న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా ఫిన్లాండ్ సంస్థ టెక్నోట్రీ సాఫ్ట్‌వేర్‌తో చేతులు కలిపింది. తద్వారా గ్లోబల్ టెలికం కంపెనీ(టెల్కో)ల కోసం 5జీ ఆధారిత జనరేటివ్ ఏఐ సొల్యూషన్లను అభివృద్ధి చేయనుంది.
టెలికం రంగ దిగ్గజాలకు సేవలందించే టెక్నోట్రీ సహకారంతో క్లయింట్ల అవసరాలకు అనుగుణమైన తదుపరితరం సొల్యూషన్లకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా టెల్కోలు, కమ్యూనికేషన్ సర్వీసులందించే సంస్థ(సీఎస్‌పీ)లకు కొత్త అవకాశాలకు వీలు కల్పించడం, ఆవిష్కరణలకు ఊతమివ్వడం, సస్టెయినబుల్ గ్రోత్‌కు దన్నునివ్వడం వంటి సేవలను అందించనున్నాయి.
తాజా భాగస్వామ్యం ఏఐ ఆధారిత డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో హెచ్‌సీఎల్ టెక్‌కున్న పట్టు, టెక్నోట్రీకు గల 5జీ ఏఐ ఆధారిత బీఎస్‌ఎస్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాలు కలగలసి క్లయింట్లకు పటిష్ట సేవలందించనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment