ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలు చేయాలని వామపక్షాలు నిర్ణయించాయి. జిల్లా సమగ్ర అభివృద్ధి, పేద బడుగు బలహీనవర్గాలకు సామాజిక న్యాయం కోసం ఉద్యమించేందుకు ఎర్రజెండాలు ఏకమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలవారీగా, మొక్కుబడిగా ఆందోళనలు చేసినా, జిల్లా స్థాయిలో ఎనిమిది వామపక్షాలు, వాటి అనుబంధ సంఘాలు ఏకం కావడం అరుదు.ఇందూరు జిల్లా నుంచి ఐక్య ఉద్యమాలకు సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ...
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు, సీపీఐ(ఎంఎల్)లిబరేషన్‌తో పాటు ఫార్వర్డ్‌బ్లాక్, వాటి అనుబంధ సంఘాలు సిద్ధమవుతున్నారుు.
⇒ సమస్యల పరిష్కారానికి ఏకమైన వామపక్షాలు
⇒ జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఆందోళనలు
⇒ 17 ముఖ్య అంశాలతో సిద్ధమైన కార్యాచరణ
⇒ రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతల నిర్ణయం
⇒ 17న ‘చలో ఎన్‌డీఎస్‌ఎల్’తో ఉద్యమాలకు శ్రీకారం
⇒ సర్కారుపై తీవ్రంగా ఒత్తిడి పడే అవకాశం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పోరాటాలు చేసేందుకు వామపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రజా సమస్యలపై ఎర్ర జెండా పార్టీలు సంయుక్త కార్యాచరణను రూపొందించడం దా దాపుఇదే మొదటిసారి. శనివారం నిజామాబాద్ టీఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వామపక్షాలు ఈ తీర్మానం చేశాయి. సమష్టిగా పోరాడేందుకు సిద్ధపడినట్లు పేర్కొన్నాయి.
సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు భూమయ్య, ప్రభాకర్, భాస్కర్, మల్లికార్జున్ పాల్గొన్న ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్ అధ్యక్షత వహించారు. సర్కారు వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. నిరసనకు సిద్ధం కావా లని ప్రజలకు పిలుపునిచ్చారు.
బడ్జెట్ కేటాయింపులపై ఆగ్రహం
రౌండ్‌టేబుల్ సమావేశంలో వామపక్షాల నేత లు ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. బడ్జెట్‌లో జి ల్లా అభివృద్ధికి తగిన నిధులు కేటాయించకుం డా, విద్యా, వైద్యరంగాలకు మొండిచేయి చూప డంపై ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు కోసం నిధులివ్వకపోవడం, జిల్లా, డివిజన్ కేంద్రాలలో ప్రభుత్వాస్పత్రులకు నిధులు కేటాయించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తానన్న సర్కార్ వాగ్దానాలు అమలు కాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు, బడ్జెట్ కేటాయింపులో నిర్లక్ష్యం, పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన 17 ముఖ్య సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలని తీర్మానించారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ఒక ప్ర త్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భరోసాగా ఉండాలని నిర్ణయించాయి, పేద, బడుగు, బలహీనవర్గాల సమస్యల పరిష్కారం కోసం తరచూ రోడ్లెక్కి నిరసన తెలిపే కమ్యూనిస్టులు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయూలని భావిస్తున్నారుు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా నిరసన కార్యక్రమాలు ఇబ్బందికరంగా మారవచ్చు.
వామపక్షాల ఎజెండా ఇదే
ఆందోళనలో భాగంగా ముందుగా ఈ నెల 17న ‘చలో ఎన్‌డీఎస్‌ఎల్’కు వామపక్ష నేతలు పిలుపునిచ్చారు.ఎన్‌డీఎస్‌ఎల్, ఎన్‌సీఎస్‌ఎల్‌ను ప్రభుత్వమే నడిపించే వర కు పోరాటాలు చేయాలని నిర్ణయించాయి. ‘మిషన్ కాకతీయ’లో అవినీతి అరికట్టి, ప్రజల భాగస్వామ్యంతో మరమ్మత్తులు జరిపించాలని , సింగూరు ప్రాజెక్టును ఇందూ రు హక్కుగా ప్రకటించాలని, మెడికల్ కళాశాలకు తగిన నిధులు కేటాయించాలని, ఎర్రజొన్న రైతులను ఆదుకొని వ్యాపారుల మోసాలను అరికట్టేంత వరకు పోరాడాల నేది వీరి ఎజెండా. పసుపు, చెరుకు, మొక్కజొన్న రైతాంగం పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, పెద్దపల్లి రైల్వే పనులు వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నది డిమాండ్.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయడం, ఉచిత ఇంటి నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించి గతంలో నిలిచిపోయిన వాటికి బిల్లులు చెల్లించాలి, బీడీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం, వృత్తిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం, గల్ఫ్ బాధితులకు ప్రత్యేక నిధిని కేటాయించి అప్పులు రద్దు చేసి ఉపాధి కల్పించడం, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో అవినీతిని అరికట్టడం, ప్రరుువేటు, విద్యా, వైద్యం లో దోపిడిని అరికట్టడం, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సమస్యలు వామపక్షాల ఉద్యమ ఎజెండా. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడం, డ్వాక్రా రుణాల మంజూరు లక్ష్యంగా ముందుకు సాగుతారు. పలు రూపాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు చేపడతారు.
ఇక ఐక్యంగా పోరుబాట
Published Sun, Mar 15 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement