‘ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు’ | Janachaitanya Vedika Conduct Roundtable Meeting On Ban On Alcohol | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 13 2018 4:33 PM | Last Updated on Sat, Oct 13 2018 8:05 PM

Janachaitanya Vedika Conduct Roundtable Meeting On Ban On Alcohol

సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో మద్యపాన నిషేదంపై శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్యపానం వల్ల లక్షలాది ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. మద్యపాన నిషేదంపై అన్ని పార్టీలు తమ వైఖరి తెలపాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆంశంపై స్పష్టమైన హామీని ప్రజలకు ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement