Generative AI
-
కొత్త టెక్నాలజీతో 10 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: క్వాంటమ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఐటీ ప్లేస్మెంట్, స్టాఫింగ్ కంపెనీ క్వెస్ ఐటీ స్టాఫింగ్ నివేదిక వెల్లడించింది. ఏఐ, మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్‌చెయిన్ విభాగాలలోని నైపుణ్యాలు వినూత్న అప్లికేషన్లతో పరిశ్రమలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని తెలిపింది. క్వెస్ టెక్నాలజీ స్కిల్స్ రిపోర్ట్–2024 ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కూడా 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు 150 బిలియన్ డాలర్లకు పైగా దోహదపడతాయని అంచనా. ఇది సాంకేతిక నైపుణ్యంలో భారత స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రిటైల్, ఆటోమోటివ్, తయారీలో ఏఐ/ఎంఎల్ సాంకేతికత మోసాన్ని గుర్తించడం, నిర్ధారణ, నాణ్యత నియంత్రణ ద్వారా సామర్థ్యాన్ని పెంచుతుంది’ అని వివరించింది. అసమాన అవకాశాలను.. ‘టెక్ నియామకాల్లో 43.5 శాతం వాటాతో బెంగళూరు ప్రధమ స్థానంలో ఉంది. హైదరాబాద్ 13.4 శాతం, పుణే 10 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత సాంకేతికత నిపుణులు టెక్నాలజీలో కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. జనరేటివ్ ఏఐ, బ్లాక్‌చెయిన్ వంటి సాంకేతికతల జోరుతో 2030 నాటికి భారత ఐటీ రంగం 20 లక్షల ఉద్యోగాలను జోడించనుంది’ అని నివేదిక తెలిపింది. ఏఐ/ఎంల్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ వంటి సంప్రదాయ నైపుణ్యాల కలయిక అసమాన అవకాశాలను అందిస్తుందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. -
ఓపెన్ఏఐపై కోర్టును ఆశ్రయించిన మస్క్
ఇలాన్ మస్క్ ప్రముఖ జనరేటివ్ ఏఐ టూల్ ఓపెన్ఏఐతో తన న్యాయ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాడు. ఓపెన్ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమేరకు కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశాడు.ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్‌మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ ఇటీవల కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వ్యాజ్యంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్, మైక్రోసాఫ్ట్, పలువురు బోర్డు సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ సెర్చ్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓపెన్‌ఏఐను స్థాపించామని, కానీ అందుకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యాపార ధోరణిను అవలంభిస్తున్నట్లు చెప్పారు. -
ట్యాక్స్ నిపుణులకు దన్నుగా జెన్ఏఐ
న్యూఢిల్లీ: జనరేటివ్ ఏఐపై (జెన్ఏఐ) వివిధ రంగాల్లో ఆసక్తి పెరుగుతోంది. విధుల నిర్వహణ సామర్థ్యాలను పెంచుకునేందుకు ఇది గణనీయంగా ఉపయోగపడగలదని దేశీయంగా చాలా మటుకు సీఎఫ్‌వోలు, ఆర్థిక.. ట్యాక్స్ నిపుణులు భావిస్తున్నారు. ఈవై ట్యాక్స్ అండ్ ఫైనాన్స్ ఆపరేషన్స్ (టీఎఫ్‌వో) సర్వే 2024 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా 32 దేశాల నుంచి 18 పరిశ్రమలకు సంబంధించి 1,600 మంది నిపుణులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో భారత్ నుంచి 70 మంది సీఎఫ్‌వోలు, పన్నుల నిపుణులు ఉన్నారు. ట్యాక్స్, ఫైనాన్స్ విభాగాల్లో ఎదురవుతున్న కీలక సవాళ్లను ఈ నివేదికలో ప్రస్తావించారు. దీని ప్రకారం విధుల నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి జెన్ఏఐ ఉపయోగపడగలదని భావించే సీఎఫ్‌వోలు, ఫైనాన్స్, ట్యాక్స్ నిపుణుల సంఖ్య భారత్‌లో 2023లో 19 శాతంగా ఉండగా తాజాగా 94 శాతానికి పెరిగింది. అంతర్జాతీయంగా 87 శాతం మంది ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్యాక్స్ నిపుణుల్లో జెన్ఏఐ సామర్థ్యాలకు గుర్తింపు పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది. సర్వే ప్రకారం దేశీయంగా ట్యాక్స్ నిపుణులు ఇప్పటికే జెన్ఏఐ వినియోగంలో పురోగతి సాధిస్తున్నారు. 14 శాతం మంది జెన్ఏఐతో వ్యూహాలను రూపొందించడం, పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించడం, దానితో ఇతరత్రా ఉపయోగాలను తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. 47 శాతం మంది తమ కార్యకలాపాలను మెరుగుపర్చే విషయంలో జెన్ఏఐ సామర్థ్యాలపై అధ్యయనాలు, ప్రయోగాలు చేస్తున్నారు. అయితే, 44 శాతం మందికి జెన్ఏఐ సామర్థ్యాలను అర్థం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా ఉంటున్నాయి. వృత్తిగతంగా సానుకూల మార్పులు .. ట్యాక్స్ ప్రొఫెషనల్స్ కార్యాలయాలు, వృత్తిగత జీవితాల్లో సానుకూల మార్పులకు దోహదపడేలా జెన్ఏఐ సమర్ధవంతమైన సాధనంగా ఎదుగుతోందని ఈవై ఇండియా డిజిటల్ ట్యాక్స్ లీడర్ రాహుల్ పట్నీ తెలిపారు. డాక్యుమెంట్ల సమీక్షల నుంచి రోజువారీ పూర్తి చేయాల్సిన డ్రాఫ్టింగ్ వరకు వివిధ అంశాల్లో ఏఐ ఉపయోగపడగలదని వివరించారు. దీనితో నిపుణులు ఇతరత్రా కీలకమైన అంశాలపై దృష్టి పెట్టేందుకు, మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని పట్నీ పేర్కొన్నారు. నియంత్రణ సంస్థ నిబంధనలపరంగా, రిపోరి్టంగ్పరంగా భారం పెరిగే కొద్దీ తలెత్తే సవాళ్లను పరిష్కరించేందుకు కంపెనీల్లో ట్యాక్స్ నిపుణులు కొత్త వ్యూహాలు పాటించాల్సి వస్తుందని .. ఇలాంటి విషయాల్లో జెన్ఏఐ ఉపయోగకరంగా ఉండగలదనే అభిప్రాయం ఉంటోందని ఈవై ఇండియా నేషనల్ లీడర్ జితేష్ బన్సల్ తెలిపారు. -
చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ జనరేటివ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దానికి పోటీగా చాలా కంపెనీలు తమ సొంత ఏఐలను తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా ఓపెన్ఏఐ ‘చాట్‌జీపీటీ సెర్చ్’ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.గూగుల్‌లో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే సెర్చ్‌లోకి వెళ్లి వెతుకుతారు. అదేమాదిరి ఇకపై చాట్‌జీపీటీలోనూ సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గూగుల్ బ్రౌజర్లో ఎలాగైతే మనం సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారం వస్తుందో అదేవిధంగా చాట్‌జీపీటీలోనూ డిస్ప్లే అవుతుంది. విభిన్న వెబ్సైట్లలోని సమాచారాన్ని క్రోడికరించి మనం వెతుకుతున్న అంశాలను ముందుంచుతుంది. అయితే ఈ ఆప్షన్ ఓపెన్ఏఐ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. చాట్‌జీపీటీ ప్లస్ కస్టమర్లు మాత్రమే దీన్ని వినియోగించేలా ఏర్పాటు చేశారు. కాగా, ఈ చాట్‌జీపీటీ ప్లస్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.కొత్తగా పరిచయం చేసిన చాట్‌జీపీటీ సెర్చ్ వల్ల స్పోర్ట్స్ స్కోర్, స్టాక్ మార్కెట్ షేర్ ధరలు, లేటెస్ట్ వివరాలు..వంటి రియల్‌టైమ్ సమాచారాన్ని తెలసుకోవచ్చు. దాంతోపాటు విభిన్న వెబ్‌సైట్‌ల్లోని ముఖ్యమైన సమాచారాన్ని క్రోడీకరించి సెర్చ్‌లో అడిగిన కమాండ్‌కు అనుగుణంగా డిస్ప్లే అవుతుంది. ఈ సేవలు పొందేందుకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ యూజర్లకు కొన్ని వారాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతామని పేర్కొంది.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!జనరేటివ్ ఏఐ సాయంతో లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లను వినియోగించి ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే ప్రముఖ కంపెనీలు తమ సొంత ఏఐను సృష్టించుకున్నాయి. గూగుల్ జెమినీ, యాపిల్-యాపిల్ ఇంటెలిజెన్స్, మెటా-మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్-కోపైలట్..వంటి టూల్స్‌ను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచాయి. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఆర్థిక సేవల్లో ఏఐ, జెనరేటివ్ ఏఐ కీలకం
న్యూఢిల్లీ: దేశంలో 90 శాతం ఆర్థిక సంస్థలు కృత్రిమ మేథ (ఏఐ)కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. జెనరేటివ్ ఏఐని ఆవిష్కరణలకు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంగా పేర్కొంది. డేటా అనలైటిక్స్ సైతం కీలకంగా మారుతున్నట్టు 74 శాతం ఆర్థిక సంస్థలు పీడబ్ల్యూసీ ఇండియా సర్వేలో భాగంగా వెల్లడించాయి. నిర్ణయాలు తీసుకోవడంలో దీని సమగ్రమైన ప్రాధాన్యతను వెల్లడించాయి. ఈ సర్వేలో 31 బ్యాంక్‌లు, బీమా సంస్థలు, ఫిన్టెక్లో తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.పరిశ్రమ అభిప్రాయాలు.. » కస్టమర్లను సొంతం చేసుకోవడం, వారికి మెరుగైన అనుభవాన్ని ఇవ్వడం నూతన ఆవిష్కరణలకు కీలకమని 84 శాతం సంస్థలు తెలిపాయి. » ఉత్పత్తుల పంపిణీ అన్నది ఆవిష్కరణలకు కీలకమని 50 శాతం సంస్థలు పేర్కొన్నాయి. » రిస్క్‌ను పరిమితం చేయడం, మారుతున్న నియంత్రపరమైన నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం కీలకమైనవిగా 65 శాతం సంస్థలు చెప్పాయి. ఆవిష్కరణల విషయంలో నియంత్రణ పరమైన అవరోధాలను అధిగమించడం కీలకమని తెలిపాయి. » ప్రధానంగా అంతర్గత చర్యల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని 45 శాతం ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. ‘‘ఫిన్‌టెక్ పరిశ్రమ అభివృద్ధి చెందే క్రమంలో వృద్ధికి.. డిజిటల్ భద్రత, నియంత్రణపరమైన నిబంధనల అమలుకు మధ్య సమతూకం అవసరం. నిబంధనల అమలు భాగస్వామ్యాల ద్వారా మారుతున్న నియంత్రపరమైన మార్పులను అధిగమించొచ్చు’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ మిహిర్ గాంధీ తెలిపారు. -
జనరేటివ్‌ఏఐ కోసం భారీగా ఖర్చు
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం వైపు మొగ్గు చూపుతున్నాయి. అందులో భాగంగా జనరేటివ్ ఏఐపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. అయితే అందుకు కావాల్సిన సిస్టమ్ అప్‌గ్రేడేషన్, హార్డ్‌వేర్‌కు భారీగా ఖర్చు చేస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు తమ టెక్ బడ్జెట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. చాలా కంపెనీలు జనరేటివ్ ఏఐకు షిఫ్ట్ అవుతుండడంతో ప్రధానంగా హార్డవేర్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. నవంబర్ 2022లో ఓపెన్ఏఐ చాట్ జీపీటీను ప్రారంభించినప్పటి నుంచి జనరేటివ్ ఏఐపై పరిశోధనలు పెరిగాయి. రిసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ గార్ట్నర్ నివేదిక ప్రకారం.. 2024లో ఐటీ కంపెనీలు డేటా సెంటర్ సిస్టమ్‌ల అప్‌గ్రేడ్ కోసం దాదాపు 24 శాతం రెవెన్యూ పెంచాయి. హార్డ్‌వేర్ పరికరాల కోసం చేసే ఖర్చును 5.4 శాతం అధికం చేశాయి. 2018 నుంచే కొన్ని కంపెనీలు డేటా సెంటర్ సిస్టమ్‌లపై చేసే వ్యయాలను పెంచుతూ ఉన్నాయి.మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు డేటా సెంటర్లు, హార్డ్వేర్పై ఖర్చును పెంచడం తప్పనిసరైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, జనరేటివ్ ఏఐ బిజినెస్ సర్వీసెస్ యూనిట్ సీఈఓ శ్రీధర్ మంథా మాట్లాడుతూ..‘చాలా కంపెనీలు ఇప్పటికీ ప్రాథమిక ఏఐ టాస్క్‌లకు అనువైన పాత డేటా సర్వర్లనే ఉపయోగిస్తున్నాయి. అయితే సంస్థలు క్రమంగా జనరేటివ్ ఏఐకు షిఫ్ట్ అవుతున్నాయి. దాంతో డేటా సెంటర్ సిస్టమ్‌లను, హార్డ్‌వేర్‌ను అప్డేట్ చేస్తున్నాయి’ అన్నారు. ఇదిలాఉండగా, కంపెనీ జనరేటివ్ ఏఐ హార్డ్వేర్పై భారీగా ఖర్చు చేస్తుండడంతో ఈ విభాగంలో నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
టెక్నోట్రీతో హెచ్‌సీఎల్ టెక్ జత
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా ఫిన్లాండ్ సంస్థ టెక్నోట్రీ సాఫ్ట్‌వేర్‌తో చేతులు కలిపింది. తద్వారా గ్లోబల్ టెలికం కంపెనీ(టెల్కో)ల కోసం 5జీ ఆధారిత జనరేటివ్ ఏఐ సొల్యూషన్లను అభివృద్ధి చేయనుంది.టెలికం రంగ దిగ్గజాలకు సేవలందించే టెక్నోట్రీ సహకారంతో క్లయింట్ల అవసరాలకు అనుగుణమైన తదుపరితరం సొల్యూషన్లకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా టెల్కోలు, కమ్యూనికేషన్ సర్వీసులందించే సంస్థ(సీఎస్పీ)లకు కొత్త అవకాశాలకు వీలు కల్పించడం, ఆవిష్కరణలకు ఊతమివ్వడం, సస్టెయినబుల్ గ్రోత్‌కు దన్నునివ్వడం వంటి సేవలను అందించనున్నాయి.తాజా భాగస్వామ్యం ఏఐ ఆధారిత డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో హెచ్‌సీఎల్ టెక్కున్న పట్టు, టెక్నోట్రీకు గల 5జీ ఏఐ ఆధారిత బీఎస్ఎస్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాలు కలగలసి క్లయింట్లకు పటిష్ట సేవలందించనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ పేర్కొంది. -
బీవోబీ-మైక్రోసాఫ్ట్ జెన్ఏఐ హ్యాకథాన్.. రూ.లక్షల్లో ప్రైజ్‌మనీ
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా మైక్రోసాఫ్ట్ సహకారంతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ)పై దేశవ్యాప్త ఆన్లైన్ హ్యాకథాన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.బ్యాంక్ నిర్వచించిన నిర్దిష్ట అంశాల్లో జెన్ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పాల్గొనేవారిని ప్రేరేపించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యం. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతులు అందజేస్తామని, హ్యాకథాన్ నుంచి వెలువడే ఉత్తమ ఐడియాలను అమలు చేస్తామని బ్యాంక్ పేర్కొంది.డెవలపర్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్, స్టార్టప్స్, ఫిన్‌టెక్‌లు వ్యక్తిగతంగా లేదా బృందంగా ఈ హ్యాకథాన్‌లో పాల్గొనవచ్చు. కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, ఆడిట్ & కాంప్లయన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, పర్సనలైజ్డ్ కంటెంట్ జనరేషన్ అనే ఆరు విభాగాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుతమైన పరిష్కారాలను కోరుతోంది.బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్నోవేషన్‌లో ముందంజలో ఉంటుందని, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి జెన్ఏఐ కొత్త మార్గాలను అందిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఉమ్మడి విజన్ ను పంచుకోవడానికి సంతోషిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా&దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు.కంటెస్టెంట్లు https://bobhackathon.com ద్వారా హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు వ్యక్తిగతంగా లేదా టీమ్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక్కో టీమ్‌లో గరిష్టంగా నలుగురు వ్యక్తులు ఉండొచ్చు. జూన్ 10 నుంచి 30వ తేదీలోపు ఐడియాలను సమర్పించవచ్చు. షార్ట్ లిస్ట్ చేసిన జట్లు ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. -
హమ్మయ్య.. ఇన్ఫోసిస్‌లో ఆ ముప్పు లేదు!
టెక్ పరిశ్రమలో ఎటు చూసినా జనరేటివ్ ఏఐ ప్రభంజనం.. అంతటా లేఆఫ్‌ల భయంతో ఐటీ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అయితే ఇన్ఫోసిస్‌లో మాత్రం ఆ ముప్పు లేదంటున్నారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. జెన్ఏఐ కారణంగా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగా తాము ఉద్యోగాలను తగ్గించబోమని సీఎన్‌బీసీ-టీవీ18 ఇంటర్వ్యూలో చెప్పారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతితో ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగిస్తోందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "లేదు, మేము అలా చేయడం లేదు. నిజానికి ఇండస్ట్రీలో ఇతరులు అలా చేశారు. ఆ విధానం సరికాదని మేం చాలా స్పష్టంగా చెప్పాం' అని పేర్కొన్నారు. పెద్ద సంస్థలకు అన్ని సాంకేతికతలు కలిసి వస్తాయనేది తన అభిప్రాయమని ఆయన వివరించారు. వచ్చే కొన్నేళ్లలో కృత్రిమ మేధ (ఏఐ)లో నిపుణులుగా ఎదిగే వారు మరింత మంది తమతో చేరుతారని, ప్రపంచంలోని పెద్ద సంస్థలకు సేవలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో క్లయింట్ల పరంగా, ఉద్యోగుల సంఖ్య పరంగా మరింత విస్తరిస్తామని పరేఖ్ తెలిపారు.మరి నియామకాలు?లేఆఫ్‌ల విషయాన్ని పక్కన పెడితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో నియామకాల పరిస్థితి ఎలా ఉండనుంది అన్నదానిపై తన దృక్పథాన్ని పరేఖ్ తెలియజేశారు. ఆర్థిక వాతావరణం మెరుగుపడటం, డిజిటల్ పరివర్తనపై వ్యయం పెరగడం జరిగితే నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయని చెప్పారు. అయితే నియామకాలపై ఎటువంటి వార్షిక లక్ష్యం లేకపోయినా ఆర్థిక వాతావరణం ఆధారంగా నియామకాలు చేపడతామని వివరించారు. -
‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’
ప్రపంచంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే కొత్త పరిజ్ఞానాలు పుట్టుకొచ్చిన ప్రతీసారి కొత్త భయాలు మొదలవుతాయి. ప్రస్తుతం జనరేటివ్ ఏఐ ఆధారిత సాధనాలతో ఈ భయం ఎక్కువవుతోంది. ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, వ్యాపావేత్తలు ఏఐ భవిష్యత్తు తరానికి ముప్పు తెస్తుందని కొందరు భావిస్తే, ఆ సాంకేతికతతో మరింత మేలు జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. వారి భావనలు ఎలాఉన్నా మర్పు సత్యం. కొత్త పరిజ్ఞానాలు వచ్చినప్పుడు ఇలాంటి వాదోపవాదాలు జరగటం, భయాలు తలెత్తటం మొదటి నుంచీ ఉన్నవే. అప నమ్మకం, సందేహం, ఆవిష్కరణల్లోని సంక్లిష్టత, టెక్నాలజీ మీద అవగాహన లేకపోవటం, అర్థం చేసుకోలేక పోవటం వంటివన్నీ వీటికి కారణమవుతుంటాయి. తమ జీవనోపాధికి భంగం కలుగుతుందనే అభిప్రాయమూ భయాన్ని సృష్టిస్తుంది. చరిత్రలో ఇలాంటి ఒక ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం. విచిత్రమైన భయాలు ‘రైలులో ప్రయాణం చేస్తే తీవ్ర గాయాలవుతాయి. ప్రాణాలూ పోవచ్చు.’ ‘శరీరం కరిగిపోతుంది. కాళ్లూ చేతులు విడిపోయి, పక్కలకు ఎగిరి పడతాయి.’ ‘గర్భిణుల రైళ్లలో ప్రయాణం చేస్తే వారి కడుపులోంచి పిండాలు బయటకు వచ్చేస్తాయి.’ ఇప్పుడంటే ఇవి నవ్వు తెప్పిస్తుండొచ్చు గానీ ఒకప్పుడు ఇలాగే భయపడేవారు. రైల్ సిక్నెస్ ప్రపంచంలో మొట్టమొదటి ప్రజా రైలు ప్రయాణం ఇంగ్లండ్‌లో 1825లో ప్రారంభమైంది. రైలు వేగం, అది చేసే చప్పుడు, దాన్నుంచి వెలువడే పొగ చాలామందిని భయభ్రాంతులకు గురిచేశాయి. అప్పటికి రైలు వేగం గంటకు 30 కిలో మీటర్లు. అంత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదమని, బోగీ కదలికలకు ఎముకలు విరిగిపోతాయని వణికిపోయేవారు. ఈ రైలు భయానికి జర్మనీలో ‘ఈసెన్బాంక్రాన్కీట్’ అనీ పేరు పెట్టారు. అంటే ‘రైల్ సిక్నెస్’ అని అర్థం. ఇదీ చదవండి: పెళ్లికొడుకు వాచ్‌పై కన్నేసిన జూకర్బర్గ్ దంపతులు.. ధర ఎంతో తెలుసా.. బుల్లెట్ రైలు ఇంగ్లండ్ మొత్తానికి రైలు మార్గం విస్తరించిన తర్వాత కూడా భయాలు పోలేదు. విమర్శలూ తగ్గలేదు. రైలు ప్రయాణాన్ని వెటకారం చేస్తూ సెటైర్లు కూడా వెలువడ్డాయి. గుర్రాలు, గుర్రపు బగ్గీల వంటి ఆనాటి ప్రయాణ సాధనాలను, పరిస్థితులను బట్టి చూస్తే కొత్త రైలు భయం అర్థం చేసుకోదగిందే. టెక్నాలజీ పురోగమిస్తున్నకొద్దీ, వాడకం పెరుగుతున్నకొద్దీ మామూలు విషయంగా మారుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు గంటకు 460 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లకు చేరుకున్నాం. -
మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన గూగుల్.. కారణం?
గూగుల్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ ‘జెమిని’ ఓ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోదీపై ఇచ్చిన వివాదాస్పద సమాధానం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో కేంద్రం గూగుల్‌కు నోటీసులు పంపింది. దీనిపై తాజాగా గూగుల్ క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా తమ ప్లాట్‌ఫామ్‌ను ‘నమ్మదగినది కాదు’ అని పేర్కొంది. ఈమేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓ ఆంగ్ల పత్రికకు ఈ విషయాన్ని తెలిపారు. ‘ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని గూగుల్‌కు చెందిన ‘జెమిని’ను ఇటీవల ఓ నెటిజన్ అడగ్గా.. మోదీ అవలంబించిన విధానాల వల్ల కొంత మంది ఆయనను ఫాసిస్టు అని పిలిచారని ఆ ఏఐ టూల్ వివాదాస్పద సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అడగ్గా స్పష్టంగా చెప్పలేమంటూ ఆచితూచి జవాబిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఓ జర్నలిస్టు ఎక్స్(ట్విటర్)లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. దీంతో ‘జెమిని’పై విమర్శలు వ్యక్తమయ్యాయి. గూగుల్ ఏఐ టూల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు. Forgot to tag @elonmusk. Hope his AI product will be better. https://t.co/Mo8iugmiKK — Arnab Ray (@greatbong) February 22, 2024 ఇదీ చదవండి: ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే.. ఈ వ్యవహారాన్ని కేంద్రం తీవ్రంగా స్పందించింది. గూగుల్‌కు నోటీసులిచ్చింది. దీనిపై గూగుల్ తన స్పందనగా క్షమాపణలు చెప్తూ.. తమ ప్లాట్‌ఫామ్‌ను ‘నమ్మదగినది కాదని’ పేర్కొన్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో ఏఐ ఉత్పత్తులను లాంచ్ చేయాలంటే సంబంధిత ఏఐ ప్లాట్‌ఫామ్స్ ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. దీనిపై గందరగోళం నెలకొంది. అయితే ఈ విషయంలో స్టార్టప్‌లకు మినహాయింపును ఇచ్చినట్లు మంత్రి వివరించారు. These are direct violations of Rule 3(1)(b) of Intermediary Rules (IT rules) of the IT act and violations of several provisions of the Criminal code. @GoogleAI @GoogleIndia @GoI_MeitY https://t.co/9Jk0flkamN — Rajeev Chandrasekhar 🇮🇳(Modiyude Kutumbam) (@Rajeev_GoI) February 23, 2024 -
జనరేటివ్ ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు ఊడనున్నాయా..?
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా రంగాల్లో ఉద్యోగాలుపోయే ప్రమాదముందని చాలామంది నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ ఛైర్మన్ రాజేశ్ నంబియార్ ఈ అంశంపై స్పందిస్తూ జనరేటివ్ ఏఐ కారణంగా బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ) రంగంలో పనిచేసే ఉద్యోగులకు అధికంగా ముప్పు వాటిల్లనుందని తెలిపారు. భారత టెక్ పరిశ్రమలో కీలకమైన సాఫ్ట్వేర్ సేవల విభాగం మాత్రం ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏఐ ముప్పును గ్రహించి, 48.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.06 లక్షల కోట్ల) విలువైన దేశీయ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) పరిశ్రమ త్వరగా తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. 250 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 20.75 లక్షల కోట్ల) విలువైన దేశీయ ఐటీ పరిశ్రమపైనా కొంతమేర ఏఐ ప్రభావం చూపొచ్చని పేర్కొన్నారు. ‘తమ పనిలో ఏఐను వినియోగించలేని ఐటీ నిపుణులను.. ఏఐ వినియోగించే వారు భర్తీ చేసే ప్రమాదం ఉంద’ని నంబియార్ అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ప్రపంచ టాప్ కంపెనీలో నోటీసు లేకుండా ఉద్యోగాల తొలగింపు.. భవిష్యత్తు అవసరాల కోసం ఏఐ ఆధారిత నైపుణ్యాలను తమ ఉద్యోగులకు కల్పించడానికి ఐటీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. చివరకు మానవ సామర్థ్యాల్లో మాత్రమే తేడా ఉంటుందని, ప్రస్తుత వ్యవస్థతో ఏఐ సమీకృతమైనప్పుడు అసలైన మార్పులు వెలుగుచూస్తాయని నంబియార్ తెలిపారు. వైట్‌కాలర్ ఉద్యోగాలపైనే జనరేటివ్ ఏఐ ప్రభావం అధికంగా ఉంటుందని, కొత్త సాంకేతికతలకు మారాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ ఇండియాకు ఛైర్మన్, ఎండీగా నంబియార్ వ్యవహరిస్తున్నారు.