సెబీ డీలిస్టింగ్ నిబంధనల సవరణ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా స్వచ్చంద డీలిస్టింగ్ నిబంధనలను సవరించింది. దీనిలో భాగంగా నిర్ధారిత(ఫిక్స్‌డ్) ధర విధానం ద్వారా షేర్ల డీలిస్టింగ్‌కు వీలు కలి్పంచనుంది. వెరసి రివర్స్ బుక్‌బిల్డింగ్(ఆర్‌బీబీ) పద్ధతిలో ప్రత్యామ్నాయానికి తెరతీసింది. దీంతో లిస్టెడ్ కంపెనీలకు సులభతర బిజినెస్ నిర్వహణలో మరింత తోడ్పాటు లభించనుంది. ఆర్‌బీబీ విధానంలో ఏదైనా సంస్థ షేర్లను డీలిస్ట్ చేయదలచుకుంటే తలుత పబ్లిక్ అనౌన్స్‌మెంట్ చేయవలసి ఉంటుంది. ఇందుకు తప్పనిసరిగా కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించవలసి ఉంటుంది. తదుపరి వాటాదారులు షేర్లను ఆఫర్ చేసేందుకు వీలుంటుంది.
తాజా నోటిఫికేషన్‌లో సెబీ ఫిక్స్‌డ్ ధర విధానం ద్వారా ఆర్‌బీబీ విధానంలో ప్రత్యామ్నాయానికి వీలు కలి్పంచింది. తరచుగా ట్రేడయ్యే షేర్లను స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి డీలిస్టింగ్ చేసేందుకు కంపెనీలు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంను ఆఫర్ చేయవలసి ఉంటుంది. మరోపక్క ఆర్‌బీబీ పద్ధతిలో చేపట్టే డీలిస్టింగ్‌కు సంబంధించి కౌంటర్ ఆఫర్ విధానంలోనూ సెబీ సవరణలు చేసింది. పబ్లిక్ వాటాలో కనీసం 50 శాతం టెండర్ అయితే ప్రస్తుత 90 శాతానికికాకుండా 75 శాతానికి కౌంటర్ ఆఫర్ ప్రకటించవచ్చు. అయితే కౌంటర్ ఆఫర్ ధర టెండర్ అయిన షేర్ల సగటు పరిమాణ అధిక ధర కంటే తక్కువగా ఉండటాన్ని అంగీకరించరు. వెరసి కొనుగోలుదారుడు ఆఫర్ చేసిన సంకేత ధరను మించి ప్రకటించవలసి ఉంటుంది. ఆఫర్ తదుపరి కొనుగోలుదారుడి వాటా 90 శాతానికి చేరుకుంటేనే డీలిస్టింగ్‌కు అనుమతిస్తారు.
ఎక్సే్చంజీల్లో 1 నుంచి లావాదేవీ చార్జీల్లో మార్పులు
మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థల సభ్యులందరికీ ఒకే రకమైన రుసుముల విధానాన్ని అమలు చేయాలంటూ సెబీ ఆదేశించిన నేపథ్యంలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తాజాగా క్యాష్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ల ట్రేడింగ్‌పై లావాదేవీ ఫీజులను సవరించాయి. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో సెన్సెక్స్, బ్యాంకెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌లపై ట్రాన్సాక్షన్ ఫీజును రూ. 1 కోటి ప్రీమియం టర్నోవరుపై రూ. 3,250గా బీఎస్‌ఈ నిర్ణయించింది. అయితే, ఈక్విటీ డెరివేటివ్స్‌లోని మిగతా కాంట్రాక్టులకు చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవు. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో క్యాష్ మార్కెట్‌కి సంబంధించి రూ. 1 లక్ష విలువ చేసే ట్రేడ్‌కి చార్జీలు రూ. 2.97గా ఉంటాయి. ఈక్విటీ ఫ్యూచర్స్‌కి ఈ రుసుము రూ. 1 లక్షకి రూ. 1.73గాను, ఈక్విటీ ఆప్షన్ల విషయంలో రూ. 1 లక్ష ప్రీమియం విలువపై రూ. 35.03గాను ఉంటుంది. కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో ఫ్యూచర్స్‌కి సంబంధించి లక్ష ట్రేడ్ వేల్యూకి రూ. 0.35 ఫీజు ఉంటుంది.
రంగు చూసి ఫండ్స్‌లో రిస్క్ తెలుసుకోవచ్చు
ఈ దిశగా కొత్త ప్రతిపాదనలు తెచి్చన సెబీ
వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక ముందు ఇన్వెస్టర్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా సెబీ కొన్ని కీలక ప్రతిపాదనలు రూపొందించింది. ఒక మ్యూచువల్ ఫండ్ పథకానికి సంబంధించి రిస్‌్కను సూచించే ‘రిస్‌్క–ఓ–మీటర్’ రంగుల థీమ్‌తోనూ ఉండాలన్నది సెబీ ప్రతిపాదన. మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించి రిస్‌్క–ఓ–మీటర్‌ను ఆరు స్థాయిల్లో తెలియజేయడం తప్పనిసరి. ప్రస్తుతం లో(తక్కువ), లో టు మోడరేట్ (తక్కువ నుంచి మోస్తరు), మోడరేట్ (మోస్తరు), మోడరేట్‌లీ హై (కొంచెం ఎక్కువ), హై (ఎక్కువ), వెరీ హై (మరీ ఎక్కువ)గా అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీలు/ఫండ్స్ నిర్వహణ సంస్థలు) తెలియజేస్తున్నాయి. ఇప్పుడు తక్కువ రిస్క్‌కు ఆకుపచ్చ, తక్కువ నుంచి మోస్తరు రిస్‌్కకు ముదురు చిలకపచ్చ, మోస్తరు రిస్‌్కకు లేత చిలకపచ్చ (నియాన్ ఎల్లో), కొంచెం ఎక్కువ రిస్‌్కకు కాఫీ రంగు (క్యారామెల్), అధిక రిస్క్‌కు చిక్కటి నారింజ రంగు, అధిక రిస్‌్కకు ఎర్రటి రంగును సూచించాలన్నది సెబీ ప్రతిపాదన. ఎక్స్‌పెన్స్ రేషియో, రాబడులు అన్నవి ఒకే పథకానికి సంబంధించి డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో వేర్వేరుగా ఉండడంతో.. ఈ రెండు రకాల ప్లాన్లకు సంబంధించి అన్ని వివరాలు ప్రదర్శించాలంటూ సెబీ మరో ప్రతిపాదన చేసింది. వీటిపై అక్టోబర్ 18 వరకు ప్రజల నుంచి సలహా, సూచనలను సెబీ ఆహా్వనించింది.
Comments
Please login to add a commentAdd a comment