PwC report
-
క్రెడిట్ కార్డ్.. గీత దాటొద్దు..!
క్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి యాక్టివ్ కార్డులు 10 కోట్ల మార్క్‌ను దాటగా.. వచ్చే ఐదేళ్లలో (2029 మార్చి నాటికి) 20 కోట్లకు పెరుగుతాయని పీడబ్ల్యూసీ అంచనా. యూపీఐ దెబ్బకు డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. చెల్లింపులకు వచ్చే సరికి యూపీఐ తర్వాత క్రెడిట్ కార్డుల హవాయే నడుస్తోంది. బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ ఉంటేనే యూపీఐ. బ్యాలన్స్ లేకపోయినా క్రెడిట్ (అరువు)తో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వీలు కల్పిస్తాయి. అందుకే వీటి వినియోగం పట్ల ఆసక్తి పెరుగుతూ పోతోంది. కానీ, క్రెడిట్ కార్డ్‌లను ఇష్టారీతిన వాడేయడం సరికాదు. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్‌లో రుణాల అర్హతకు గీటురాయిగా మారుతుంది. రుణ ఊబిలోకి నెట్టేసే ప్రమాదం లేకపోలేదు. క్రెడిట్ కార్డుపై లిమిట్ ఎంత? ఎంత వ్యయం చేయాలి? గీత దాటితే ఏమవుతుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఇప్పడంతా డిజిటల్ చెల్లింపులే. కరోనా విపత్తు తర్వాత నుంచి నగదు చెల్లింపులు గణనీయంగా తగ్గిపోయాయి. వినియోగదారులు నగదుకు బదులు క్రెడిట్ కార్డుతో షాపింగ్‌కు వెళితే మరింత ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పైగా గతంతో పోలిస్తే జీనవశైలి ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో క్రెడిట్ కార్డుల స్వైపింగ్ మితిమీరుతోంది. పండుగల సందర్భంగా ఆకర్షించే ఆఫర్లు కూడా ఇందుకు ఒక కారణం. కార్డు ఉంది కదా అని చెప్పి ఇష్టారీతిన ఖర్చు చేస్తే.. తిరిగి చెల్లించేటప్పుడు ఆ భారం మోయాల్సి వస్తుంది. పైగా క్రెడిట్ స్కోర్‌ను ఇది ప్రతికూలంగా ప్రభావితం చేయగలదు. అందుకే క్రెడిట్ కార్డు వినియోగం విషయమై ప్రతి ఒక్కరూ అవగాహనతో, బాధ్యతతో వ్యవహరించాలి. క్రెడిట్ లిమిట్ కార్డుపై ఉన్న గరిష్ట వ్యయ పరిమితి ఇది. ఏ కాలంలో అయినా ఈ మేరకు గరిష్టంగా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్న మేర తదుపరి గడువు నాటికి పూర్తిగా చెల్లించేస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ఆదాయం, వ్యక్తిగత ఆర్థిక చరిత్ర, రిస్క్ ఆధారంగా క్రెడిట్ లిమిట్‌ను కార్డు జారీ సమయంలోనే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తుంటాయి. కార్డుపై వినియోగం, చెల్లింపుల తీరు ఆధారంగా తర్వాతి కాలంలో ఈ లిమిట్‌ను సవరించుకునే అవకాశం ఉంటుంది. వినియోగం కార్డుపై క్రెడిట్ లిమిట్ రూ.లక్ష ఉందనుకుంటే.. గరిష్టంగా రూ.లక్ష వరకు వినియోగించుకోవచ్చని అర్థం. ఇలా పూర్తి పరిమితి మేర ప్రతి నెలా కార్డు ఖర్చు చేస్తుంటే అది క్రెడిట్ స్కోర్‌కు ఏ మాత్రం మంచిది కాదు. క్రెడిట్ వినియోగ నిష్పత్తి (సీయూఆర్) అని ఒకటి ఉంటుంది. రూ.లక్ష క్రెడిట్ లిమిట్ ఉన్నప్పుడు ఒక నెలలో రూ.90,000 ఖర్చు పెట్టారని అనుకుందాం. అప్పుడు సీయూఆర్ 90 శాతం అవుతుంది. ‘‘అధిక క్రెడిట్ వినియోగ నిష్పత్తి రుణ దాహార్తిని తెలియజేస్తుంది. ఇది క్రెడిట్ స్కోర్‌ను తగ్గించేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో సీయూఆర్ దాటి ఖర్చు చేయడం తప్పు కాదు. కానీ అది అరుదుగానే ఉండాలి. సీయూఆర్ 30 శాతం మించకుండా చూసుకుంటేనే మంచిది. కార్డుపై బకాయి మొత్తాన్ని గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి. ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. దీనివల్ల తర్వాతి కాలంలో క్రెడిట్ లిమిట్‌ను సులభంగా పెంచుకోవచ్చు. రుణాలను తక్కువ వడ్డీ రేటుకు పొందొచ్చు’’అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. సాధారణంగా సీయూఆర్ 70 శాతం మించితే అది క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఖర్చులపై నియంత్రణలేమిని, బలహీన ఆర్థిక పరిస్థితులను ఇది తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్‌పై రిమార్క్ కార్డు బకాయిల తిరిగి చెల్లింపులు తీరు క్రెడిట్ స్కోర్‌పై 35 శాతం మేర ప్రభావం చూపిస్తుందని బ్యాంక్ బజార్ చెబుతోంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ కొనసాగాలంటే సకాలంలో బకాయిలు చెల్లించడం ఎంతో అవసరం. లేదంటే అధిక వడ్డీలకుతోడు, ఆలస్య రుసుములు చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. క్రెడిట్ వినియోగ రేషియో అధికంగా ఉన్నా, క్రెడిట్ ఓవర్ లిమిట్‌కు వెళ్లినా కానీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోరును లెక్కించే సందర్భంగా తక్కువ సీయూఆర్‌ను సానుకూలంగా చూస్తామని క్రిఫ్ హైమార్క్ (క్రెడిట్ బ్యూరో) మాజీ ఎండీ సంజీత్ దావర్ తెలిపారు.క్రెడిట్ ఓవర్ లిమిట్ ఒక బిల్లు సైకిల్ పరిధిలో క్రెడిట్ లిమిట్‌ను మొత్తం వాడేస్తే.. తదుపరి చెల్లింపులకు అవకాశం ఉండదు. కానీ, క్రెడిట్ స్కోర్ అధికంగా ఉన్న వారికి ఇందులో వెసులుబాటు ఉంది. క్రెడిట్ ఓవర్ లిమిట్ సదుపాయం వినియోగించుకోవచ్చు. కార్డు లిమిట్ పూర్తయినప్పటికీ.. అదే కార్డుపై మరింత లిమిట్ తీసుకోవచ్చు. ఇందుకు అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ‘‘కొన్ని సందర్భాల్లో మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న కస్టమర్లకు తాత్కాలికంగా క్రెడిట్ లిమిట్‌ను బ్యాంక్‌లు పెంచుతాయి. ఇందుకోసం ముందుగానే సంప్రదించాలి. కొన్ని కార్డు సంస్థలు క్రెడిట్ లిమిట్ మించిపోయినప్పటికీ, లావాదేవీలను అనుమతిస్తుంటాయి. కాకపోతే అందుకు ఓవర్ లిమిట్ ఫీజు వడ్డిస్తాయి. పెనాల్టీ వడ్డీ రేట్లను కొన్ని అమలు చేస్తాయి. ఇవి సాధారణ రేట్ల కంటే అధికంగా ఉంటాయి’’అని ఆదిల్ శెట్టి వివరించారు. క్రెడిట్ ఓవర్ లిమిట్‌పై చార్జీలు అన్ని క్రెడిట్ కార్డు సంస్థల్లో ఒకే విధంగా ఉండవు. కొన్ని బ్యాంక్‌లు 2.5 శాతం లేదా కనీసం రూ.550, కొన్ని సంస్థలు 3 శాతం చొప్పున చార్జీ వసూలు చేస్తున్నాయి. క్రెడిట్ ఓవర్ లిమిట్ ఆప్షన్‌తో కొన్ని ప్రత్యేక కార్డులు కూడా ఉన్నాయి. లేని వారు బ్యాంక్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో తప్పించి, దీన్నొక అలవాటుగా మార్చుకోకూడదు. ఒకరికి ఎన్ని కార్డులు ‘‘అందరికీ ఒక్కటే సూత్రం వర్తించదు. ఆర్థిక పరిస్థితులు, ఖర్చు చేసే అలవాట్లపై ఎన్ని క్రెడిట్ కార్డులు అన్నది ఆధారపడి ఉంటుంది. బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, సకాలంలో చెల్లింపులు చేసే వారు ఎన్ని కార్డులు అయినా కలిగి ఉండొచ్చు. కాకపోతే ఒకరికి రెండు లేదా మూడు కార్డులు మించి ఉండరాదన్నది సాధారణ సూత్రం’’అని మై మనీ మంత్ర వ్యవస్థాపకుడు రాజ్‌ఖోస్లా వివరించారు. ఆన్లైన్ చెల్లింపులకు వినియోగించేందుకు తక్కువ లిమిట్‌తో ఒక కార్డు, ఇతర ముఖ్యమైన, అత్యవసరాల కోసం మరొక కార్డు కలిగి ఉండొచ్చని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు విశాల్ ధావన్ సూచించారు. మినిమం డ్యూ ఒక నెలలో కార్డుపై చేసిన వ్యయం మొత్తాన్ని బిల్లు జారీ చేసిన నాటి నుంచి 20 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం చెల్లించే వెసులుబాటు లేకపోతే, మినిమం డ్యూ అమౌంట్ అని ఉంటుంది. అంత చెల్లించినా సరిపోతుంది. మొత్తం బిల్లులో ఇది సుమారు 5 శాతంగా ఉంటుంది. అప్పుడు మిగిలిన బకాయిపై నెలవారీ 3 శాతానికి పైనే వడ్డీ రేటు పడిపోతుంది. ఇతర చార్జీలు కూడా చెల్లించుకోవాలి. మినిమం డ్యూ అమౌంట్ చెల్లించడం చెల్లింపుల వైఫల్యం కిందకు రాదు. బకాయి మొత్తాన్ని వెంటనే చెల్లించలేని వారు పెద్ద లావాదేవీలను ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. లేదంటే లోన్ ఎగైనెస్ట్ క్రెడిట్ కార్డ్ (కార్డుపై రుణం) ఆఫర్‌ను వినియోగించుకోవడం ద్వారా రుణం పొంది సత్వర చెల్లింపుల నుంచి గట్టెక్కొచ్చు. క్రెడిట్ లిమిట్ కార్డుపై ఉన్న గరిష్ట వ్యయ పరిమితి ఇది. ఏ కాలంలో అయినా ఈ మేరకు గరిష్టంగా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్న మేర తదుపరి గడువు నాటికి పూర్తిగా చెల్లించేస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ఆదాయం, వ్యక్తిగత ఆర్థిక చరిత్ర, రిస్క్ ఆధారంగా క్రెడిట్ లిమిట్‌ను కార్డు జారీ సమయంలోనే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తుంటాయి. కార్డుపై వినియోగం, చెల్లింపుల తీరు ఆధారంగా తర్వాతి కాలంలో ఈ లిమిట్‌ను సవరించుకునే అవకాశం ఉంటుంది. లిమిట్ పెంచుకోవచ్చు.. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండి, కార్డుపై అధిక వ్యయం చేసే వారికి ఉచితంగా లిమిట్‌ను పెంచుకునేందుకు బ్యాంక్‌లు ఆఫర్లు ఇస్తుంటాయి. లేదంటే ఎవరికి వారే స్వచ్ఛందంగా కార్డు సంస్థను సంప్రదించి లిమిట్ పెంచాలని కోరొచ్చు. వినియోగం 70–80 శాతం దాటుతున్న వారు ప్రస్తుత కార్డుపైనే లిమిట్‌ను పెంచుకోవడం లేదంటే మరో కార్డు తీసుకుని వ్యయాలను రెండు కార్డుల మధ్య వైవిధ్యం చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. దీనివల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్)ను తగ్గించుకోవచ్చు. స్వీయ నియంత్రణ క్రెడిట్ కార్డుపై వాస్తవ రుణ పరిమితి (క్రెడిట్ లిమిట్) కంటే తక్కువ లిమిట్‌ను ఎవరికి వారే విధించుకోవచ్చు. దీనివల్ల వ్యయాలపై నియంత్రణ సాధ్యపడుతుంది. బ్యాంక్/ఎన్బీఎఫ్సీ యాప్ ద్వారా క్రెడిట్ లిమిట్లో మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.3 లక్షల క్రెడిట్ లిమిట్ ఉన్నప్పుడు రూ.లక్ష పరిమితిని సొంతంగా నిర్ణయించుకోవచ్చు. అటువంటప్పుడు కార్డుపై ఒక నెలలో వ్యయం రూ.లక్షకు చేరగానే తదుపరి చెల్లింపులు తిరస్కరణకు గురవుతాయి. ఎలాంటి పెనాల్టీ చార్జీలు పడవు. ఖర్చులు చేయిదాటిపోకుండా, గుర్తు చేసేందుకు ఈ సదుపాయం అక్కరకు వస్తుంది. యాప్‌లోకి వెళ్లి ఈ పరిమితిలో ఎప్పుడైనా మార్పులు చేసుకోవచ్చు. లాభ–నష్టాలు.. → అధిక లిమిట్ అత్యవసర వైద్యం, ప్రయాణాలప్పుడు ఆదుకుంటుంది. → కార్డులు పెరిగేకొద్దీ వాటిపై వ్యయాలు కూడా ఇతోధికం అవుతుంటాయి. అన్నీ కలసి రుణ భారాన్ని పెంచేస్తాయి. → స్వీయ నియంత్రణ లేనట్టయితే, అధిక క్రెడిట్ లిమిట్ విషయంలో హద్దులేనట్టుగా వ్యవహరించినట్టయితే రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఎదురవుతుంది. → కార్డులు ఎక్కువైనప్పుడు వాటి వేర్వేరు గడువు తేదీలను గుర్తు పెట్టుకుని, సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. → చెల్లింపుల వైఫల్యాలు, అధిక క్రెడిట్ వినియోగం క్రెడిట్ స్కోర్‌ను తగ్గించేస్తాయి. → బాధ్యతతో, వివేకంతో వినియోగిస్తే క్రెడిట్ కార్డు ద్వారా తగ్గింపు ఆఫర్లు పొందొచ్చు. వినియోగంపై రివార్డు పాయింట్లను కూడా పొందొచ్చు. క్రెడిట్ స్కోరును బలోపేతం చేసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
గేమింగ్.. జూమింగ్
న్యూఢిల్లీ: దేశంలో గేమింగ్ పరిశ్రమ రానున్న మూడేళ్లలో రెట్టింపు కానుంది. 2028 నాటికి రూ.66,000 కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. తద్వారా ఈ రంగంలో రెండు నుంచి మూడు లక్షల మందికి అదనంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. ఆర్థికాభివృద్ధికి తోడు, సాంస్కృతిక వైభవం గేమింగ్ పరిశ్రమ వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. ‘ఫ్రమ్ సన్‌రైజ్ టు సన్‌షైన్:..’ పేరిట భారత గేమింగ్ పరిశ్రమపై పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. ఢిల్లీలో ఇండియా గేమింగ్ కన్వెన్షన్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కారాలను సూచించింది. ఏటా 15 శాతం చొప్పున.. భారత ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ 2023 నాటికి రూ.33,000 కోట్లుగా ఉంది. 2023 నుంచి 2028 వరకు ఏటా 14.5 శాతం చొప్పున కాంపౌండ్ అవుతూ రూ.66,000 కోట్లకు చేరుకుంటుంది. ఈ సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలుగా అవకాశాలను సొంతం చేసుకోవాలంటే అందుకు పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాలి. ఆన్లైన్ గేమింగ్‌లో అదిపెద్ద ఉప విభాగమైన రియల్ మనీ గేమింగ్ మార్కెట్ 2028 నాటికి రూ.26,500 కోట్లకు చేరుకోవచ్చు. గేమింగ్ పరిశ్రమ వచ్చే కొన్నేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 2–3 లక్షల మందికి ఉపాధికలి్పంచడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థపై చెప్పుకోతగ్గ ప్రభావాన్ని చూపిస్తుంది. సవాళ్లు–మార్గాలు.. గేమింగ్ రంగం వృద్ధి ప్రధానంగా పన్ను అంశాల పరిష్కారం, నియంత్రణపరమైన స్పష్టతపైనే ఆధారపడి ఉంటుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక స్పష్టం చేసింది. నియంత్రణ పరమైన అనుసంధాన లేమి, అధిక జీఎస్టీ కారణంగా నిలకడలేని వ్యాపార నమూనా, గేమింగ్ మానిటైజేషన్ విషయంలో ఉన్న నైతిక అంశాలు, నైపుణ్యాల అంతరం, భాగస్వాముల ప్రయోజనాల విషయంలో సమతుల్యం, గేమర్ల మానసిక ఆరోగ్యం, ప్లేయర్ల ఎంగేజ్మెంట్, సాంస్కృతిక సంబంధిత గేమ్‌ల రూపకల్పన, గేమింగ్ కెరీర్ పట్ల సమాజంలో ఉన్న భావనలు మార్చడం, చట్టవిరుద్ధమైన గ్యాంబ్లింగ్‌ను కట్టడి చేయడం వంటి సవాళ్లను ప్రస్తావించింది. -
ఆర్థిక సేవల్లో ఏఐ, జెనరేటివ్ ఏఐ కీలకం
న్యూఢిల్లీ: దేశంలో 90 శాతం ఆర్థిక సంస్థలు కృత్రిమ మేథ (ఏఐ)కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. జెనరేటివ్ ఏఐని ఆవిష్కరణలకు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంగా పేర్కొంది. డేటా అనలైటిక్స్ సైతం కీలకంగా మారుతున్నట్టు 74 శాతం ఆర్థిక సంస్థలు పీడబ్ల్యూసీ ఇండియా సర్వేలో భాగంగా వెల్లడించాయి. నిర్ణయాలు తీసుకోవడంలో దీని సమగ్రమైన ప్రాధాన్యతను వెల్లడించాయి. ఈ సర్వేలో 31 బ్యాంక్‌లు, బీమా సంస్థలు, ఫిన్టెక్లో తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.పరిశ్రమ అభిప్రాయాలు.. » కస్టమర్లను సొంతం చేసుకోవడం, వారికి మెరుగైన అనుభవాన్ని ఇవ్వడం నూతన ఆవిష్కరణలకు కీలకమని 84 శాతం సంస్థలు తెలిపాయి. » ఉత్పత్తుల పంపిణీ అన్నది ఆవిష్కరణలకు కీలకమని 50 శాతం సంస్థలు పేర్కొన్నాయి. » రిస్క్‌ను పరిమితం చేయడం, మారుతున్న నియంత్రపరమైన నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం కీలకమైనవిగా 65 శాతం సంస్థలు చెప్పాయి. ఆవిష్కరణల విషయంలో నియంత్రణ పరమైన అవరోధాలను అధిగమించడం కీలకమని తెలిపాయి. » ప్రధానంగా అంతర్గత చర్యల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని 45 శాతం ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. ‘‘ఫిన్‌టెక్ పరిశ్రమ అభివృద్ధి చెందే క్రమంలో వృద్ధికి.. డిజిటల్ భద్రత, నియంత్రణపరమైన నిబంధనల అమలుకు మధ్య సమతూకం అవసరం. నిబంధనల అమలు భాగస్వామ్యాల ద్వారా మారుతున్న నియంత్రపరమైన మార్పులను అధిగమించొచ్చు’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ మిహిర్ గాంధీ తెలిపారు. -
దేశీ సంస్థల్లో ఏఐ జోరు
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు కృత్రిమ మేథను (ఏఐ) వినియోగించుకోవడం గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగం మిగతా అన్ని విభాగాల కన్నా ముందుంటున్నాయి. కోవిడ్ తర్వాత శకంలో ఏఐ ప్రభావం అనే అంశంపై కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2020లో భారత మార్కెట్లో నిర్వహించిన సర్వేకు కొనసాగింపుగా 2022–23లో 220 పైచిలుకు చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్‌వో), నిర్ణయాధికారాలు ఉన్న ఉన్నతోద్యోగులతో మాట్లాడి దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. దీని ప్రకారం గత రెండేళ్లుగా పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెరి్నంగ్) వినియోగం అత్యధికంగా పెరిగింది. సర్వేలో పాల్గొన్న వాటిలో ఈ రంగాలకు చెందిన 64 శాతం సంస్థలు తాము ప్రస్తుతం ఏఐకు మారే క్రమంలో తొలి దశలో ఉన్నట్లు తెలిపాయి. దీనిపై మరింతగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు సూచనప్రాయంగా తెలియజేశాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఏఐని వినియోగించడం ద్వారా పెట్టుబడులపై అధిక రాబడులను అందుకునే విషయంలో ట్రావెల్, ఆతిథ్య పరిశ్రమ ఒక మోస్తరు సంతృప్త స్థాయికి చేరింది. టెక్నాలజీ, మీడియా, టెలికం, హెల్త్‌కేర్, ఫార్మా తదితర రంగాలు ఏఐ వినియోగంలో స్థిరంగా ముందుకెడుతున్నప్పటికీ పెట్టుబడులపై రాబడులను అంచనా వేసుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ► మిగతా రంగాలతో పోలిస్తే రిటైల్, కన్జూమర్ మార్కెట్లలో ఏఐ వినియోగం తగ్గింది. మార్కెట్ శక్తులు, వినియోగదారుల పోకడలు మారిపోతున్న నేపథ్యంలో ఏఐని ఏయే అంశాల్లో వినియోగించవచ్చనేది గుర్తించడం సంక్లిష్టంగా మారడమే ఇందుకు కారణం. ► గత రెండేళ్లుగా, 2020 మధ్య నుంచి 2022–23 వ్యవధిలో పారిశ్రామికోత్పత్తులు.. తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ సొల్యూ,న్స్ వినియోగం అత్యధికంగా 20 శాతం పెరిగింది. -
మీడియా, ఎంటర్టైన్మెంట్ ఆదాయం... రూ. 6 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: దేశంలో మీడియా, వినోద పరిశ్రమ ఆదాయం భారీ వృద్ధిని చూడనుంది. 2027 నాటికి పరిశ్రమ ఆదాయం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ 73.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని (రూ.6.03 లక్షల కోట్లు) పీడబ్ల్యూసీ సంస్థ అంచనా వేసింది. వినియోగదారుల ప్రాధాన్యతలు పెరుగుతూ ఉండడం, ఇంటర్నెట్ విస్తరణ, కొత్త టెక్నాలజీల అవతరణ ఇవన్నీ కూడా మీడియా, వినోద పరిశ్రమ రూపురేఖలను మార్చేస్తున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ మీడియా, వినోద పరిశ్రమపై ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ మీడియా, వినోద పరిశ్రమకు 2022ను కీలక మలుపుగా చెప్పుకోవాలి. 5.4 శాతం వృద్ధితో ఆదాయం 2.32 లక్షల డాలర్లకు (రూ.190 లక్షల కోట్లు) చేరింది. 2021లో వృద్ధి 10.6 శాతంతో పోలిస్తే సగం తగ్గింది. వినియోగదారులు చేసే ఖర్చు తగ్గడమే ఇందుకు కారణం’’అని నివేదిక తెలిపింది. మొత్తం ప్రకటనల ఆదాయంలో అతిపెద్ద విభాగంగా ఉన్న ఇంటర్నెట్ ప్రకటనల విభాగంలో వృద్ధి గతేడాది స్తబ్దుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్‌లో ఆశావహం భారత్‌లో మీడియా, వినోద పరిశ్రమ వృద్ధికి ఆశావహ పరిస్థితులు నెలకొన్నట్టు పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. 2022లో పరిశ్రమ ఆదాయం 15.9 శాతం వృద్ధి చెంది 46,207 మిలియన్ డాలర్లుగా (రూ.3.78 లక్షల కోట్లు) ఉన్నట్టు వెల్లడించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్, సంప్రదాయ టీవీ, ఇంటర్నెట్, అవుట్ ఆఫ్ హోమ్ ప్రకటనల దన్నుతో పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు వివరించింది. ఇదీ చదవండి ➤ Economic Loss due to floods: కన్నీటి వరదలు.. ఎన్ని వేల కోట్ల నష్టాన్ని మిగిల్చాయో తెలుసా? ఎస్బీఐ రిపోర్ట్ ముఖ్యంగా 2022లో భారత్‌లో 5జీ సేవలు ప్రారంభించడం మీడియా, వినోద పరిశ్రమ వృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశంగా పేర్కొంది. నూతన ఆవిష్కరణలతో ఓటీటీ ఆదాయం 2022లో 1.8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని, 2021లో 1.4 బిలియన్ డాలర్ల ఆదాయంతో పోలిస్తే 25 శాతం అధికమని, 2018లో ఉన్న ఆదాయంతో పోలిస్తే ఆరు రెట్లు వృద్ధి చెందినట్టు వివరించింది. భారత్‌లో ఓటీటీ ఆదాయం ఏటా 14.3 శాతం చొప్పున వృద్ధి చెందుతూ, 2027 నాటికి 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. వినియోగం విస్తృతం ‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), మెటావర్స్ విస్తరణతో వినియోగం విస్తృతమైంది. ప్రేక్షకుల ఆకాంక్షలకు అనుగుణంగా కొనసాగేందుకు రూపాంతర ఆవిష్కరణలపై కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా చీఫ్ డిజిటల్ ఆఫీసర్ మన్‌ప్రీత్ సింగ్ అహుజా తెలిపారు. మొబైల్ వినియోగం పెరగడం ప్రస్తుత చానళ్లపై ప్రభావం చూపిస్తుందని పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. డిజిటల్ చానళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నందున, సంప్రదాయ మీడియా, వినోద వ్యాపార సంస్థలు సరైన విధానాలను అవలంబించడం కీలకమని పేర్కొంది. భారత్ ఈ ఏడాది వేగంగా వృద్ధి సాధిస్తున్న వార్తా పత్రికల మార్కెట్‌గా ఉన్నట్టు తెలిపింది. ఓటీటీ, కనెక్టెడ్ టీవీ మార్కెట్‌కు భారత్‌లో భారీ వృద్ధి అవకాశాలున్నట్టు అంచనా వేసింది. -
డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా యూపీఐదే
న్యూఢిల్లీ: దేశీయంగా ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ)లో లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి 2026–27 నాటికి రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా ఆక్రమించనున్నాయి. రోజుకు 100 కోట్ల స్థాయికి చేరనున్నాయి. పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం 2022–23లో రిటైల్ సెగ్మెంట్లో మొత్తం లావాదేవీల పరిమాణంలో యూపీఐ లావాదేవీల వాటా 75 శాతంగా ఉంది. దేశీయంగా మొత్తం డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ ఏటా 50 శాతం (పరిమాణం పరంగా) పెరుగుతూ వస్తోంది. ఇది 2022–23లో 103 బిలియన్ లావాదేవీల స్థాయిలో ఉండగా 2026–27 నాటికి 411 బిలియన్ లావాదేవీలకు చేరనుంది. ఇందులో ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు 83.71 బిలియన్లుగా ఉండగా అప్పటికి 379 బిలియన్లకు (రోజుకు దాదాపు 1 బిలియన్) చేరతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదికలో వివరించింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ మెరుగ్గా వృద్ధి చెందుతోంది. 2024–25 నాటికి డెబిట్ కార్డు లావాదేవీలను మించనుంది. ► క్రెడిట్ కార్డుల జారీ వచ్చే అయిదేళ్లలో 21 శాతం మేర వృద్ధి చెందనుండగా.. డెబిట్ కార్డుల జారీ మాత్రం స్థిరంగా 3 శాతం స్థాయిలోనే కొనసాగనుంది. డెబిట్ కార్డును ఎక్కువగా నగదు విత్‌డ్రాయల్‌కే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు యూపీఐతో కూడా విత్‌డ్రా చేసుకునే వీలుండటంతో డెబిట్ కార్డుల వినియోగం తగ్గనుంది. ► 2022–23లో బ్యాంకులు, ఫిన్‌టెక్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కార్డుల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో క్రెడిట్ కార్డుల వ్యాపారం వాటా 76 శాతంగా ఉంది. దీంతో ఆయా సంస్థలకు ఇది ఆకర్షణీయమైన వ్యాపారంగానే కొనసాగనుంది. 2021–22తో పోలిస్తే 2022–23లో క్రెడిట్ కార్డుల జారీ ద్వారా ఆదాయం 42 శాతం పెరిగింది. వచ్చే అయిదేళ్లలో ఇది వార్షికంగా 33 శాతం వృద్ధి చెందనుంది. -
క్రెడిట్ కార్డ్‌లు వినియోగిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!
న్యూఢిల్లీ: దేశీయంగా చోటు చేసుకుంటున్న మోసాల్లో 57 శాతం పైగా ఉదంతాలు ‘ప్లాట్‌ఫామ్’ ఆధారితమైనవే ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి రాక తర్వాత ఈ తరహా నేరాలు భారీగా పెరిగాయని తెలిపింది. రిమోట్ పని విధానం, ఈ–కామర్స్, డెలివరీ యాప్‌లు, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు మొదలైనవన్నీ కూడా ఇటువంటి మోసాల పెరుగుదలకు దారి తీశాయని ‘ఆర్థిక నేరాలు, మోసాల సర్వే 2022’ నివేదికలో పీడబ్ల్యూసీ వివరించింది. సోషల్ మీడియా, ఈ–కామర్స్, ఎంటర్ప్రైజ్, ఫిన్‌టెక్ వేదికలను ప్లాట్‌ఫామ్‌లుగా పరిగణిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మోసాల వల్ల 26 శాతం దేశీ సంస్థలు 1 మిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 8.2 కోట్లు) నష్టపోయినట్లు పేర్కొంది. 111 సంస్థలపై సర్వే ఆధారంగా పీడబ్ల్యూసీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో టెక్నాలజీ, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, రిటైల్, విద్య, హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగవంతం.. గడిచిన కొన్నాళ్లుగా భారతీయ వినియోగదారులు, సంస్థల్లో కొత్త ప్లాట్‌ఫామ్‌ల వినియోగం చాలా వేగంగా పెరిగిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ పునీత్ గర్ఖెల్ తెలిపారు. ‘సగటున ఒక భారతీయ కంపెనీ అయిదు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ–కామర్స్, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు, హోమ్ డెలివరీ విధానాలు, రిమోట్ పని విధానం మొదలైనవి వివిధ రకాల ప్లాట్‌ఫాం ఆధారిత ఆవిష్కరణలకు దారి తీసినప్పటికీ నేరగాళ్లకు కూడా కొత్త మార్గాలు లభించినట్లయింది‘ అని పేర్కొన్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ముంచుకొచ్చే ముప్పుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. మోసాలను ముందస్తుగా గుర్తించి, నివారించడంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నివేదిక సూచించింది. ఇందులోని మరిన్ని అంశాలు.. ► ప్రతి 10 ప్లాట్‌ఫామ్ మోసాల్లో నాలుగు .. అంతర్గత కుట్రదారుల వల్లే చోటుచేసుకున్నాయి. ► లోపలి వారు, బైటివారు కుమ్మక్కై చేసిన మోసాలు 26 శాతం ఉన్నాయి. కంపెనీలు అంతర్గతంగా పటిష్టమైన చర్యలు అమలు చేస్తే మూడింట రెండొంతుల ప్లాట్‌ఫామ్ మోసాలను నివారించవచ్చని దీని ద్వారా తెలుస్తోందని నివేదిక తెలిపింది. ► కస్టమర్లు మోసపోయిన కేసుల్లో 92 శాతం మోసాలు చెల్లింపులపరమైనవిగా ఉన్నాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. -
జోరుగా కార్పొరేట్ డీల్స్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా దేశీయంగా విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్ఏ).. ఇతరత్రా కార్పొరేట్ డీల్స్ మాత్రం గతేడాది భారీగానే జరిగాయి. కోవిడ్ పూర్వ స్థాయిని మించి 159 బిలియన్ డాలర్ల విలువ చేసే 2,103 లావాదేవీలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే విలువపరంగా 29 శాతం పెరిగాయి. 2022 వార్షిక నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం డీల్స్‌లో ఎంఅండ్ఏ తరహా ఒప్పందాల వాటా అత్యధికంగా ఉంది. 20పైగా భారీ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 2021తో పోలిస్తే రెట్టింపై 107 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. అయితే, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీన డీల్ (సుమారు 60 బిలియన్ డాలర్లు)ను మినహాయిస్తే మాత్రం ఎంఅండ్ఏ ఒప్పందాల విలువ 2021తో పోలిస్తే 15 శాతం తగ్గిందని నివేదిక తెలిపింది. ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులూ 2021తో పోలిస్తే 22 శాతం తగ్గి 52 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు పేర్కొంది. అయితే, అంతకన్నా ముందు మూడేళ్ల వ్యవధితో పోలిస్తే విలువ, పరిమాణంపరంగాను 20 శాతం ఎక్కువగానే నమోదైనట్లు వివరించింది. ఇన్వెస్టర్లు భారత్‌ను దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నారని, ప్రస్తుత మార్కెట్ మందగమనం కాస్త కష్టతరంగానే ఉన్నా చాలా మందికి పెద్దగా ఆందోళకరమైన అంశం కాకపోవచ్చని ఈ ధోరణుల ద్వారా తెలుస్తోందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ దినేష్ ఆరోరా తెలిపారు. ఆకర్షణీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ.. దేశీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇంధనం, విద్యుత్, ఇండస్ట్రియల్స్ మొదలైన విభాగాలు ఆకర్షణీయంగా ఉండగలవని నివేదిక పేర్కొంది. గతేడాది కంపెనీలు తమ స్థానాలను పటిష్టపర్చుకోవడం, పోటీని కట్టడి చేయడం, కొత్త వినూత్న విభాగాల్లోకి ప్రవేశించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. దీనితో బ్యాంకింగ్, సిమెంట్, విమానయాన రంగాల్లో కొన్ని భారీ డీల్స్ చోటు చేసుకున్నాయని నివేదిక వివరించింది. -
స్టార్టప్‌లకు నిధుల కొరత
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు నిధుల మద్దతు తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో దేశంలో స్టార్టప్‌లకు నిధుల సాయం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రెండేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.7 బిలియన్ డాలర్లకు (రూ.21,870 కోట్లు) పరిమితమైంది. 205 డీల్స్ నమోదయ్యాయి. ఈ మేరకు పీడబ్ల్యూసీ ఓ నివేదికను విడుదల చేసింది. జూలై–సెప్టెంబర్ కాలంలో కేవలం రెండు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా సాధించాయి. యూనికార్న్ హోదా పొందే విషయంలో అంతర్జాతీయంగా ఉన్న ధోరణే మన దగ్గరా కనిపించింది. అంతర్జాతీయంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 20 స్టార్టప్‌లు యూనికార్న్ హోదా పొందగా, ఇందులో 45 శాతం కంపెనీలు సాస్ విభాగం నుంచే ఉన్నాయి. ఇక డెకాకార్న్ స్థాయికి ఒక్కటీ చేరుకోలేదు. అన్ని విభాగాల్లోనూ క్షీణత.. ఆరంభ దశ, వృద్ధి దశ, తదుపరి దశ ఇలా అన్ని విభాగాల్లోని స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో నిధుల మద్దతు తగ్గింది. ఆరంభ స్థాయి డీల్స్ విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 21 శాతంగా ఉంది. అంతకుముందు మూడు నెలల కాలంలో ఆరంభ స్థాయి డీల్స్ విలువ 12 శాతంతో పోలిస్తే రెట్టింపైంది. ముఖ్యంగా స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిటల్ సంస్థలు (వీసీలు) మద్దతుగా నిలుస్తున్నాయి. వృద్ధి దశ, తదుపరి దశ స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో 79 శాతం నిధులు వెళ్లాయి. ‘‘స్టార్టప్‌లకు నిధుల మార్కెట్లో మందగమనం ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు డీల్స్ విషయంతో జాగ్రత్త పాటిస్తున్నారు’’ అని పీడబ్ల్యూసీ ఇండియా డీల్స్ పార్ట్నర్ అమిత్ నవకా పేర్కొన్నారు. కాగా, ఇన్వెస్టర్లు గణనీయమైన నిధులు సమీకరించారని, ఈ నిధులు ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోకి రానున్నాయని నివేదిక అంచనా వేసింది. ఒక్కో డీల్ 4-5 డాలర్లు.. సెప్టెంబర్ క్వార్టర్లో ఒక్కో డీల్ టికెట్ విలువ సగటున 4–5 మిలియన్ డాలర్లు (రూ.32.5-40.5 కోట్లు)గా ఉంంది. సెప్టెంబర్ క్వార్టర్లో 38 విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ నమోదయ్యాయి. ఇందులో 30 దేశీ డీల్స్ ఉన్నాయి. సాస్, ఎడ్యుటెక్ స్టార్టప్‌లలో ఎక్కువ ఎం అండ్ఏ లు నమోదయ్యాయి. ఎడ్యుటెక్ కంపెనీ ‘అప్‌గ్రాడ్’ నాలుగు కంపెనీలను సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. -
సంస్థలకు భారీ షాక్ ఇవ్వనున్న ఉద్యోగులు!
న్యూఢిల్లీ: దేశీయంగా 30 శాతం మంది ఉద్యోగులు తాము పనిచేస్తున్న కంపెనీ నుంచి మారడానికే ఆసక్తి చూపుతున్నట్లు పీడబ్ల్యూసీ ఇండియా పేర్కొంది. ఇక 71 శాతం మంది అయితే ఉద్యోగ గమనంలో ఉపేక్షకు గురవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో గత రెండేళ్లుగా దేశీ ఉపాధి రంగంలో అటు ఉద్యోగులు, ఇటు యాజమాన్యాల ఆలోచనా ధోరణి మార్పులకు లోనైనట్లు నివేదిక వివరించింది. ‘వర్క్‌ఫోర్స్ భయాలు, ఆశలు– 2022’ పేరిట పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం యాజమాన్యాలు(ఎంప్లాయర్స్) నిలకడైన మానవవనరుల ఏర్పాటు వ్యూహాలపైనే దృష్టి పెడుతున్నాయి. ఇక ఉద్యోగులైతే ఆర్థిక అండతోపాటు.. అవకాశాలు, నూతన కల్పనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సర్వేలో 2,608 మంది ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో 93 శాతం మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులుకావడం గమనార్హం! 19 శాతమే దేశీయంగా సర్వేలో పాల్గొన్న 34 శాతంమంది కొత్త కంపెనీకి మారేందుకు అత్యంత ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 19 శాతమే. కాగా.. దేశీయంగా మరో 32 శాతం మంది ప్రస్తుత కంపెనీని వీడే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. మిల్లీనియల్స్‌లో అత్యధిక శాతం మంది కొత్త ఉపాధి కోసం ఉత్సాహం చూపుతున్నారు. రానున్న 12 నెలల్లోగా కంపెనీ మారే సన్నాహాల్లో ఉన్నట్లు తెలియజేశారు. జెన్ జెడ్ ఉద్యోగులలో కంపెనీ మారేందుకు విముఖత చూపారు. అయితే పని గంటల తగ్గింపునకు డిమాండ్ చేయడం ప్రస్తావించదగ్గ విషయం!! సర్వేలో సగంమంది ఉద్యోగులు అవకాశాలలేమిపై విచారం వ్యక్తం చేశారు. ఇదేవిధంగా సహచరుల నుంచి నైపుణ్యాలను నేర్చుకునే విషయంపై పెదవి విరిచారు. -
స్టార్టప్‌లకు ఫండింగ్ బూస్ట్
ముంబై: దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి నిధుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2022) తొలి మూడు నెలల్లోనే ఏకంగా 14 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. వెరసి వరుసగా మూడో క్వార్టర్లోనూ యూనికార్న్‌ల స్పీడ్ కొనసాగింది. పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక ప్రకారం 334 లావాదేవీల ద్వారా 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 75,000 కోట్లు) తాజా పెట్టుబడులు లభించాయి. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. కాగా.. మార్చిచివరికల్లా దేశీయంగా వీటి సంఖ్య 84ను తాకింది. ఒక త్రైమాసికంలో 10 బిలియన్ డాలర్ల నిధులు దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి ప్రవహించడం వరుసగా ఇది మూడోసారికావడం విశేషం! వెరసి ఈ క్యూ1(జనవరి–మార్చి)లో స్టార్లప్‌లు మొత్తం 10.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. సాస్ హవా నివేదిక ప్రకారం సాఫ్ట్‌వేర్‌నే సర్వీసులుగా అందించే(సాస్) కంపెనీలు అత్యధికంగా పెట్టుబడులను అందుకున్నాయి. 3.5 బిలియన్ డాలర్లకు మించిన నిధులు ప్రవహించాయి. దీంతో క్యూ1లో ఐదు యూనికార్న్‌లు సాస్ విభాగంనుంచే ఆవిర్భవించాయి. ప్రపంచ ఆర్థిక వాతావరణం అనిశ్చితిగా ఉన్నప్పటికీ దేశీ స్టార్టప్ వ్యవస్థ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు కన్సల్టెన్సీ స్టార్టప్స్ విభాగం చీఫ్ అమిత్ నాకా పేర్కొన్నారు. వృద్ధికి పెట్టుబడులు అవసరమైన స్థాయిలో నిధులు లభించడం ప్రస్తావించదగ్గ అంశమని తెలియజేశారు. సుపరిపాలన దేశీయంగా స్టార్టప్‌లు భారీ వృద్ధిని అందుకుంటున్న నేపథ్యంలో కార్పొరేట్ సుపరిపాలనకు ప్రాధాన్యత పెరుగుతున్నట్లు అమిత్ పేర్కొన్నారు. దీంతో స్టార్టప్‌లకు కార్పొరేట్ గవర్నెన్స్‌పై మార్గదర్శకాల రూపకల్పనపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. వ్యవస్థాగతంగా విస్తరణపై ఆశలున్న కంపెనీలు ఇందుకు తగిన విధంగా సన్నద్ధంకావలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సాస్ ఎకోసిస్టమ్‌లోకి గత మూడేళ్లలోనే మూడు రెట్లు అధిక పెట్టుబడులు తరలిరాగా.. కరోనా మహమ్మారి ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహాన్నిచ్చినట్లు వివరించారు. మారుమూల ప్రాంతాల నుంచీ పనిచేసే పరిస్థితులతోపాటు, ఉత్పాదకత పెరగడం, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాధాన్యత ఇందుకు సహకరిస్తున్నాయి. 15 సంస్థలు సాస్ విభాగంలో గత మూడేళ్ల కాలంలో 15 యూనికార్న్‌లు పుట్టుకొచ్చాయి. ఈ జాబితాలో డార్విన్‌బాక్స్, ఫ్రాక్టల్, యూనిఫోర్, హసురా, అమగీ మీడియా ల్యాబ్స్ తదితరాలున్నాయి. 2021 చివర్లో ఫ్రెష్‌వర్క్స్ నాస్డాక్లో బంపర్ లిస్టింగ్‌ను సాధించడంతో సాస్ సంస్థలకు కొత్త జోష్ వచ్చినట్లు అమిత్ ప్రస్తావించారు. పలు కంపెనీలు పబ్లిక్ లిస్టింగ్‌పై దృష్టిపెడుతున్నట్లు పేర్కొన్నారు. విలీనాలు.. దేశీ స్టార్టప్ వ్యవస్థలో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) లావాదేవీలు క్యూ1లో ఈకామర్స్ విభాగంలో అధికంగా జరిగాయి. క్యూర్‌ఫుడ్స్, మెన్సా బ్రాండ్స్, గ్లోబల్బీస్, మైగ్లామ్ ఎంఅండ్ఏలో భాగమయ్యాయి. వీటి కీలక వ్యాపార వ్యూహాలకు ప్రాధాన్యత లభించగా.. అప్స్కాలియో, ఈవెన్‌ఫ్లో తదితర కంపెనీలు సైతం రేసులో చేరాయి. 38 శాతం ఎంఅండ్ఏలు ఈకామర్స్, డైరెక్ట్‌టు కన్జూమర్ విభాగంలో నమోదుకాగా.. 22 శాతం డీల్స్‌కు సాస్ రంగంలో తెరలేచింది. వృద్ధి, చివరి దశ స్టార్టప్‌లు విలువరీత్యా 89 శాతం పెట్టుబడులు అందుకోగా.. మొత్తం లావాదేవీల్లో 44 శాతం వాటాను ఆక్రమించాయి. గత మూడు త్రైమాసికాలలో వృద్ధిస్థాయి నిధులు 6.5–7 బిలియన్ డాలర్లకు చేరగా.. సగటు టికెట్ పరిమాణం 5.5–7 కోట్ల డాలర్లుగా నమోదైంది. తొలి దశ పెట్టుబడుల విషయానికివస్తే 4 మిలియన్ డాలర్ల సగటు టికెట్ పరిమాణంలో 76.1 కోట్ల డాలర్లు లభించాయి. లావాదేవీల పరిమాణంలో ఇవి 55 శాతంగా నివేదిక తెలియజేసింది. -
ఆల్‌టైమ్ రికార్డ్, గతేడాది రూ.4.95లక్షల కోట్లకు చేరిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్!
ముంబై: ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ (పీఈలు) 2021లో పెద్ద ఎత్తున స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశాయి. 35 బిలియన్ డాలర్లను (రూ.2.62లక్షల కోట్లు) కుమ్మరించాయి. ఇతర సంస్థల్లోనూ కలిపి చూస్తే 2021లో పీఈ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరి 66.1 బిలియన్ డాలర్లు (రూ.4.95 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. మొత్తం మీద 2021లో 2,064 లావాదేవీలు జరిగాయి. 114.9 బిలియన్ డాలర్లు (రూ.8.62 లక్షల కోట్లు) వచ్చాయి. విలువ పరంగా 2020తో పోల్చి చూస్తే 40 శాతం ఎక్కువ. పీడబ్ల్యూసీ ఇండియా ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. లావాదేవీల వివరాలు.. ► 2021లో పీఈ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. 66.1 బిలియన్ డాలర్లతో 1,258 లావాదేవీలు జరిగాయి. 2020లో నమోదైన లావాదేవీలతో పోలిస్తే 32 శాతం అధికం. ► 43 స్టార్టప్‌లు యూనికార్న్‌లు మారాయి. ► స్టార్టప్‌లు 1,000కు పైగా విడతల్లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాయి. ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) కంపెనీలు పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నాయి. ► విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు (ఎంఅండ్ఏ) రెట్టింపయ్యాయి. 2020తో పోలిస్తే విలువ పరంగా 28 శాతం వృద్ధి నమోదైంది. ► టెక్నాలజీ కంపెనీలు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. 823 లావాదేవీలు నమోదయ్యాయి. ► 2022లో పెట్టుబడుల జోరు కొనసాగుతుందని పీడబ్ల్యూసీ అంచనా. -
యూనికార్న్‌ల హవా!
ముంబై/న్యూఢిల్లీ: ఈ కేలండర్ ఏడాది(2022)లోనూ స్టార్టప్‌ల హవా కొనసాగనుంది. కనీసం 50 సంస్థలు యూనికార్న్ హోదాను పొందే వీలున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,500 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌గా పిలిచే విషయం విదితమే. ఇప్పటికే కనీసం 10 కోట్ల డాలర్ల నిధుల సమీకరణ రీత్యా భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా ఆవిర్భవించగల స్టార్టప్‌ల జాబితాను పీడబ్ల్యూసీ రూపొందించింది. ఈ జాబితాలో ఖాటాబుక్, వాట్‌ఫిక్స్, ప్రాక్టో, నింజాకార్ట్, ఇన్‌షార్ట్స్, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, పెప్పర్ఫ్రై, లివ్‌స్పేస్ తదితర 50 స్టార్టప్‌లకు చోటు లభించింది. పెట్టుబడుల దూకుడు దేశీయంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గత కేలండర్ ఏడాది(2021)లో అత్యంత అధికంగా 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్‌లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది(2020)లో సమకూర్చుకున్న 11.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లుకంటే ఎక్కువకావడం విశేషం! దీంతో గతేడాది ఏకంగా 46 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. ఫలితంగా దేశంలో యూనికార్న్‌ల సంఖ్య 90కు చేరింది. 2021 దేశీ టెక్ యూనికార్న్ నివేదిక పేరుతో ఓరిస్ వెంచర్ పార్టనర్స్ రూపొందించిన వివరాలివి. వీటి ప్రకారం.. టాప్–3 ర్యాంక్ గతేడాది బిలియన్ డాలర్ల విలువను సాధించిన కంపెనీల జాబితాలో షేర్‌చాట్, క్రెడ్, మీషో, నజారా, మాగ్లిక్స్, ఎంపీఎల్, గ్రోఫర్స్(బ్లింకిట్), అప్‌గ్రాడ్, మమాఎర్త్, గ్లోబల్బీస్, అకో, స్పిన్నీ తదితరాలు చోటు సాధించాయి. దీంతో ప్రపంచంలోనే అమెరికా(487), చైనా(301) తదుపరి భారత్ 90 యూనికార్న్‌లతో మూడో ర్యాంకులో నిలిచింది. వెరసి 39 యూనికార్న్‌లకు ఆవాసమైన యూకేను నాలుగో ర్యాంకులోకి నెట్టింది. 60,000 స్టార్టప్‌లకు నిలయంకావడం ద్వారా భారత్ మూడోపెద్ద స్టార్టప్ ఎకోవ్యవస్థగల దేశంగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 13 యూనికార్న్‌లలో ఒకటి దేశీయంగానే ఊపిరి పోసుకుంటుండటం విశేషం! ఉపాధి సైతం భారీగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లు కొత్తతరహా సొల్యూషన్స్, సాంకేతికతలను అందించడమేకాకుండా భారీ స్థాయిలో ఉపాధి కల్పనకూ దారి చూపుతున్నాయి. ఫిన్‌టెక్, ఈకామర్స్, ఎస్ఏఏఎస్(సాస్) విభాగాల నుంచి అత్యధికంగా స్టార్టప్‌లు ఆవిర్భవిస్తున్నాయి. వీటి తదుపరి హెల్త్‌టెక్, ఎడ్టెక్, డీ2సీ, గేమింగ్, క్రిప్టో విభాగాలు నిలుస్తున్నాయి. అత్యధిక స్టార్టప్‌లకు బెంగళూరు నెలవుకాగా.. విలువలో 37.6 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్ అగ్రపథాన్ని పొందింది.3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడం ద్వారా గత జూలైలో ఈ విలువను అందుకుంది. ఇక ఆరు నెలల్లోనే యూనికార్న్ హోదాను పొందిన సంస్థగామెన్సా బ్రాండ్స్ గుర్తింపు పొందింది. 2021 మే నెలలో 5 కోట్ల డాలర్లు సమకూర్చుకోవడంతో ఈ విలువను సాధించింది. మహిళలూ.. యూనికార్న్‌ల వ్యవస్థాపకుల్లో 20 శాతం నాన్ ఇంజినీర్స్ కాగా.. దాదాపు 67 శాతం వరకూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్బీ నుంచి ఒకరు లేదా అంతకుమించిన వ్యక్తులు ఉన్నట్లు ఓరిస్ వెంచర్స్ తాజా నివేదిక పేర్కొంది. జాబితాలో 13 మంది మహిళా వ్యవస్థాపకులకు చోటు లభించగా.. 2021లోనే 8 మంది ఈ హోదాను సాధించారు. వీరిలో ఫాల్గుణి నాయర్(నైకా), గజల్ కల్రా(రివిగో), రుచీ కల్రా(ఆఫ్‌బిజినెస్), దివ్యా గోకుల్‌నాథ్(బైజూస్), ఘజల్ అలఘ్(మమాఎర్త్), సరితా కటికనేని(జెనోటీ) తదితరులున్నారు. డెకాకార్న్‌లుగా.. 10 బిలియన్ డాలర్లు అంతకుమించిన విలువను అందుకున్న కంపెనీలను డెకాకార్న్‌లుగా వ్యవహరిస్తుంటారు. దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, బైజూస్, ఓయో డెకాకార్న్‌లుగా ఆవిర్భవించాయి. గతేడాది అత్యధికంగా 11 స్టార్టప్‌లు ఐపీఓలను చేపట్టాయి. వీటిలో 8 యూనికార్న్‌లే! ఐపీవోల ద్వారా 7.16 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నాయి. వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 18,300 కోట్లు(2.46 బిలియన్ డాలర్లు) అందుకుంది. మరోపక్క జొమాటో 14.8 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్(విలువ)తో చరిత్ర సృష్టించింది. ఈ బాటలో నైకా 13.5 బిలియన్ డాలర్లు, ఫ్రెష్‌వర్క్స్ 6.9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించడం విశేషం! -
రూ.4 లక్షల కోట్లు: భవిష్యత్ అంతా ఎంటర్టైన్మెంటే!
న్యూఢిల్లీ: మిగతా దేశాలతో పోలిస్తే దేశీ మీడియా, వినోద (ఎంఈ) రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. 2025 నాటికి ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు చేరనుంది. అటు ప్రకటనకర్తలు, ఇటు వినియోగదారులు మీడియాపై చేసే వ్యయాలు ఇందుకు తోడ్పడనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఎంఈ రంగం వార్షిక ప్రాతిపదికన 10.75 శాతం మేర వృద్ధి చెందనుంది. 2025 నాటికి రూ. 4,12,656 కోట్లకు చేరనుంది. ‘కరోనా వైరస్ మహమ్మారికి కూడా భారత మీడియా, వినోద రంగం దీటుగా ఎదురునిల్చింది‘ అని కన్సల్టెన్సీ పార్ట్నర్ రాజీబ్ బసు తెలిపారు. టెక్నాలజీ పురోగతి, ఇంటర్నెట్ మరింతగా అందుబాటులోకి వస్తుండటం తదితర అంశాలు.. ప్రజలు కంటెంట్‌ను వినియోగించే తీరుతెన్నులను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక భాషల్లోని కంటెంట్‌కు మరింతగా డిమాండ్ ఉంటుందని, వ్యాపార విధానాలు సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుందని వివరించారు. విభాగాలవారీగా చూస్తే.. మహమ్మారిపరమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ 2020లో టీవీ అడ్వర్టైజింగ్ రూ.35,015 కోట్లకు చేరింది. ఇది 7.6 శాతం మేర వృద్ధి చెందనుంది. 2025 నాటికి మొత్తం ఎంఈ రంగంలో సుమారు రూ.50,000 కోట్ల మేర దీని వాటా ఉండనుంది. ఇంటర్నెట్ మాధ్యమంలో ప్రకటనలు 2020-25 మధ్య 18.8 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. రూ.30,000 కోట్లకు చేరనున్నాయి. 2020లో రూ.7,331 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ విభాగం 25.4 శాతం వృద్ధి రేటుతో 2025 నాటికి రూ. 22,350 కోట్లకు చేరుతుంది. న్యూస్‌పేపర్, కన్జ్యూమర్ మ్యాగజైన్ విభాగం మాత్రం స్వల్పంగా 1.82 శాతం స్థాయిలో మాత్రమే వృద్ధి చెందనుంది. 2025 నాటికి రూ. 26,299 కోట్లకు చేరనుంది. మహమ్మారి నేపథ్యంలో 2020లో ప్రింట్ అడ్వర్టైజింగ్ ఆదాయాలు 12 శాతం, ప్రింట్ సర్క్యులేషన్ ఆదాయం 4 శాతం మేర తగ్గాయి. మహమ్మారి ధాటికి కుదేలైన బాక్సాఫీస్ ఆదాయాలు మళ్లీ కోలుకుని 2025 నాటికి 39.3 శాతం వార్షిక వృద్ధితో రూ.13,857 కోట్లకు చేరవచ్చు. తీవ్రంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమ 2023 మధ్య నాటికి.. తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి కోలుకోవచ్చు. 2020లో మ్యూజిక్, రేడియో, పాడ్కాస్ట్ల మార్కెట్ ఆదాయాలు రూ.4,626 కోట్లకు పడిపోయాయి. లైవ్ మ్యూజిక్ విభాగం ఆదాయం సుమా రు రూ. 522 కోట్ల మేర క్షీణించింది. ఇది తిరిగి కోలుకుని 19.1 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2025 నాటికి రూ.11,026 కోట్లకు చేరనుంది. వీడియో గేమ్స్, ఈ-స్పోర్ట్స్ విభాగం ఆదాయాలు 2020లో రూ.11,250 కోట్లకు చేరగా .. 2025 నాటికి వార్షికంగా 16.5 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. వచ్చే నాలుగేళ్లలో రూ.24,213 కోట్లకు చేరవచ్చు. వివిధ ఇన్నోవేషషన్లు ఇందుకు దోహదపడతాయి. -
డీల్ స్ట్రీట్‌లో డాన్.. రిలయన్స్
ముంబై: కరోనా కల్లోలం ఉన్నా, ఈ ఏడాది డీల్స్ జోరుగా జరిగాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా, పలు విదేశీ సంస్థలు మన కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. రిలయన్స్ కారణంగా భారీ డీల్స్ కుదిరాయంటున్న ఈ సంస్థ ఇంకా ఏం చెప్పిందంటే..., ► గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది డీల్స్ 7 శాతం వృద్ధితో 8,000 కోట్ల డాలర్లకు పెరిగాయి. మొత్తం 1,268 లావాదేవీలు జరిగాయి. ► దీంట్లో మూడో వంతుకు పైగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన డీల్స్ ఉన్నాయి. ► రిలయన్స్‌కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో 1,020 కోట్ల డాలర్లు సాధించింది. ఇక రిటైల్ విభాగం కూడా వేల కోట్ల ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లను ఆకర్షించింది. ► ఈ ఏడాది జరిగిన మొత్తం డీల్స్‌లో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ వాటా దాదాపు సగంగా ఉంది. ఇక ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) లావాదేవీలు గత ఏడాది మాదిరిగానే 3,820 కోట్ల డాలర్ల రేంజ్లో ఉన్నాయి. ► ఈ ఏడాది ఆరంభంలో టెలికం రంగంలో భారీ డీల్స్ వచ్చాయి. ఆ తర్వాత కరోనా కల్లోలం చెలరేగడంతో పలు సంస్థల తమ ఒప్పందాలను వాయిదా వేశాయి. పలు పీఈ ఫండ్స్ కూడా వేచి చూసే ధోరణిని అవలంభించాయి. ► దేశీయ డీల్స్ పరంగా చూస్తే, రిలయన్స్ రిటైల్–ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందమే పెద్దది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ 330 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ► విదేశీ సంస్థల డీల్స్ ఈ ఏడాది 11 శాతం పెరిగాయి. రిలయన్స్ జియోలో 9.9 శాతం వాటా కోసం ఫేస్బుక్ సంస్థ 570 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. లాక్డౌన్ కాలంలో జరిగిన అతి పెద్ద డీల్ ఇదే. ► ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి 3,000 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)లు వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఎఫ్‌డీఐలతో పోల్చితే ఇది 15 శాతం అధికం. ► రిలయన్స్ వల్లనే అధికంగా పీఈ డీల్స్ జరిగాయి. ఫేస్బుక్, టీపీజీ, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్ తదితర పీఈ ఫండ్స్, సావరిన్ ఫండ్స్ రిలయన్స్ జియోలో 980 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఏడాది పీఈ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇది 66 శాతానికి సమానం. రిలయన్స్ రిటైల్ వెంచర్లో 510 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఈ ఏడాది మొత్తం పీఈ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ 1,500 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఇది రికార్డ్ స్థాయి. ► ఈ ఏడాది అత్యధిక నిధులు ఆకర్షించిన రంగంగా టెలికం నిలిచింది. ఈ రంగంలోకి మొత్తం 1,120 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక రిటైల్ రంగంలో 650 కోట్ల డాలర్లు, టెక్నాలజీ రంగంలో 600 కోట్ల డాలర్లు, ఫార్మాలో 250 కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► వాటాలను విక్రయించి వివిధ సంస్థల నుంచి పీఈ సంస్థలు వైదొలగడం గత ఐదేళ్లలోనే అత్యంత కనిష్టానికి ఈ ఏడాది పడిపోయింది. స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉండటమే దీనికి కారణం. ఈ వాటాల విక్రయం పరంగా చూస్తే, మొత్తం 420 కోట్ల డాలర్ల విలువైన 136 లావాదేవీలు జరిగాయి. ఇది గత ఏడాది డీల్స్‌తో పోల్చితే 56 శాతం తక్కువ. (విలువ పరంగా) -
అమెరికన్ ఉద్యోగాలకు భారీ ముప్పు
వాషింగ్టన్: ఇప్పటికే ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతున్న అమెరికన్లకు మరో బ్యాడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ వర్కర్లు తమ ఉద్యోగాలను రోబోట్లకు వదులుకోవాల్సి వస్తుందని.. దానిలో ముఖ్యంగా అమెరికా ఎక్కువగా ప్రభావితం కానుందని తాజా రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే పదిహేనేళ్లలో దాదాపు 38 శాతం అమెరికన్ ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని పీడబ్ల్యూసీ తాజా రిపోర్టు వెల్లడించింది. అదేవిధంగా యూకేలోనూ 30 శాతం ఉద్యోగాలు పోనున్నాయని పేర్కొంది. ఇదే రకమైన ప్రమాదం జపనీస్లకు పొంచి ఉందని తెలిసింది. అమెరికా, యూకే లేబర్ మార్కెట్లో సర్వీసు ఉద్యోగాలు ఎక్కువగా ఆధిపత్యం కొనసాగిస్తుంటాయని, అదే స్థాయిలో కీలకరంగాలైన ఫైనాన్స్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎడ్యుకేషన్, మానుఫ్రాక్ట్ర్చరింగ్, ఫుడ్ సర్వీసులల్లో ఉద్యోగులు ఎక్కువగా పనిచేస్తుంటారని రిపోర్టు తెలిపింది. ఫైనాన్సియల్ సర్వీసెస్ ఉద్యోగాలు తీసుకుంటే, రోబోట్స్ తో రీప్లేస్ అయి, 61 శాతం ఉద్యోగాలు హరించుకుపోతాయని రిపోర్టు వెల్లడించింది. అయితే యూకేలో మాత్రం ఫైనాన్సియల్ జాబ్స్ 32 శాతం మాత్రమే కోల్పోనున్నాయని పేర్కొంది. అయితే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సోషల్ వర్క్ లో పనిచేసే ఉద్యోగులు ఈ రోబోట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు తక్కువగా ప్రభావితమవుతారని పీడబ్ల్యూసీ తెలిపింది. ఎక్కువ రోబోట్ల వాడకం సామాజిక అంతరాలకు కూడా దారితీయనుందని పీడబ్ల్యూసీ అథార్స్ చెప్పారు.