Fixed price
-
Andhra Pradesh: అభివృద్ధిపైనా అబద్ధాలే
సాక్షి, అమరావతి: వరుసగా ఏటా సొంత ఆదాయాల్లో పెరుగుదల.. జాతీయ స్థాయికి మించి పెరిగిన తలసరి ఆదాయం.. చిన్న, సూక్ష్మ పరిశ్రమలతో 32.79 లక్షల ఉద్యోగాలు.. కోవిడ్‌లోనూ ఉపాధికి ఢోకా లేకుండా భరోసా.. గాడిన పడ్డ పొదుపు సంఘాలు.. బాగుపడ్డ ప్రభుత్వ పాఠశాలలు.. పేదవాడికి ఆరోగ్య భరోసా.. రైతుల్లో నిశ్చింత.... ఇవన్నీ ఒక రాష్ట్రం అభివృద్ధి ప్రయాణానికి తిరుగులేని నిదర్శనాలు! స్ధిర ధరల ఆధారంగా వృద్ధి రేటు వైఎస్సార్ సీపీ హయాంలో ఏటా పెరిగినట్లు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేనే స్పష్టంగా చెబుతోంది. అయినా సరే.. గత సర్కారు పాలనలో అభివృద్ధి జరగలేదని.. ఆదాయం పెరగలేదని.. తలసరి ఆదాయం తగ్గిపోయిందని.. పెట్టుబడులు రాలేదని.. స్కీములన్నీ స్కామ్‌లేనంటూ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు కట్టుకథలు చెప్పారు!! కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించిన 2023–24 సామాజిక ఆర్ధిక సర్వే సాక్షిగా ఈ అబద్ధాలు బట్టబయలయ్యాయి. స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని గణించడం వాస్తవ అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతారు. వైఎస్సార్ సీపీ హయాంలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం వెంటాడినప్పటికీ ప్రతి ఏడాది వృద్ధి సాధించినట్లు సర్వే స్పష్టం చేసింది. 2022–23తో పోల్చితే 2023–24లో స్థిర ధరల ఆధారంగా వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని సర్వే తెలిపింది.వృద్ధికి ఊతం..⇒ 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం కూడా జాతీయ స్థాయిని మించి పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,84,205 కాగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,42,479గా ఉంది. ⇒ 2021–22 నుంచి 2023–24 వరకు రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరులు వరుసగా పెరిగాయి. పొదుపు మహిళకు ‘‘ఆసరా’’రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 99 శాతం రికవరీతో పాటు 30 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే వెల్లడించింది. స్వయం సహాయక సంఘాలకు 2019 ఏప్రిల్ 11వతేదీ వరకు ఉన్న రుణాల భారాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా చెల్లించి గత ప్రభుత్వం ఆదుకుంది. 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు రూ.25,557.54 కోట్లు చెల్లించింది.పారిశ్రామిక విప్లవం.. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.11,688.11 కోట్ల పెట్టుబడితో 20 భారీ పరిశ్రమలు ఏర్పాటు కావడమే కాకుండా ఉత్పత్తిని సైతం ప్రారంభించి 14,596 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ⇒ రూ.6.07 లక్షల కోట్ల పెట్టుబడితో తలపెట్టిన మరో 156 భారీ మెగా ప్రాజెక్టులు నిర్మాణ, ప్రారంభ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా 4.86 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,286.48 కోట్ల పెట్టుబడితో 2,71,341 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కావడమే కాకుండా వాటి ద్వారా ఏకంగా 19,86,658 మందికి ఉపాధి కల్పించాయి. ⇒ గతంలో ఐదేళ్ల టీడీపీ పాలనలో ఎంఎస్ఎంఈల ద్వారా రూ.26,000 కోట్ల పెట్టుబడులు, 8.67 లక్షల మందికి ఉపాధి కల్పించగా వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఎంఎస్ఎంఈలతో రూ.33,177 కోట్లు పెట్టుబడులు, 32.79 లక్షల మందికి ఉపాధి చూపినట్లు సర్వే వెల్లడించింది. 2023–24లో 2.24 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా 64,307 మంది ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. విద్యా సంస్కరణలు.. చదువులకు సాయం⇒ మన బడి నాడు – నేడు కింద తొలి దశలో రూ.3859.12 కోట్ల వ్యయంతో 15,715 స్కూళ్లలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలను కల్పించగా రెండో దశలో రూ.8,000 కోట్లతో అదనపు తరగతి గదులతోపాటు 11 రకాల సదుపాయాలను 22,344 స్కూళ్లలో కల్పించారు. రూ.372.77 కోట్లతో 883 స్కూళ్లలో వసతులు కల్పించారు. ⇒ పిల్లల చదువులకు పేదరికం అడ్డురాకూడదనే సంకల్పంతో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు చొప్పున 2022–23లో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.94 కోట్లు అందచేశారు. ⇒ 2023–24 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డ్రాప్ అవుట్స్ లేవు. 6 నుంచి 8వ తరగతి వరకు 0.01 శాతం మాత్రమే డ్రాప్ అవుట్స్ ఉండగా తొమ్మిది, పదో తరగతిలో 2.39 శాతం డ్రాప్ అవుట్స్ నమోదయ్యాయి.ఆర్బీకేలు.. పెట్టుబడి సాయందేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు సేవలందించాయని సర్వే తెలిపింది. రైతు భరోసా – పీఎం కిసాన్ కింద 2023–24లో 2.58 లక్షల మంది ఆర్వోఎఫ్ఆర్, కౌలు రైతులతో సహా 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,226.08 కోట్లు పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం అందచేసింది. రాష్ట్ర పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరుల గురించి సామాజిక, ఆర్థిక సర్వేలో పేర్కొన్న భాగం -
నిర్ధారిత ధరతో ఇక డీలిస్టింగ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా స్వచ్చంద డీలిస్టింగ్ నిబంధనలను సవరించింది. దీనిలో భాగంగా నిర్ధారిత(ఫిక్స్డ్) ధర విధానం ద్వారా షేర్ల డీలిస్టింగ్‌కు వీలు కలి్పంచనుంది. వెరసి రివర్స్ బుక్బిల్డింగ్(ఆర్బీబీ) పద్ధతిలో ప్రత్యామ్నాయానికి తెరతీసింది. దీంతో లిస్టెడ్ కంపెనీలకు సులభతర బిజినెస్ నిర్వహణలో మరింత తోడ్పాటు లభించనుంది. ఆర్బీబీ విధానంలో ఏదైనా సంస్థ షేర్లను డీలిస్ట్ చేయదలచుకుంటే తలుత పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇందుకు తప్పనిసరిగా కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించవలసి ఉంటుంది. తదుపరి వాటాదారులు షేర్లను ఆఫర్ చేసేందుకు వీలుంటుంది. తాజా నోటిఫికేషన్లో సెబీ ఫిక్స్డ్ ధర విధానం ద్వారా ఆర్బీబీ విధానంలో ప్రత్యామ్నాయానికి వీలు కలి్పంచింది. తరచుగా ట్రేడయ్యే షేర్లను స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి డీలిస్టింగ్ చేసేందుకు కంపెనీలు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంను ఆఫర్ చేయవలసి ఉంటుంది. మరోపక్క ఆర్బీబీ పద్ధతిలో చేపట్టే డీలిస్టింగ్‌కు సంబంధించి కౌంటర్ ఆఫర్ విధానంలోనూ సెబీ సవరణలు చేసింది. పబ్లిక్ వాటాలో కనీసం 50 శాతం టెండర్ అయితే ప్రస్తుత 90 శాతానికికాకుండా 75 శాతానికి కౌంటర్ ఆఫర్ ప్రకటించవచ్చు. అయితే కౌంటర్ ఆఫర్ ధర టెండర్ అయిన షేర్ల సగటు పరిమాణ అధిక ధర కంటే తక్కువగా ఉండటాన్ని అంగీకరించరు. వెరసి కొనుగోలుదారుడు ఆఫర్ చేసిన సంకేత ధరను మించి ప్రకటించవలసి ఉంటుంది. ఆఫర్ తదుపరి కొనుగోలుదారుడి వాటా 90 శాతానికి చేరుకుంటేనే డీలిస్టింగ్‌కు అనుమతిస్తారు. ఎక్సే్చంజీల్లో 1 నుంచి లావాదేవీ చార్జీల్లో మార్పులు మార్కెట్ ఇన్ఫ్రా సంస్థల సభ్యులందరికీ ఒకే రకమైన రుసుముల విధానాన్ని అమలు చేయాలంటూ సెబీ ఆదేశించిన నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా క్యాష్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ల ట్రేడింగ్‌పై లావాదేవీ ఫీజులను సవరించాయి. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో సెన్సెక్స్, బ్యాంకెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌లపై ట్రాన్సాక్షన్ ఫీజును రూ. 1 కోటి ప్రీమియం టర్నోవరుపై రూ. 3,250గా బీఎస్ఈ నిర్ణయించింది. అయితే, ఈక్విటీ డెరివేటివ్స్‌లోని మిగతా కాంట్రాక్టులకు చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవు. మరోవైపు ఎన్ఎస్ఈలో క్యాష్ మార్కెట్‌కి సంబంధించి రూ. 1 లక్ష విలువ చేసే ట్రేడ్‌కి చార్జీలు రూ. 2.97గా ఉంటాయి. ఈక్విటీ ఫ్యూచర్స్కి ఈ రుసుము రూ. 1 లక్షకి రూ. 1.73గాను, ఈక్విటీ ఆప్షన్ల విషయంలో రూ. 1 లక్ష ప్రీమియం విలువపై రూ. 35.03గాను ఉంటుంది. కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో ఫ్యూచర్స్కి సంబంధించి లక్ష ట్రేడ్ వేల్యూకి రూ. 0.35 ఫీజు ఉంటుంది. రంగు చూసి ఫండ్స్‌లో రిస్క్ తెలుసుకోవచ్చుఈ దిశగా కొత్త ప్రతిపాదనలు తెచి్చన సెబీవివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక ముందు ఇన్వెస్టర్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా సెబీ కొన్ని కీలక ప్రతిపాదనలు రూపొందించింది. ఒక మ్యూచువల్ ఫండ్ పథకానికి సంబంధించి రిస్‌్కను సూచించే ‘రిస్్క–ఓ–మీటర్’ రంగుల థీమ్‌తోనూ ఉండాలన్నది సెబీ ప్రతిపాదన. మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించి రిస్్క–ఓ–మీటర్‌ను ఆరు స్థాయిల్లో తెలియజేయడం తప్పనిసరి. ప్రస్తుతం లో(తక్కువ), లో టు మోడరేట్ (తక్కువ నుంచి మోస్తరు), మోడరేట్ (మోస్తరు), మోడరేట్లీ హై (కొంచెం ఎక్కువ), హై (ఎక్కువ), వెరీ హై (మరీ ఎక్కువ)గా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు/ఫండ్స్ నిర్వహణ సంస్థలు) తెలియజేస్తున్నాయి. ఇప్పుడు తక్కువ రిస్క్‌కు ఆకుపచ్చ, తక్కువ నుంచి మోస్తరు రిస్‌్కకు ముదురు చిలకపచ్చ, మోస్తరు రిస్‌్కకు లేత చిలకపచ్చ (నియాన్ ఎల్లో), కొంచెం ఎక్కువ రిస్‌్కకు కాఫీ రంగు (క్యారామెల్), అధిక రిస్క్‌కు చిక్కటి నారింజ రంగు, అధిక రిస్‌్కకు ఎర్రటి రంగును సూచించాలన్నది సెబీ ప్రతిపాదన. ఎక్స్పెన్స్ రేషియో, రాబడులు అన్నవి ఒకే పథకానికి సంబంధించి డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో వేర్వేరుగా ఉండడంతో.. ఈ రెండు రకాల ప్లాన్లకు సంబంధించి అన్ని వివరాలు ప్రదర్శించాలంటూ సెబీ మరో ప్రతిపాదన చేసింది. వీటిపై అక్టోబర్ 18 వరకు ప్రజల నుంచి సలహా, సూచనలను సెబీ ఆహా్వనించింది. -
ఐకానిక్ అశోక్ హోటల్@ రూ.7,409 కోట్లు
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సుప్రసిద్ధ సంస్థ అశోక్ హోటల్ అంచనా విలువను ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఆస్తుల మానిటైజేషన్‌లో భాగంగా ఢిల్లీలోని కీలక ప్రాంతంలోగల అశోక్ హోటల్‌కు రూ. 7,049 కోట్ల సంకేత విలువను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 25 ఎకరాలలో విస్తరించిన ఈ ఆస్తి విక్రయాన్ని పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో చేపట్టనుంది. పెట్టుబడిదారులతో చర్చలు(ఇన్వెస్టర్ కన్సల్టేషన్) ఇప్పటికే ప్రారంభంకాగా.. క్యాబినెట్ నోట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆస్తుల మానిటైజేషన్(ఎన్ఎంపీ) జాబితాలో అశోక్ హోటల్, సమీపాన గల సామ్రాట్సహా టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌కు చెందిన 8 ఆస్తులున్నాయి. 2021 ఆగస్ట్‌లోనే సీతారామన్ నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల విలువైన ఎన్ఎంపీ కార్యాచరణకు తెరతీసిన సంగతి తెలిసిందే. తద్వారా విభిన్న మౌలిక రంగ ఆస్తుల విలువను అన్‌లాక్ చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం రూ. 33,422 కోట్లు మౌలిక సంబంధ శాఖలతో చర్చల ద్వారా నీతి ఆయోగ్ ఎన్ఎంపీ నివేదికను రూపొందించింది. ఈ నెల 14న నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో సమావేశంలో ఆర్థిక మంత్రి ఎన్ఎంపీ పురోగతిపై సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 33,422 కోట్ల విలువైన ఎన్ఎంపీని సాధించింది. 2021-22లో ప్రభుత్వం రూ. లక్ష కోట్ల లావాదేవీలు పూర్తిచేయడం ద్వారా తొలి ఏడాది లక్ష్యం రూ. 88,000 కోట్లను అధిగమించడం గమనార్హం! -
వ్యాక్సిన్ ధరలు కేంద్రం ఖరారు: ఎంతంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సోకకుండా వేసుకునే వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రైవేటులో వేసుకోవాలనుకునే వారు వేసుకోవచ్చని చెప్పారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధర విషయమై కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. నిర్ధిష్ట ధర విధిస్తూ ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు ఇలా.. కోవిషీల్డ్ రూ.780 కోవాగ్జిన్ రూ.1,410 స్పుత్నిక్ రూ.1,145 5 శాతం జీఎస్టీ, రూ.150 సర్వీస్ ఛార్జీ అదనం నిర్దేశించిన ధరల కన్నా అదనంగా డబ్బులు వసూలు చేస్తే ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. అధిక ధరలు వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించింది. వ్యాక్సిన్‌పై పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధానమంత్రి సోమవారం ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియ చర్యలు చేపట్టింది. ఇప్పటికే వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు ఆర్డర్లు కూడా ఇచ్చేసింది. త్వరలోనే ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉచితంగా అందించనుంది. -
కోవిడ్ వైద్యంపై నిపుణుల బృందం
న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షించడానికి నిపుణుల బృందాన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోగులకు అందిస్తున్న చికిత్సను అధికారులు పర్యవేక్షిస్తూ ఉండేందుకు వీలుగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం సూచించింది. వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ధరల విషయంలో వ్యత్యాసాలపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా నిర్ధారణ పరీక్ష రుసుము కొన్ని రాష్ట్రాల్లో రూ.2,200 కాగా, మరికొన్ని రాష్ట్రాల్లో రూ.4,500 ఉందంటూ కోర్టు.. ధరల నిర్ణయ విషయాన్ని కేంద్రానికే వదిలేస్తున్నామని తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు అన్ని చోట్ల ఒకేలా ఉండాలని సూచించింది. ఢిల్లీలోని ఎల్ ఎన్ జేపీ ఆస్పత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సీసీటీవీల ప్రస్తావన తీసుకొచ్చింది. కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్క అంశమూ పర్యవేక్షించేందుకు వీలుంటుందని తెలిపింది. ఆస్పత్రుల్లో కరోనా రోగులను సరైన చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఈ వ్యవహారంపై జూలైలో మరోసారి విచారిస్తామని స్పష్టం చేసింది. -
స్థిర రేటుపై గృహ రుణాలు
లేహ్: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ స్థిర రేటుపై గృహ రుణాలను తీసుకురావాలనుకుంటోంది. ఇవి స్థిర రేటు (ఫిక్స్డ్) నుంచి అస్థిర రేటు(ఫ్లోటింగ్)కు మారే గృహ రుణాలు. అంటే ప్రారంభం నుంచి నిరీ్ణత కాలం వరకు (సుమారు ఐదు పదేళ్లు) ఒకటే వడ్డీ రేటు కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి మార్కెట్ రేట్లకు అనుగుణంగా గృహ రుణంపై రేటు మారుతుంటుంది. ఈ విధమైన గృహ రుణాలను ఆఫర్ చేయవచ్చా? అన్న దానిపై ఆర్బీఐ నుంచి స్పష్టత కోరినట్టు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. లేహ్ వచి్చన సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల రిటైల్ రుణాలను ఫ్లోటింగ్ రేటు ఆధారంగానే అందించాలని, రుణాలపై రేట్లు రెపో వంటి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్ల ఆధారంగానే ఉండాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిన విషయం గమనార్హం. ఆర్బీఐ నూతన మార్గదర్శకాల విడుదల అనంతరం ఫ్లోటింగ్ రేటు రుణాల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై స్పష్టత లేదన్నారు రజనీష్ కుమార్. కస్టమర్లు కోరుకుంటున్నారు.. కొంత మంది కస్టమర్లు గృహ రుణాలపై రేట్లు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అటువంటి వారి కోసం ఫిక్స్డ్–ఫ్లోటింగ్ రేటు ఉత్పత్తులను అందించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. వీటిల్లో ఐదు లేదా పదేళ్ల వరకు వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందన్నారు. కొంత కాలం తర్వాత ఫ్లోటింగ్ రేటుకు మార్చడం... భవిష్యత్తు పరిస్థితులను బ్యాంకు అంచనా వేయలేకపోవడం వల్లనేనన్నారు. సాధారణంగా గృహ రుణాల కాల వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆస్తుల నిర్వహణ బాధ్యతల విషయంలో 30 ఏళ్ల కాలానికి స్థిర రేటు ఉత్పత్తిని ఆఫర్ చేయడం కష్టమని వివరించారు. ఎస్బీఐ గరిష్టంగా 30 ఏళ్ల కాలానికే గృహ రుణాలను అందిస్తోంది. ప్రస్తుతానికి ఎంసీఎల్ఆర్ ఆధారిత ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలను ఆఫర్ చేస్తోంది. రెపో రేటు ఆధారిత ఫ్లోటింగ్ రుణాలపై రేట్లు తరచుగా మారే పరిస్థితులు ఉంటుంటాయి. ఆర్బీఐ రేపో రేటును సవరించినప్పుడల్లా బ్యాంకులు కూడా ఆ మేరకు మార్పులు చేయాల్సి వస్తుంది. -
బండ బాదుడు!
సిలిండర్ నిర్ణీత ధర కంటే అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్ ఆగడాలు వినియోగదారుల జేబులకు చిల్లులు నెలకు రూ.8.17 కోట్లకు పైగా భారం సిటీబ్యూరో: మహా నగరంలో ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులకు అ‘ధన’పు బాదుడు తప్పడం లేదు. సిలిండర్ అసలు ధర కంటే అదనంగా వసూలు చేస్తూ డెలివరీ బాయ్స్ పబ్లిక్‌గా దోచుకుంటున్నారు. ఇలా ఒక నెలలో వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తమెంతో తెలుసా? అక్షరాలా 8 కోట్ల 17 లక్షల రూపాయల పైమాటే. కొందరు వినియోగదారులు ‘చిల్లర’ కదా... అని తేలికగా తీసుకోవడంతో అది కాస్త డిమాండ్‌గా మారింది. ఎవరైనా ఇలా ఇచ్చుకోలేకపోతే రుసరుసలు తప్పవు. దీంతో అందరూ అదన ంగా చెల్లించాల్సి వస్తోంది. ఇది పేదలకు భారంగా మారుతోంది. డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం సిలిండర్ రీఫిల్ ధర రూ.662 ఉండగా... డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తోంది రూ.690. అంటే నిర్ణీత ధర కంటే అదనంగా రూ.28 వంతున లాక్కుంటున్నారు. మహా నగరం మొత్తం వినియోగదారులు నెలకు ముట్ట జెప్పుతోంది లెక్కిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏజెన్సీల నిర్లక్ష్యం... వినియోగదారులకు సిలిండర్‌ను డోర్ డెలివరీ చేయడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)తో కలుపుకొని బిల్లు వేసి.. వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల ధరనే బిల్లుపై వేస్తున్న ఏజెన్సీలు సిలిండర్ సరఫరా భారాన్ని డెలివరీ బాయ్స్‌పై పెట్టి చేతులు దులుపుకుంటున్నాయి. దీంతో వారు ఇష్టమొచ్చినట్టుగా వసూలు చేస్తున్నారు. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉంటుంది. కొందరు నామమాత్రంగా వేతనాలు అందిస్తుండగా... మరికొందరు సిలిండర్ల సంఖ్యను బట్టి కమీషన్ చెల్లిస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లపై దృష్టి పెడుతున్నారు. నిబంధనల ప్రకారం సరఫరా సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువును వినియోగదారులకు చూపించాలి. కానీ ఇది ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు ధ్యాస తప్ప బరువు చూపించాలన్న నిబంధనలను వారు మరచిపోయారు. ఇవీ నిబంధనలు వినియోగదారుడు ఆన్లైన్లో గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లుతో డోర్ డెలివరీ చేయాలి. ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల వరకు ఉచితంగా సరఫరా చేయాలి. 6 నుంచి 15 కిలోమీటర్ల వరకూ రవాణా చార్జీల పేరిట రూ.10 వసూలు చేయాలి. 16-30 కిలోమీటర్ల దూరానికి రూ.15 వసూలు చేయాలి వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి.