
కుటుంబం కోసం జిల్లాను విభజిస్తారా?
► తీరుమార్చుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదు
► జిల్లాను రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలి
► రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
కరీంనగర్ : కుటుంబ సభ్యుల కోసమే జిల్లాల విభజనకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జిల్లాలను విభజిస్తే సహించేది లేదని బీజేపీ, టీడీపీ, సీపీఐ, విద్యార్థి యువజన ప్రజా సంఘాల నేతలు ముక్తకంఠంతో హెచ్చరించారు. శనివారం ఫిలింభవన్‌లో కరీం నగర్ జిల్లా పరిరక్షణ సమితి కన్వీనర్ కొరివి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ము ఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి రాచరిక పాలన సాగిస్తు న్నారన్నారు. సీఎం తనయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లను జిల్లాగా చేయాలనుకోవడం అనాలోచితమైన చ ర్యగా అభివర్ణించారు. జగిత్యాలను జిల్లా చేయడంతోపాటు కరీంనగర్ మిగతా ప్రాంతాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు.
మంథని ప్రాంతాన్ని భూపాలపల్లి జిల్లాలోకి కలపడం, హుజూరాబాద్ ప్రాంతాన్ని వరంగల్‌లోకి, హుస్నాబాద్ ప్రాంతాన్ని సిద్దిపేటలోకి కలపాలనే నిర్ణయూలపై మండిపడ్డారు. అనాలోచితంగా కాకుం డా జిల్లాల విభజన శాస్త్రీయంగా చేపట్టాలని కోరారు. కరీంనగర్ జిల్లా పరిరక్షణ సమితి కన్వీనర్ కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రతి ఉద్యమానికి కరీంనగర్ జిల్లా గుండెకాయ వంటిదన్నారు. పుణ్యక్షేత్రాలు, నదులు అన్ని రకాల సహజ వనరులున్న జిల్లాను రాష్ట్రానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో మినీ అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, ఐటీ హబ్ ఏర్పాటు చేసి పరిశ్రమలను నెలకొల్పాలని కోరారు.
మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై పరిరక్షణ సమితి తీసుకున్న నిర్ణయాలకు మద్దతునిస్తామన్నారు. సమావేశంలో సీపీ ఐ, బీజేపీ నా యకులు న్యాల కొండ నారాయణరావు, కోమల ఆంజనేయులు, నవనీతరావు, బోయిని అశో క్, పైడిపల్లి రాజు, సిగిరి శ్రీధర్, గాజుల స్వప్న, గంట సుశీల, గజ్జెల రవీం దర్, మేడి అంజయ్య, కమలాకర్, శ్యాంకుమార్, సోమిడి వేణుగోపాల్, నరేశ్, కె. వెంకట య్య, దుర్గం మారుతి, మాదరి శ్రీనివాస్, యా దగిరి, మేకల కరుణాకర్, మల్లేశ్‌యాదవ్, గణేష్, రాములు, రాంచంద్రం, అజయ్ తదితరులు పాల్గొన్నారు.