లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావులరాంనాథ్ పేర్కొన్నారు.గురువారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పథకాలపై ప్రజలకు తెలియచేసే కార్యక్రమంలో భాగంగా పల్లె పల్లెకు బీజేపీ ఇంటింటికి మోదీ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లను ఇంటి డోర్లపై అంటించి వాటి గూర్చి ప్రజలకు వివరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల సమయంలో దళితులకు మూడెకరాల భూమిని పంపిణి చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటి వరకు ఎక్కడ ఇవ్వలేదని,ధళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన కేసీఆర్ మాటతప్పారని ఆయన అన్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడి ఆద్వర్యంలో మంచి పథకాలను ప్రవేశపెడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులు,సామాన్యుల కోసం ప్రధాన మంత్రి పసల్‌భీమా యోజన పథకం,జనని సురక్షయోజన.సుకన్య సంవృద్ది యోజన.
అటల్ పెన్షన్ యోజన, జన్‌ధన్ యోజన వంటి వినూత్న పథకాలను ప్రవేశపెడుతుందని ఆయన అన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలలోకి తీసుకవెళుతూనే మరొకవైపు తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాతామని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టకుని బీజేపీ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భరత్ నారాయణ, జిల్లా కార్యదర్శి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
‘కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి’
Published Fri, Jun 2 2017 2:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement