
న్యూఢిల్లీ: దేశంలో 90 శాతం ఆర్థిక సంస్థలు కృత్రిమ మేథ (ఏఐ)కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. జెనరేటివ్ ఏఐని ఆవిష్కరణలకు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంగా పేర్కొంది. డేటా అనలైటిక్స్ సైతం కీలకంగా మారుతున్నట్టు 74 శాతం ఆర్థిక సంస్థలు పీడబ్ల్యూసీ ఇండియా సర్వేలో భాగంగా వెల్లడించాయి. నిర్ణయాలు తీసుకోవడంలో దీని సమగ్రమైన ప్రాధాన్యతను వెల్లడించాయి. ఈ సర్వేలో 31 బ్యాంక్‌లు, బీమా సంస్థలు, ఫిన్‌టెక్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
పరిశ్రమ అభిప్రాయాలు..
» కస్టమర్లను సొంతం చేసుకోవడం, వారికి మెరుగైన అనుభవాన్ని ఇవ్వడం నూతన ఆవిష్కరణలకు కీలకమని 84 శాతం సంస్థలు తెలిపాయి.
» ఉత్పత్తుల పంపిణీ అన్నది ఆవిష్కరణలకు కీలకమని 50 శాతం సంస్థలు పేర్కొన్నాయి.
» రిస్క్‌ను పరిమితం చేయడం, మారుతున్న నియంత్రపరమైన నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం కీలకమైనవిగా 65 శాతం సంస్థలు చెప్పాయి. ఆవిష్కరణల విషయంలో నియంత్రణ పరమైన అవరోధాలను అధిగమించడం కీలకమని తెలిపాయి.
» ప్రధానంగా అంతర్గత చర్యల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని 45 శాతం ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. ‘‘ఫిన్‌టెక్ పరిశ్రమ అభివృద్ధి చెందే క్రమంలో వృద్ధికి.. డిజిటల్ భద్రత, నియంత్రణపరమైన నిబంధనల అమలుకు మధ్య సమతూకం అవసరం. నిబంధనల అమలు భాగస్వామ్యాల ద్వారా మారుతున్న నియంత్రపరమైన మార్పులను అధిగమించొచ్చు’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్ మిహిర్ గాంధీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment