సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సోకకుండా వేసుకునే వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రైవేటులో వేసుకోవాలనుకునే వారు వేసుకోవచ్చని చెప్పారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధర విషయమై కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. నిర్ధిష్ట ధర విధిస్తూ ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు ఇలా..
కోవిషీల్డ్ రూ.780
కోవాగ్జిన్ రూ.1,410
స్పుత్నిక్ రూ.1,145
5 శాతం జీఎస్‌టీ, రూ.150 సర్వీస్ ఛార్జీ అదనం
నిర్దేశించిన ధరల కన్నా అదనంగా డబ్బులు వసూలు చేస్తే ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. అధిక ధరలు వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించింది. వ్యాక్సిన్‌పై పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధానమంత్రి సోమవారం ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియ చర్యలు చేపట్టింది. ఇప్పటికే వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు ఆర్డర్లు కూడా ఇచ్చేసింది. త్వరలోనే ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉచితంగా అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment