మోడి రిజర్వేషన్ వ్యతిరేకి
Published Thu, Aug 8 2013 12:41 AM | Last Updated on Wed, Aug 15 2018 6:22 PM
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాలకు, భారత ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేకమని సామాజికవేత్త, ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. బుధవారం ఓయూ క్యాం పస్ గ్రంథాయలంలోని ఐసీఎస్‌ఎస్‌ఆర్ హాలు లో టీవీఎస్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, అంసా, బీఎస్‌ఎఫ్, టీవీవీ, ఎంఎస్ ఓ, డీఎస్‌యూ, టీఆర్‌వీడీ, టీఎస్‌ఏ ఆధ్వర్యంలో ‘గుజరాత్ అభివృద్ధి-ఒక అందమైన అబద్ధం’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
‘అంసా’ అధ్యక్షుడు మాందాల భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కంచ ఐలయ్య, సామాజిక కార్యకర్త షబానా హష్మి (ఢిల్లీ), ప్రొఫెసర్ హేమంత్‌షా (అహ్మదాబాద్) ప్రసంగించారు. ఐలయ్య మాట్లాడుతూ మోడి బీసీ వర్గానికి చెందిన వారైనా బీసీలు, దళితులకు ప్రతినిధి కాదని, బ్రాహ్మణులకు మాత్రమే ప్రతినిధి అని అన్నారు. మోడికి దమ్ముంటే ఈ నెల 11న హైదరాబాద్‌లో జరిగే సభలో రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంకా పరిశోధన విద్యార్థులు కోట శ్రీనివాస్‌గౌడ్, సత్య, సుదర్శన్, బండారు వీరబాబు, డేవిడ్ తదితరులు పలు విషయాలపై చర్చించారు.
Advertisement
Advertisement