మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన గూగుల్‌.. కారణం? | Google Apologises To India About Gemini Comments On PM Modi | Sakshi
Sakshi News home page

మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన గూగుల్‌.. కారణం?

Published Mon, Mar 4 2024 2:41 PM | Last Updated on Mon, Mar 4 2024 3:49 PM

Google Apologises To India About Gemini Comments On PM Modi - Sakshi

గూగుల్‌ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ ‘జెమిని’ ఓ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోదీపై ఇచ్చిన వివాదాస్పద సమాధానం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో కేంద్రం గూగుల్‌కు నోటీసులు పంపింది.

దీనిపై తాజాగా గూగుల్‌ క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా తమ ప్లాట్‌ఫామ్‌ను ‘నమ్మదగినది కాదు’ అని పేర్కొంది. ఈమేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఈ విషయాన్ని తెలిపారు.

‘ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని గూగుల్‌కు చెందిన ‘జెమిని’ను ఇటీవల ఓ నెటిజన్‌ అడగ్గా.. మోదీ అవలంబించిన విధానాల వల్ల కొంత మంది ఆయనను ఫాసిస్టు అని పిలిచారని ఆ ఏఐ టూల్‌ వివాదాస్పద సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అడగ్గా స్పష్టంగా చెప్పలేమంటూ ఆచితూచి జవాబిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఓ జర్నలిస్టు ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్‌ చేయగా అవి వైరల్‌ అయ్యాయి. దీంతో ‘జెమిని’పై విమర్శలు వ్యక్తమయ్యాయి. గూగుల్ ఏఐ టూల్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు.

ఇదీ చదవండి: ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే..

ఈ వ్యవహారాన్ని కేంద్రం తీవ్రంగా స్పందించింది. గూగుల్‌కు నోటీసులిచ్చింది. దీనిపై గూగుల్‌ తన స్పందనగా క్షమాపణలు చెప్తూ.. తమ ప్లాట్‌ఫామ్‌ను ‘నమ్మదగినది కాదని’ పేర్కొన్నట్లు మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. దేశంలో ఏఐ ఉత్పత్తులను లాంచ్‌ చేయాలంటే సంబంధిత ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. దీనిపై గందరగోళం నెలకొంది. అయితే ఈ విషయంలో స్టార్టప్‌లకు మినహాయింపును ఇచ్చినట్లు మంత్రి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement