2028 నాటికి రెట్టింపునకు రూ.66,000 కోట్లకు మార్కెట్
మరో 2–3 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: దేశంలో గేమింగ్ పరిశ్రమ రానున్న మూడేళ్లలో రెట్టింపు కానుంది. 2028 నాటికి రూ.66,000 కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. తద్వారా ఈ రంగంలో రెండు నుంచి మూడు లక్షల మందికి అదనంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. ఆర్థికాభివృద్ధికి తోడు, సాంస్కృతిక వైభవం గేమింగ్ పరిశ్రమ వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. ‘ఫ్రమ్ సన్‌రైజ్ టు సన్‌షైన్:..’ పేరిట భారత గేమింగ్ పరిశ్రమపై పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. ఢిల్లీలో ఇండియా గేమింగ్ కన్వెన్షన్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కారాలను సూచించింది.
ఏటా 15 శాతం చొప్పున..
భారత ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ 2023 నాటికి రూ.33,000 కోట్లుగా ఉంది. 2023 నుంచి 2028 వరకు ఏటా 14.5 శాతం చొప్పున కాంపౌండ్ అవుతూ రూ.66,000 కోట్లకు చేరుకుంటుంది. ఈ సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలుగా అవకాశాలను సొంతం చేసుకోవాలంటే అందుకు పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాలి.
ఆన్‌లైన్ గేమింగ్‌లో అదిపెద్ద ఉప విభాగమైన రియల్ మనీ గేమింగ్ మార్కెట్ 2028 నాటికి రూ.26,500 కోట్లకు చేరుకోవచ్చు. గేమింగ్ పరిశ్రమ వచ్చే కొన్నేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 2–3 లక్షల మందికి ఉపాధికలి్పంచడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థపై చెప్పుకోతగ్గ ప్రభావాన్ని చూపిస్తుంది.
సవాళ్లు–మార్గాలు..
గేమింగ్ రంగం వృద్ధి ప్రధానంగా పన్ను అంశాల పరిష్కారం, నియంత్రణపరమైన స్పష్టతపైనే ఆధారపడి ఉంటుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక స్పష్టం చేసింది. నియంత్రణ పరమైన అనుసంధాన లేమి, అధిక జీఎస్‌టీ కారణంగా నిలకడలేని వ్యాపార నమూనా, గేమింగ్ మానిటైజేషన్ విషయంలో ఉన్న నైతిక అంశాలు, నైపుణ్యాల అంతరం, భాగస్వాముల ప్రయోజనాల విషయంలో సమతుల్యం, గేమర్ల మానసిక ఆరోగ్యం, ప్లేయర్ల ఎంగేజ్‌మెంట్, సాంస్కృతిక సంబంధిత గేమ్‌ల రూపకల్పన, గేమింగ్ కెరీర్ పట్ల సమాజంలో ఉన్న భావనలు మార్చడం, చట్టవిరుద్ధమైన గ్యాంబ్లింగ్‌ను కట్టడి చేయడం వంటి సవాళ్లను ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment