
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో 5జీ నెట్‌వర్క్‌ను పరిచయం చేసేందుకు భారతదేశం సన్నద్ధం అవుతున్నందున.. స్మాల్ సెల్ విస్తరణకై రైట్ ఆఫ్ వే నిబంధనలకు సవరణ చేయాలని టెలికం పరిశ్రమ డిమాండ్ చేస్తోంది.
‘స్మాల్ సెల్స్ విషయంలో నియంత్రణ వ్యవస్థ లేదు. టవర్లు, కేబుల్స్ ఏర్పాటుకు అనుమతులు దక్కించుకోవడంలో సవాళ్లు ఉన్నాయి. రాష్ట్రాన్నిబట్టి విధానాలు వేర్వేరుగా అమలవుతున్నాయి. అడ్డంకులు తొలగితేనే స్మాల్ సెల్ విస్తరణకు ఆస్కారం ఉటుంది’ అని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. 5జీ నెట్‌వర్క్స్‌లో స్మాల్ సెల్స్ (మొబైల్ బేస్ స్టేషన్స్) అత్యంత కీలకం.