tngo bhavan
-
ఇక ఐక్యంగా పోరుబాట
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలు చేయాలని వామపక్షాలు నిర్ణయించాయి. జిల్లా సమగ్ర అభివృద్ధి, పేద బడుగు బలహీనవర్గాలకు సామాజిక న్యాయం కోసం ఉద్యమించేందుకు ఎర్రజెండాలు ఏకమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలవారీగా, మొక్కుబడిగా ఆందోళనలు చేసినా, జిల్లా స్థాయిలో ఎనిమిది వామపక్షాలు, వాటి అనుబంధ సంఘాలు ఏకం కావడం అరుదు.ఇందూరు జిల్లా నుంచి ఐక్య ఉద్యమాలకు సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ... సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు, సీపీఐ(ఎంఎల్)లిబరేషన్‌తో పాటు ఫార్వర్డ్‌బ్లాక్, వాటి అనుబంధ సంఘాలు సిద్ధమవుతున్నారుు. ⇒ సమస్యల పరిష్కారానికి ఏకమైన వామపక్షాలు ⇒ జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఆందోళనలు ⇒ 17 ముఖ్య అంశాలతో సిద్ధమైన కార్యాచరణ ⇒ రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతల నిర్ణయం ⇒ 17న ‘చలో ఎన్డీఎస్ఎల్’తో ఉద్యమాలకు శ్రీకారం ⇒ సర్కారుపై తీవ్రంగా ఒత్తిడి పడే అవకాశం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పోరాటాలు చేసేందుకు వామపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రజా సమస్యలపై ఎర్ర జెండా పార్టీలు సంయుక్త కార్యాచరణను రూపొందించడం దా దాపుఇదే మొదటిసారి. శనివారం నిజామాబాద్ టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వామపక్షాలు ఈ తీర్మానం చేశాయి. సమష్టిగా పోరాడేందుకు సిద్ధపడినట్లు పేర్కొన్నాయి. సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు భూమయ్య, ప్రభాకర్, భాస్కర్, మల్లికార్జున్ పాల్గొన్న ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్ అధ్యక్షత వహించారు. సర్కారు వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. నిరసనకు సిద్ధం కావా లని ప్రజలకు పిలుపునిచ్చారు. బడ్జెట్ కేటాయింపులపై ఆగ్రహం రౌండ్‌టేబుల్ సమావేశంలో వామపక్షాల నేత లు ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. బడ్జెట్లో జి ల్లా అభివృద్ధికి తగిన నిధులు కేటాయించకుం డా, విద్యా, వైద్యరంగాలకు మొండిచేయి చూప డంపై ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు కోసం నిధులివ్వకపోవడం, జిల్లా, డివిజన్ కేంద్రాలలో ప్రభుత్వాస్పత్రులకు నిధులు కేటాయించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తానన్న సర్కార్ వాగ్దానాలు అమలు కాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, బడ్జెట్ కేటాయింపులో నిర్లక్ష్యం, పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన 17 ముఖ్య సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలని తీర్మానించారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ఒక ప్ర త్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భరోసాగా ఉండాలని నిర్ణయించాయి, పేద, బడుగు, బలహీనవర్గాల సమస్యల పరిష్కారం కోసం తరచూ రోడ్లెక్కి నిరసన తెలిపే కమ్యూనిస్టులు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయూలని భావిస్తున్నారుు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా నిరసన కార్యక్రమాలు ఇబ్బందికరంగా మారవచ్చు. వామపక్షాల ఎజెండా ఇదే ఆందోళనలో భాగంగా ముందుగా ఈ నెల 17న ‘చలో ఎన్డీఎస్ఎల్’కు వామపక్ష నేతలు పిలుపునిచ్చారు.ఎన్డీఎస్ఎల్, ఎన్సీఎస్ఎల్ను ప్రభుత్వమే నడిపించే వర కు పోరాటాలు చేయాలని నిర్ణయించాయి. ‘మిషన్ కాకతీయ’లో అవినీతి అరికట్టి, ప్రజల భాగస్వామ్యంతో మరమ్మత్తులు జరిపించాలని , సింగూరు ప్రాజెక్టును ఇందూ రు హక్కుగా ప్రకటించాలని, మెడికల్ కళాశాలకు తగిన నిధులు కేటాయించాలని, ఎర్రజొన్న రైతులను ఆదుకొని వ్యాపారుల మోసాలను అరికట్టేంత వరకు పోరాడాల నేది వీరి ఎజెండా. పసుపు, చెరుకు, మొక్కజొన్న రైతాంగం పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, పెద్దపల్లి రైల్వే పనులు వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నది డిమాండ్. అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయడం, ఉచిత ఇంటి నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించి గతంలో నిలిచిపోయిన వాటికి బిల్లులు చెల్లించాలి, బీడీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం, వృత్తిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం, గల్ఫ్ బాధితులకు ప్రత్యేక నిధిని కేటాయించి అప్పులు రద్దు చేసి ఉపాధి కల్పించడం, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో అవినీతిని అరికట్టడం, ప్రరుువేటు, విద్యా, వైద్యం లో దోపిడిని అరికట్టడం, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సమస్యలు వామపక్షాల ఉద్యమ ఎజెండా. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడం, డ్వాక్రా రుణాల మంజూరు లక్ష్యంగా ముందుకు సాగుతారు. పలు రూపాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు చేపడతారు. -
పీఆర్సీ పీటముడి వీడేనా..?
* ఉద్యోగ సంఘాల నేతల్లో ఆందోళన * హైపవర్ కమిటీ ఏర్పాటుతో హైటెన్షన్ * ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల భేటీలో కమిటీపైనే ప్రధాన చర్చ సాక్షి, హైదరాబాద్: ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పదో పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పీఆర్సీ సిఫారసులను పరిశీలించి, ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఇటీవలే హైపవర్ కమిటీని ఏర్పాటు చేయడంతో.. ఇప్పట్లో తేల్చరేమోనన్న టెన్షన్ ఉద్యోగులు, పెన్షనర్లలో నెలకొంది. మంగళవారం టీఎన్జీవో భవన్లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఉద్యోగ సంఘాల నేతలు హైపవర్ కమిటీ ఏర్పాటును పైకి స్వాగతించినా.. ఈ కమిటీ వల్ల పీఆర్సీ అమలు ఆలస్యమవుతుందా అని లోలోన ఆలోచనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన గడువు (మూడోవారం) మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. కానీ, హైపవర్ క మిటీ నుంచి కనీసం పిలుపు కూడా రాకపోయేసరికి ఉద్యోగ సంఘాలకు దిక్కుతోచడం లేదు. టీఎన్జీవో కార్యాలయంలో చైర్మన్ దేవీప్రసాద్ అధ్యక్షతన జరిగిన జేఏసీ సమావేశంలో 84 ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రధాన అంశాలపై సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించింది. సమావేశంలో వివిధ సంఘాల నేతలు మమత, పి.మధుసూదన్‌రెడ్డి, పి.వెంకట్‌రెడ్డి, రేచల్, భుజంగరావు, శివశంకర్, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు ఇవీ... - కనీస వేతనం రూ. 15 వేలు చేయాలి. - 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి. - 2013 జూలై 1 నుంచే పీఆర్సీని నగదు రూపంలో వర్తింపజేయాలి. - గ్రాట్యుటీ రూ. 15 లక్షలకు పెంచాలి. - ఈ ప్రధాన అంశాలపై సీఎం నిర్ణయం తీసుకోవాలి. - సీఎం హామీకి అనుగుణంగా వెంటనే హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వాలి - గెజిటెడ్ హెచ్ఎం, జూనియర్ అసిస్టెంట్లు, వెటర్నరీ వైద్యుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకోసం అనామలీస్ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. - సీఎంను, ప్రదీప్‌చంద్రను కలసి ఈ తీర్మానాలను తెలియజేయాలని నిర్ణయించారు. వచ్చేవారం సంఘాలతో హైపవర్ కమిటీ భేటీ పీఆర్సీపై ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ మంగళవారం తొలిసారిగా సమావేశమైంది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర సారథ్యంలో ఆర్థిక ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, సర్వీసెస్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిట్‌మెంట్‌పై వివిధ ఉద్యోగ సంఘాల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి చర్చించారు. 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పట్టుబడుతున్నాయి. పదో పీఆర్సీ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసింది. ఒక్కోశాతం ఫిట్‌మెంట్‌కు దాదాపు రూ.180 కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది. ఈ వారంలో చర్చలకు వీలుగా మార్గదర్శకాలు రూపొందించి వచ్చేవారంలో ఉద్యోగ సంఘాలతో చర్చించనున్నారు. ఉద్యోగ సంఘాలను జేఏసీగా చర్చలకు ఆహ్వానించనున్నట్లు తెలిసింది. పీఆర్సీని ప్రకటించాలి పీఆర్సీలో కనీస వేతనం రూ. 15 వేలు ఉండాలని, ఫిట్మెంట్ 60 శాతం ఇవ్వాలని, 2013 జూలై 1 నుంచి ఆర్థిక ప్రయోజనం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరుతూ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంగళవారం కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రను కలసి మెమొరాండం అందజేసింది. కమిటీకి విజ్ఞప్తుల వెల్లువ పీఆర్సీ కనీస మూల వేతనాన్ని రూ.13 వేల నుంచి రూ. 15 వేలకు పెంచాలని పీఆర్సీ హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రకు ఉపాధ్యాయ సంఘాల జేఏసీ, ఇతర ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశా యి. జేఏసీ చైర్మన్ పి.వెంకట్‌రెడ్డి నేతృత్వంలో టీటీజేఏసీ, పలు సంఘాల నేతలు వెంకట్‌రెడ్డి, భుజంగరావు, హర్షవర్దన్‌రెడ్డి, మల్లయ్య, అబ్దుల్లా, మణిపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, స్వామిరెడ్డి, రఘునందన్ మంగళవారం సచివాలయంలో ప్రదీప్‌చంద్రను కలసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. -
సమాజ హితం కోసమే ‘రాజ్యాధికారం’
మెదక్‌టౌన్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో దళిత, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదని ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్ వచ్చిన సందర్భంగా స్థానిక టీఎన్జీఓ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 19న విడుదల కానున్న రాజ్యాధికారం సినిమా ప్రజాస్వామ్యవాదులను, దళిత, బడుగు, బలహీన వర్గాల వారి మనస్సులను హత్తుకునేలా ఉంటుందన్నారు. సమాజ హితం కోసమే రాజ్యాధికారం సినిమా తీసినట్లు తెలిపారు. సామాజిక ఇతివృత్తాలతో తీస్తున్న సినిమాలకు ఆదరణ కరువవుతుందన్నారు. ప్రేమ, యాక్షన్ సినిమాలు కాకుండా సమాజాన్ని చైతన్యం చేసే సినిమాలు రావాలని అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు ఓటుహక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అప్పుడే ఆట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందినట్లని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి పాటు పడాలన్నారు. రెండు తెలుగు ప్రభుత్వాలు ఒకరినొకరు సహకరించుకొని సినిమా రంగాభివృద్ధికి తోడ్పాటు నందించాలన్నారు. సినిమా రంగంలో వ్యాపార దృక్పథం పెరిగిపోయిందన్నారు. తన సినిమాల పట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
త్వరలోనే మెరుగైన పీఆర్సీ
సంగారెడ్డి క్రైం: బడ్జెట్ సమావేశాల అనంతరం ఉద్యోగులు ఆశించిన రీతిలోనే మెరుగైన పీఆర్ సీ రానుందని టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. సంగారెడ్డిలోని టీఎన్జీఓ భవన్లో బుధవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మెరుగైన పీఆర్సీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఏ రాష్ర్ట్రంలో లేని విధంగా పరిమితి లేని చెల్లింపులతో కూడిన హెల్త్ కార్డులు ఇవ్వడం హర్షణీయమన్నారు. కానీ కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం రేట్లు పెంచాలని హెల్త్ కార్డులు తీసుకోవడం లేదన్నారు. వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసరంగా శస్త్ర చికిత్సలు జరిగినట్లయితే రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల విభజన వెంటనే పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ర్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 65 సంవత్సరాలు దాటిన రిటైర్డ్ ఉద్యోగులకు 65 శాతం పెన్షన్ ఇవ్వాలని కోరారు. అనంతరం టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్యామ్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు ఎం.రాజేందర్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌రావు, విజయలక్ష్మి, మనోహర, జయరామ్ నాయక్, సుశీల్‌బాబు, జావెద్ అలీ, సుధాకర్, మంజులత, రవి, సిద్ధి రాములు తదితరులు పాల్గొన్నారు. -
72 గంటల పాటు హైదరాబాద్ బంద్!
-
72 గంటల పాటు హైదరాబాద్ బంద్!
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ కీలక సమావేశం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు టీఎన్జీవో భవన్లో జరగనుంది. ఈ నెల 7న తలపెట్టిన శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం, అదే సమయంలో ఏపీఎన్జీవోల సభను అనుమతి ఇవ్వడంపై జేఏసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. టీఆర్ఎస్తో పాటు బీజేపీ నేతలు కూడా ఈ జేఏసీ భేటికి హాజరు కానున్నారు. ఇందులో 72 గంటల పాటు హైదరాబాద్ బంద్ నిర్వహించే అంశంపై జేఏసీ నేతలు చర్చించనున్నారు. భేటీ అనంతరం జేఏసీ నేతలు కీలక ప్రకటన చేయనున్నారు. మరోవైపు శాంతిర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ న్యాయవాది శ్రీరంగారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.