hardware
-
జనరేటివ్‌ఏఐ కోసం భారీగా ఖర్చు
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం వైపు మొగ్గు చూపుతున్నాయి. అందులో భాగంగా జనరేటివ్ ఏఐపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. అయితే అందుకు కావాల్సిన సిస్టమ్ అప్‌గ్రేడేషన్, హార్డ్‌వేర్‌కు భారీగా ఖర్చు చేస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు తమ టెక్ బడ్జెట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. చాలా కంపెనీలు జనరేటివ్ ఏఐకు షిఫ్ట్ అవుతుండడంతో ప్రధానంగా హార్డవేర్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. నవంబర్ 2022లో ఓపెన్ఏఐ చాట్ జీపీటీను ప్రారంభించినప్పటి నుంచి జనరేటివ్ ఏఐపై పరిశోధనలు పెరిగాయి. రిసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ గార్ట్నర్ నివేదిక ప్రకారం.. 2024లో ఐటీ కంపెనీలు డేటా సెంటర్ సిస్టమ్‌ల అప్‌గ్రేడ్ కోసం దాదాపు 24 శాతం రెవెన్యూ పెంచాయి. హార్డ్‌వేర్ పరికరాల కోసం చేసే ఖర్చును 5.4 శాతం అధికం చేశాయి. 2018 నుంచే కొన్ని కంపెనీలు డేటా సెంటర్ సిస్టమ్‌లపై చేసే వ్యయాలను పెంచుతూ ఉన్నాయి.మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు డేటా సెంటర్లు, హార్డ్వేర్పై ఖర్చును పెంచడం తప్పనిసరైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, జనరేటివ్ ఏఐ బిజినెస్ సర్వీసెస్ యూనిట్ సీఈఓ శ్రీధర్ మంథా మాట్లాడుతూ..‘చాలా కంపెనీలు ఇప్పటికీ ప్రాథమిక ఏఐ టాస్క్‌లకు అనువైన పాత డేటా సర్వర్లనే ఉపయోగిస్తున్నాయి. అయితే సంస్థలు క్రమంగా జనరేటివ్ ఏఐకు షిఫ్ట్ అవుతున్నాయి. దాంతో డేటా సెంటర్ సిస్టమ్‌లను, హార్డ్‌వేర్‌ను అప్డేట్ చేస్తున్నాయి’ అన్నారు. ఇదిలాఉండగా, కంపెనీ జనరేటివ్ ఏఐ హార్డ్వేర్పై భారీగా ఖర్చు చేస్తుండడంతో ఈ విభాగంలో నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు..
నిత్యం కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైళ్లను వినియోగిస్తుంటారు. ఇందులో ప్రధానంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్లుంటాయి. అసలు వేర్ అంటే ఏమిటో తెలుసా.. సాధనమని అర్థం. కంప్యూటర్లో మానిటర్, సీపీయూ, కీబోర్డు, మౌజ్ వంటి భాగాలన్నీ హార్డ్వేర్లు. ఈ హార్డ్వేర్లను పనిచేయించేవి సాఫ్ట్వేర్లు. ఈ సాఫ్ట్‌వేర్‌ల్లో చాలారకాలు ఉంటాయి. వీటిల్లో మంచి చేసేవే కాదు, హాని చేసేవీ ఉంటాయి. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రాన్సమ్వేర్ ఇది హానికర సాఫ్ట్వేర్. పీసీలో ఇన్స్టాల్ అయ్యి, లోపలి భాగాలను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. పరికరాన్ని, డేటాను తిరిగి వినియోగించుకోనీయకుండా చేస్తుంది. రాన్సమ్ అంటే డబ్బులు తీసుకొని, విడుదల చేయటం. పేరుకు తగ్గట్టుగానే ఇది డబ్బులు చెల్లించాలంటూ సందేశాన్ని తెర మీద కనిపించేలా చేస్తుంది. డబ్బులు చెల్లిస్తే గానీ డేటాను వాడుకోనీయదు. మనకు సంబంధించిన ఏ వివరాలు కనిపించవు. రాన్సమ్వేర్లలో చాలా రకాలున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం, నాణ్యమైన యాంటీవైరస్/ యాంటీ మాల్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా దీని బారినపడకుండా చూసుకోవచ్చు. స్పైవేర్ ఇదొక మాల్వేర్. ఒకసారి కంప్యూటర్లో ఇన్స్టాల్ అయితే చాలు. మన అనుమతి లేకుండానే, మనకు తెలియకుండానే ఆన్లైన్ వ్యవహారాలన్నింటినీ పసిగడుతుంది. ప్రకటనకర్తలు, మార్కెటింగ్ డేటా సంస్థలు సైతం ఇంటర్నెట్ వాడేవారి తీరుతెన్నులను తెలుసుకోవటానికి దీన్ని ఉపయోగిస్తుంటాయి. మార్కెటింగ్, ప్రకటనల కోసం తోడ్పడే స్పైవేర్లను ‘యాడ్వేర్’ అంటారు. ఇవి డౌన్లోడ్ లేదా ట్రోజన్ల ద్వారా పీసీలో ఇన్స్టాల్ అవుతాయి. ఈమెయిల్ ఐడీలు, వెబ్సైట్లు, సర్వర్ల వంటి వివరాలను పీసీ నుంచి సేకరించి, ఇంటర్నెట్ ద్వారా థర్డ్ పార్టీలకు చేరవేస్తాయి. కొన్ని స్పైవేర్లు లాగిన్, పాస్‌వర్డ్‌ల వంటి వాటినీ దొంగిలిస్తాయి. ఈ సాఫ్ట్వేర్లను ‘కీలాగర్స్’ అని పిలుచుకుంటారు. సీపీయూ మెమరీని, డిస్క్ స్టోరేజినీ, నెట్వర్క్ ట్రాఫిక్‌నూ వాడుకుంటాయి. నాగ్వేర్ ఒకరకంగా దీన్ని వేధించే సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా పని చేస్తున్నప్పుడో, ఫీచర్‌ను ప్రయత్నిస్తున్నప్పుడో పాపప్, నోటిఫికేషన్ మెసేజ్‌లతో లేదా కొత్త విండో ఓపెన్ చేస్తుండడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు- వెబ్‌పేజీ లేదా ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నామనుకోండి. ఏదో యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని న్యూవిండోలో అడగొచ్చు. ప్రోగ్రామ్‌ను లోడ్ చేస్తున్నప్పుడు లైసెన్స్ కొనమనీ చెబుతుండొచ్చు. దీని ద్వారా వచ్చే మెసేజ్‌లు చాలా చిరాకు పుట్టిస్తుంటాయి. ఆగకుండా అలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సాఫ్ట్‌వేర్‌ను అన్ఇన్స్టాల్ చేయటం ఉత్తమం. ఇదీ చదవండి: పేటీఎంపై నిషేధం.. ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు క్రాప్వేర్ ఇది కొత్త పీసీతో వచ్చే సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ముందే ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇవి ప్రయోగ పరీక్షల కోసం ఉద్దేశించినవి. కాబట్టి వీటితో మనకు నేరుగా ఉపయోగమేమీ ఉండదు. గడువు తీరిన తర్వాత పోతాయి. కొన్నిసార్లు అప్లికేషన్లను పరీక్షించటానికి తయారీదారులు క్రాప్వేర్ను ఇన్స్టాల్ చేయిస్తుంటారు. ఇందుకోసం థర్డ్ పార్టీలు డబ్బు కూడా చెల్లిస్తుంటాయి. దీంతో పీసీల ధరా తగ్గుతుంది. డిస్క్ స్పేస్‌ను వాడుకున్నా క్రాప్వేర్ హాని చేయదు. -
‘హే గూగుల్’.. ఏంటిది? వందలాది ఉద్యోగులను తీసేస్తున్న టెక్ దిగ్గజం
ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజం గూగుల్ వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. తమ డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజినీరింగ్ టీమ్‌లలో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందిని ఇంటికి సాగనంపుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ చర్యలు కొంకా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. బాధితుల్లో వాయిస్ అసిస్టెంట్ టీమ్ గూగుల్ చేపట్టిన ప్రస్తుత లేఆఫ్‌లతో ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో వాయిస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హార్డ్‌వేర్ టీమ్‌లో పనిచేస్తున్న వారు ఉన్నారు. కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్‌లోని వర్కర్లపైనా లేఆఫ్‌ల ప్రభావం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉత్పత్తుల ప్రాధాన్యతలకు అనుగుణంగా 2023 ద్వితీయార్థంలో తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి సిబ్బందిలో మార్పులు చేశాయని గూగుల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థాగత మార్పులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లో తొలగింపులు జరుగుతున్నట్లు సెమాఫోర్ అనే న్యూస్ వెబ్సైట్ మొదట నివేదించింది. 9to5Google అనే గూగుల్ సంబంధిత సమాచార వెబ్సైట్ హార్డ్‌వేర్ టీమ్‌లో పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు పేర్కొంది. ప్రభావిత సిబ్బందికి తొలగింపు సమాచారాన్ని కంపెనీ పంపుతోంది. గూగుల్‌లో ఇతర విభాగాల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం వీరికి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల యూనియన్ మండిపాటు గూగుల్ తొలగింపులపై ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ‘కంపెనీ కోసం ఉద్యోగులు నిరంతరం కష్టపడుతన్నాం.. దీంతో కంపెనీ ప్రతి త్రైమాసికంలో బిలియన్ల కొద్దీ ఆర్జిస్తోంది. కానీ ఉద్యోగులను తొలగించడం మాత్రం ఆపడం లేదు’ అని వాపోయింది. అయితే తొలగింపులకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేసింది. Tonight, Google began another round of needless layoffs. Our members and teammates work hard every day to build great products for our users, and the company cannot continue to fire our coworkers while making billions every quarter. We won’t stop fighting until our jobs are safe! — Alphabet Workers Union (AWU-CWA) (@AlphabetWorkers) January 11, 2024 -
యూజ్డ్ ఐటీ హార్డ్‌వేర్.. నిబంధనల్లో మార్పులివే..
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) యూనిట్లు ఉపయోగించిన ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను (ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్లు) బైటికి తరలించడానికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దేశీ టారిఫ్ ఏరియాల్లో (డీటీఏ) తాము సొంతంగా వినియోగించుకోవడానికి మాత్రమే లైసెన్సు అవసరం లేకుండా కంపెనీలు వాటిని సెజ్‌ల నుంచి తరలించవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, ఆ పరికరాలను సెజ్ యూనిట్లలో కనీసం రెండేళ్ల పాటు ఉపయోగించి ఉండాలి. అయిదేళ్ల కన్నా పాతవై (తయారీ తేదీ నుంచి) ఉండకూడదు. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం స్వల్పంగా సడలించిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా దేశీ మార్కెట్లోని సంస్థలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, కస్టమ్స్ చట్టాలపరంగా సెజ్‌లను విదేశీ భూభాగంగా పరిగణించడం వల్ల వాటిలోని యూనిట్లకు సుంకాలపరమైన మినహాయింపులు ఉంటాయి. కానీ, సెజ్‌లలోని సంస్థలు తమ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాల్లోకి తీసుకువస్తే .. వాటిని దిగుమతులుగా పరిగణిస్తారు. తదనుగుణంగా సుంకాలూ వర్తిస్తాయి. -
పేదింటికి పెద్ద కష్టం !
అనంతపురం కల్చరల్ /రాప్తాడు: జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్త కళ్ల ముందే మరణించడంతో ఓ మహిళ కన్నీరు మున్నీరైంది. ఆ బాధ నుంచి తేరుకోకముందే కన్న కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. చిన్న వయసులోనే కట్టుకున్న భర్త మంచం పట్టడంతో భార్య ... తన తండ్రికి ఏమైందో తెలీక ఓ మూడేళ్ల బాలుడు.. ఇలా ఓ కుటుంబాన్ని కష్టాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గుత్తి మండలం రజాపురానికి చెందిన ఆదిలక్ష్మమ్మ భర్త మార్కెట్‌యార్డులో పనిచేస్తుండేవాడు. ఆయన చనిపోవడంతో కుమారుడు కృష్ణమూర్తి, కోడలు ఆదెమ్మతో కలసి అనంతపురంలోని చిన్మయనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. ఆదిలక్ష్మమ్మ పెన్షన్‌తో ఆ కుటుంబం జీవనం సాగించేది. అయితే ఆదిలక్ష్మమ్మ 2021 ఫిబ్రవరిలో మరణించడంతో వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. అదే సంవత్సరం అక్టోబరులో ఆదెమ్మ కుమారుడు సాకే శ్రీకాంత్ (32)కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. కుమారుడికి వచ్చిన జబ్బును చూసి కుంగిపోయిన ఆదెమ్మ భర్త కృష్ణమూర్తి కూడా నవంబరు 1న చనిపోవడంతో ఇక ఆ ఇల్లు దిక్కులేనిదైంది. వారంలో ఐదుసార్లు డయాలసిస్ చేస్తేకానీ శ్రీకాంత్ బతికే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి ఆదెమ్మ , భార్య మల్లిక కన్నీరుమున్నీరవుతున్నారు. కష్టాల్లో శ్రీకాంత్ కుటుంబం బీటెక్ పూర్తి చేసిన సాకే శ్రీకాంత్ ఆరు నెలల కిందట వరకు హుషారుగానే ఉండేవాడు. హైదరాబాద్‌లో అనే సంస్థల్లోనూ పనిచేశాడు. 2018లో వజ్రకరూరు మండలం, కొనకొండ్లకు చెందిన మల్లికతో వివాహం జరగడంతో విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లిలో హార్డ్‌వేర్ ఇంజనీరుగా చేరాడు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే విధి వారిని చిన్నచూపు చూసింది. గత సంవత్సరం అక్టోబరు నెలలో అనారోగ్యంగా ఉందని హాస్పిటల్‌కు వెళితే శ్రీకాంత్ రెండు కిడ్నీలు పాడయ్యాయని తేలింది. దీంతో అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరిగేందుకు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశారు. ఆఖరికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు మాత్రం ఆపరేషన్‌తో సమస్య తీరుతుందని దానికి రూ.40 లక్షలు అవసరమవుతాయని తేల్చి చెప్పారు. బిడ్డను బతికించండయ్యా... రెండు కిడ్నీలు పాడైపోయి నా బిడ్డ పడుతున్న బాధ చూడలేకపోతున్నా. ఉన్న డబ్బంతా ఆస్పత్రులకే ఖర్చు పెట్టా. మా ఇంటి భారాన్ని కూతురు, అల్లుడు మోస్తున్నారు. బిడ్డ బతకాలంతే రూ.40 లక్షలు అవసరమంట. దయగల మారాజులు చేతనైంత సాయం చేసి నా కొడుకును బతికించండయ్యా.. – ఆదెమ్మ , సాకే శ్రీకాంత్ తల్లి దాతలు సాయం చేయదలిస్తే... సాకే శ్రీకాంత్ సెల్ నంబర్ – 7658971971 ఎస్బీఐ , జేఎన్టీయూ బ్రాంచ్ అకౌంట్ నం: 30453144331 ఐఎఫ్ఎస్సీ కోడ్ – ఎస్బీఐఎన్ 0021008 గూగుల్‌పే /ఫోన్‌పే నం – 7658971971 -
ఒకప్పుడు బెంగళూరులో హార్డ్‌వేర్ ఇంజనీర్.. ఇప్పుడేమో
అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మందలపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మందలపల్లి హరీష్‌కు వ్యవసాయం పట్ల ఎనలేని మక్కువ. చదువు, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ ఆలోచనలు మాత్రం నిరంతరం సొంత ఊరు, వ్యవసాయం చుట్టూ తిరిగేవి. ఎమ్మెస్సీ చదివి బెంగళూరులో ఒక కార్పొరేట్ కంపెనీలో హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా చిప్ డిజైనింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తూ వారాంతాల్లో స్వగ్రామానికి వచ్చి సొంత భూమిలో వ్యవసాయ పనులు చక్కబెట్టుకునే వారు. ప్రస్తుతం కరోనా వల్ల ఇంటి నుంచి పనిచేసే అవకాశం లభించడంతో.. పని గంటలు ముగిసిన తర్వాత.. పూర్తిస్థాయిలో వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు తనకు ఎదురైన ఆరోగ్య సమస్యలకు నగర కాలుష్యం, జీవనశైలి కారణాలని డాక్టర్లు చెప్పటంతో.. హరీష్ ఆహారపు అలవాట్లు మార్చుకొని చిరుధాన్యాలు తినడం ప్రారంభించారు. ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడడం మొదలైంది. దీంతో సొంత ఊర్లోనే అవసరమైన పంటలు పండించుకొని కాలుష్యానికి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా జీవించవచ్చని నిర్ణయించుకున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేశారు. పాలేకర్ చెప్పిన ప్రకృతి వ్యవసాయంలో ఆవు ప్రాముఖ్యత, గోమూత్రం, గోమయం వల్ల కలిగే వ్యవసాయ, ఆరోగ్య ప్రయోజనాలను అవగతం చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని పంచగవ్య విద్యాపీఠంలో సంవత్సరం పాటు శిక్షణ పొందారు. విద్యార్థి దశలో నేర్చుకున్న వేదం, పంచగవ్య శిక్షణకు ఎంతగానో దోహదపడిందని చెప్పారు. చిరుధాన్యాలతో తొలి ప్రయత్నం చిరుధాన్యాల వినియోగం పెరుగుతుండటంతో 18 ఎకరాలలో అరికలు, సామలు, ఊదలు, వరిగలు, కొర్రలు, అండు కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నల సాగును హరీష్ చేపట్టారు. తాను పండించడంతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా చిరుధాన్యాలు పండించేలా ప్రోత్సహిస్తుండటం విశేషం. పంటల చీడపీడలు, యాజమాన్య సమస్యలు అధిగమించేందుకు ఉమ్మడిగా పరిష్కారాలు వెతుక్కుంటూ పరస్పర సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కేవలం పంటలు పండించడం వరకే పరిమితం కాకుండా వాటికి విలువ జోడించడం ద్వారా ఆర్థికంగా లబ్ధి ఉంటుందని ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. తద్వారా తన పంటతో పాటు రైతుల పంటను కూడా ప్రాసెస్ చేశారు. తనకు తెలిసిన వినియోగదారులను నేరుగా సంప్రదించి వారికి చిరుధాన్యాలు సరఫరా చేశారు. రైతులు పండించిన పంటకు మాత్రం ప్రాసెసింగ్ చార్జీలు మాత్రమే తీసుకుని విలువ జోడింపు ద్వారా వచ్చిన మొత్తాన్ని వారికే అందేలా సహాయపడ్డారు. ప్రాసెసింగ్ చేసిన చిరుధాన్యాలకు మంచి ధర లభించడంతో రైతులంతా ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు. దేశీ వరి రకాల సాగు చిరుధాన్యాల ధరలు తగ్గడంతో ప్రస్తుతం 8 ఎకరాల్లో విస్తృతంగా అమ్ముడవుతున్న వరి సాగు మొదలు పెట్టారు హరీష్. నల్లబియ్యం, ఎర్రబియ్యపు దేశీయ వరి విత్తనాలను సాగు చేస్తున్నారు. నవారా, రాజముడి, రాక్తశాలి, చెన్నంగి, చిట్టిముత్యాలు, కాలాబట్టి, మణిపూర్ బ్లాక్ చఖావో, కర్పు కవునీ, సేలం సన్నాలు రకాలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే రసాయనాలు లేకుండా పండిస్తున్నారు. మిల్లెట్స్, మిల్లెట్స్‌ను యంత్రంతో శుద్ధిచేస్తున్న హరీష్ రసాయనాల అవశేషాలు లేని మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించాలనే ఆకాంక్షతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన హరీష్ ఇప్పుడు పలువురి జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్న, సన్న కారు రైతులకు ప్రకృతి వ్యవసాయం చేయడం, లాభసాటిగా గోశాల నిర్వహించడం పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని హరీష్ (76010 80665) అంటున్నారు. – ప్రసన్న కుమార్, బెంగళూరు ఇంటి వద్ద నుంచే హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూనే పూర్తిస్థాయి రైతుగా మారి స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు హరీష్. చిరుధాన్యాలు, దేశీ వరి రకాల సాగుపై దృష్టి సారించారు. చుట్టుపక్కల రైతుల ప్రయోజనం కోసం కూడా కృషి చేస్తూ ఈ హార్డ్‌వేర్ ఇంజనీర్ శభాష్ అనిపించుకుంటున్నారు. బ్లాక్ రైస్ కాలాబట్టి పొలంలో హరీష్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ // మీ అభిప్రాయాలు, సూచనలను prambabu.35@gmail.com కు పంపవచ్చు. -
T Works: ‘ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్’ సమస్యలకు చెక్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చిరునామాగా ఉన్న రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ రంగంలోనూ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తోంది. హార్డ్‌వేర్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం అవసరమైన ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, సెమీకండక్టర్లు స్థానికంగా లభించడం లేదు. అదీగాక ఆవిష్కర్తలు తమ డిజైన్లకు అవసరమైన ఎలక్ట్రానిక్స్ కాంపోనెట్స్ కోసం విదేశీ తయారీదారులపై ఆధారపడుతున్నా కస్టమ్స్ సమస్యలు, నాణ్యతలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం చొరవతో ఏర్పాటైన ‘టీ వర్క్స్’అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, సెమీకండక్టర్ల పంపిణీలో పేరొందిన ‘మౌసర్ ఎలక్ట్రానిక్స్’తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఆవిష్కర్తల ఆలోచనలకు ‘టీ వర్క్స్’రూపం హార్డ్‌వేర్ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ‘టీ వర్క్స్’ను ఏర్పాటు చేస్తోంది. 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ‘టీ వర్క్స్’250 రకాల పరిశ్రమలకు అవసరమయ్యే అత్యాధునిక ఉపకరణాలు అందుబాటులోకి తెస్తోం ది. 3డీ ప్రింటర్లు, యంత్రాల నిర్వహణలో ఉపయోగపడే సీఎన్సీ మెషీన్లు, లేజర్ కట్టర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు తయారీ (పీసీబీ ఫ్యాబ్రికేషన్) వంటి అత్యాధునిక ఉపకరణాలు ‘టీ వర్క్స్’లో ఉంటాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు తమ ఆలోచనలకు రూపమిచ్చేందుకు ‘టీ వర్క్స్’ ఉపయోగపడనుంది. హార్డ్‌వేర్ ప్రోటోటైపింగ్‌కు అవరోధాలు ‘టీ వర్క్స్’నిర్వహించిన ఇండియా స్టార్టప్ హార్డ్‌వేర్ సర్వే ప్రకారం హార్డ్‌వేర్ ప్రొటోటైపింగ్ రంగం అభివృద్దికి కస్టమ్స్ నిబంధనలు, విడి భాగాల కొనుగోలు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయి. మౌసర్తో భాగస్వామ్యం ద్వారా నాణ్యమైన, నమ్మకమైన విడిభాగాలు దొరకడంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం లభిస్తుంది. దీంతో స్టార్టప్‌లు, తయారీదారులు, ఎంఎస్ఎంఈలు సులభంగా ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, సెమీకండక్టర్లను కస్టమ్స్ సమస్యలు లేకుండా కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. తక్కువ సమయంలో తక్కువ ధరకు స్థానికంగా లభ్యం కాని సంక్లిష్ట విడిభాగాలనూ కొనుగోలు చేయొచ్చు. మరోవైపు ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, సెమీకండక్టర్ల తయారీదారులను ఒకే వేదిక మీదకు తీసుకురావడంతోపాటు వినియోగదారులకు తయారీదారులను చేరువ చేస్తుంది. వినియోగదారుల డిజైన్లకు అవసరమైన డేటా షీట్లు, డిజైన్ల వివరాలు, సాంకేతిక, ఇంజనీరింగ్ సమాచారాన్ని మౌసర్ ఎలక్ట్రానిక్స్ తన ‘టెక్నికల్ రిసోర్స్ సెంటర్’ద్వారా అందుబాటులోకి తెస్తుంది. మౌసర్ 223 దేశాల్లో 1,100 మంది ఉత్పత్తిదారులకు చెందిన 50లక్షల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 6.30లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ సంస్థతో భాగస్వామ్యం ద్వారా స్థానిక ఆవిష్కర్తలు ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారం దొరుకుతుందని ‘టీ వర్క్స్’సీఈఓ సుజయ్ కారంపూరి ‘సాక్షి’కి ధీమా వ్యక్తంచేశారు. చదవండి: Telangana: లాక్డౌన్ గైడ్‌లైన్స్ విడుదల చేసిన టీ సర్కార్ విమానం ఎక్కాలంటే ‘యాంటిజెన్’ మస్ట్ -
జూన్‌కల్లా ‘టీ–వర్క్స్’ తొలి దశ
సాక్షి, హైదరాబాద్: హార్డ్‌వేర్ స్టార్టప్ కంపెనీల కోసం ఉద్దేశించిన టీ–వర్క్స్ ఇంక్యుబేటర్ డిజైన్లకు తుది ఆమోదం లభించిందని, ఈ డిజైన్ల ప్రకారం టీ–వర్క్స్ తొలిదశ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పరిశ్రమలు, ఐటీ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్‌లోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. టీ–వర్క్స్ పనులను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. టీ–క్లౌడ్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఇలాంటి ప్రాజెక్టులు అమలు చేసిన రాష్ట్రాలు లేదా దేశాల అనుభవాలను అధ్యయ నం చేయాలని సూచించారు. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు పనులను వేగంగా పూర్తి చేయాలని, ఇప్పటికే పార్కులో పెట్టుబడులకు అంగీకరించిన కంపెనీల కార్యకలాపాలు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డి సహకారం తీసుకోవాలని కేటీఆర్ టీఎస్ఐఐసీ అధికారులకు సూచించారు. ఇంటింటికీ ఇంటర్నెట్ కోసం ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ (టీ–ఫైబర్) ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాలను రానున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్వర్క్ (టీడీఎన్) ద్వారా ప్రదర్శించాలన్నారు. వేగంగా పనులు... టీ–ఫైబర్, టీ–వర్క్స్, టీ–క్లౌడ్ ప్రాజెక్టుల పురోగతిపై కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. టీ–ఫైబర్ ఆధ్వర్యంలో చేపడుతున్న టీడీఎన్ మరో 2 వారాల్లో పూర్తవుతుందని అధికారులు వివరించారు. మహేశ్వరం మండలంలోని 4గ్రామాల్లో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, ఇవి పూర్తయితే ఈ–హెల్త్, ఈ–ఎడ్యుకేషన్, ఈ–గవర్నెన్స్ రంగాల్లో రానున్న మార్పులను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే వారంలో ఈ నెట్‌వర్క్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌ను ఆదేశించారు. వరంగల్ మెగాటెక్స్‌టైల్ పార్కులో అవసరమైన ప్రభు త్వ కార్యాలయాల ఏర్పాటుకు రెవెన్యూశాఖ 20 ఎకరాల స్థలాన్ని కోరినట్లు అధికారులు తెలిపారు. పార్కుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇప్పటికే వచ్చాయని, లే అవుట్ పూర్తయిందని, రోడ్లు, నీటి సౌకర్యాల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రికి వివరించారు. నీటి సౌకర్యం కోసం ఇప్పటికే రూ. 50 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయని, టెక్స్టైల్ పార్కు పనులు సకాలంలో పూర్తి చేస్తామని మంత్రికి అధికారులు వివరించారు. డ్రై పోర్టులపై.... రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రై పోర్టుల గురించి కూడా కేటీఆర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. డ్రై పోర్టుల కోసం గతంలో గుర్తించిన భువనగిరి, జహీరా బాద్, జడ్చర్లతోపాటు రాష్ట్రానికి నలువైపులా ఉన్న మరిన్ని ప్రాంతాలనూ పరిశీలించాలన్నా రు. టీఎస్ఐఐసీ చేపట్టిన మెడికల్ డివైసెస్ పార్కు పురోగతి, దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ పార్కు, జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్), మెగా ఫుడ్ పార్కు, సీడ్ పార్కు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, టీ–ఫైబర్ ఎండీ సుజయ్ కారంపూరిలతోపాటు పరిశ్రమలు, ఐటీశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
డ్వామా పీడీ వైవీ గణేశ్ ఉపాధి హామీ లైఫ్ ప్రాజెక్టుపై అవగాహన ముకరంపుర : ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను సద్వినియో గం చేసుకుని అభివృద్ధి చెందాలని డ్వామా పీడీ వైవీ గణేశ్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి, నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలపై గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వం కొత్తగా లైఫ్ ప్రాజెక్టు కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఉపాధిహామీలో రెండేళ్లపాటు వందరోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబంలోని 18-35 సంవత్సరాల యువతీయువకులను గుర్తించి వివిధ విభాగాల్లో శిక్షణ ఇప్పించి ఉపాధిమార్గం చూపుతామన్నారు. వంద పనిదినాలు పూర్తిచేసిన కుటుంబాల్లో 12,857మందిని ఈ కార్యక్రమానికి ఎంచుకోగా.. 805 మందిని వృత్తి నైపుణ్యత శిక్షణకు, 693 మందిని స్వయం ఉపాధికి, 803మందిని జీవనోపాధికి ఎంపిక చేసినట్లు తెలిపారు. లేడీస్ టైలరింగ్, ఎలక్ట్రిక్ మోటార్ రివైండింగ్, పంప్సెట్ల నిర్వహణ, టీవీ, డీవీడీలు, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్ రిపేరింగ్, డెరుురీ నిర్వహణ, గొర్రెల పెంపకం, అగర్బత్తుల తయారీ, పేపర్బ్యాగ్లు, పేపర్ ప్లేట్ల తయారీ, బ్యూటీపార్లర్ నిర్వహణ, సెల్ఫోన్ల రిపేరు, కంప్యూటర్ హార్డ్‌వేర్, కంప్యూటర్ బేసిక్స్, లైట్ మోటార్ వాహనాల డ్రైవింగ్, బొమ్మల తయారీ, కూరగాయ ల నర్సరీ, సాగు, దుస్తుల అద్దకం, కొవ్వొత్తుల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు న్యాక్ ద్వారా ఎలక్ట్రీషియన్, ప్లంబర్ తదితర డిమాండ్ ఉన్న వృత్తులలో శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తమ అభిరుచిని బట్టి శిక్షణకు కార్యక్రమ స్థలివద్ద ఉన్న స్టాల్స్‌లో పలువురు పేర్లు న మోదు చేసుకున్నారు. మైనార్టీ ఈడీ హమీద్, జిల్లా ఉపాధికల్పనాధికారి రవీందర్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, ఎస్బీహెచ్ మేనేజర్ జయప్రకాశ్, నాక్ డెరైక్టర్ హేమా బూక్యా , వారధి కార్యదర్శి ఆంజనేయులు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా ప్రాంగణం మేనేజర్ ఉమారాణి, ఉపాధికూలీల కుటుంబాలు పాల్గొన్నారు. -
ఫార్మాసిటీై పె అపోహలొద్దు
- పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు - ఫార్మాసిటీ, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్ సిటీ భూముల పరిశీలన కందుకూరు: ఫార్మాసిటీ ఏర్పాటు పై అపోహలు వద్దని, కాలుష్యరహిత కంపెనీలనే స్థాపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 288లోని ప్రభుత్వం ఫార్మాసిటీకి కేటాయించిన భూములను టీఎస్ఐఐసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. భూములకు సంబంధించిన మ్యాప్‌లను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్మాసిటీకి 11 వేల ఎకరాలను సేకరిస్తున్నామని, మొదటి విడతలో మూడు వేల ఎకరాల్లో పనులు ప్రారంభించనున్నామని వెల్లడించారు. అందుకుగాను రహదారుల నిర్మాణం, నీరు, విద్యుత్ వంటి వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. ఎవరికి ఇబ్బంది లేకుండా వంద అడుగుల మేర రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని సూచించారు. కాలుష్యంలేని కంపెనీలను స్థాపించడానికి సీఎం కేసీఆర్ దీక్షతో పనిచేస్తున్నారని కొనియాడారు. సాగు నీరుతోపాటు పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తొలగించాలన్న సంకల్పంతో పని చేస్తున్నామన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని, గిట్టనివారు చేసే తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్దన్నారు. మున్నుందు ఉజ్వల భవిష్యత్ ఉందని, జాతీయిస్థాయిలో ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. నైపుణ్యంలేని వారికి సైతం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నామన్నారు. అంతకుముందు మహేశ్వరం మండలంలోని హార్డ్‌వేర్ పార్కు, ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఎన్ని కంపెనీలు ఏర్పాటు జరిగింది.. ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారు.. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. రవాణా సదుపాయాలు, కంపెనీల విస్తరణకు ఆటంకంగా మారిన కోర్టు కేసుల విషయమై టీఎస్ఐఐసీ అధికాారులతో చర్చించారు. ఆయన వెంట టీఎస్ఐఐసీ ఈడీ ఈవీ.నర్సింహారెడ్డి, జోనల్ మేనేజర్ కె.శ్యాంసుందర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పి. శ్రావణ్‌కుమార్, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ దేవరాజ్, ఉప తహసీల్దార్ వెంకటేష్, స్థానిక సర్పంచ్ గోవర్ధన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆండ్రాయిడ్ వన్ వచ్చేసింది!
రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్... బోలెడు వినూత్న ఫీచర్లు.. అయినా సరే... ఐటీ రంగం దిగ్గజం గూగుల్... ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎందుకు? ఏమిటి? ఎలా..? సరిగ్గా రెండు రోజుల క్రితం మూడు భారతీయ కంపెనీలు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఆండ్రాయిడ్ వన్’తోపాటు ఈ మూడు కంపెనీలు వేర్వేరు పేర్లతో విడుదల చేసిన ఫోన్లన్నింటిలోనూ ఫీచర్లు అన్నీ ఒకటే! ఎందుకిలా? ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇతరుల కంటే ఎక్కువ ఫీచర్లు అందివ్వడం ద్వారా ఎక్కువ ఫోన్లు అమ్ముకోవాలని ఎవరైనా ఆలోచిస్తారు. దీనికి భిన్నంగా మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్ టెలికామ్ కంపెనీలు కొత్త స్మార్ట్ఫోన్ల విడుదల చేసేందుకు కారణం.. ఇంటర్నెట్ సెర్చింజిన్ గూగుల్! సెర్చింజిన్‌ను నడపడంతోపాటు గూగుల్ అనేక ఇతర రంగాల్లోనూ పనిచేస్తోందని అందరికీ తెలుసు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్సిస్టమ్ కూడా వీటిల్లో ఒకటి. అప్పుడప్పుడూ కొత్త కొత్త పేర్లతో ఆపరేటింగ్ సిస్టమ్‌లను విడుదల చేయడం... వాటిని ఉపయోగించుకుని కంపెనీలు సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయడం.. ఇదీ ఇప్పటివరకూ నడిచిన వ్యవహారం. అయితే ప్రపంచవ్యాప్తంగా... మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను చేజిక్కించుకునేందుకు, తన ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్లు అమ్మే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వాణిజ్యాని పెంచుకునే లక్ష్యంతో గూగుల్ తాజాగా చేస్తున్న ప్రయత్నం ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ఫార్మ్. లేటెస్ట్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్... ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ఫార్మ్ ద్వారా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లన్నింటిలోనూ లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకోలా చెప్పాలంటే అతితక్కువ ఖర్చుతో మెరుగైన ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కునేందుకు ఆండ్రాయిడ్ వన్ అవకాశం కల్పిస్తోంది. 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఒక జీబీ ర్యామ్, నాలుగు నుంచి 8 జీబీల మెమరీ, అయిదు మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెళ్ల సెల్ఫీ కెమెరా... 4.5 అంగుళాల స్క్రీన్. ఇవీ వన్ ప్లాట్‌ఫార్మ్‌లోని ప్రధాన ఫీచర్లు. కొద్దిపాటి తేడాలతో అన్నింట్లోనూ ఒకే రకమైన అప్లికేషన్లు ఇన్‌బిల్ట్‌గా వచ్చాయి. ధర కూడా రూ.6299 నుంచి రూ.6499 మధ్యలోనే ఉండటం గమనార్హం. ఇక సాఫ్ట్వేర్ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ వన్ కొన్నవారు సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం మళ్లీ డబ్బు చెల్లించాల్సిన అసలు లేదంటోంది గూగుల్. భవిష్యత్తులో విడుదలయ్యే కొత్త ఓఎస్లన్నింటినీ ఈ ఫోన్లకు అందిస్తామని, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూంటామని ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ ఓఎస్‌లో కొన్ని మార్పులు చేసి ఉపయోగించుకునే కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 500 కోట్ల మందికి స్మార్ట్ఫోన్లు లక్ష్యం ప్రపంచ జనాభాలో స్మార్ట్ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య 200 కోట్లకు మించదని అంచనా. ఈ నేపథ్యంలో మిగిలిన 500 కోట్ల మంది చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు ఉంచడమే లక్ష్యంగా గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ఫార్మ్ను అభివృద్ధి చేసింది. వీరిలో వందకోట్ల మంది ఒక్క భారత్‌లోనే ఉన్నారని అంచనా. పైగా గత నాలుగేళ్లలో భారత్‌లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువైన నేపథ్యంలో ఇక్కడి మార్కెట్‌పై గూగుల్ కన్ను పడింది. స్మార్ట్ఫోన్లు తయారు చేయాలంటే అది ఆండ్రాయిడ్ వన్లా ఉండాలని ఎవరైనా అనుకునేలా చేయాలన్నది గూగుల్ లక్ష్యం. అందుకే వేర్వేరు కంపెనీల భాగస్వామ్యంతో ఒకే రకమైన ఫీచర్లు ఉన్న స్మార్ట్ఫోన్ల తయారీకి చొరవ చూపింది. తద్వారా మైక్రోసాఫ్ట్, బ్లాక్‌బెర్రీ, సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న శాంసంగ్కూ చెక్ పెట్టింది. స్థానిక భాషలకు ప్రాముఖ్యత... ఆండ్రాయిడ్ వన్‌లో ఉన్న మరో ప్రముఖమైన ఫీచర్ స్థానిక భాషలకు సపోర్ట్. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ ఫీచర్‌ను తమ ఫోన్లలో చేర్చినప్పటికీ ఆండ్రాయిడ్ వన్‌లో భాగం కావడం వల్ల దీని ప్రాధాన్యత పెరుగుతుంది. దాదాపు ఏడు భాషల్లో పనిచేయించుకోగల అవకాశం ఉండటం వల్ల ఆయా భాషల్లో కొత్త కొత్త అప్లికేషన్ల తయారీకి మార్గం సుగమం అవుతుందని గూగుల్ అంచనా. అంతేకాదు... త్వరలో గూగుల్ తన ‘న్యూస్‌స్టాండ్’ అప్లికేషన్‌ను కూడా స్మార్ట్ఫోన్లకు అందుబాటులోకి తేనుంది. స్థానిక పత్రికల డిజిటల్ ఎడిషన్లను వీటి ద్వారా చూసుకోవచ్చునన్నమాట. మొత్తంమ్మీద ఇంటర్నెట్లో గూగుల్ ద్వారా సృష్టించిన సంచలనాన్ని స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనూ పునరావృతం చేసేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నం ఫలిస్తే వినియోగదారులకు మరింత మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. -
విప్రో బాటలోనే HCL టెక్నాలజీస్