ఇలాన్ మస్క్ ప్రముఖ జనరేటివ్ ఏఐ టూల్ ఓపెన్‌ఏఐతో తన న్యాయ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాడు. ఓపెన్‌ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమేరకు కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశాడు.
ఓపెన్‌ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్‌మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ ఇటీవల కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్‌ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్‌ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.
ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!
ఈ వ్యాజ్యంలో ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్, మైక్రోసాఫ్ట్, పలువురు బోర్డు సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ సెర్చ్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓపెన్‌ఏఐను స్థాపించామని, కానీ అందుకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యాపార ధోరణిను అవలంభిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment