partenrship
-
చేతులు కలిపిన టెక్ మహీంద్రా, ఏడబ్ల్యూఎస్
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ టెక్ మహీంద్రా తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో (ఏడబ్ల్యూఎస్) ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజిన్స్ సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా టెలికం నెట్‌వర్క్‌లను రూపాంతరం చేసే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది.అధునాతన ఏఐ పరిష్కారాలను వినియోగించి నెట్వర్క్ సామర్థ్యాన్ని, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికి ఇరు సంస్థలు కృషిచేస్తాయి. కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు, ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం రూపొందించిన అటానమస్ నెట్వర్క్స్ ఆపరేషన్స్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో టెక్ మహీంద్రా బహుళ–సంవత్సరాల వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకం చేసింది. -
టెక్నోట్రీతో హెచ్‌సీఎల్ టెక్ జత
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా ఫిన్లాండ్ సంస్థ టెక్నోట్రీ సాఫ్ట్‌వేర్‌తో చేతులు కలిపింది. తద్వారా గ్లోబల్ టెలికం కంపెనీ(టెల్కో)ల కోసం 5జీ ఆధారిత జనరేటివ్ ఏఐ సొల్యూషన్లను అభివృద్ధి చేయనుంది.టెలికం రంగ దిగ్గజాలకు సేవలందించే టెక్నోట్రీ సహకారంతో క్లయింట్ల అవసరాలకు అనుగుణమైన తదుపరితరం సొల్యూషన్లకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా టెల్కోలు, కమ్యూనికేషన్ సర్వీసులందించే సంస్థ(సీఎస్పీ)లకు కొత్త అవకాశాలకు వీలు కల్పించడం, ఆవిష్కరణలకు ఊతమివ్వడం, సస్టెయినబుల్ గ్రోత్‌కు దన్నునివ్వడం వంటి సేవలను అందించనున్నాయి.తాజా భాగస్వామ్యం ఏఐ ఆధారిత డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో హెచ్‌సీఎల్ టెక్కున్న పట్టు, టెక్నోట్రీకు గల 5జీ ఏఐ ఆధారిత బీఎస్ఎస్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాలు కలగలసి క్లయింట్లకు పటిష్ట సేవలందించనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ పేర్కొంది. -
బంటీతో రాం...రాం : విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం ?
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఓటమి తరువాత టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ 2023 ఫైనల్లో భారత్ ఓడిపోయిన మరుసటి రోజే భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని మేనేజర్ బంటీ సజ్దేహ్ మధ్య దశాబ్ద కాలానిపైగా ఉన్న దీర్ఘకాలిక పార్టనర్‌షిప్‌ను ముగించినట్టు సమాచారం. ఇంత సక్సెస్ఫుల్ భాగస్వామ్యానికి వీడ్కోలు పలకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలపై స్పష్టత లేదు కానీ కోహ్లినే సొంతంగా రూ.100కోట్ల కంపెనీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులను కూడా ప్రారంహించాడట. రోహిత్ శర్మ, KL రాహుల్, అజింక్యా రహానే, శుభ్‌మన్ గిల్ లాగానే ఇపుడు కోహ్లీ, బంటీ సంబంధం కూడా ముగిసిందని ఇండస్ట్రీ మూలాన్ని ఉటంకిస్తూ క్రికెట్ నెక్స్ట్ పేర్కొంది. క్రికెట్ నెక్ట్స్ నివేదికల ప్రకారం కార్మర్ స్టోన్ వ్యవస్థాపకుడు బంటి సజ్దేహ్ గత పదేళ్లుగా కోహ్లి వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. ప్రధాన క్రికెట్ ఈవెంట్లలో తరచుగా అతని పక్కన ఉంటూ కోహ్లికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచాడు. ముఖ్యంగా కోహ్లి, వాణిజ్య ప్రయోజనాలు, బ్రాండ్ వాల్యూ వంటి అంశాలను బంటీ పర్యవేక్షిస్తుంటారు. పుమా సంస్థతో కోహ్లి వందకోట్ల ఒప్పందంతో పాటు అనేక కీలక ఒప్పందాలు కుదర్చడంలో బంటీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి తోడు కార్నర్‌స్టోన్ అటు క్రీడాకారులు, ఇటు బాలీవుడ్ ప్రముఖుల వ్యాపార కార్యకలాపాలనుసైతం నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇకోహ్లీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుందనే విమర్శలు ఉన్న ఈ నేపథ్యంలోనే కార్నర్ స్టోన్ నుంచి రోహిత్ శర్మ, కేఎల్ రాహల్, అజింక్యా రహానే, శుభ్‌మన్ గిల్ వంటి క్రీడాకారులు బయటికి వచ్చేశారు. పీవీ సింధు, సానియా మీర్జా, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, యశ్ ధుల్ వంటి ప్లేయర్లు ఆ సంస్థలోనే కొనసాగుతున్నారు. 2020లో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ కార్నర్‌స్టోన్‌తో భాగస్వామ్యం కలిగి, ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ (DCA)ని ఏర్పాటు చేసింది. అయితే, కార్నర్‌స్టోన్‌తో క్రికెటర్ల అనుబంధం జాయింట్ వెంచర్‌తో సంబంధం లేకుండా ఉంది. బంటికి టీమ్ ఇండియాలో కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. సోహైల్ ఖాన్ మాజీ భార్య సీమా సోదరుడే బంటీ. అలాగే స్టార్ ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మకు బావ. అతని సోదరి కార్నర్‌స్టోన్‌లో చేరడం తోపాటు, స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేసింది. ఇది ఇలా ఉంటే బంటీ తన పాఠశాల విద్యను ముంబైలో పూర్తి చేశాడు. ముంబైలోని HR కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, ఆస్ట్రేలియా బాండ్ విశ్వవిద్యాలయంలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. అతను పర్సప్ట్ ఎంటర్టైన్మెంట్లో టాలెంట్ అక్విజిషన్ అడ్వైజర్‌గా తన కరియర్‌ను ప్రారంభించాడు. -
హరితహారంలో భాగస్వాములమవుతాం
ఐనవోలు (వర్ధన్నపేట) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో విద్యుత్‌శాఖ ఉద్యోగుల భాగస్వామ్యంతో మొక్కలు నాటి సంరక్షిస్తామ ని ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ అన్నారు. మండలంలోని ఐనవోలులో విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా సిబ్బందితో కలిసి ఆయనమొక్కలు నాటా రు. సీఎండీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ చేపట్టి న హరితహారంలో ప్రతివ్యక్తి పాల్గొనాలని పిలుపునిచ్చారు. సబ్‌స్టేçÙన్ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చర్యలు చేపడుతామ ని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ మోహన్‌రావు, డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ నర్సింగరావు, చీఫ్ ఇంజ నీర్ ఆఫ్ ఆపరేషన్ సదన్లాల్, ఎస్ఈ ఆపరేషన్ సదన్లాల్, డీఈ వి జేందర్, ఎంపీపీ మార్నేని రవీందర్రావు, ఏడీఈ పెద్దిరాజం, ఏఈ లక్ష్మణ్‌నాయక్, సర్పంచ్ పల్లంకొండ సురేష్, ఎంపీటీసీ సభ్యుడు బొల్లెపెల్లి మధు, మల్లికార్జునస్వామ ఆలయ ఈవో శేషుభారతి, పాల్గొన్నారు. ం