పరకాలకు అన్యాయం
♦ జిల్లా కేంద్రం ఏర్పాటుతోనే న్యాయం
♦ రౌండ్‌టేబుల్ సమావేశంలో
♦ అఖిలపక్ష నాయకులు, పట్టణ ప్రముఖుల అభిప్రాయం
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా పరకాలను చేయడం తప్పా మరో మార్గం లేదని అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీ య నాయకులు, ప్రముఖులు, వ్యాపారస్తులు, విద్యార్థి, సంఘాల నాయకులు అభిప్రాయపడ్డాయి. పరకాలతో వ్యాపార వాణిజ్య సంబం ధాలు కలిగిన మండలాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలపడం వల్ల ఇప్పటికే వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడిందని ఆందో ళన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు జిల్లా కేంద్రం కోసం అఖిలపక్షం పిలుపునిచ్చే ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుండి పోరాడుతామని స్ప ష్టం చేశారు. పరకాల పట్టణంలోని స్వర్ణగార్డెన్‌లో మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
సమావేశానికి రాజకీయ పార్టీలు నాయకులు, వ్యాపారస్తులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రముఖులు హాజరై జిల్లాల పునర్విభజన తర్వాత పరకాల స్థితిగతులపై చర్చించారు. పరకాల పాత తాలూకాలతో కలిపి రెవెన్యూ డివిజన్ చేయాలని కోరగా పాలకులు ఏకపక్షంగా రూపురేఖలు లేని వరంగల్ రూరల్ జిల్లాలో కలిపి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. జిల్లాల పునర్విభజనలో పరకాల అత్యధికంగా నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేం ద్రం చేయడం తప్పా మరో మార్గం లేదని, పరకాల ఉనికి కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.
సమావేశంలో బీజేపీ, టీడీ పీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, వైఎస్సార్ సీపీ, లోక్‌జనశక్తి పార్టీల నాయకులతోపాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగబండి విద్యాసాగర్, డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ ఏరుకొండ సాంబమూర్తి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండి ఆగయ్య, లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీణవంక రాజు, కిరాణ వర్తక సంఘం నాయకులు చంద్రశేఖర్, శివకృష్ణ, బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు పిట్ట వీరస్వామి, వీరేశం, ఫర్టిలైజర్స్ సంఘం నాయకులు సూర్యదేవర సదానందం, ఎమ్మార్పీఎస్ నాయకులు దుప్పటి మొగిళి, వ్యాపారస్తులు ఎర్రం రామన్న, మినుపాల బాపురావు, పల్నాటి సతీష్, శంకరాచారి, దంచనాల ఈశ్వర్, విద్యార్థి సంఘాల నాయకులు కట్టగాని శ్రీకాంత్, ఇంగిళి వీరేష్‌రావు, కుసుమ అఖిల్, యూత్ నాయకులు కొయ్యడ శ్రీనివాస్, యాట నరేష్, నాగెల్లి రంజిత్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రం కోసం మానవహారం
పరకాల: పరకాలను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం మానవహారం నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్‌లో అరగంట సేపు చేపట్టిన మానవహారంలో కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రం ఏర్పాటు చేయని పక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని నాయకులు, వ్యాపారస్తులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, విద్యార్థిసంఘాల నాయకులు పాల్గొన్నారు.