అఖిలపక్ష కమిటీతో వైఎస్సార్‌సీపీ రౌండ్‌టేబుల్ సమావేశం
కడప కార్పొరేషన్: ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కొప్పర్తిలో కొనసాగించకపోతే ఉద్యమం తప్పదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో అఖిలపక్ష పార్టీ నేతలు, ప్రజా సంఘాలతో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళిత ఫోరం జిల్లా చైర్మన్ కిశోర్ బూసిపాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గాలిచంద్ర, జి.చంద్రశేఖర్, ఏఐసీసీ కో–ఆర్డినేటర్ ఎస్‌ఏ సత్తార్, బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి ఎస్.గుర్రప్ప, వైస్సార్‌ఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, డీవైఎఫ్‌ఐ, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.250కోట్లతో కొప్పర్తిలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి తరలించడం దారుణమన్నారు.
దీనివల్ల ఈ ప్రాంత యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పెద్ద దెబ్బ పడుతుందని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కూడా నష్టం జరుగుతుందన్నారు. వైఎస్సార్ జిల్లాపై కక్షసా«ధించడానికే సీఎం చంద్రబాబు ఇలా చేశారని మండిపడ్డారు. కలెక్టర్ లోతేటి శివశంకర్‌కు వినతిపత్రం సమరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment