హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ 2004లో నటించిన చిత్రం ‘ఐ–రోబోట్’ గుర్తుంది కదా! అందులో రోబోలు మానవ సైకాలజీ ఆధారంగా పనిచేస్తాయి. అమెరికాలో 2035 నాటికి ఇలాంటి పరిస్థితి ఉండొచ్చని నిర్మించిన ఊహాజనిత చిత్రమది. పరిస్థితి అంతలా కాకున్నా.. 2045 నాటికి మానవ మేధస్సుతో సమానంగా పోటీపడే సాంకేతిక పరిజ్ఞానం సాధ్యమేనంటున్నారు.. టెక్ నిపుణులు. ప్రస్తుత ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ’ని దాటి మనిషిలా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుని సమస్యలు పరిష్కరించే ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)’ టెక్నాలజీ వస్తుందంటున్నారు.
హాంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ కంపెనీ 2016లో ఏఐ టెక్నాలజీతో నిర్మించిన ‘సోఫియా’ హూమనాయిడ్ రోబో ప్రోగ్రామింగ్‌కు అనుగుణంగా పనిచేస్తోంది. అలాగే యూకేకు చెందిన ఇంజనీర్డ్ ఆర్ట్స్ సంస్థ 2021 డిసెంబర్‌లో అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీతో నిరి్మంచిన ‘అమెకా’ హూమనాయిడ్ రోబో మానవ ముఖ కవళికలను అర్థం చేసుకోవడంతో పాటు ఎన్నో హావభావాలను పలికిస్తోంది. ఇకపై వచ్చే టెక్నాలజీ మనిíÙతో పోటీపడుతుందని.. అది ఆర్టిఫిíÙయల్ జనరల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సాంకేతికతతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు వేగంగా వస్తాయని చెబుతున్నారు. ఈ రోబోలు మానవ మేధస్సును మించిపోతే ముప్పు కూడా ఉండొచ్చని మరికొందరు హెచ్చరిస్తున్నారు.
యంత్రానికి ఇంగితజ్ఞానం ఉంటే.. అది ఏజీఐ..
టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషికున్న ఇంగిత జ్ఞానం (కామన్‌సెన్స్) యంత్రాలకు, సాఫ్ట్‌వేర్‌కు ఉండదు. ఒకవేళ యంత్రాలకే ఇంగితజ్ఞానం ఉంటే.. అది ఆరి్టఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అవుతుందని దీన్ని సమర్థించేవారు చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో ఏజీఐ అనేది సమగ్రమైన, పూర్తి కంప్యూటింగ్ సామర్థ్యాలు గల తెలివైన వ్యవస్థగా అభివరి్ణస్తున్నారు. ప్రస్తుతం ఏ పనిచేయాలన్నా టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ తప్పనిసరిగా మారింది. అయితే, వాటిలో సాంకేతిక సమస్య ఎదురైతే నిపుణులైన వారే సరిచేయాలి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. అయితే, టెక్నాలజీలో ఏ సమస్య ఎదురైనా ఏజీఐ గుర్తించి పరిష్కరిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆధునిక కాలంలో మనిషి చేయగల ఏ పనినైనా ఏజీఐ వ్యవస్థ చేస్తుందంటున్నారు.
ప్రస్తుతానికి నూరు శాతం పనిచేసే ఏజీఐ వ్యవస్థ లేకపోయినప్పటికీ.. అత్యంత బలమైన ఈ కృత్రిమ మేధస్సును టెక్ దిగ్గజ సంస్థ ఐబీఎం తయారు చేసిన వాట్సన్ సూపర్ కంప్యూటర్‌లోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలోను కొంతమేర వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ ఎలాంటి డేటానైనా అద్భుతమైన వేగంతో యాక్సెస్ చేయడంతోపాటు ప్రాసెస్ చేస్తుందంటున్నారు. అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో మానవ మెదడు కంటే వందల రెట్లు వేగంగా స్పందిస్తుందని పేర్కొంటున్నారు. ఏజీఐ వ్యవస్థ ఇంగిత జ్ఞానం, నిశిత ఆలోచన, బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్, ట్రాన్స్‌ఫర్ లెరి్నంగ్ వంటి సామర్థ్యాలను కలిగి ఉంటుందని వివరిస్తున్నారు. అందువల్లమనిíÙలాగే సృజనాత్మకంగా ఆలోచిస్తుందని చెబుతున్నారు.
ఏజీఐతో ఏ పనైనా సుసాధ్యమే..
ప్రస్తుతం ఏజీఐ టెక్నాలజీని కొన్ని విభాగాలలో కొంతమేర వినియోగిస్తున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐబీఎం వాట్సన్ సూపర్ కంప్యూటర్లు సగటు కంప్యూటర్ చేయలేని గణనలను చేయగలవని అంటున్నారు. వీటిని పూర్తిస్థాయి ఏజీఐ టెక్నాలజీతో అనుసంధానం చేస్తే విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. రోగి డేటా ఆధారంగా ఔషధాలను కూడా సిఫారసు చేయవచ్చంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వినియోగిస్తే.. రోడ్డుపై ఇతర వాహనాలు, వ్యక్తులు, వస్తువులను గుర్తించడంతో పాటు డ్రైవింగ్ నిబంధనలకు కట్టుబడి ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు. ప్రమాదాలను ముందుగానే నూరు శాతం గుర్తించి గమనాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని వివరిస్తున్నారు.
ఏఐ అటార్నీగా పిలిచే ‘రోస్ ఇంటెలిజెన్స్’ (న్యాయ నిపుణుల వ్యవస్థ)లోని ఒక బిలియన్ టెక్ట్స్ డాక్యుమెంట్ల డేటాను విశ్లేషించి.. సంక్లిష్టమైన ప్రశ్నలకు మూడు సెకన్ల కంటే తక్కువ వ్యవధిలో సమాధానం చెప్పగలదని ప్రయోగాలు నిరూపించాయంటున్నారు. అయితే, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ 2014లో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘ఏజీఐ సాధ్యమే.. పూర్తి కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందితే అది మానవజాతిని అంతం చేస్తుంది. ఇది తనంత తానుగా నిర్ణయాలు తీసుకుంటుంది.. మానవులు దానితో పోటీ పడలేరు’’ అని హెచ్చరించారు. అయినప్పటికీ, కొంతమంది ఏఐ నిపుణులు ఏజీఐ టెక్నాలజీ అవసరమని భావిస్తున్నారు. దీనిపై పనిచేస్తున్న అమెరికాకు చెందిన కంప్యూటర్ సైన్స్ శాస్త్రవేత్త రే కుర్జ్‌వీల్ 2029కి కంప్యూటర్లు మానవ మేధస్సు స్థాయిని సాధిస్తాయని స్పష్టం చేస్తున్నారు. 2045 నాటికి ఏజీఐ టెక్నాలజీ, మానవ మేధస్సు సమానంగా పనిచేస్తాయని తెలిపారు.
‘ఏఐ’ని మించిన టెక్నాలజీ..
సిద్ధాంతపరంగా మనిషి ఏ పనిచేసినా మేధస్సును ఉపయోగించి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. మనిíÙకంటే మెరుగ్గా, చురుగ్గా పనిచేస్తేనే టెక్నాలజీకి విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)’ టెక్నాలజీ మనిషి చేసే కొన్ని నిర్దిష్ట పనులు మాత్రమే చేయగలుగుతుంది. అంటే.. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఎదురైతే హెచ్చరిస్తుంది గాని సమస్యను పరిష్కరించలేదు. వాహనాల్లో వినియోగిస్తున్న ఏఐ టెక్నాలజీ ప్రమాదాలను గుర్తించి హెచ్చరిస్తుంది గాని ఆపలేదు. ఇప్పటికే ఉన్న అనేక ఏఐ సిస్టమ్స్ సెల్ఫ్ డెవలప్‌మెంట్ కోసం, నిర్దిష్ట సమస్యలు పరిష్కరించడానికి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ లెరి్నంగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు అవసరమవుతాయి. అయితే, ఇవేమీ మానవ మెదడు సామర్థ్యాన్ని చేరుకోలేకపోయాయి. అయితే ఏజీఐ టెక్నాలజీ మాత్రం మానవ సామర్థ్యాలతో సమానంగా లేదా అంతకు మించిన కృత్రిమ మేధస్సుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీపై పరిశోధన చేస్తున్న నిపుణులు భవిష్యత్‌లో పూర్తి స్థాయి ఏజీఐ టెక్నాలజీ సాధ్యమేనంటున్నారు.
(నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి)
Comments
Please login to add a commentAdd a comment