టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం వైపు మొగ్గు చూపుతున్నాయి. అందులో భాగంగా జనరేటివ్ ఏఐపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. అయితే అందుకు కావాల్సిన సిస్టమ్ అప్‌గ్రేడేషన్, హార్డ్‌వేర్‌కు భారీగా ఖర్చు చేస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు తమ టెక్ బడ్జెట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. చాలా కంపెనీలు జనరేటివ్ ఏఐకు షిఫ్ట్ అవుతుండడంతో ప్రధానంగా హార్డవేర్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. నవంబర్ 2022లో ఓపెన్‌ఏఐ చాట్ జీపీటీను ప్రారంభించినప్పటి నుంచి జనరేటివ్ ఏఐపై పరిశోధనలు పెరిగాయి. రిసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ గార్ట్‌నర్ నివేదిక ప్రకారం.. 2024లో ఐటీ కంపెనీలు డేటా సెంటర్ సిస్టమ్‌ల అప్‌గ్రేడ్ కోసం దాదాపు 24 శాతం రెవెన్యూ పెంచాయి. హార్డ్‌వేర్ పరికరాల కోసం చేసే ఖర్చును 5.4 శాతం అధికం చేశాయి. 2018 నుంచే కొన్ని కంపెనీలు డేటా సెంటర్ సిస్టమ్‌లపై చేసే వ్యయాలను పెంచుతూ ఉన్నాయి.
మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు డేటా సెంటర్లు, హార్డ్‌వేర్‌పై ఖర్చును పెంచడం తప్పనిసరైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, జనరేటివ్ ఏఐ బిజినెస్ సర్వీసెస్ యూనిట్ సీఈఓ శ్రీధర్ మంథా మాట్లాడుతూ..‘చాలా కంపెనీలు ఇప్పటికీ ప్రాథమిక ఏఐ టాస్క్‌లకు అనువైన పాత డేటా సర్వర్‌లనే ఉపయోగిస్తున్నాయి. అయితే సంస్థలు క్రమంగా జనరేటివ్ ఏఐకు షిఫ్ట్ అవుతున్నాయి. దాంతో డేటా సెంటర్ సిస్టమ్‌లను, హార్డ్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నాయి’ అన్నారు. ఇదిలాఉండగా, కంపెనీ జనరేటివ్ ఏఐ హార్డ్‌వేర్‌పై భారీగా ఖర్చు చేస్తుండడంతో ఈ విభాగంలో నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment