అమెరికన్ ఉద్యోగాలకు భారీ ముప్పు
అమెరికన్ ఉద్యోగాలకు భారీ ముప్పు
Published Sat, Mar 25 2017 12:15 PM | Last Updated on Mon, Aug 20 2018 4:52 PM
వాషింగ్టన్: ఇప్పటికే ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతున్న అమెరికన్లకు మరో బ్యాడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ వర్కర్లు తమ ఉద్యోగాలను రోబోట్లకు వదులుకోవాల్సి వస్తుందని.. దానిలో ముఖ్యంగా అమెరికా ఎక్కువగా ప్రభావితం కానుందని తాజా రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే పదిహేనేళ్లలో దాదాపు 38 శాతం అమెరికన్ ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని పీడబ్ల్యూసీ తాజా రిపోర్టు వెల్లడించింది. అదేవిధంగా యూకేలోనూ 30 శాతం ఉద్యోగాలు పోనున్నాయని పేర్కొంది. ఇదే రకమైన ప్రమాదం జపనీస్లకు పొంచి ఉందని తెలిసింది.
అమెరికా, యూకే లేబర్ మార్కెట్లో సర్వీసు ఉద్యోగాలు ఎక్కువగా ఆధిపత్యం కొనసాగిస్తుంటాయని, అదే స్థాయిలో కీలకరంగాలైన ఫైనాన్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, మానుఫ్రాక్ట్ర్చరింగ్, ఫుడ్ సర్వీసులల్లో ఉద్యోగులు ఎక్కువగా పనిచేస్తుంటారని రిపోర్టు తెలిపింది. ఫైనాన్సియల్ సర్వీసెస్ ఉద్యోగాలు తీసుకుంటే, రోబోట్స్ తో రీప్లేస్ అయి, 61 శాతం ఉద్యోగాలు హరించుకుపోతాయని రిపోర్టు వెల్లడించింది. అయితే యూకేలో మాత్రం ఫైనాన్సియల్ జాబ్స్ 32 శాతం మాత్రమే కోల్పోనున్నాయని పేర్కొంది. అయితే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సోషల్ వర్క్ లో పనిచేసే ఉద్యోగులు ఈ రోబోట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు తక్కువగా ప్రభావితమవుతారని పీడబ్ల్యూసీ తెలిపింది. ఎక్కువ రోబోట్ల వాడకం సామాజిక అంతరాలకు కూడా దారితీయనుందని పీడబ్ల్యూసీ అథార్స్ చెప్పారు.
Advertisement
Advertisement