర సదానందం, ఎమ్మార్పీఎస్ నాయకులు దుప్పటి మొగిళి, వ్యాపారస్తులు ఎర్రం రామన్న, మినుపాల బాపురావు, పల్నాటి సతీష్, శంకరాచారి, దంచనాల ఈశ్వర్, విద్యార్థి సంఘాల నాయకులు కట్టగాని శ్రీకాంత్, ఇంగిళి వీరేష్‌రావు, కుసుమ అఖిల్, యూత్ నాయకులు కొయ్యడ శ్రీనివాస్, యాట నరేష్, నాగెల్లి రంజిత్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రం కోసం మానవహారం పరకాల: పరకాలను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం మానవహారం నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో అరగంట సేపు చేపట్టిన మానవహారంలో కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రం ఏర్పాటు చేయని పక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని నాయకులు, వ్యాపారస్తులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, విద్యార్థిసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
‘హోదా’ ఉద్యమానికిదే సమయం
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు సాక్షి, అమరావతి: ఆంధ్రులకు ఆత్మగౌరవం కావాలో, అబద్ధాలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలపై పోరాటమే శరణ్యమని తీర్మానించింది. సీఎం, కేంద్రమంత్రుల స్థాయిలోని వ్యక్తులు అబద్ధాలు చెబుతున్నా రని, దీన్ని ప్రజలు క్షమించరని హెచ్చరించింది. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే ప్రభుత్వ తీరు ను ఎదిరించాలని నిర్ణయించింది. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జస్టిస్ లక్ష్మణరెడ్డి అధ్యక్షతన విభజన చట్టం, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. లక్ష్మణరెడ్డి ప్రారంభోప న్యాసం చేస్తూ హోదా తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అంటూ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శిం చారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ కలసి మోదీ ప్రభుత్వంపై ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాసం పెట్టాలన్నారు. హోదా కోసం తమ పార్టీ పోరాడుతూనే ఉందనీ ఎంపీల రాజీనామాను ప్రయోగించేందుకు తమ పార్టీ సిద్ధమైందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మఅన్నారు. రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎంపీ లు రాజీనామా చేస్తే అది పెద్ద చర్యే అవుతుంద న్నారు. ప్రముఖ జర్నలిస్టుకొమ్మినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ విశాఖ విమానాశ్రయంలో ఏపీ విపక్ష నేత జగన్‌ను అడ్డు కోవడమంటే ఉద్య మాన్ని చూసి బాబు భయపడడమేనన్నా రు. లోక్‌సత్తా నేత కె.శ్రీనివాస్, రాయలసీమ అభివృ ద్ధి మండలి నేత ఇస్మాయిల్, చార్టెడ్ అకౌంటెంట్ వెంకటరెడ్డి, సీనియర్ జర్నలిస్టు చెన్ను శివప్ర సాద్, టీవీరావు, పోతురాజు శివ ప్రసంగించారు. -
మహిళలపై హింస పెరుగుతోంది
విజయవాడ (గాంధీనగర్) : మహిళలపై రోజురోజుకూ హింస పెరుగుతోందని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధ అన్నారు. లైంగికంగా, కుటుంబ పరంగా, రాజ్యపరంగా.. ఇలా అనేక రూపాల్లో హింస జరుగుతోందన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యాన ‘మహిళలపై జరుగుతున్న రాజ్యహింస’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం శనివారం జరిగింది. ఆమె మాట్లాడుతూ మహిళలపై హింసకు ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక కారణాలే మూలమని పేర్కొన్నారు. ఆదివాసీ మహిళలు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారిపై సైనికులే లైంగికదాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులను తెలుసుకునేందుకు వెళ్లిన ప్రొఫెసర్ నందినీ సుందర్, అర్చనా ప్రసాద్, జర్నలిస్ట్ మాలినీ సుబ్రహ్మణ్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. మహిళలపై దాడులను ప్రశ్నించేవారిని ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి రాజేశ్వరి ప్రసంగించారు. అనంతరం రాజ్యహింసను ఎదుర్కొనేందుకు పోరాటాలను తీవ్రతరం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో బి.కొండారెడ్డి (పీకేఎఫ్), టి.శ్రీరాములు (కేఎన్పీఎస్), వీఎన్ఎన్ రాజ్యలక్ష్మి (ఓపీడీఆర్), ఎస్ఎస్సీ బోసు(పౌరహక్కుల సంఘం), కొప్పల మాధవి (రూట్స్ హెల్త్ ఫౌండేషన్), మురళీకృష్ణ (పద్మశ్రీ నాజర్ కళాక్షేత్రం), మహిళా, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీచ్ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా పోరాటం
విజయవాడ : పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం వైగాగ్లో ఏర్పాటు చేయదలచిన బీచ్ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ బాలికల విభాగం నగర కమిటీ తీర్మానించింది. ఆదివారం యూటీఎఫ్ భవన్లో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు హాజరై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ అధ్యక్షుడు టి. కోటి, బాలికల విభాగం రాష్ట్ర కో–కన్వీనర్ టి. రాణి పాల్గొన్నారు. -
ఐక్యంగా ముందుకు సాగుదాం
మచిలీపట్నం టౌన్ : బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో బందరు ప్రాంతంలోని 33 వేల ఎకరాల భూములను లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి భూములను రక్షించుకునేందుకు రైతులు ఐక్యంగా ముందుకురావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక ఈడేపల్లిలోని బెల్ ఉద్యోగుల సంఘం భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మా చినకొండయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పంట భూములను బడా పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నుతోందన్నారు. ఈ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ డబ్బులను రానున్న ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు చంద్రబాబునాయుడు కుట్ర చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నాయకులు బొర్రా విఠల్, మారుమూడి విక్టర్‌ప్రసాద్ మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 4,500 ఎకరాల్లో పోర్టును నిర్మించేందుకు నిర్ణయం తీసుకోగా, పోర్టును రెండు వేల ఎకరాల్లోనే నిర్మించాలని రాద్ధాంతం చేసిన టీడీపీ నాయకులు నేడు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో 33 వేల ఎకరాల భూములను లాక్కునేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఐసీఈయూ నాయకుడు జి. కిషోర్‌కుమార్ మాట్లాడుతూ పోర్టును నిర్మిస్తే ఈ ప్రాంతానికి ఏఏ పరిశ్రమలు వస్తాయో ఇంకా స్పష్టత రాకుండానే, పరిశ్రమలను నిర్మిస్తామని పారిశ్రామిక వేత్తలు ముందుకు రాకుండానే భూములను లాక్కోవటం దారుణమన్నారు. పోతేపల్లి ఎంపీటీసీ సభ్యుడు పిప్పళ్ల నాగబాబు ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అబ్ధుల్‌మతీన్, సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ.సీపీఐ నాయకుడు మోదుమూడి రామారావు ,కాంగ్రెస్ నాయకులు రాంప్రసాద్, బి. ధర్మారావు, కుమారి, సీపీఐ నాయకుడు గుర్రం వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్) నాయకుడు ఈపూరి రాంబాబు పాల్గొన్నారు. -
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన
బోధన్: సుదీర్ఘ ఉద్యమం, అమరవీరుల త్యాగాల ఫలితంగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా, గత ప్రభుత్వాల అడుగుజాడల్లో పాలన సాగిస్తోందని వామపక్ష, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. నిజాం షుగర్స్ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ‘టీఆర్ఎస్ రెండేళ్ల పాలన–నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలి’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొంటామని స్వయంగా చెప్పిన సీఎం కేసీఆర్.. రెండేళ్లు గడిచినా హామీని నెరవేర్చలేదని రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు విమర్శించారు. పైగా లేఆఫ్ ప్రకటించి మూసివేశారని, వందలాది కార్మికులు రోడ్డున పడినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఆచరణలో అమలు కావడం లేదని తెలిపారు. తెలంగాణలో తమ బతుకులు బాగు పడతాయనుకున్న ప్రజలు ప్రభుత్వ విధానాలను చూసి నిరాశకు గురవుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వామపక్ష, ప్రజా సంఘాల నేతలు గంగాధర్ అప్ప, వరదయ్య, సాయిబాబా, షేక్‌బాబు, గంగారెడ్డి, సురేశ్, శ్రీనివాస్, శంకర్‌గౌడ్, భాస్కర్, జైత్రాం, సుల్తాన్ సాయిలు, శివకుమార్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబం కోసం జిల్లాను విభజిస్తారా?
► తీరుమార్చుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదు ► జిల్లాను రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలి ► రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు కరీంనగర్ : కుటుంబ సభ్యుల కోసమే జిల్లాల విభజనకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జిల్లాలను విభజిస్తే సహించేది లేదని బీజేపీ, టీడీపీ, సీపీఐ, విద్యార్థి యువజన ప్రజా సంఘాల నేతలు ముక్తకంఠంతో హెచ్చరించారు. శనివారం ఫిలింభవన్‌లో కరీం నగర్ జిల్లా పరిరక్షణ సమితి కన్వీనర్ కొరివి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ము ఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి రాచరిక పాలన సాగిస్తు న్నారన్నారు. సీఎం తనయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లను జిల్లాగా చేయాలనుకోవడం అనాలోచితమైన చ ర్యగా అభివర్ణించారు. జగిత్యాలను జిల్లా చేయడంతోపాటు కరీంనగర్ మిగతా ప్రాంతాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. మంథని ప్రాంతాన్ని భూపాలపల్లి జిల్లాలోకి కలపడం, హుజూరాబాద్ ప్రాంతాన్ని వరంగల్‌లోకి, హుస్నాబాద్ ప్రాంతాన్ని సిద్దిపేటలోకి కలపాలనే నిర్ణయూలపై మండిపడ్డారు. అనాలోచితంగా కాకుం డా జిల్లాల విభజన శాస్త్రీయంగా చేపట్టాలని కోరారు. కరీంనగర్ జిల్లా పరిరక్షణ సమితి కన్వీనర్ కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రతి ఉద్యమానికి కరీంనగర్ జిల్లా గుండెకాయ వంటిదన్నారు. పుణ్యక్షేత్రాలు, నదులు అన్ని రకాల సహజ వనరులున్న జిల్లాను రాష్ట్రానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో మినీ అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, ఐటీ హబ్ ఏర్పాటు చేసి పరిశ్రమలను నెలకొల్పాలని కోరారు. మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై పరిరక్షణ సమితి తీసుకున్న నిర్ణయాలకు మద్దతునిస్తామన్నారు. సమావేశంలో సీపీ ఐ, బీజేపీ నా యకులు న్యాల కొండ నారాయణరావు, కోమల ఆంజనేయులు, నవనీతరావు, బోయిని అశో క్, పైడిపల్లి రాజు, సిగిరి శ్రీధర్, గాజుల స్వప్న, గంట సుశీల, గజ్జెల రవీం దర్, మేడి అంజయ్య, కమలాకర్, శ్యాంకుమార్, సోమిడి వేణుగోపాల్, నరేశ్, కె. వెంకట య్య, దుర్గం మారుతి, మాదరి శ్రీనివాస్, యా దగిరి, మేకల కరుణాకర్, మల్లేశ్‌యాదవ్, గణేష్, రాములు, రాంచంద్రం, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుందాం
► ఎగువ ప్రాజెక్టుల నిర్మాణంతో కృష్ణా, గోదావరి డెల్టా మనుగడ ప్రశ్నార్థకం ► వివిధ రైతు సంఘాల నాయకుల ఆందోళన విజయవాడ(గాంధీనగర్): కృష్ణా గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు రైతు సంఘాలతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఢిల్లీ తీసుకెళ్లాలని రౌండ్‌టేబుల్ సమావేశ తీర్మానించింది. అక్రమ ప్రాజెక్టులను ఆడ్డుకోకపోతే కృష్ణా, గోదావరి డెల్టా మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ‘ కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులు- వివాదాలు ’ అనే అంశంపై శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ రామచంద్రయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు. అందుకోసం ప్రభుత్వం మేధావులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి కార్యచరణ ప్రకటించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోకపోతే సాగునీటి సంక్షోభం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, వీ ఆజాద్, చలసాని ఆంజనేయులు, కొమ్మన నాగేశ్వరరావు. యలమందరావు పాల్గొన్నారు. నదులు అనుసంధానం చేయాలి: వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి రాష్ట్రంలో నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలి. సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. వర్షాకాలంలో నీరు సముద్రం పాలు కాకుండా ప్రకాశం బ్యారేజీకి దిగువన పులిగడ్డ వరకు చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి. పులిచింతల ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి, నిర్దేశిత నీటిని నిల్వ చేయాలి. స్వయం ప్రతిపత్తి కలిగిన అథారిటీ ఉండాలి: ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు అమలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతాం. నీటి పంపకాల విషయంలో సమగ్ర జల విధానం కావాలి. ఎగువ రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుంది, డెల్టా మనుగడ దెబ్బతింటుంది. నీటి పంపకాల కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన అథారిటినీ ఏర్పాటు చేయాలి. అందరినీ కలుపుకోవడం లేదు: జలగం కుమారస్వామి, బీకేఎస్, జాతీయ కార్యవర్గ సభ్యుడు సీఎం చంద్రబాబుకు అందరినీ కలుపుకుని పోవాలనే ఆలోచనే లేదు. తాను మాత్రమే చేయాలి. తన ప్రభుత్వమే చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అక్రమంగా పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించారు కాబట్టే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలంగాణ రాష్ట్రం వాదిస్తుంటే మన రాష్ట్రం వాటిని అడ్డుకునే ధైర్యం చేయడం లేదు. రెండేళ్ల పాలనలో ఏ విషయంలోనూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. రాయలసీమకు తాగు నీరు లేని పరిస్థితి ఏర్పడింది. గోదావరి డెల్టాలో ఏడాదికే తీవ్ర సంక్షోభం వచ్చింది. నీటి వాడకంపై కేంద్ర నియంత్రణ ఉండాలి : నరసింహారావు, రైతు సంఘం నాయకుడు నీళ్లు రాజకీయమయ్యాయి. దిగువ రాష్ట్రాలు నీళ్లు వాడుకునే హక్కు కోల్పోయాయి. దీనికి రాష్ర్ట ప్రభుత్వమే కారణం. అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని ఇతరులను నిందించేకంటే ..పులిచింతల ప్రాజెక్ట్‌ను సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. ప్రాజెక్ట్ పరిధిలోని 6 గ్రామాలకు నేటికీ ఆర్ ఆర్‌ప్యాకేజీ’ ఇవ్వ లేదు. ప్రాజెక్టులో 45 టీఎంసీలకుగాను కేవలం 14 టీఎంసీలే నిల్వ ఉంటుంది. నదుల్లో నీటి వినియోగంపై కేంద్రం నియంత్రణ ఉండాలి. సీఎం కార్యాలయానికే వెళ్లలేని పరిస్థితి : యేర్నేని నాగేంద్రనాథ్, రైతాంగ సమాఖ్య నాయకుడు ప్రధాని వద్దకైనా వెళ్లగలంగానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు. ఇరిగేషన్ కార్యాలయంలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని రైతులను కలవనివ్వడం లేదు. సమస్యలు చెబుదామని వెళితే పోలీసులు అడ్డుకుంటున్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. పట్టిసీమ నీళ్లు రాయలసీమకు ఎలా తీసుకెళతారో.. మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. -
రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది:కవిత
-
గత పాలకుల వల్లే కష్టాలు
శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల రౌండ్‌టేబుల్ సమావేశంలో హరగోపాల్ హైదరాబాద్ : శ్రీశైలం ముంపు బాధితులకు నేటికీ ఉద్యోగాలను ఇవ్వకపోవడం గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలమూరు అధ్యయన వేదిక - హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడు తూ ప్రాజెక్టును నిర్మించినప్పుడు భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి సీఎం ఎన్టీరామారావు ఇచ్చిన 98,68 జీవోలను ఇప్పటికీ ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్‌కు వెళ్లిన కేసీఆర్ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. బాధితులు 160 రోజుల పాటు తమకు ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రధాన డిమాం డ్తో ఉద్యమిస్తున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. అర్హత కలిగిన 2,500 మంది నిరుద్యోగులు నిర్వాసితుల్లో ఉన్నారని, వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారికి న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలు వారికి అండగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ... ప్రభుత్వాలు మారినా, ప్రత్యేక తెలంగాణ వచ్చినా శ్రీశైలం నిర్వాసితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ నినాదాలు చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఏడాది దాటినా నిర్వాసితులను పట్టించుకోకపోవ డం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డిలు మాట్లాడుతూ శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఈ నెల 20న మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి నుంచి వందలాది మంది నిర్వాసితులతో చేపట్టనున్న చలో అసెంబ్లీ పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రజాకవి రాజారాంప్రకాష్, విరసం సభ్యుడు రాంకి రామ్మోహన్‌లతోపాటు నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు కురుమన్న, ఉపాధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌కు అన్యాయం అత్యంత అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు. కృష్ణానది ఎక్కువగా పారేది ఈ జిల్లాలోనే అయినా తాగు నీరు, సాగునీరు లేక వలసలతో వెలవెలబోతుంది. ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు గడచినా శ్రీశైలం ముంపు నిర్వాసిత కుటుంబాలకు న్యాయం జరుగలేదు. - ఎం. మురళీధర గుప్తా,హైదరాబాద్ జిల్లా కన్వీనర్ , పాలమూరు అధ్యయన వేదిక . ఆందోళనకు ముగింపు రావాలి గత ప్రభుత్వాల దుర్మార్గానికి, మోసానికి బాధితులైన నిర్వాసితులకు ఎదురవుతున్న అ న్ని నియంత్రణలు, అడ్డంకులు తొలగించి ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి. అదే విధంగా 67 గ్రామాలలో సామాజిక నివేదికలు లేవు. దీనిపై సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేసి నివేదిక తయారు చేయించి గడువులో అమలు జరపాలి. - ఎం.రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ . వయసు మీరుతున్నా జాబ్ రాలేదు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో మాతాతల నాటి నుంచి వస్తున్న సాగుభూమి 9.5 ఎకరాలు కోల్పోయా. మూడు దశాబ్దాల నుంచి నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో జీవిస్తున్నా. వయసు మీరిపోతోంది కానీ ఉద్యోగం రాలేదు. పౌరహక్కుల, ప్రజా సంఘాల నేతలు మా విషయంలో స్పందించి న్యాయం చే యాలి. - పి.కురుమన్న, శ్రీశెలం ముంపు నిర్వాసితుల జిల్లా అధ్యక్షుడు. -
భద్రాద్రి జిల్లా కోసం..
- ఊపందుకున్న ఉద్యమం - రౌండ్‌టేబుల్ సమావేశం - ఏకమైన రాజకీయ పక్షాలు భద్రాచలం : భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆదివారం పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు గిరిజన, దళిత, వర్తక,వాణిజ్య, స్వచ్ఛంద సంస్థలు, పట్టణ ప్రముఖులు సుమారు 500 మంది పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతో భద్రాచలానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసమని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయటంతో ఆ ప్రభావం భద్రాచలంపై తీవ్రంగా పడిందన్నారు. ఏజెన్సీ కేంద్రంతో పాటు, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి క్షేత్రం వెలసిన భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తేనే భవిష్యత్ ఉంటుందన్నారు. దీన్ని సాధించుకునేందుకు.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమబాట పడతామన్నారు. పార్టీలకతీతంగా చేపట్టే ఆందోళనకు గ్రామస్థాయిలో ప్రజానీకాన్ని కదిలిస్తామన్నారు. ఇందుకోసమని అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీలో విలీనమైన ముంపు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపి భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేయూలని కొందరు, అది కాని పక్షంలో భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. తాడో పేడో తేల్చుకోవాలి భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించుకునేలా రాజకీయ పార్టీలకతీతంగా అంతా ఏకం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ద్వారా ప్రభుత్వం దృష్టికి భద్రాద్రి వాసుల అభిప్రాయూన్ని తీసుకెళ్లాలని నిర్ణరుుంచారు. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. -
ప్రత్యేకహోదాపై ప్రభుత్వాలకు డెడ్‌లైన్
- 20లోగా సమస్య పరిష్కరించాలి - 21 తర్వాత రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు - రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రత్యేకహోదా సాధన సమితి గాంధీనగర్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి డెడ్‌లైన్ విధించింది. ఈనెల 20వతేదీన ప్రధాని నరేంద్రమోదీతో భేటి అవుతున్న చంద్రబాబు ఆయన నుంచి స్పష్టమైన ప్రకటన చేయించాలని డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా , విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం సస్యశ్యామలం కాదని పదే పదే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 14నెలల కాలంలో చంద్రబాబు రాష్ట్రానికి ఏం అడిగారు.. ఇప్పటికి ఏం సాధించారు అనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది సార్లు మోదీని కలిసిన చంద్రబాబు డప్పుకొట్టుకోవడం తప్ప వాస్తవానికి సాధించిదేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేస్తోందన్నారు. ఈనెల 11న జరిగిన బంద్ తర్వాత ముఖ్యమంత్రిలో చలనం వచ్చిందని, అందువల్లే ఆయన 20న ప్రధానిని కలుస్తున్నారన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు మధ్య ఆరోజున జరిగే సంభాషణను బహిర్గతం చేయాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రకటన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పలేదని, మూడు పంటలు పండే భూముల్లో రాజధాని ఏర్పాటు చేయొద్దని అందరూ చెప్పారని, అయినా ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తోందన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే మాత్రం ప్రణాళికా సంఘానికి ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యాన జరిగే ఉద్యమాల్లో ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొనాలని ఆయన కోరారు. మాజీ మంత్రి వడ్డేశోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 లో పేర్కొన్న ఆస్తుల విభజనపై రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆంధ్రమేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, వంగల సుబ్బారావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఈశ్వరయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని, నగర సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తీర్మానాలు ఇవే.. రౌండ్‌టేబుల్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీసుకున్న తీర్మానాలను ఆంధ్రమేధావులు ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వెల్లడించారు. ఈనెల 20న ప్రధానితో సీఎం భేటి తర్వాత ఆమోదయోగ్యమైన ప్రకటన రాకపోతే 13జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని తీర్మానించినట్లు చెప్పారు. ఈనెల 21నుంచి ప్రత్యేక హోదా వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించాలని, రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక హోదాకు అనుకూలంగా తీర్మానం చేయాలని, పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉండి పోరాడాలని, ప్రజాప్రతినిధులకు గులాబీలు ఇచ్చి నిరసన తెలియజేయాలని తీర్మానించినట్లు చెప్పారు. అప్పటికీ స్పష్టత రాకపోతే రాష్ట్ర పతికి సమస్యను విన్నవించేందుకు రాష్ట్రపతి భవన్ వద్ద నిరసన తెలియజేస్తామని వివరించారు. -
గుడిసెల జోలికొస్తే రోడ్డుకీడుస్తాం
సాక్షి, హైదరాబాద్: గుడిసెల్లో ఉంటున్న పేదలకు పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాలకు పాల్పడుతోందని వివిధ పక్షాలు నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలు, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల పరిధిలో గుడిసెల తొలగింపును వెంటనే నిలిపివేయాలని, అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో గుడిసెలను తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన ‘‘పేదల గుడిసెల తొలగింపు-టీఆర్ఎస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి’’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గుడిసెలు తొలగింపునకు గురైన కొమురంభీమ్‌నగర్ పేదలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గుడిసెలను నిర్దాక్షిణ్యంగా తొలగించిన సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ పార్టీని రోడ్డు మీదకు ఈడుస్తామని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. కబ్జాకు గురైన భూములను తాము చూపుతామని, వాటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటే పేదలకు ఒకటి కాదు మూడు పడక గదులు కట్టించి ఇవ్వొచ్చునన్నారు. గుడిసెల తొలగింపునకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలసి పోరాడుతామని, పేదల గుడిసెలను తొలగిస్తున్న ప్రభుత్వానికి మానవత్వం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పేదలకు రెండు పడకగదుల ఇళ్లు కట్టిస్తామని ఒకవైపు చెబుతూ మరోవైపు గుడిసెలు తొలగించడం కేసీఆర్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిదర్శనమన్నారు. గృహ నిర్మాణం కోసం రెండు బడ్జెట్లలో రూ.వెయ్యి కోట్ల చొప్పున కేటాయించిన ప్రభుత్వం అందుల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. ఒక్క గుడిసె జోలికి వచ్చినా సీఎం కేసీఆర్‌ను క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు పంపిస్తామని వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ హెచ్చరించారు. ఒక్క గుడిసెను తొలగించినా ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. గుడిసె వాసుల కోసం వామపక్షాలు చేపట్టే పోరాటాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కొమురంభీమ్ నగర్ గుడిసెవాసులతో పాటు రాష్ట్రంలోని గుడిసెవాసులందరికీ జీవో 59 ప్రకారం చట్టబద్ధంగా పట్టాలు పొందే హక్కు ఉందని సీపీఎంనేత తమ్మినేని వీరభద్రం అన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజీవ్‌గృహకల్పలో దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడిని తెచ్చేందుకు వామపక్షాలు, ఇతరపార్టీలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామన్నారు. ఈ భేటీకి శ్రీధర్‌రెడ్డి (బీజేపీ), కె.గోవర్దన్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న), ఝాన్సీ (న్యూడెమోక్రసీ-రాయల), జానకిరాములు (ఆర్ఎస్పీ), వీరయ్య ( సీపీఐ-ఎంఎల్) తదితరులు పాల్గొన్నారు. -
31న గురుకులాల రౌండ్‌టేబుల్ సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని సమస్యలపై అన్ని సంఘాలు కలసి గురుకులాల సమాఖ్యగా ఏర్పడి ఈ నెల 31న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నా యి. ‘గురుకుల వ్యవస్థ బలోపేతం-సమస్యలు-పరిష్కారం’ అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సంఘాల నాయకులు రామలక్ష్మణ్, దయానంద్, రవిచందర్, సీతామనోహర్, అర్జున వెంకట్‌రెడ్డి, యాదయ్య, బాలరాజు, పరంధాములు ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రత్యేక హోదా కోసం 2న భిక్షాటన: శివాజి
విజయవాడ (గాంధీనగర్): రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జూన్ 2న భిక్షాటన చేపట్టబోతున్నట్టు సినీనటుడు శివాజీ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితుల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం మూడు నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. అందుకే తాను శాంతియుతంగా ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేశారు. -
ఇక ఐక్యంగా పోరుబాట
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలు చేయాలని వామపక్షాలు నిర్ణయించాయి. జిల్లా సమగ్ర అభివృద్ధి, పేద బడుగు బలహీనవర్గాలకు సామాజిక న్యాయం కోసం ఉద్యమించేందుకు ఎర్రజెండాలు ఏకమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలవారీగా, మొక్కుబడిగా ఆందోళనలు చేసినా, జిల్లా స్థాయిలో ఎనిమిది వామపక్షాలు, వాటి అనుబంధ సంఘాలు ఏకం కావడం అరుదు.ఇందూరు జిల్లా నుంచి ఐక్య ఉద్యమాలకు సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ... సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు, సీపీఐ(ఎంఎల్)లిబరేషన్‌తో పాటు ఫార్వర్డ్‌బ్లాక్, వాటి అనుబంధ సంఘాలు సిద్ధమవుతున్నారుు. ⇒ సమస్యల పరిష్కారానికి ఏకమైన వామపక్షాలు ⇒ జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఆందోళనలు ⇒ 17 ముఖ్య అంశాలతో సిద్ధమైన కార్యాచరణ ⇒ రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతల నిర్ణయం ⇒ 17న ‘చలో ఎన్డీఎస్ఎల్’తో ఉద్యమాలకు శ్రీకారం ⇒ సర్కారుపై తీవ్రంగా ఒత్తిడి పడే అవకాశం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పోరాటాలు చేసేందుకు వామపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రజా సమస్యలపై ఎర్ర జెండా పార్టీలు సంయుక్త కార్యాచరణను రూపొందించడం దా దాపుఇదే మొదటిసారి. శనివారం నిజామాబాద్ టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వామపక్షాలు ఈ తీర్మానం చేశాయి. సమష్టిగా పోరాడేందుకు సిద్ధపడినట్లు పేర్కొన్నాయి. సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు భూమయ్య, ప్రభాకర్, భాస్కర్, మల్లికార్జున్ పాల్గొన్న ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్ అధ్యక్షత వహించారు. సర్కారు వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. నిరసనకు సిద్ధం కావా లని ప్రజలకు పిలుపునిచ్చారు. బడ్జెట్ కేటాయింపులపై ఆగ్రహం రౌండ్‌టేబుల్ సమావేశంలో వామపక్షాల నేత లు ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. బడ్జెట్లో జి ల్లా అభివృద్ధికి తగిన నిధులు కేటాయించకుం డా, విద్యా, వైద్యరంగాలకు మొండిచేయి చూప డంపై ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు కోసం నిధులివ్వకపోవడం, జిల్లా, డివిజన్ కేంద్రాలలో ప్రభుత్వాస్పత్రులకు నిధులు కేటాయించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తానన్న సర్కార్ వాగ్దానాలు అమలు కాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, బడ్జెట్ కేటాయింపులో నిర్లక్ష్యం, పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన 17 ముఖ్య సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలని తీర్మానించారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ఒక ప్ర త్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భరోసాగా ఉండాలని నిర్ణయించాయి, పేద, బడుగు, బలహీనవర్గాల సమస్యల పరిష్కారం కోసం తరచూ రోడ్లెక్కి నిరసన తెలిపే కమ్యూనిస్టులు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయూలని భావిస్తున్నారుు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా నిరసన కార్యక్రమాలు ఇబ్బందికరంగా మారవచ్చు. వామపక్షాల ఎజెండా ఇదే ఆందోళనలో భాగంగా ముందుగా ఈ నెల 17న ‘చలో ఎన్డీఎస్ఎల్’కు వామపక్ష నేతలు పిలుపునిచ్చారు.ఎన్డీఎస్ఎల్, ఎన్సీఎస్ఎల్ను ప్రభుత్వమే నడిపించే వర కు పోరాటాలు చేయాలని నిర్ణయించాయి. ‘మిషన్ కాకతీయ’లో అవినీతి అరికట్టి, ప్రజల భాగస్వామ్యంతో మరమ్మత్తులు జరిపించాలని , సింగూరు ప్రాజెక్టును ఇందూ రు హక్కుగా ప్రకటించాలని, మెడికల్ కళాశాలకు తగిన నిధులు కేటాయించాలని, ఎర్రజొన్న రైతులను ఆదుకొని వ్యాపారుల మోసాలను అరికట్టేంత వరకు పోరాడాల నేది వీరి ఎజెండా. పసుపు, చెరుకు, మొక్కజొన్న రైతాంగం పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, పెద్దపల్లి రైల్వే పనులు వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నది డిమాండ్. అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయడం, ఉచిత ఇంటి నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించి గతంలో నిలిచిపోయిన వాటికి బిల్లులు చెల్లించాలి, బీడీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం, వృత్తిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం, గల్ఫ్ బాధితులకు ప్రత్యేక నిధిని కేటాయించి అప్పులు రద్దు చేసి ఉపాధి కల్పించడం, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో అవినీతిని అరికట్టడం, ప్రరుువేటు, విద్యా, వైద్యం లో దోపిడిని అరికట్టడం, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సమస్యలు వామపక్షాల ఉద్యమ ఎజెండా. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడం, డ్వాక్రా రుణాల మంజూరు లక్ష్యంగా ముందుకు సాగుతారు. పలు రూపాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు చేపడతారు. -
రైతుల పక్షాన న్యాయపోరాటాలు
ఏపీ రాజధానిపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు రాజధాని ప్రాంత రైతుల్లో ధైర్యం నింపేందుకు అన్ని పక్షాలు కలసిరావాలని పిలుపు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ బాధ్యత తీసుకోవాలని తీర్మానం సాక్షి, హైదరాబాద్: ఖాకీల నీడలో మానవ హక్కుల్ని హరిస్తూ రాజధాని ప్రాంత రైతుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రభుత్వ విపరీత పోకడలను ఉద్యమ రూపంలో ఎదుర్కోవాల్సి ఉందని ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి రైతుల్లో మనోధైర్యం నింపాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందని పేర్కొంది. న్యాయపోరాటాలతో పాటు ప్రజా పోరాటాలు నిరాటంకంగా కొనసాగించాలని, కరపత్రాలతో ప్రచారం చేయాలని, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో విశాల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ దుశ్చర్యల్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని అభిప్రాయపడింది. ఇందుకు అభ్యుదయవాదులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షపార్టీ వైఎస్సార్ సీపీ బాధ్యత తీసుకోవాలని వక్తల ఏకాభిప్రాయంతో తీర్మానించింది. సమావేశంలో పాల్గొన్న వక్తలంతా ప్రభుత్వం భూములు సమీకరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జరీబు భూముల్ని రాజధాని నిర్మాణానికి మినహాయించాలని తీర్మానం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో మంగళవారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంగా ఎంపికచేసిన మండలాల్లో వైవిధ్యం గల పంటల ఫొటో ఎగ్జిబిషన్, ఏపీ రాజధానిపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. తొలుత జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రైతులు భూ సమీకరణకు ఒప్పుకోకుంటే బలవంతపు భూ సేకరణ చేపడతామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, అయితే కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌లో రాజధాని నిర్మాణానికి బలవంతపు సేకరణకు అవకాశం లేదని చెప్పారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ మన దేశ సంస్థలే ఇతర దేశాల్లో భారీ నిర్మాణాలు చేస్తుంటే సింగపూర్ సహకారం ఎందుకని ప్రశ్నించారు. రైతుల పక్షాన ఉంటాం: వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ భూములు ఇవ్వనన్నాడనే కారణంతో ఆ ప్రాంతానికి చెందిన రైతు శ్రీనాథ్చౌదరిని పోలీసులు తీసుకెళ్లారని, వారం రోజులుగా ఆయన జాడ లేదని చెప్పారు. పోలీసుల దాష్టీకాన్ని ప్రపంచానికి చెప్పేందుకు అన్ని రాజకీయ పక్షాలు కలసి ఉద్యమ బాట పట్టాలన్నారు. వైఎస్సార్ సీపీ రైతుల పక్షాన కడవరకు పోరాడుతుందని చెప్పారు. రైతు ఉద్యమనేత అనుమోలు గాంధీ మాట్లాడుతూ ఇక్కడి పొలాల్లో 120 రకాల పంటలను పండిస్తున్నారని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ విధానం చట్టవిరుద్ధమైందన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ 2011లో రైతుల భూముల జోలికొస్తే ఖబడ్దార్ అన్న బాబు ఇప్పుడు భూ సమీకరణకు అడ్డువస్తే ఖబడ్దా ర్ అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కిసాన్‌సెల్ నేత కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఏ విషయంలోనైనా నష్టం జరుగుతుందంటే సీఎంగా ఉన్న సమయంలో వైఎస్సార్ రైతులకు అనుకూలంగా నిర్ణయా లు తీసుకునే వారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, సీపీఐ ఎం.ఎల్. నేత గుర్రం విజయకుమార్, హైకోర్టు న్యాయవాది జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటల ఫొటో ఎగ్జిబిషన్ పలువురిని ఆకట్టుకుంది. సమావేశానికి ముందు జస్టిస్ లక్ష్మణరెడ్డి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఫొటోల్లో పంటలను రైతు నాయకుడు ఎ.గాంధీ వివరించారు. -
మోడి రిజర్వేషన్ వ్యతిరేకి
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాలకు, భారత ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేకమని సామాజికవేత్త, ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. బుధవారం ఓయూ క్యాం పస్ గ్రంథాయలంలోని ఐసీఎస్ఎస్ఆర్ హాలు లో టీవీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, అంసా, బీఎస్ఎఫ్, టీవీవీ, ఎంఎస్ ఓ, డీఎస్‌యూ, టీఆర్‌వీడీ, టీఎస్ఏ ఆధ్వర్యంలో ‘గుజరాత్ అభివృద్ధి-ఒక అందమైన అబద్ధం’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ‘అంసా’ అధ్యక్షుడు మాందాల భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కంచ ఐలయ్య, సామాజిక కార్యకర్త షబానా హష్మి (ఢిల్లీ), ప్రొఫెసర్ హేమంత్‌షా (అహ్మదాబాద్) ప్రసంగించారు. ఐలయ్య మాట్లాడుతూ మోడి బీసీ వర్గానికి చెందిన వారైనా బీసీలు, దళితులకు ప్రతినిధి కాదని, బ్రాహ్మణులకు మాత్రమే ప్రతినిధి అని అన్నారు. మోడికి దమ్ముంటే ఈ నెల 11న హైదరాబాద్‌లో జరిగే సభలో రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంకా పరిశోధన విద్యార్థులు కోట శ్రీనివాస్‌గౌడ్, సత్య, సుదర్శన్, బండారు వీరబాబు, డేవిడ్ తదితరులు పలు విషయాలపై చర్చించారు. -
తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తాం