stephen hawking
-
మానవ మేధకు మరో రూపం.. హెచ్చరించిన స్టీఫెన్ హాకింగ్!
హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ 2004లో నటించిన చిత్రం ‘ఐ–రోబోట్’ గుర్తుంది కదా! అందులో రోబోలు మానవ సైకాలజీ ఆధారంగా పనిచేస్తాయి. అమెరికాలో 2035 నాటికి ఇలాంటి పరిస్థితి ఉండొచ్చని నిర్మించిన ఊహాజనిత చిత్రమది. పరిస్థితి అంతలా కాకున్నా.. 2045 నాటికి మానవ మేధస్సుతో సమానంగా పోటీపడే సాంకేతిక పరిజ్ఞానం సాధ్యమేనంటున్నారు.. టెక్ నిపుణులు. ప్రస్తుత ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ’ని దాటి మనిషిలా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుని సమస్యలు పరిష్కరించే ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)’ టెక్నాలజీ వస్తుందంటున్నారు. హాంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ కంపెనీ 2016లో ఏఐ టెక్నాలజీతో నిర్మించిన ‘సోఫియా’ హూమనాయిడ్ రోబో ప్రోగ్రామింగ్‌కు అనుగుణంగా పనిచేస్తోంది. అలాగే యూకేకు చెందిన ఇంజనీర్డ్ ఆర్ట్స్ సంస్థ 2021 డిసెంబర్లో అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీతో నిరి్మంచిన ‘అమెకా’ హూమనాయిడ్ రోబో మానవ ముఖ కవళికలను అర్థం చేసుకోవడంతో పాటు ఎన్నో హావభావాలను పలికిస్తోంది. ఇకపై వచ్చే టెక్నాలజీ మనిíÙతో పోటీపడుతుందని.. అది ఆర్టిఫిíÙయల్ జనరల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సాంకేతికతతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు వేగంగా వస్తాయని చెబుతున్నారు. ఈ రోబోలు మానవ మేధస్సును మించిపోతే ముప్పు కూడా ఉండొచ్చని మరికొందరు హెచ్చరిస్తున్నారు. యంత్రానికి ఇంగితజ్ఞానం ఉంటే.. అది ఏజీఐ.. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషికున్న ఇంగిత జ్ఞానం (కామన్సెన్స్) యంత్రాలకు, సాఫ్ట్‌వేర్‌కు ఉండదు. ఒకవేళ యంత్రాలకే ఇంగితజ్ఞానం ఉంటే.. అది ఆరి్టఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అవుతుందని దీన్ని సమర్థించేవారు చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో ఏజీఐ అనేది సమగ్రమైన, పూర్తి కంప్యూటింగ్ సామర్థ్యాలు గల తెలివైన వ్యవస్థగా అభివరి్ణస్తున్నారు. ప్రస్తుతం ఏ పనిచేయాలన్నా టెక్నాలజీ, సాఫ్ట్వేర్ తప్పనిసరిగా మారింది. అయితే, వాటిలో సాంకేతిక సమస్య ఎదురైతే నిపుణులైన వారే సరిచేయాలి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. అయితే, టెక్నాలజీలో ఏ సమస్య ఎదురైనా ఏజీఐ గుర్తించి పరిష్కరిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆధునిక కాలంలో మనిషి చేయగల ఏ పనినైనా ఏజీఐ వ్యవస్థ చేస్తుందంటున్నారు. ప్రస్తుతానికి నూరు శాతం పనిచేసే ఏజీఐ వ్యవస్థ లేకపోయినప్పటికీ.. అత్యంత బలమైన ఈ కృత్రిమ మేధస్సును టెక్ దిగ్గజ సంస్థ ఐబీఎం తయారు చేసిన వాట్సన్ సూపర్ కంప్యూటర్లోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలోను కొంతమేర వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ ఎలాంటి డేటానైనా అద్భుతమైన వేగంతో యాక్సెస్ చేయడంతోపాటు ప్రాసెస్ చేస్తుందంటున్నారు. అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో మానవ మెదడు కంటే వందల రెట్లు వేగంగా స్పందిస్తుందని పేర్కొంటున్నారు. ఏజీఐ వ్యవస్థ ఇంగిత జ్ఞానం, నిశిత ఆలోచన, బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్, ట్రాన్స్ఫర్ లెరి్నంగ్ వంటి సామర్థ్యాలను కలిగి ఉంటుందని వివరిస్తున్నారు. అందువల్లమనిíÙలాగే సృజనాత్మకంగా ఆలోచిస్తుందని చెబుతున్నారు. ఏజీఐతో ఏ పనైనా సుసాధ్యమే.. ప్రస్తుతం ఏజీఐ టెక్నాలజీని కొన్ని విభాగాలలో కొంతమేర వినియోగిస్తున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐబీఎం వాట్సన్ సూపర్ కంప్యూటర్లు సగటు కంప్యూటర్ చేయలేని గణనలను చేయగలవని అంటున్నారు. వీటిని పూర్తిస్థాయి ఏజీఐ టెక్నాలజీతో అనుసంధానం చేస్తే విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. రోగి డేటా ఆధారంగా ఔషధాలను కూడా సిఫారసు చేయవచ్చంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వినియోగిస్తే.. రోడ్డుపై ఇతర వాహనాలు, వ్యక్తులు, వస్తువులను గుర్తించడంతో పాటు డ్రైవింగ్ నిబంధనలకు కట్టుబడి ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు. ప్రమాదాలను ముందుగానే నూరు శాతం గుర్తించి గమనాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని వివరిస్తున్నారు. ఏఐ అటార్నీగా పిలిచే ‘రోస్ ఇంటెలిజెన్స్’ (న్యాయ నిపుణుల వ్యవస్థ)లోని ఒక బిలియన్ టెక్ట్స్ డాక్యుమెంట్ల డేటాను విశ్లేషించి.. సంక్లిష్టమైన ప్రశ్నలకు మూడు సెకన్ల కంటే తక్కువ వ్యవధిలో సమాధానం చెప్పగలదని ప్రయోగాలు నిరూపించాయంటున్నారు. అయితే, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ 2014లో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘ఏజీఐ సాధ్యమే.. పూర్తి కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందితే అది మానవజాతిని అంతం చేస్తుంది. ఇది తనంత తానుగా నిర్ణయాలు తీసుకుంటుంది.. మానవులు దానితో పోటీ పడలేరు’’ అని హెచ్చరించారు. అయినప్పటికీ, కొంతమంది ఏఐ నిపుణులు ఏజీఐ టెక్నాలజీ అవసరమని భావిస్తున్నారు. దీనిపై పనిచేస్తున్న అమెరికాకు చెందిన కంప్యూటర్ సైన్స్ శాస్త్రవేత్త రే కుర్జ్వీల్ 2029కి కంప్యూటర్లు మానవ మేధస్సు స్థాయిని సాధిస్తాయని స్పష్టం చేస్తున్నారు. 2045 నాటికి ఏజీఐ టెక్నాలజీ, మానవ మేధస్సు సమానంగా పనిచేస్తాయని తెలిపారు. ‘ఏఐ’ని మించిన టెక్నాలజీ.. సిద్ధాంతపరంగా మనిషి ఏ పనిచేసినా మేధస్సును ఉపయోగించి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. మనిíÙకంటే మెరుగ్గా, చురుగ్గా పనిచేస్తేనే టెక్నాలజీకి విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)’ టెక్నాలజీ మనిషి చేసే కొన్ని నిర్దిష్ట పనులు మాత్రమే చేయగలుగుతుంది. అంటే.. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఎదురైతే హెచ్చరిస్తుంది గాని సమస్యను పరిష్కరించలేదు. వాహనాల్లో వినియోగిస్తున్న ఏఐ టెక్నాలజీ ప్రమాదాలను గుర్తించి హెచ్చరిస్తుంది గాని ఆపలేదు. ఇప్పటికే ఉన్న అనేక ఏఐ సిస్టమ్స్ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం, నిర్దిష్ట సమస్యలు పరిష్కరించడానికి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఫోర్స్మెంట్ లెరి్నంగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు అవసరమవుతాయి. అయితే, ఇవేమీ మానవ మెదడు సామర్థ్యాన్ని చేరుకోలేకపోయాయి. అయితే ఏజీఐ టెక్నాలజీ మాత్రం మానవ సామర్థ్యాలతో సమానంగా లేదా అంతకు మించిన కృత్రిమ మేధస్సుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీపై పరిశోధన చేస్తున్న నిపుణులు భవిష్యత్‌లో పూర్తి స్థాయి ఏజీఐ టెక్నాలజీ సాధ్యమేనంటున్నారు. (నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి) -
11 ఏళ్లకే ప్రపంచ మేధావులనే మించిపోయిన బుడతడు
ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న బుడతడి వయసు పట్టుమని పదకొండేళ్లు. బ్రిటన్‌కు చెందిన ఈ బాలుడి పేరు కెవిన్ స్వీనే. ఇతడి వయసు కొంచెమే గాని, తెలివితేటలు చాలా ఘనం. ఐక్యూలో ఏకంగా ఐన్‌స్టీన్‌ను, స్టీఫెన్ హాకింగ్‌ను సైతం అధిగమించి, అంతర్జాతీయ మేధావులంతా అవాక్కయ్యేలా చేసిన ఘనత ఇతడిది. ఐక్యూ పరీక్షల్లో 162 స్కోర్ సాధించి, ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లను తలదన్నడంతో కెవిన్‌కు అంతర్జాతీయ మేధావుల సంస్థ ‘మెన్సా ఇంటర్నేషనల్’ నుంచి ప్రత్యేక ఆహ్వానం లభించింది. ‘మెన్సా ఇంటర్నేషనల్’లో సభ్యత్వం దక్కాలంటే, ఐక్యూ కనీసం 98 లేదా అంతకు మించి ఉండాలి. ఎడిన్‌బరోలో గత జూలై 16న జరిగిన ఐక్యూ పరీక్షకు హాజరైన కెవిన్, ఇందులో 162 స్కోర్ సాధించాడు. ఇదివరకు ఈ పరీక్షలో ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ 160 స్కోర్ సాధించగా, ఐన్‌స్టీన్ ఎప్పుడూ ఈ పరీక్షకు హాజరవలేదు. అయితే, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఐన్‌స్టీన్ ఐక్యూ కూడా 160 ఉండేది. చదవండి: ఎక్కువసేపు కూర్చునే ఉంటారా? ఈ సమస్యలు తెలిస్తే.. స్థిమితంగా కూర్చోలేరేమో! -
ఐన్‌స్టీన్, హాకింగ్‌లకన్నా ఈ చిన్నారి బుర్ర మరింత స్మార్ట్
మెక్సికో సిటీ: ఇంటెలిజెన్స్ కోషెంట్.. దీన్నే షార్ట్‌కట్‌లో ఐక్యూ అంటారు. ఇది ఎవరైనా ఒక వ్యక్తి తెలివితేటల స్థాయిని చెప్పే ఓ కొలమానం అనొచ్చు. సమస్యలను విశ్లేషించగల, పరిష్కరించగల సామర్థ్యానికి కొలమానం ఇది. అయితే ఇప్పటి వరకు అత్యధిక ఐక్యూ ఉన్న వారి జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫేన్ హాకింగ్‌లు ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరి ఐక్యూ లెవల్స్ 160 వరకు ఉన్నట్లు ప్రచారం ఉంది. ఐక్యూ విషయంలో వీరిని మించిపోయింది మెక్సికన్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక. ఈ చిన్నారి ఐక్యూ ఏకంగా 162గా గుర్తించారు. ఆ వివరాలు.. మెక్సికోకు చెందిన అధారా పెరెజ్ (8) అనే చిన్నారి మెక్సికోలోని తలాహుక్ మురికివాడ ప్రాంతంలో నివసిస్తూ ఉండేది. అయితే మూడేళ్ల ప్రాయంలో ఉండగా అధారా అస్పెర్జర్ సిండ్రోమ్ (ఆటిజం కోవకు చెందిన వ్యాధి)బారిన పడింది. ఫలితంగా డిప్రెషన్‌తో బాధపడుతుండేది. స్కూల్‌కు వెళ్లడానికి కూడా ఇష్టపడేది కాదు. ఈ క్రమంలో అధారా తల్లిదండ్రులు ఆమెను థెరపీ కోసం సైక్రియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అధారాను పరీక్షించిన వైద్యులు చిన్నారిలో అసమాన తెలివితేటలు ఉండటం గమనించారు. (చదవండి: నో స్వెట్ సర్జరీ: గుండెపోటుతో యంగ్ బాడీ బిల్డర్ మృతి) ఈ క్రమంలో అధారాను టాలెంట్ కేర్ సెంటర్‌కు తీసుకెళ్లమని సూచించారు. అక్కడ అధారా ఐక్యూని పరీక్షించగా.. 162గా తేలింది. ఇక టాలెంట్ కేంద్రంలో ఒకే రకమైన స్కిల్స్ ఉన్న విద్యార్థులను చేర్చుకుని వారికి చదువు చెప్తారు. ఈ క్రమంలో అధారాను అక్కడ చేర్చుకున్నారు. (చదవండి: Albert Einstein Birth Anniversary: విశ్వనరుడు ఐన్‌స్టీన్) టాలెంట్ కేర్ సెంటర్లో చేరిన అధారా ఎనిమిదేళ్ల వయసు వచ్చే సరికే ఎలిమెంటరీ, మిడిల్, హై స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అంతేకాక రెండు ఆన్లైన్ డిగ్రీలు పొందింది అధారా. తన అనుభవాల గురించి తెలియజేస్తూ.. ‘డు నాట్ గివ్ అప్’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఇక మానసిక వైకల్యం ఉన్న వారి ఎమోషన్స్‌ని నిత్యం పరిశీలించేందుకు గాను ఓ స్మార్ట్ బ్రాస్లెట్ని అభివృద్ధి చేసింది. ఆస్ట్రోనాట్ అయి అంతరిక్షం వెళ్లాలని.. అంగారకుడిపై వలస రాజ్యం స్థాపించాలనేది అధారా కోరిక. (చదవండి: ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు) తన ప్రతిభ ఆధారంగా అధారా ఫోర్బ్స్ మెక్సికో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా అధారా తల్లి మాట్లాడుతూ ‘‘అస్పెర్జర్ సిండ్రోమ్ కారణంగా బాల్యంలో నా కుమార్తె ఎవరితో త్వరగా కలిసేది కాదు. ఓ సారి తను ఓ చిన్న ఇంట్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా.. ఫ్రెండ్స్ అధారాను గదిలో పెట్టి బంధించారు. బయట నుంచి తనను హేళన చేయసాగారు. ఆ రోజు నా కుమార్తె పడిన బాధ చూసి.. తనను ఒంటరిగా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఈరోజు తన తెలివితేటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. -
3 సబ్జెక్టుల్లో దాదాపు 100% కానీ..
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఫలితాల సందర్భంగా ఓ విషాద ఘటన వెలుగు చూసింది. నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి వినాయక్ శ్రీధర్ సీబీఎస్ఈ పరీక్షలో రాసిన మూడు సబ్జెక్టుల్లో దాదాపు 100 శాతం మార్కులు సాధించాడు. అయితే, కంప్యూటర్ సైన్స్, సోషల్ పరీక్షలు రాయకుండానే మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే నరాల సంబంధ వ్యాధి ముదిరి ఈ లోకం వీడివెళ్లిపోయాడు. రాసిన సబ్జెక్టులు ఇంగ్లిష్‌లో 100కు 100, సైన్స్‌లో 96, సంస్కృతంలో 97 మార్కులు సాధించాడు. రెండేళ్ల వయస్సులో అతడికి మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధి సోకింది. వీల్‌చైర్‌లోనే స్కూల్‌కు వచ్చిన అతడికి..ప్రపంచ ప్రఖ్యాత స్టీఫెన్హాకింగ్ ఆదర్శం. అంతరిక్ష శాస్త్రం చదవాలని, వ్యోమగామి కావాలని కలలు కనేవాడని తల్లి మమత చెప్పారు. -
దేవుడు లేడు.. విధీ లేదు
లండన్: ‘అసలు దేవుడే లేడు. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. మన తలరాతను ఎవరూ నిర్ణయించరు. దీనివల్ల నాకు తెలిసిందేమంటే స్వర్గమనేది లేదు. మరణానంతరం జీవితం లేదు. కేవలం మనం కోరుకోవడం వల్లే మరణానంతరం కూడా జీవితం ఉంటుందని అనుకుంటున్నాం. వీటిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సైన్స్ ముందు ఇలాంటివన్నీ తేలిపోతాయి’ అని దివంగత విఖ్యాత భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తన చివరి పుస్తకంలో పేర్కొన్నారు. ‘బ్రీఫ్ ఆన్సర్స్ టు బిగ్ క్వశ్చన్స్’ పేరిట తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని జాన్ ముర్రే అనే సంస్థ ప్రచురించింది. ‘నా లాంటి వికలాంగులు దేవుడి శాపానికి గురయ్యారని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నారు. కానీ ఇలాంటి నమ్మకాల్ని ప్రకృతి ధర్మాలు వివరిస్తాయని భావిస్తున్నా’ అని ‘ఈజ్ దేర్ గాడ్?’ అనే చాప్టర్లో హాకింగ్ వ్యాఖ్యానించారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాదిరిగా తాను కూడా ‘దేవుడు’ అనే పదాన్ని ఓ వ్యక్తికి కాకుండా ప్రకృతి ధర్మాలకు ఆపాదిస్తానని చెప్పారు. ఈ శతాబ్దం చివరి నాటికి దేవుడి మనుసులో(ప్రకృతిలో లోతుల్లో) ఏముందో తెలిసిపోతుందని అన్నారు. ఈ విశ్వం అందరికీ ఒకటేనని, దాన్ని సృష్టించేందుకు దేవుడు అక్కర్లేదని చెప్పారు. హాకింగ్ ఆలోచనలు, హాస్య చతురత, సిద్ధాంతాలు, రచనల్ని పొందుపరచిన ఈ పుస్తకాన్ని ఆయన వారసత్వ సంపదగా భావిస్తామని ఆయన కూతురు ల్యూసీ అన్నారు. ఈ పుస్తకం రాయల్టీ హక్కుల ద్వారా సమకూరే ఆదాయంలో కొంత భాగం మోటార్ న్యూరాన్ డిసీజ్ అసోసియేషన్, స్టీఫెన్ హాకింగ్ ఫౌండేషన్‌కు వెళ్తాయి. -
సూపర్ హ్యూమన్స్‌తో మానవాళి అంతం
లండన్: స్టీఫెన్ హాకింగ్.. పరిచయం అక్కర్లేని పేరు. విశ్వ ఆవిర్భావ రహస్యాలను, టైమ్ ట్రావెల్ సహా భవిష్యత్ పరిణామాలను సశాస్త్రీయంగా పండిత, పామరులకు అర్థమయ్యేలా వివరించిన భౌతిక శాస్త్రవేత్త హాకింగ్. బిగ్ బ్యాంగ్ నుంచి బ్లాక్ హోల్స్ వరకు విశ్వ రహస్యాలను వివరిస్తూ హాకింగ్ రాసిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా పాపులర్. మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతూ, వీల్ చెయిర్‌కే పరిమితమైన పరిస్థితిలోనూ ఆయన పరిశోధనలను వదల్లేదు. ఏడు నెలల క్రితమే ఈయన మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆలోచనలతో కూడిన పుస్తకం ఒకటి త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ప్రస్తుత సాధారణ మానవాళిని సమూలంగా అంతమొందించే ‘సూపర్ హ్యూమన్’ తరమొకటి రాబోతోందని ‘బ్రీఫ్ ఆన్సర్స్ టు ద బిగ్ క్వశ్చన్స్’ అనే పుస్తకంలో హెచ్చరించారు. అత్యాధునిక జన్యుసాంకేతికత సాయంతో అపార మేధోశక్తి సామర్థ్యాలతో రూపొందనున్న ఆ సూపర్ హ్యూమన్స్‌తో సాధారణ మనుషులు ఎందులోనూ పోటీ పడలేరన్నారు. ‘సూపర్ హ్యూమన్స్ జీవం పోసుకున్న తరువాత సాధారణ మానవాళికి మరణం తప్ప మరో మార్గం ఉండదు’ అని స్పష్టం చేశారు. ‘సంపన్నులు తమతో పాటు, తమ పిల్లల డీఎన్ఏలో అవసరమైన మేరకు మార్పులు చేసుకుని.. అద్భుతమైన జ్ఞాపకశక్తి, గొప్ప వ్యాధి నిరోధకత, అంతులేని మేధో శక్తి, మరింత ఆయుర్దాయం.. మొదలైన ఎంపిక చేసుకున్న లక్షణాలతో సూపర్ హ్యూమన్స్‌గా తమ సంతతిని వృద్ధి చేసుకుంటారు’ అని చెప్పారు. మేధో సామర్థ్యాన్ని, భావోద్వేగాలను మార్పు చేసుకోగల జన్యు సాంకేతికతను మన శాస్త్రవేత్తలు ఈ శతాబ్దంలోనే అభివృద్ధి చేయగలరని బలంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ముందు జాగ్రత్తగా మానవుల జన్యు క్రమంలో మార్పులు చేయడాన్ని నిషేధించేలా చట్టాలు రూపొందించాల్సి రావచ్చని కూడా ఆయన ఊహించారు. క్రిస్పర్ అనే డీఎన్ఏ ఎడిటింగ్ విధానాన్ని కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించారు. ప్రమాదకర జన్యువులను మార్చడం లేదా కొత్త జన్యువులను చేర్చడం ఆ విధానం ద్వారా సాధ్యమవుతుంది. ఇది ఆవిష్కృతమై ఆరేళ్లైంది. హాకింగ్ పేర్కొన్న ఈ సూపర్ హ్యూమన్స్ థీయరీని పలువురు శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు. ‘భూమిని, వాతావరణాన్ని.. దాని పరిమితికి మించి దుర్వినియోగపర్చాం. దాని పర్యవసానంగా రానున్న ప్రమాదరక సవాళ్లను ఎదుర్కోవడం ప్రస్తుతం మనకున్న మేధో పరిమితులతో సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో భూమిని సమూల విధ్వంసం నుంచి కాపాడేందుకు హాకింగ్ చెబుతున్న సూపర్హ్యూమన్స్ మనకు అవసరం’ అని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో క్లైమేట్ సైన్స్ బోధించే క్రిస్ రాప్లీ వ్యాఖ్యానించారు. -
ప్రజా సందర్శనకు హాకింగ్ కుర్చీ, కంప్యూటర్
లండన్: ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు చెందిన చక్రాల కుర్చీని, ఆయన సంభాషించేందుకు వాడిన ప్రత్యేక కంప్యూటర్ను ప్రజా సందర్శనకు ఉంచే అవకాశముందని బ్రిటన్‌కు చెందిన ‘ది సండే టైమ్స్’ పత్రిక తెలిపింది. హాకింగ్ స్మృతుల్ని సజీవంగా ఉంచేందుకు వీలుగా ఈ రెండింటిని ఏదైనా మ్యూజియానికి ఇచ్చే అంశాన్ని ఆయన కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారని వెల్లడించింది. లండన్‌లోని సైన్స్ మ్యూజియంలో హాకింగ్ జీవితచరిత్ర, ఉపన్యాసాల వీడియోలతో పాటు చక్రాల కుర్చీ, కంప్యూటర్ను ప్రదర్శనకు ఉంచే అవకాశముందని పేర్కొంది. హాకింగ్ వాడిన చక్రాల కుర్చీ స్వీడన్లో తయారైందనీ, ఓసారి చార్జింగ్ పెడితే ఇది గంటకు 13 కి.మీ వేగంతో 32 కి.మీ దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. -
‘విశ్వ’ శాస్త్రవేత్తకి అశ్రు నివాళి
కేంబ్రిడ్జ్ : కాలం కథను వివరించిన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(76) అంత్యక్రియలు కేంబ్రిడ్జ్ పట్టణంలో శనివారం జరిగాయి. అంతకుముందు అభిమానులు, సన్నిహితులు అశ్రునయనాలతో హాకింగ్‌కు వీడ్కోలు పలికారు. గ్రేట్ సెయింట్ మేరిస్ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మత పెద్దలు బైబిల్ చదువుతూ హాకింగ్ అంతిమయాత్ర కొనసాగించారు. హాకింగ్ పార్థివదేహం చర్చికి చేరుకోగానే అక్కడున్న గంటలను 76సార్లు మోగించారు. అంతిమయాత్రలో ఆయన మాజీ భార్య జేన్ హాకింగ్, కొడుకు టిమోథీ హాకింగ్, కూతురు ల్యూసీ హాకింగ్, హాలీవుడ్ నటుడు ఎడ్డీ రెడ్మేనే(హాకింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలో హాకింగ్ పాత్ర పోషించారు), కమెడియన్ డారా ఒబ్రెయిన్, దర్శకుడు చార్లెస్ గార్డ్, టీవీ ప్రెసెంటర్ కార్లెట్ హాకిన్, ఇతర ప్రముఖులు, పలువురు శాస్త్రవేత్తలు, విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు. హాకింగ్ అస్థికలను ఐజాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్ సమాధుల సమీపంలోనే పూడ్చిపెట్టనున్నారు. అల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత అంతటి గొప్ప శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అని గోన్విలె అండ్ కాయిస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పుస్తకంలో విద్యార్థులు రాసుకొచ్చారు. కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో? కాలం వెనుక్కు ఎందుకు నడవదు? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యత్తు ఎందుకు ముందుగా తెలియదు? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని ఆ పుస్తకంలో వ్యక్తం చేశారు. ఈ ఖగోళ శాస్త్రవేత్త మార్చి 14న కన్నుమూసిన విషయం తెలిసిందే. -
కొత్త బ్లాక్‌హోల్స్‌కు స్టీఫెన్ హకింగ్ పేరు
న్యూఢిల్లీ: రష్యన్ వ్యోమగాములు ఓ కొత్త బ్లాక్ హోల్(కృష్ణ బిలం)ను కనుగొన్నారు. తన జీవితమంతా అంతరిక్ష పరిశోధనలకు కేటాయించిన ప్రఖ్యాత బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హకింగ్ పేరును బ్లాక్ హోల్‌కు పెట్టారు. కొత్తగా కనిపెట్టిన బ్లాక్ హోల్ ఓఫికస్ నక్షత్రాలు కూటమిలో ఉన్నట్లు కనుగొన్నారు. సరిగ్గా స్టీఫెన్హకింగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత ఈ విషయం కనిపెట్టారు. మాస్కో స్టేట్‌యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొంతకాలంగా నక్షత్రాల కూటమిలో గామా కిరణాల పేలుళ్లను(జీఆర్బీ) పరిశీలిస్తున్నారు. నక్షత్రం కూలిపోవటం వల్లే పేలుడు సంభవించిందని, దాని స్థానంలో బ్లాక్ హోల్ ఏర్పడటానికి పరిస్థితులు దారితీశాయని వెల్లడించారు. గామా-రే ఖగోళ శాస్త్రంలో.. గామా-రే పేలుళ్లు చాలా శక్తివంతమైన పేలుళ్లు అని, సుదూరంలో ఉన్న గెలాక్సీలను కూడా అవి మింగేస్తాయని తెలిపారు. పేలుళ్ల సమయంలో విడుదలయ్యే శక్తిని టెలిస్కోపు ద్వారా బంధించడం కూడా దాదాపు అసాధ్యమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సెకనులోపదో వంతు నుంచి మిల్లీ సెకండ్ సమయంలో మాయమైపోతాయని చెప్పారు. కానీ అదృష్టవశాత్తు రష్యాన్ వ్యోమగాములు ఈ దృశ్యాన్ని బంధింపగలిగారని రష్యన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ శక్తివంతమైన పేలుళ్లను స్పెయిన్ దేశంలోని టెనెరిఫ్ ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన మాస్టర్-ఐఏసీ రోబోటిక్ టెలిస్కోప్ బంధించగలిగిందని తెలిపారు. బ్లాక్ హోల్‌పై పరిశోధనలకు గానూ దీనికి స్టీఫెన్హకింగ్ బ్లాక్ హోల్ అని నామకరణం చేసినట్లు రష్యన్ పరిశోధకులు, ఆస్ట్రోనామర్స్ టెలిగ్రామ్ జర్నల్‌లో పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణను జీఆర్బీ180316ఏ పేరుతో రిజిస్టర్ చేశారు. బ్లాక్ హోల్లో వెళ్లిన ఏ వస్తువులూ తిరిగి రాలేవు. కాంతిని కూడా బ్లాక్ హోల్స్ మింగేస్తాయి. స్టీఫెన్ హకింగ్(76) ఈ నెల 14న అమియోట్రోఫిక్ లాటెరల్ స్ల్కెరోసిస్- ప్రోగ్రెస్సివ్ న్యూరోడీజనరేటివ్ వ్యాధితో మరణించిన సంగతి తెల్సిందే. -
వీల్‌చైర్ నుంచి విశ్వదర్శనం
రెండో మాట మానవజాతి క్రమంగా రోదసిని నివాసయోగ్యం చేసుకోకపోతే భవిష్యత్తు ప్రమాదంలో చిక్కుకోవచ్చని హాకింగ్ ఊహించాడు. ‘ఆకస్మికంగా భూగోళం వేడెక్కిపోవడం, అణ్వస్త్ర యుద్ధాలు, కృత్రిమ పద్ధతుల ద్వారా జన్యుకణాలలో వ్యాప్తి చెందే వైరస్ తదితర ప్రమాదకర ప్రయోగాలతో భూప్రపంచంపై జీవరాశి ప్రమాద స్థితికి చేరువ కావచ్చునని హెచ్చరిం చాడు. సైన్స్, టెక్నాలజీ, రోదసీ, సౌరమండల వ్యవస్థ పరిణామాలను సాధారణ పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన బహుకొద్దిమంది శాస్త్రవేత్తలలో హాకింగ్ ఒకరు. ‘నేను నాస్తికుడిని. భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తను. ఖగోళ శాస్త్రవేత్తను. ప్రపంచ ఆవిర్భావం, దాని ఉనికికి సంబంధించిన విశ్వదర్శనంలో శిథిల శరీరంతోనే దూర తీరాలు ప్రయాణించి శాస్త్ర పరిశోధనలు కొనసాగించిన నేను సృష్టికి కారకుడు దేవుడు కాదు, దేవుడే లేడన్న నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే విజ్ఞానశాస్త్రాన్ని (సైన్స్) అర్థం చేసుకోవడానికి ముందు మానవుడు ఈ విశ్వసృష్టికి కారకుడు దైవం అని భావించడం సహజం. కానీ శరవేగాన దూసుకుపోతూ ప్రగతిమార్గంలో ఉన్న విజ్ఞానశాస్త్రం అనేక పరిశోధనల తరువాత విశ్వసృష్టికి కారణాన్ని మరింత విశ్వసనీయతతో, వైజ్ఞానికంగా వివరించసాగింది. దైవ భావన ఉద్దేశం మాకు (శాస్త్రవేత్తలు) తెలుసునంటే అర్థం ఆ దైవానికి తెలిసిన ప్రతి విషయమూ మాకు తెలుసునని చెప్పడమే, దేవుడనేవాడుంటే, గింటే! నిజానికి అతడు లేడు. కనుకనే నేను నిరీశ్వరవాదిని, నాస్తికుడిని. దైవం ఉనికిని నా శిథిల శరీరమే ప్రశ్నిస్తోంది.’ – స్టీఫెన్ హాకింగ్ (విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త. ఇటీవల కన్నుమూశారు) ‘రెండు ప్రశ్నలు: 1. భగవంతుడు సృష్టికి కారకుడా? 2. కనీసం దేవుడికి ఈ సృష్టి ఎలా జరిగిందో తెలుసా? నిజం చెప్పాలంటే సృష్టి జరిగిన తరువాత వచ్చినవాడు భగవంతుడు. కాబట్టి దేవుడు సృష్టికర్త కాజాలడు. ఈ కారణం చేతనే ఈ సృష్టి ఎలా జరిగిందన్న విషయం కూడా భగవంతుడికి తెలియదు.’ – నాసదీయ సూక్తం (రుగ్వేదం, 10వ మండలం, 129వ సూక్తి) అంటే రుగ్వేదకాలం నాటికే భారతీయ భౌతికవాదం ప్రచలితమవుతోందన్నది సుస్పష్టం. వివేచనతో, హేతుబద్ధతతో కూడిన వ్యాఖ్యానాలు ఈ భౌతికవాద ప్రపంచానికి అందుతూనే ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2–4 శతాబ్దాలలోనే గణితశాస్త్రంలో ప్రసిద్ధుడైన యూక్లిడ్‌కు ఎంతో ముందే ఈ శాస్త్రంలో కొత్తపుంతలు తొక్కి, కొత్త భావధారకు రూపురేఖలు అద్దిన త్రయం– జీనో (క్రీ.పూ. 495–435), యూడోక్సిస్ (క్రీ.పూ. 408–355), ఆర్కిమెడిస్ (క్రీ.పూ. 287–212). ముగ్గురూ గ్రీకులే. ఇక ఆర్యభట్టు (క్రీ.శ.490–599), భాస్కరాచార్య (క్రీ.శ. 6వ శతాబ్దం) భారతీయ మహా గణిత, భౌతికశాస్త్రవేత్తలు. వీరంతా ఆధునిక ప్రపంచ భౌతిక విజ్ఞాన, ఖగోళ శాస్త్రవేత్తలు, అణు విజ్ఞానశాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్, పెన్రోజ్ వీలర్, స్టీఫెన్ హాకింగ్‌లకు గౌరవనీయులైన మార్గదర్శకులే. ప్రపంచం పరస్పర ఆధారంతో ప్రభావితమవుతుందని తన సాధారణ సాపేక్ష, విశుద్ధ (ప్రత్యేక) సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, అణు శాస్త్ర విజ్ఞాన పరిధిని విస్తరించిన ఐన్‌స్టీన్ ఇటీవల దివంగతుడైన హాకింగ్‌కు గురుతుల్యుడే. కౌమారం దాటక ముందే దారుణమైన నరాల వ్యాధితో, శిథిల దేవాలయంగా మిగిలిన శరీరంతో దాదాపు 50 ఏళ్లు బతికాడు హాకింగ్. వీల్‌చైర్‌కు పరిమితమై రోదసీ, నక్షత్ర సౌర మండల పరిశోధనలను కొనసాగించడంలోని విశేషం– ఆయన మేధస్సు నిరంత పరిశోధనా తృష్ణతో ప్రకాశిస్తూ ఉండడమే. అందుకే ఇటీవలనే దక్షిణ కొరియాలో (ప్యాంగ్‌చాంగ్) జరిగిన పారాలింపిక్స్‌లో అంగ వైకల్యం కలిగిన కొందరు క్రీడాకారులు హాకింగ్‌కు ఘన నివాళి అర్పించారు. దివ్యాంగులకు హాకింగ్ గొప్ప స్ఫూర్తి. అంతకు ముందు హాకింగ్ దివ్యాంగులైన క్రీడాకారులకు ఆర్ద్ర మైన సందేశం ఇచ్చారు: ‘మీరు చూడవలసింది అంతరిక్షంలో తారాడుతున్న నక్షత్రాలకేసే. నాలా వైకల్య స్థితిలో ఉన్న మీ పాదాల కేసి మాత్రం మీ చూపులను నిలపకండి!’ విశ్వవీక్షకుడు విశ్వవీక్షణ ఫలితాలకు అక్షర రూపమిస్తూ హాకింగ్‌తో పాటే ఉంటూ, తుది పత్ర రచనకు రూపకల్పన చేసిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ థామస్ హెర్డాగ్. ఈ తుది పత్రంలోనే తన ‘బ్లాక్ హోల్స్(కృష్ణబిలాలు) సిద్ధాంతాన్ని హాకింగ్ సమర్ధించుకోవడానికి కొన్ని భావనలు చేశారు. ఈ పరిశోధనలకు అంతుండదు. అందుకే వాటిని శాస్త్రవేత్తల సమ్మతి పొందేవరకు సమాజానికి విడుదల చేయరు. మూఢ విశ్వాసులకు, మత ఛాందసులకు, వారి సంఘ వ్యతిరేక ధోరణులకు; హేతువాదానికి మధ్య తేడా, అసలు ఘర్షణ ఈ బిందువు దగ్గరే ఆరంభమవుతుందని గ్రహించాలి. భౌతిక ప్రపంచానికి పరిణామవాదమనే విలువైన కానుకను అందించిన చార్లెస్ డార్విన్ను ఇటీవలే కేంద్ర మంత్రి ఒకరు గేలి చేశారు. అలా తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. తాజాగా పదార్ధ సాంద్రత, దానిలోని శక్తి గురించి వెల్లడిస్తూ ఐన్‌స్టీన్ వెల్లడించిన (ఇ=ఎంసి స్క్వేర్) సిద్ధాంతాన్నీ, హాకింగ్ కృష్ణబిలాల సిద్ధాంతాన్ని విమర్శిస్తూ ‘అన్నీ వేదాలలోనే ఉన్నాయిష’ రీతిలో మరో కేంద్రమంత్రి హర్షవర్ధన్ చెప్పారు. అసలు సాపేక్ష సిద్ధాంతం కన్నా విశిష్టమైన సిద్ధాంతం వేదాలలోనే ఉందని హాకింగ్ చెప్పాడని కూడా ఆ మంత్రి చెప్పారు. దీనికి ఆధారాలు ఏమిటని అడిగితే అడ్డదిడ్డమైన సమాధానం చెప్పి తప్పించుకున్నారాయన. రేపు ఇలాంటి వాదనలు ఇంకా పుట్టవచ్చు. ఎందుకంటే డార్విన్ పరిణామవాదాన్ని కనీసం దశావతారాల కోణం నుంచి కూడా చూడలేని అంధులయ్యారు ఈ మూర్ఖశిఖామణులు. గొప్ప హెచ్చరిక ముందు ముందు మానవజాతి క్రమంగా రోదసిని నివాసయోగ్యం చేసుకోకపోతే భవిష్యత్తు ప్రమాదంలో చిక్కు కోవచ్చని హాకింగ్ ఊహించాడు. ఇందుకు కారణాన్ని కూడా పేర్కొన్నాడు: ‘ఆకస్మికంగా భూగోళం వేడెక్కిపోవడం, అణ్వస్త్ర యుద్ధాలు, కృత్రిమ పద్ధతుల ద్వారా జన్యుకణాలలో వ్యాప్తి చెందే వైరస్ తదితర ప్రమాదకర ప్రయోగాలతో భూప్రపంచంపై జీవరాశి ప్రమాద స్థితికి చేరువ కావచ్చునని హెచ్చరించాడు. ‘కృత్రిమ మేధస్సు’ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యంత్రాన్ని సృష్టించుకోవడం ద్వారా కొన్ని రోగాలను, దారిద్య్రాన్ని అదుపు చేయడానికి తోడ్పడవచ్చునేమోగానీ, దాని వల్ల చాలా ప్రమాదాలు, పొంచి ఉంటాయని ముందస్తుగా హెచ్చిరించినవాడు హాకింగ్. సైన్స్, టెక్నాలజీ, రోదసీ, సౌర మండల వ్యవస్థ పరిణామాలను సాధారణ పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన బహుకొద్దిమంది శాస్త్రవేత్తలలో హాకింగ్ ఒకరు. రాజకీయ పరిణామాలపై కూడా నిశిత వ్యాఖ్యలు చేయగల నిపుణ శాస్త్రవేత్త ఆయన. కనుకనే ‘బుద్ధి జాఢ్య జనితోన్మాది’గా పలువురు ప్రపంచ వ్యాఖ్యాతలు, నాయకులు ప్రెసిడెంట్ ట్రంప్‌ను అంచనా కడుతున్న పరిణామాన్ని గమనించిన హాకింగ్, ‘తన ఎన్నికకు ముందు ట్రంప్ పేదవాళ్ల ప్రతినిధిగా తనను చిత్రించుకోడానికి ప్రయత్నించిన పచ్చి వదరుబోతు’ అన్నాడు. నిజానికి మానవజాతిలో, దేశ దేశాల పాలకుల్లో ‘బ్లాక్ హోల్స్’ ఉంటారని ఊహించిన హాకింగ్ నిరంతరం ప్రజా బాహుళ్యాన్ని హెచ్చరిస్తూ సామాజిక చైతన్యాన్ని పెంచడానికి ప్రయత్నించిన కమ్యూనిస్టు– సోషలిస్టు మానవతావాది. ఆయన కుటుంబ పునాదులే సమాజవాదం, సమానత్వ సిద్ధాంతాలు. ఆయన ‘బ్లాక్ హోల్స్’ సిద్ధాంతం, ఆ ‘కృష్ణబిలాలు’ ఎంత ఆకర్షణీయమైన అంశంగా మారాయంటే అవి భౌతిక విజ్ఞాన శాస్త్రానికి చెందిన ప్రాథమిక భావనలకు నాటికీ నేటికీ పెద్ద సవాళ్లుగా మారాయి. అంతు చిక్కనివి అనేకం ఆకాశంలో మన కంటికి కనిపించేవి కొన్ని వస్తువులే. కానీ టెలిస్కోప్స్‌లో కనిపించేవి మరికొన్ని, అలాగే ఏ దృష్టికీ అంతు చిక్కనివి అనేకం. అలాంటి వాటిని కనిపెట్టే యత్నంలో లాప్లాస్, హాకింగ్‌ల పరిశోధనల్లో అందినవని భావిస్తున్న ‘కృష్ణ బిలాలు’ ఒక భాగం. ‘బ్లాక్ హోల్’ పదంలో అర్థవంతమైన ఆంతర్యం ఉంది. ఆ ‘కృష్ణ బిలం ప్రాంతం దిశగా చివరికి కాంతి కిరణం ప్రయాణించినా ఆ కిరణాన్ని పట్టుకుని బ్లాక్ హోల్ తనలోకి గుంజేసుకుం టోంది’. పదార్థం లేదా శక్తీ నశించటం ఉండదు, కానీ ఒక రూపం నుంచి మరో రూపంలోకి (రూప పరివర్తన) మారుతుంది. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న సామెత లాగా వేదాల్లో లేనిది లేదు, సర్వం వేదమయం, ప్రపంచ విజ్ఞాన శాస్త్రాలన్నింటికీ వైజ్ఞానిక కేంద్ర భూమిక వేద వాఙ్మయం– నిజమే ఒప్పుకుందాం. కానీ ఆ మహత్తర వాఙ్మయం వృద్ధిలోకి రాకుండా అడ్డుకున్నవాడెవడు? అడ్డుకునే స్వార్థపరులైన బ్రిటిష్ సామ్రాజ్య పాలకులకన్నా ముందు వైదిక శాస్త్రవాదులు మన స్వీయప్రతిభను ఎందుకు విస్తరించలేకపోయారు? వేల సంవత్సరాల వేద కాలం నాటికే చార్వాకుడు, కపిలుడు, వాత్సాయనుడు, బుద్ధుడు లాంటివారు ప్రవేశపెట్టిన హేతువాదాన్ని, భౌతికవాదాన్ని ఎందుకు ఎదగనివ్వకుండా అడ్డుకట్టలు వేయాల్సి వచ్చింది? అణువును బద్ధలుకొట్టలేమని ఒకప్పుడు పాశ్చాత్యులే నిర్ణయించి నిస్తేజులై ఉన్న సమయంలో ప్రాచీన కాలంలోనే మన కపిలుడు అణువు రహస్యాన్ని ఛేదించి ‘పేలవః పేలవః పేలవః’ సిద్ధాంతం రూఢి పరచగా, ఆ తరువాత ఆ సిద్ధాంతం ఆచరణలో ముందుకు సాగకుండా అడ్డుకున్న వారెవరు? స్వార్థ ప్రయోజనాల కోసం, ఉచితంగా ప్రజల శ్రమశక్తిని దోచుకుని సంపదను అనుభవిస్తూ యాచక వృత్తిని ఒక ఉపాధి మార్గంగా భావించి ప్రోత్సహించిన స్వార్థపర శక్తులే దేశంలో భౌతికవాద వినాశనానికి క్రమంగా గోతులు తవ్వాయి. మైథిలీ భాషావేత్త, సుప్రసిద్ధ సాహితీ, తాత్విక, భౌతికవాద ఆచార్యుడయిన పండిత హరిమోహన్ ఝా ‘దుర్గా స్తోత్ర పారాయణం’ గురించి పురాణ కాలక్షేపం చేస్తూ ‘‘రూపం ‘దేవి’/ జయం ‘దేహి’/ యశో ‘దేహి’/ ద్విషో దేహి’’ అంటూ స్తోత్రం చదువుతున్నారు. ఒకరు ప్రశ్నించాడట. అసలు ఈ యాచించే ప్రవృత్తి, సంస్కృతి ఎక్కడినుంచి వచ్చిందని. అందుకు సమాధానంగా పండితుడు ‘‘అరె అబ్బీ! ఈ రోగం చాలా పాతదిరా. వేద కాలం నుంచీ మన నాలుకల మీద ‘ద’ కూర్చుని ఉంది’’ అన్నాడు. ‘దేహి/దేహి/దేహి!’ అందరి దేవతలతో మనకున్న సంబంధం ఒకే ఒక అక్షరం ద్వారానే– ‘దే’. చివరికి ఉపనిషత్తు కూడా ‘ద, ద, ద’ (దానం/దయ/దమనం) అనే గురు మంత్రమే తీసుకొచ్చింది. ఇలా వేదం, ఉపనిషత్తు రెండింటి ముగింపు ‘ద’అక్షరంతోనే మొదలవుతుంది. చివరికి దర్శనం కూడా ‘ద’అక్షరంతోనే ఆరంభమవుతుంది. అసలు మన సంస్కృతే ‘దానం’ పైన ఆధారపడి ఉంది. అంటే, శ్రమ చేసుకోకుండా ఇలా యాచక ప్రవృత్తి (దేహి)నే బతుకులు చాలించుకోమన్న సిద్ధాంత బోధ వల్లనే దేశంలో భౌతికవాదం ఎదగకుండా స్వార్థపరులు జాగ్రత్త పడ్డారని ఝా నిర్ధారించాడు. చివరికి ప్రాచీన సాహిత్యంలో జాబాలి రాముడికి చేసిన బోధలు భౌతికవాదమే. చార్వాకాచార్యుడు భారతీయ భౌతికవాద ఆది పురుషులలో ఒకరు. హేతువును ఆశ్రయించని, నిరూపణకు నిలబడని వాదనను తిరస్కరించమన్నవాడు వివేకానంద. వ్యాసకర్త abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
తుదిదశలోనూ హాకింగ్ పరిశోధన
లండన్ : ఖగోళంలో ఎవరూ దృష్టి సారించని అంశాలపై ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఎన్నో పరిశోధనలు జరిపారు. భౌతిక శాస్రంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిన ఆయన విశ్వంలో మనిషిని పోలిన జీవులు ఉండొచ్చని తెలిపి, దానిని నిరూపించడానికి అలుపెరగని ప్రయత్నాలు చేశారు. తన పరిశోధనల సారాన్ని వివరిస్తూ ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ అనే గ్రంథాన్ని వెలువరించారు. ప్రపంచంలోని యువ శాస్త్రవేత్తలకు ఇది ఒక గొప్ప దిక్సూచిగా నిలిచింది. అతి భయంకరమైన వ్యాధితో పోరాడుతూ చక్రాల కుర్చీకే పరిమితమైనా.. మానవులకు ఏదో మేలు చేయాలనే తపన స్టీఫెన్ హాకింగ్ది. స్టీఫెన్ హాకింగ్ తుదిశ్వాస వరకు పరిశోధనలోనే నిమగ్నమయ్యారు. అందుకు నిదర్శరం తాను చనిపోవడానికి రెండువారాలకు ముందు ఆయన సమర్పించిన పరిశోధనా పత్రాలు. తాను ముందునుంచి చెబుతున్నట్టు.. విశ్వం ఒక్కటే లేదని, దానిని పోలిన విశ్వసముదాయాలు ఎన్నెన్నో ఉన్నాయని పేర్కొంటూ.. తన వాదనకు బలం చేకూర్చే సమాచారాన్ని ఈ పరిశోధనా పత్రాల్లో హాకింగ్ పొందుపర్చారు. ‘ఏ స్మూత్ ఎగ్జిట్ ఫ్రమ్ ఎటర్నల్ ఇన్ఫ్లేషన్’ పేరుతో ప్రచురించిన ఈ పత్రాలలో మానవ మనుగడ ఎక్కువ కాలం నిలవదని, వేరే సురక్షితమైన ప్రాంతానికి తరలివెళ్లక తప్పదని తాను ఎప్పటినుంచో చెబుతున్న థియరీకి సంబంధించి వివరణాత్మక విషయాలను పొందుపరిచారు. ‘ఒక పరమాణువు విస్తరించడం వల్లే నేటి విశ్వం ఆవిర్భవించింది. మనకున్న బిగ్ బ్యాంగ్ థియరీలాగే, ఇతర జీవులకు విశ్వాన్ని పోలిన ఆవాసం తప్పకుండా ఉంటుందని’ అని స్టీఫెన్ తన పరిశోధన పత్రాల్లో పేర్కొన్నారు. -
స్టీఫెన్ హాకింగ్స్ చెప్పిన జీవిత సత్యాలు..
స్టీఫెన్ హాకింగ్స్ భౌతికంగా మన మధ్యలేకపోయినా ఆయన తన మనుసుతో పలికిన ప్రతిభావం చిరస్మరణీయం. ఆయన పుస్తకం మనకు మార్గదర్శకం. హాకింగ్స్ తన జీవితంలో కేవలం సృష్టిని వివరించడమే కాదు మనిషి ఎలా ఉండాలి, మనసును ఎలా ఉంచుకోవాలి అన్న విషయాలను భావి తరాలకు అందించారు. ఆయన చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ప్రతి మనిషికి వర్తించడమే కాదు ఎలా ప్రవర్తించాలో చెబుతాయి. ‘‘పని మీ జీవితానికో అర్థాన్ని, ప్రయోజనాన్ని ఇస్తుంది..అది లేకుండా మీ జీవితం శూన్యం’’ ఇది 2010 సంవత్సరంలో ఏబీసీ వరల్డ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట. ఈ వ్యాఖ్య గురించి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ సాలీ మైట్లిస్ వివరిస్తూ.. ‘‘ఈ వ్యాఖ్య ప్రతి జీవితానికీ వర్తిస్తుంది. పని కేవలం మన కడుపునింపే ఓ అవసరం మాత్రమే కాదు మన ఆత్మ సంతృప్తినిచ్చే చక్కటి ఔషధం కూడా. మనం చేసే పనిని ప్రేమిస్తే ఆ పని ఎంత కష్టమైనా, ఎన్ని కష్టాలొచ్చినా అందులో నీకు నువ్వు చేయాల్సిన పని తప్ప కష్టం కనిపించదు. ఇది నీకు మాత్రమే కాదు నువ్వు పని చేసే సంస్థ ఉన్నతికి కూడా ఉపయోగపడుతుంది.’’ అంటారామె. ‘మీరు కెరీర్‌ను ఎంచుకోవడం ద్వారా మీ జీవితంలో కచ్చితంగా సానుకూల ప్రభావాలను కలిగి ఉంటారు.’ ఈ విషయాన్ని చాలా మంది గొప్పవాళ్లు, తత్వ శాస్త్ర నిపుణులు అంగీకరించారు. మన జీవితంలో ఒక వృత్తిని ఎంచుకోవడం ద్వారా సగం విజయం సాధించినట్టేనని వారు తెలిపారు. అది మన జీవితంలో చోటుచేసుకోబోయే మంచి పరిణామాలకు మార్గమన్నారు. -
వేదాలు గొప్పవని హాకింగే చెప్పారు
ఇంఫాల్: ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం(ఉ=ఝఛి2) కంటే మెరుగైన సిద్ధాంతం వేదాల్లో ఉన్నట్లు కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఇటీవల కన్నుమూసిన ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఈ విషయాన్ని చెప్పారన్నారు. ఇంఫాల్‌లో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్షవర్ధన్ మాట్లాడారు. ‘ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం కంటే మెరుగైన సిద్ధాంతం మన వేదాల్లో ఉండొచ్చని హాకింగ్ గతంలో పత్రికాముఖంగా తెలిపారు’ అని చెప్పారు. సమావేశం అనంతరం ఈ వాదనలకు ఆధారమేంటని విలేకరులు ప్రశ్నించగా.. వాటిని కనుక్కోవాల్సిన బాధ్యత మీదేనన్నారు. ‘హిందూ మతంలోని ఆచార, సంప్రదాయాల్లో సైన్స్ మెండుగా ఉంది. ఆధునిక భారత్‌లో ప్రతీ ఆవిష్కరణ మన పూర్వీకులు సాధించిన వాటికి కొనసాగింపే’ అని సమావేశం అనంతరం హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఇంతకుముందు 2015లో ముంబైలో జరిగిన 102వ సైన్స్ కాంగ్రెస్‌లోనూ భారత్‌లో 7,000 ఏళ్ల క్రితం విమానాలు ఉండేవనీ, వాటిద్వారా ప్రజలు వేర్వేరు దేశాలకు, గ్రహాలకు వెళ్లేవారని వేదాల్లో ఉన్నట్లు ఓ పత్రాన్ని దాఖలుచేయడం వివాదానికి దారితీసింది. -
‘విశ్వ’ విజేత
కాలేజీ రోజుల్లో అతడూ అందరిలాంటి కుర్రాడే... రోజంతా... స్నేహితులతో షికార్లు.. పార్టీలతో సరదాగా గడిపిన వాడే! తెలివైన వాడనే ఒకే ఒక్క కారణం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసే అవకాశమిచ్చింది. అయితేనేం.. ఒకసారి గురి కుదిరిన తరువాత మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు.. మనకు కనిపించని విశాల విశ్వం అంచులని తాకింది ఆయన దృష్టి.. విశ్వం ఆవిర్భావం మొదలుకొని... అన్నింటినీ తనలో కలుపుకోగల కృష్ణబిలాల వరకూ.. భౌతికశాస్త్రాన్ని ఔపోసన పట్టేశాడు. సిద్ధాంతాల చట్రంలోకి తెచ్చేశాడు. ఒళ్లు చచ్చుబడిపోయినా.. ఒకదశలో కళ్లు మినహా మరే ఇతర అవయవం పనిచేయకపోయినా... తన మేధోశక్తితో విశ్వం ఆనుపానులను సామాన్యుడి దరికి చేర్చాడు. ఈ తరం ఐన్‌స్టీన్‌గా మిగిలిపోయాడు. ‘స్టీఫెన్ హాకింగ్’పేరుతో కాలంలోకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.. సాక్షి, హైదరాబాద్: మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేది భౌతిక శాస్త్రం. నాలుగు వందల ఏళ్ల క్రితం సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వ ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం భౌతికశాస్త్ర పురోభివృద్ధికి తొలి మేలిమలుపు అయితే.. 20వ శతాబ్దం తొలినాళ్లలో ఐన్‌స్టీన్ సామాన్య సాపేక్ష సిద్ధాంతం రెండవదన్నది అందరూ అంగీకరించే విషయం. సామాన్య సాపేక్ష సిద్ధాంతం విశాల విశ్వం పనితీరుపై ఒక అవగాహన కల్పిస్తుంది. అణుస్థాయిలో భౌతిక ప్రపంచం తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు పనికొచ్చే క్వాంటమ్ మెకానిక్స్‌పై కూడా ఐన్‌స్టీన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే.. అటు విశాల విశ్వాన్ని విడమరచి చెప్పే సాపేక్ష సిద్ధాంతాన్ని.. ఇటు సూక్ష్మ ప్రపంచం ధర్మాలను వివరించే క్వాంటమ్ మెకానిక్స్‌ను కలిపింది స్టీఫెన్ హాకింగ్ కాబట్టి! భౌతిక శాస్త్రంలో ఇది మూడో మేలి మలుపని ప్రపంచం ఇప్పటికే గుర్తించడం హాకింగ్ గొప్పదనానికి నిదర్శనం. ఐన్‌స్టీన్, హాకింగ్.. వీరిద్దరిలో ఎవరు గొప్ప అన్న వాదన చాలాకాలంగా జరుగుతోంది. శాస్త్రవేత్తల కమ్యూనిటీ ఈ విషయంలో రెండుగా విడిపోయి ఉండవచ్చు కూడా. ఇద్దరినీ పోల్చి చూడటం సరికాదన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. అయితే కొన్ని విషయాల్లో ఐన్‌స్టీన్ కంటే హాకింగ్ గొప్పవాడు అనక తప్పదు. అందుకు కారణాలు ఏమిటంటే.. పట్టుమని 21 ఏళ్లు కూడా నిండకుండానే.. ‘ఇంకొన్నేళ్లలో నీకు మరణం తప్పదు’ అని ఎవరైనా అంటే.. కుప్పకూలిపోతారు.. నిరాశ నిస్పృహలతో జీవితాన్ని కొనసాగిస్తారు. స్టీఫెన్ హాకింగ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వైకల్యం ముంచుకొస్తున్న తరుణంలోనే తన మేధకు మరింత పదును పెట్టి ఖగోళశాస్త్రంలో తనదైన ముద్ర వేశాడు. అందుకే ఆయన ఒకచోట ‘‘21 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి జీవితంపై నా అంచనాలన్నీ సున్నా అయిపోయాయి. ఆ తరువాత నాకు దక్కిందంతా బోనస్’’అని అంటాడు. గొంతుకనిచ్చిన టెక్నాలజీ 1985.. హాకింగ్ జెనీవాలో పర్యటిస్తున్నారు. న్యుమోనియా బారిన పడటంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పటికే అమియోమోట్రోపిక్ లాటరల్ స్లె్కరోసిస్ (ఏఎల్ఎస్) వ్యాధితో బాధపడుతున్న హాకింగ్ శరీరం ఈ కొత్త దాడికి తట్టుకోలేకపోయింది. పరిస్థితి విషమించిన దశలో ఆయన ఊపిరి పీల్చుకునేందుకు గాను గొంతుకు రంధ్రం చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన మాట్లాడే అవకాశాన్నీ కోల్పోయారు. కొంతకాలంపాటు కనుబొమల కదలికలతో, స్పెల్లింగ్ కార్డుల సాయంతో అక్షరాలను సూచిస్తూ పదాలను నిర్మించి తన భావాలను వెల్లడించే వారు. ఈ పరిస్థితుల్లో హాకింగ్‌తో పనిచేస్తున్న మార్టిన్ కింగ్ అనే శాస్త్రవేత్త కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న వర్డ్స్ ప్లస్ అనే సంస్థను సంప్రదించారు. ఈ సంస్థ అధిపతి వూల్టోజ్ అత్తగారూ ఏఎల్‌ఎస్‌తో బాధపడుతుండేవారు. ఆమె మాట్లాడేందుకు, రాసేందుకు వీలుగా వూల్టోజ్ ఈక్వలైజర్ పేరుతో ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. హాకింగ్‌కు ఇదేమైనా ఉపయోగపడుతుందేమో అని మార్టిన్ కింగ్ వూల్టోజ్ను విచారించారు. వూల్టోజ్ ఆ ఈక్వలైజర్‌ను హాకింగ్‌కు ఉచితంగా ఇచ్చేశారు. ఆపిల్ –2 కంప్యూటర్‌పై ఈక్వలైజర్ సాఫ్ట్‌వేర్‌కు స్పీచ్ సింథసైజర్ అనే పరికరం తోడైంది. హాకింగ్‌కు సపర్యలు చేసిన ఒక నర్సు భర్త డేవిడ్ మేసన్ దీన్ని తయారు చేశాడు. చిన్నసైజులో ఉండే ఈ స్పీచ్ సింథసైజర్ హాకింగ్ చక్రాల కుర్చీ చేతిమీద అమరిపోయింది. వీటి సాయంతో హాకింగ్ నిమిషానికి 15 పదాల చొప్పున మాట్లాడటం ప్రారంభించారు. అయితే, తన బొటనవేలిని మాత్రం కదిలించేందుకు ఉపయోగపడ్డ ఒక నాడి క్రమేపీ దెబ్బతినడంతో 2008 నాటికి ఆయన మౌస్‌ను క్లిక్ చేసే సామర్థ్యాన్ని కూడా కోల్పోయారు. ఈ దశలో హాకింగ్ విద్యార్థి ఒకరు చీక్ స్విచ్ పేరుతో ఇంకో చిన్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. హాకింగ్ కళ్లజోడుకు అతుక్కునేలా రూపొందించిన ఈ పరికరం పరారుణ కాంతితో పనిచేసేది. దవడ కండరాలను బిగించడం ద్వారా ఇది మౌస్ మాదిరిగా పనిచేసేది. ఈ పరికరం సాయంతో హాకింగ్ ఈ మెయిళ్లు రాయడం మొదలుకొని ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, పుస్తకాలు రాయడం, స్పీచ్ సింథసైజర్ సాయంతో మాట్లాడగలగడం వంటి అనేక పనులు చేయగలిగారు. 2011 నాటికి పరిస్థితి మరింత క్షీణించింది. నిమిషానికి ఒకట్రెండు మాటలు మాత్రమే మాట్లాడగలిగిన స్థితికి చేరుకున్నారు. ఈ దశలో ఇంటెల్ వ్యవస్థాపకుడు గార్డన్ మూర్ సాయం అందించేందుకు ముందుకొచ్చారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జస్టిన్ రాట్నర్ కొంతమంది నిపుణుల సాయంతో హాకింగ్ ఆలోచనలనే మాటల రూపంలోకి మార్చగలిగారు. భూమిపై... ‘మనం భూమిని ఖాళీ చేయాల్సిన సమయం ఎంతో దూరంలో లేదు. మరో వందేళ్లలోనే మనం నివాసయోగ్యంగా ఉండే మరో గ్రహాన్ని వెతుక్కోవాలి. మితిమీరిన జనాభా, వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు, భూమికి అత్యంత సమీపంగా వస్తున్న గ్రహశకలాలతో ఇక భూమిపై జీవించడం దుర్లభంగా మారుతుంది’ –మరో భూమి అన్వేషణ కోసం బీబీసీ డాక్యుమెంటరీపై.. మరణంపై... మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం, నరకం అన్నవి అసలే లేవు. చావు అంటే భయం ఉన్నవారి కోసం అలాంటి కట్టు కథలు అల్లారు. మన మెదడు ఒక కంప్యూటర్ లాంటిది. కంప్యూటర్లో విడిభాగాలు పాడైతే అదెలా పనిచేయదో మెదడు కూడా అంతే.. పనిచేయడం ఆగిపోతుంది. నాకు చావంటే భయం లేదు. అలాగని వెంటనే మరణించాలని లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సింది చాలా ఉంది. జీవించి ఉన్న సమయంలోనే మనలోని శక్తి సామర్థ్యాల్ని సమర్థంగా వినియోగించుకోవాలి. –2011లో గార్డియన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హాకింగ్ 5 అద్భుత రచనలు మై బ్రీఫ్ హిస్టరీ ఇది హాకింగ్ ఆత్మకథ లాంటిది. లండన్‌లో హాయిగా సాగిన తన బాల్యం.. బెట్స్ కడుతూ తన మిత్రులతో సరదాగా గడిచిన యవ్వనం.. మేధావిగా, ప్రఖ్యాత సైద్ధాంతిక శాస్త్రవేత్తగా తన పరిణామం.. ఈ వివరాలన్నింటినీ ‘మై బ్రీఫ్ హిస్టరీ’లో ఆసక్తికరంగా హాకింగ్ వివరిస్తారు. పాఠకులకు తెలియని ఒక కొత్త హాకింగ్‌ను, సరదాపరుడు, చతురుడైన హాకింగ్‌ను ఈ పుస్తకంలో ఆయన పరిచయం చేస్తారు. ఇందులోని అరుదైన ఫొటోగ్రాఫ్‌లు పాఠకులకు అదనపు ఆసక్తిని కలిగిస్తాయి. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ భౌతిక, ఖగోళ సిద్ధాంతాలు సామాన్యులకు అర్థమయ్యే లా హాకింగ్ ఈ పుస్తకాన్ని 1988లో రాశారు. ఇందులో విశ్వం ఆవిర్భావం, విస్తరణ, అంతరిక్షం, కాలంతో పాటు గురుత్వాకర్షణ, కృష్ణబిలాలను సరళమైన రీతిలో హాకింగ్ వివరించారు. 2001 నాటికి 35 భాషల్లో తర్జుమా అయింది. ది గ్రాండ్ డిజైన్ ఈ పుస్తకాన్ని లియోనార్డ్ మ్లోడినౌ అనే మరో భౌతికశాస్త్రవేత్తతో కలసి హాకింగ్ 2010లో రచించారు. బిగ్‌బ్యాంగ్(విశ్వ ఆవిర్భావం) భౌతికశాస్త్ర నియమాల ఆధారంగానే జరిగిందనీ, ఇందులో దేవుడి పాత్రేమీ లేదని ఈ పుస్తకంలో హాకింగ్ స్పష్టం చేశారు. విశ్వం పుట్టుకను తెలుసుకునేందుకు దేవుడ్ని అన్వేషించాల్సిన అవసరం లేదన్నారు. ‘దేవుడు లేడని ఎవ్వరూ నిరూపించలేరు. కానీ సైన్స్ దేవుడి అవసరం లేకుండా చేస్తుంది’ అని అన్నారు. యూనివర్స్ ఇన్ ఏ నట్‌షెల్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకానికి సీక్వెల్‌గా హాకింగ్ దీన్ని 2001లో రాశారు. ఇందులో తన పరిశోధనలతో పాటు క్వాంటమ్ మెకానిక్స్, ఆధునిక భౌతికశాస్త్ర సిద్ధాంతాలు, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలైన ఐన్‌స్టీన్, రిచర్డ్ ఫైన్‌మెన్‌ల సిద్ధాంతాలను ఇందులో హాకింగ్ వివరించారు. ఈ పుస్తకం 2002లో అవెన్టిస్ ప్రైజ్‌కు ఎంపికైంది. జార్జ్స్ సీక్రెట్ కీ టు యూనివర్స్ కుమార్తె లూసీతో కలసి హాకింగ్ 2007లో చిన్నారుల కోసం రాసిన పుస్తకమిది. ఇందులో కాస్మోస్ అనే శక్తిమంతమైన కంప్యూటర్ సాయంతో చిన్నారులు సుసన్, రింగో, ఎరిక్, జార్జ్‌లతో పాటు డా.రీపర్ సాహసాలు చేస్తారు. కథల రూపంలో విశ్వంలోని సంక్లిష్ట అంశాలను సులభంగా అర్థమయ్యేలా హాకింగ్ ఇందులో వివరించారు. భారత్‌తో అనుబంధం తొలిసారి 2001లో భారత్‌కు వచ్చిన హాకింగ్ 16 రోజులపాటు దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో జరిగిన ఓ సెమినార్లో ప్రసంగించారు. అలాగే ‘స్ట్రింగ్స్ 2001’పేరుతో జరిగిన మరో కార్యక్రమంలో నిర్వాహకులు హాకింగ్‌ను ‘సరోజిని దామోదర్ ఫెలోషిప్’తో సత్కరించారు. హాకింగ్ చక్రాల కుర్చీని అమర్చేలా మహీంద్రా అండ్ మహీంద్రా రూపొందించిన ప్రత్యేకమైన కారులో ఆయన ముంబైలో విహరించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్, కుతుబ్మీనార్లను సందర్శించిన హాకింగ్ ఈ పర్యటనలో భాగంగా అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌ను కలుసుకుని దాదాపు 45 నిమిషాల సేపు ముచ్చటించారు. హాకింగ్‌ను కబళించిన వ్యాధి స్టీఫెన్ హాకింగ్‌కు 21 ఏళ్ల వయసులోనే అమియోట్రోపిక్ లాటరల్ స్లె్కరోసిస్ (ఏఎల్ఎస్) అనే ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు బయటపడింది. హాకింగ్ మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం బతకరని అప్పట్లో వైద్యులు చెప్పినా ఆయన మరో 50 ఏళ్లపైనే జీవించడం విశేషం. అసలు ఇంతకీ ఏంటీ ఏఎల్ఎస్ వ్యాధి.. దీనినే లౌ గెహ్రిగ్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపే అరుదైన రోగం. భారత్‌లో ఏడాదికి దాదాపు లక్ష మంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు అంచనా. ఇది కండరాలను బలహీనపరిచి ఏ చిన్న పని కూడా చేయనీదు. చికిత్సతో స్వల్ప ప్రయోజనం ఉండొచ్చు కానీ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. రోజులు గడిచేకొద్దీ వ్యాధి మరింత ముదురుతుంది. క్రమక్రమంగా కండరాలు సత్తువ కోల్పోయి నిలబడటం, మాట్లాడటం, తినడం, కదలడం చేయలేరు. కనీసం సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేరు. నరాల నుంచి మెదడుకు సంకేతాలు చేరవు. కండరాలు చచ్చుబడిపోతాయి. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన మూడు నుంచి ఐదేళ్లలోపు శ్వాసకోశ సంబంధ సమస్యలతో రోగులు చనిపోతారు. ఆస్తులు 129.75 కోట్లు - చనిపోయేనాటికి స్టీఫెన్ హాకింగ్ సంపద రూ.129.75 కోట్లు(2 కోట్ల డాలర్లు)గా ఉంది. - సిమ్సన్స్, ఫ్యుచరమా, స్టార్‌ట్రెక్: నెక్సట్ జనరేషన్, ద బిగ్‌బ్యాంగ్ థియరీ వంటి టెలివిజన్ సీరియళ్లలో హాకింగ్ పేరుతో పాత్రలను రూపొందించారు. అడుగడుగునా పోరాటమే వీల్ చైర్ నుంచే విశ్వ రహస్యాలను శోధించి... ఆత్మస్థైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితమే ఒక పోరాటం. అరుదైన వ్యాధితో పోరాడటమే కాదు, కుటుంబ జీవితంలోనూ ఆయన ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. గొప్ప శాస్త్రవేత్తగా ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హాకింగ్ విద్యార్థి జీవితం సాదాసీదాగా గడిచిపోయింది. చదువులో పెద్దగా ప్రతిభ కనబర్చకపోయినప్పటీకీ.. చిన్నారి హాకింగ్ తెలివితేటల్ని చూసి టీచర్లు మంత్రముగ్ధులయ్యేవారు. తొమ్మిదేళ్ల వయసులోనే హాకింగ్‌కు ఐన్‌స్టీన్ అనే నిక్‌నేమ్ కూడా ఉండేది. తొలుత హాకింగ్‌ను డాక్టర్ చేయాలని ఆయన తండ్రి ఆశపడ్డారు. ఇందుకోసం బయాలజీ తీసుకోవాలని ఒత్తిడి కూడా చేశారు. అయితే హాకింగ్‌కు గణితంపై అమితమైన ఆసక్తి ఉండటంతో అందులోనే డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో గణితంలో డిగ్రీకి ప్రథమ ప్రాధాన్యం లేకపోవడంతో ఆయన భౌతికశాస్త్రాన్ని ఎంచుకున్నారు. అప్పటి నుంచి భౌతిక, ఖగోళ శాస్త్రాల లోతుపాతుల్ని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ప్రేమ.. పెళ్లి 1963లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హాకింగ్‌కు జేన్ విల్డే అనే అమ్మాయితో తొలిసారి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇంతలోనే తనను అరుదైన వ్యాధి కబళిస్తోందన్న విషయం హాకింగ్‌కు తెలిసింది. ఈ విషయాన్ని విల్డేకు ఆయన తెలిపారు. ఆమె అంగీకరించడంతో వీరిద్దరూ 1965లో వివాహం చేసుకున్నారు. హాకింగ్ దంపతులకు రాబర్ట్, తిమోతి అనే ఇద్దరు కుమారులు, లూసీ అనే కుమార్తె ఉన్నారు. వివాహం అనంతరం సపర్యలు చేయడానికి వచ్చిన నర్సు ఎలైన్ మాసన్‌తో హాకింగ్ సన్నిహితంగా ఉండటంతో వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఆయనకు దూరమయ్యారు. హాకింగ్ తమకు దూరమవ్వడానికి ఎలైనే కారణమని అప్పట్లో ఆయన పిల్లలు ఆరోపించారు. అయితే వీటన్నింటిని పట్టించుకోని హాకింగ్ 1995లో ఎలైన్‌ను వివాహమాడారు. పెళ్లి తర్వాత ఎలైన్ హాకింగ్‌ను హింసిస్తోందనీ.. చెయ్యి చేసుకుంటోందని తోటి నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనమైంది. తొలుత ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హాకింగ్ ఆ ఆరోపణల్ని ఖండించడంతో కేసును క్లోజ్ చేశారు. ఎలైన్‌తో హాకింగ్ వివాహబంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. 2006లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత హాకింగ్ తన పిల్లలకు దగ్గరయ్యారు. కుమార్తె లూసీతో కలసి సైన్స్‌కు సంబంధించి ఐదు పుస్తకాలు రాశారు. హాకింగ్ పరిశోధనలు క్లుప్తంగా.. 1970 ఈ విశ్వం మొత్తం సింగుల్యారిటీ ద్వారా ఏర్పడింది. మనకు కనిపిస్తున్న గ్రహాలు, నక్షత్రాలు అన్నిరకాల ఇతర పదార్థాలు కంటికి కనిపించనంత చిన్న గుళిక స్థాయికి కుంచించుకుపోయాయనుకోండి.. అప్పుడు విశ్వం సాంద్రత, బరువు అనంతమవుతాయి. అంతరిక్షం, కాలం అన్నీ అందులోనే ఇమిడిఉంటాయి. ఈ భావనను సింగ్యులారిటీ అంటారు 1972-74 కృష్ణబిలాల యంత్రాంగం: విశ్వంలో అక్కడక్కడా అదృశ్యంగా ఉండే కృష్ణబిలాల నుంచి కూడా రేడియోధార్మికత వెలువడుతూ ఉంటుందని ప్రతిపాదన. 1981 ఇన్ఫర్మేషన్ పారడాక్స్: కృష్ణబిలంలోకి వెళ్లే పదార్థం, సమాచారం ఏదైనా సరే.. అది ఆవిరి అవడంతో ఎవరికీ అందకుండా పోతుంది. 1983 అనంత విశ్వం: అంతరిక్షం–కాలాలకు సంబంధించి ఈ విశ్వానికి సరిహద్దులు లేవు 1988 కాలం: కాలమనేది దూసుకుపోతున్న మూడు బాణాల వంటిదని హాకింగ్ అంచనా వేశారు. థెర్మోడైనమిక్స్ ఒక బాణమైతే... ఖగోళ, మానసిక సంబంధమైనవి మిగిలిన రెండు. 2006 ఈ విశ్వం వేర్వేరు స్థితుల నుంచి ఉనికిలోకి వచ్చింది. -
వినువీధిలోకి విజ్ఞాన శిఖరం
లండన్: విశ్వవిఖ్యాత ఖగోళ, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) తనువు చాలించారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వ విద్యా లయం సమీపంలోని తన ఇంట్లో బుధవారం తెల్లవారుజామున ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మా నాన్న మరణం మమ్మల్ని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ఆయన గొప్ప శాస్త్ర జ్ఞుడు. అంతకుమించి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆయన పరిశోధనలు, ఆవిష్క రణలను రాబోయే తరతరాలు గుర్తుంచుకుం టాయి. ఆయన ధైర్యం, మేధస్సు, హాస్యం ప్రపంచంలో అనేక మందిలో స్ఫూర్తి నింపాయి. నాన్న మరణం మా కుటుంబానికే కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు’ అని హాకింగ్ ముగ్గురు పిల్లలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హాకింగ్ మృతికి నివాళిగా కేంబ్రిడ్జి వర్సిటీ కాలేజ్‌లో జెండాను అవనతం చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు హాకింగ్‌కు నివాళులర్పించారు. 21ఏళ్ల వయసుకే అత్యంత అరుదైన ‘అమియోట్రోపిక్ లాటరల్ స్లె్కరోసిస్’ (ఏఎల్ఎస్) అనే వ్యాధి బారిన పడి వీల్‌చైర్‌కే పరిమితమైన హాకింగ్.. పట్టుదలతో తన శారీరక లోపాలను అధిగమించి విశ్వ రహస్యాలను ఛేదించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల సరసన చోటు సంపాదించుకున్నారు హాకింగ్. ‘మెదడు బాగా పనిచేస్తున్న తరుణంలో అవయవ లోపాలు ఉన్నంత మాత్రాన మనుషులు తమ సామర్థ్యాలకు పరిమితి విధించుకోవాల్సిన అవసరం లేదని నేను ప్రపంచానికి చాటాలనుకున్నాను’ అని హాకింగ్ గతంలో అన్న మాటలు ఆయన ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రముఖుల నివాళులు బ్రిటన్ ప్రధాని థెరెసా మే, భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాకింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘తన తరం శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ మహోన్నతమైన వారు. ఆయన కృషిని ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు. స్టీఫెన్ మెదడు అత్యద్భుతం. సంకల్పం, హాస్యం, ధైర్యాల మేళవింపు అయిన ఆయన జీవితం రాబోయే తరాల్లోనూ ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయం’ అని థెరెసా మే అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా హాకింగ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ రోజు మనం గొప్ప మనిషిని కోల్పోయాం. విజ్ఞానశాస్త్రానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అని సత్య పేర్కొన్నారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ ప్రజలు ఓటేసిన అనంతరం ఓ రోజు హాకింగ్‌కు బ్రిటన్ ప్రభుత్వం ‘ప్రైడ్ ఆఫ్ బ్రిటన్’ పురస్కారాన్ని అందజేసింది. థెరెసా మే హాజరైన ఆ సభలో హాకింగ్ మాట్లాడుతూ ‘ఎంతో కష్టమైన గణిత సమస్యలను నేను రోజూ పరిష్కరిస్తుంటాను. కానీ బ్రెగ్జిట్ లెక్కలు చేయమని మాత్రం నన్ను దయచేసి అడగొద్దు’ అని అనడంతో సభలోని వారు నవ్వు ఆపుకోలేకపోయారు. యంత్రాల సాయంతో మాట్లాడుతున్నా ఇలాంటి చలోక్తులతో హాకింగ్ ఎప్పుడూ చుట్టుపక్కల వారిని ఉల్లాసంగా ఉంచేవారు. ఆయన స్ఫూర్తిప్రదాత ప్రధాని నరేంద్ర మోదీ స్టీఫెన్ హాకింగ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, శరీరం సహకరించకపోయినా అంతరిక్ష శాస్త్రం అధ్యయనానికి ఆయన చూపిన పట్టుదల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. హాకింగ్ గొప్ప శాస్త్రవేత్త, విద్యావేత్త అని తన ట్వీటర్ సందేశంలో పేర్కొన్నారు. చెరగని ముద్ర: రాహుల్ స్టీఫెన్ మృతికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంతాపం ప్రకటించారు. తర్కం, ప్రజ్ఞ, శాస్త్రీయ జిజ్ఞాసలో ఆయన ప్రపంచానికే మార్గదర్శకుడని అన్నారు. ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారని ట్వీటర్లో పేర్కొన్నారు. శారీరకంగా ఎన్ని అవరోధాలెదురైనా ఆధునిక భౌతిక శాస్త్రంలో ఆయన అత్యంత ప్రముఖుడిగా నిలిచారని తెలిపారు. సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం పట్ల తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భౌతిక శాస్త్రంలోని అనేక విషయాలపై అధ్యయనం చేసిన హాకింగ్.. మానవాళికి విలువైన సమాచారాన్ని అందించారని కొనియాడారు. శరీరం సహకరించకున్నా, తన మేధోశక్తితో అద్భుత ఆవిష్కరణలు చేసిన హాకింగ్ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని కేసీఆర్ అన్నారు. ఓ మేధావిని కోల్పోయాం: వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ప్రపంచం ఓ మేధావిని కోల్పోయిందని సంతాప సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరణం తర్వాత జీవితం లేదనీ, స్వర్గం అనేది ఓ కట్టుకథ అన్న హాకింగ్ నమ్మకాన్ని, ఆయన రాసిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’ (కాలం కథ) అనే రచనను జగన్ గుర్తుచేశారు. అనారోగ్యంతో బాధపడుతూ, వీల్‌చైర్‌కే పరిమితమైనప్పటికీ సరికొత్త మేధో కోణాన్ని ఆవిష్కరించేందుకు హాకింగ్ చేసిన సేవలను జగన్ కొనియాడారు. ఆయన ప్రతీ కదలికలో ధైర్యం, కృతనిశ్చయం కనిపించేదన్నారు. విజ్ఞాన శాస్త్ర అవధులను తాకిన ఆయన మేధో సంపత్తికి ఘన నివాళి అర్పించారు. ఇంకొన్నాళ్లే అన్నా చదువు కొనసాగించారు.. ఏఎల్ఎస్ వ్యాధి సాధారణంగా ప్రాణాంతకమైనది. 21 ఏళ్ల వయసులో హాకింగ్‌కు ఈ వ్యాధి ఉందని బయటపడినప్పుడు ఆయన ఇంకొన్నేళ్లు మాత్రమే బతుకుతాడని వైద్యులు చెప్పారు. అయినా ఆయన దాని గురించి ఆలోచించకుండా కేంబ్రిడ్జిలో చదువు కొనసాగించారు. ఏఎల్‌ఎస్‌తో హాకింగ్ వీల్‌చైర్‌కి పరిమితమయ్యారు. ఒక చేతిలోని కొన్ని వేళ్లను మాత్రమే ఆయన కదపగలిగేవారు. ఇతరులు లేదా యంత్రాల సాయం లేకుండా కనీసం మాట్లాడటం సహా ఏ చిన్న పనీ చేసుకోలేని స్థితి. కానీ యంత్రాల సాయంతోనే ఆకట్టుకునేలా మాట్లాడుతూ సంకల్ప బలానికి, ఆసక్తికి ఓ చిహ్నంలా నిలిచారు హాకింగ్. 1970లో రోజర్ పెన్రోస్తో కలసి కృష్ణ బిలాలపై హాకింగ్ చేసిన పరిశోధనలు తొలిసారి ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టాయి. వ్యాధి సోకినట్లు కనుగొన్న తొలినాళ్లలో భార్యతో... నోబెల్ మినహా.. ఎన్నో అవార్డులు శాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకుగానూ హాకింగ్కి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. అల్బర్ట్ ఐన్‌స్టీన్ అవార్డు, వోల్ఫ్ ప్రైజ్, ద కోప్లీ మెడల్, ద ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్, కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్స్లెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, గోల్డ్ మెడల్ ఆఫ్ రాయల్ అస్ట్రోనామికల్ సొసైటీ తదితర పురస్కారాలు ఆయనను వరించాయి. హాకింగ్ బ్రిటిష్ పౌరుడై నప్పటికీ 2009లో ఒబామా అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’తో ఆయనను సత్కరించారు. తనకు ఏఎల్సీ వ్యాధి ఉందని తెలిసినప్పుడు తన ఆలోచన ఎలా ఉండేదో 2013లో ఆయన ఓ సారి చెప్పారు. ‘నాకు ఇలా జరగడం చాలా అన్యాయమని నేను బాధపడ్డాను. నా జీవితం ఇక అయిపోయిందనీ, నాలోని శక్తి సామర్థ్యాలు వృథా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు, 50 ఏళ్ల తర్వాత, నా జీవితంతో నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను’ అని ఆయన పేర్కొన్నారు. 2014లో స్టీఫెన్ హాకింగ్ జీవితంపై ‘ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్’ అని సినిమా కూడా తీశారు. ఈ సినిమాలో స్టీఫెన్ పాత్ర పోషించిన రెడ్‌మేన్‌కు ఆస్కార్ అవార్డు లభించింది. మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌తో సత్కరిస్తున్న ఒబామా నోబెల్ మాత్రం అందలేదు భౌతిక శాస్త్రం మౌలిక సూత్రాలతో విశ్వాంతరాళంలోని వస్తువులు, వాటి ఉనికిపై విశేష పరిశోధనలు చేసిన స్టీఫెన్ హాకింగ్‌కు నోబెల్ బహుమతి అందని ద్రాక్షగానే మిగిలింది. జీవితంలో ఒక్కసారైనా పొందాలని శాస్త్రవేత్తలు కలలు గనే ఆ అరుదైన గౌరవం హాకింగ్‌కు ఎందుకు దక్కలేదు? కృష్ణ బిలాలు అంతరించిపోతాయన్న ఆయన ప్రతిపాదన నిరూపణ కాకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అయితే కృష్ణ బిలాలపై హాకింగ్ పరిశోధనలను ప్రస్తుతం సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో ఆమోదిస్తున్నారు. -
అరుదైన మేధావి!
మన కాలపు మహా మేధావి... ఐన్‌స్టీన్‌కు మాత్రమే సాటిరాగల విజ్ఞానఖని స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఆద్యుడైన గెలీలియో పుట్టిన జనవరి 8న ఒక అమ్మ కడుపున జన్మించి, మరో విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ జన్మ దినం రోజైన మార్చి 14న కన్నుమూసిన హాకింగ్ భౌతిక శాస్త్రాన్నీ... ప్రత్యేకించి విశ్వనిర్మాణ శాస్త్రాన్నీ ఒడిసిపట్టినవాడు. అందులోని ఎత్తుల్నీ, లోతుల్నీ మధించి లోకులకు తేటతెల్లమైన రీతిలో విప్పి చెప్పినవాడు. ఈ భూగోళం మనుగడపైనా, ఇక్కడి మానవాళి భవిష్యత్తుపైనా ఎంతగానో బెంగపెట్టుకున్నవాడు. వీళ్లందరికీ ఒక సురక్షితమైన గ్రహాన్ని చూపించి కాపాడాలని తపన పడినవాడు. ‘ఇది ఊహ కాదు... కల్పన కాదు, నూటికి నూరుపాళ్లూ వాస్తవం. సమయం మించిపోతోంది సుమా’ అంటూ పిలుపునిచ్చినవాడు. ఎవరెలాపోతే మనకేం అనుకునే లోకంలో మానవాళి భద్రత గురించి ఇలా ఆలోచించడం వింతగానే అనిపిస్తుంది. విశ్వాంత రాళంలో మనిషిని పోలిన జీవులుండొచ్చునని పదేళ్ల క్రితం జోస్యం చెప్పి వారివల్ల ప్రమాదం ముంచుకు రావొచ్చునని హెచ్చరించినప్పుడు అందరూ ఆయన్ను వెర్రి వాడిగా లెక్కేశారు. గ్రహాంతరజీవులు(ఏలియన్స్) మనకన్నా బాగా తెలివైనవాళ్లు అయివుండొచ్చునని, ప్రయోగాల పేరిట వాళ్లని నిద్ర లేపితే ఈ భూమి మనకు కాకుండా పోవచ్చునని కూడా హాకింగ్ హెచ్చరించారు. నిత్యం అంకెలతో సావాసం చేస్తూ జీవించినంతకాలమూ వాటితో ఆడుకున్న హాకింగ్... గణితంలో ఆసక్తి ఉండే వారంతా ‘పై డే’ (22/7= 3.14)గా పిలుచుకునే రోజైన మార్చి 14నే యాదృచ్ఛి కంగా కన్నుమూశాడు. విశ్వరహస్య పేటికను ఛేదించి అందులోని ప్రతి అంశాన్నీ పామర జనానికి కూడా విప్పి చెప్పిన హాకింగ్‌ను నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే ప్రకృతి చిన్న చూపు చూసింది. కండరాల కదలికల్ని స్తంభింపజేసే మాయదారి అమియోట్రోఫిక్ లాటరల్ స్కెలరోసిస్(ఏఎల్ఎస్) అనే వ్యాధి ఆవహించి అరుదైన ఆ మేధావిని చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. అయితే అది శరీరాన్ని చేతనారహితం చేసిందే మోగానీ మెదడును తాకలేకపోయింది. ఆలోచనలకు ఆటంకాలు సృష్టించలేకపోయింది. వాటిని వ్యక్తీకరించే కంఠాన్ని నొక్కిపెట్టి ఉంచిందేమోగానీ ఆయన సంక ల్పాన్ని నిరోధించలేకపోయింది. చక్రాల కుర్చీకే అతుక్కుపోక తప్పని స్థితి ఏర్పడ్డా, ఆలోచనలు మెరుపు వేగంతో విశ్వాంతరాళాన్ని నిరంతరరాయంగా అన్వేషిస్తూనే వచ్చాయి. అందులోని వింతలనూ, విశేషాలనూ మధించాయి. ఆయన ఆత్మ స్థైర్యం ముందు ఆ మాయదారి వ్యాధి ఓడిపోయింది. అనుక్షణమూ దాన్ని ధిక్క రిస్తూ అపురూపమైన, అనూహ్యమైన సిద్ధాంతాలను ప్రతిపాదించి శాస్త్ర విజ్ఞాన ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఏఎల్ఎస్ వ్యాధి సోకింది గనుక ఇక రెండే ళ్లకు మించి బతకడని చెప్పిన వైద్యుల్ని పరిహసించడమే కాదు... అంతక్రితం ఎవరి చూపూ పడని అనేకానేక అంశాలపై దృష్టి సారించి అరుదైన ప్రతిపాదనలు చేశారు. అసంఖ్యాకంగా గ్రంథాలు వెలువరించారు. ఆయన రాసిన ‘ఏబ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ ప్రపంచవ్యాప్తంగా నలభై భాషల్లోకి అనువాదమైంది. 237 వారాలపాటు నిరంతరాయంగా లండన్ ‘సండే టైమ్స్’ బెస్ట్ సెల్లర్ గ్రంథాల్లో అగ్రభాగాన ఉంది. ప్రపంచ దేశాల్లో ఆ గ్రంథం చదివిన అనేకులు అనంతరకాలంలో శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకున్నారు. చిన్నప్పుడు తరగతి గదిలో టీచర్ పాఠం చెబుతుంటే బుద్ధిగా కూర్చుని వినే లక్షణం హాకింగ్‌కు లేదు. ఆ పాఠంలో టీచర్ కూడా గమనించని సంగతుల్ని ఇట్టే పట్టేయడం, వాటిల్లోని గుణదోషాలను చర్చించడం ఆయనకు హాబీ. కాగితం, కలంతో పనిలేకుండా కేవలం కళ్లతో చూసి చటుక్కునచెప్పే హాకింగ్ టీచర్లకు ఒక వింత. గెలీలియో త్రిశత జయంతి రోజునే పుట్టిన హాకింగ్‌కు ఆ శాస్త్రవేత్తంటే వల్ల మాలిన అభిమానం. ‘అందరూ కళ్లతో వస్తువుల్ని చూస్తారు. అందుకోసమే వాటిని వినియోగిస్తారు. కానీ ఆ వస్తువుల లోలోతుల్ని ఆరా తీసేలా కళ్లను సమ ర్ధవంతంగా వినియోగించింది గెలీలియోనే’ అని ఒక సందర్భంలో హాకింగ్ అంటాడు. చిత్రమేమంటే ఈ మాటలే ఆయనకు కూడా వర్తిస్తాయి. కృష్ణ బిలాల గురించి, వాటి పనితీరు గురించి అంచనా వేయడానికి హాకింగ్ ఒక విధానాన్ని రూపొందిం చారు. విజ్ఞాన శాస్త్రంలో అది ‘హాకింగ్ రేడియేషన్’గా గుర్తిం పుపొందింది. భౌతిక శాస్త్రంలోని ఏ రెండు విభాగాలకూ పొసగదని ఒక చమత్కారం ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని, క్వాంటమ్ మెకానిక్స్‌నూ మేళ వించి అందులోని సూక్ష్మాంశాల ప్రాతిపదికగా కృష్ణబిలాలు క్రమేపీ ద్రవ్యరాశిని కోల్పోతూ నక్షత్రాల్లాగే అవి అంతరించి పోతాయని హాకింగ్ రుజువుచేశాడు. అంతేనా... ‘మీ జీవితం ఒక కృష్ణబిలం అను కుంటున్నారా... అను కోండి. కానీ అది కూడా అంతరించిపోయి కొత్తరూపు దాల్చకతప్పదని తెలుసుకోండి’ అంటూ నిరా శావాదులకు ఆత్మవిశ్వాసం నూరి పోశాడు. ‘కిందనున్న పాదాలకేసి కాదు... నక్షత్రాలవైపు చూపు సారించండ’ని ఉద్బోధించాడు. హాకింగ్‌కొచ్చిన వ్యాధి ఎలాంటిదో, దానివల్ల ఆయన పడుతున్న యాత నేమిటో, అందుకు అలవాటుపడి ఆ పరిమితుల్లోనే ఎలా జీవనం సాగిస్తున్నాడో తెలియజెప్పే ‘ద థియరీ ఆఫ్ ఎవ్విర్‌థింగ్’ అనే చిత్రం నాలుగేళ్లక్రితం వచ్చింది. ‘మనమేం అధికులం కాదు. కోతుల్లో కాస్త అభివృద్ధిచెందిన జాతివాళ్లం’ అంటూ హెచ్చరించి మన చేష్టలతో పర్యవరణకొస్తున్న ప్రమాదాన్నీ, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తెచ్చే పరిణామాల్నీ చర్చించిన అరుదైన శాస్త్రవేత్త ఆయన. అయిదారు నెలలక్రితం ఒక చర్చ సందర్భంగా ‘ప్రజలకు రోబోలకన్నా పెట్టుబడిదారీ విధానంతోనే, అది తెచ్చే అసమానతలతోనే ముప్పు ఎక్కువ’ని హాకింగ్ చెప్పడాన్నిబట్టి ఆయన ఆలోచనాధారను అర్ధం చేసుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రంపైన మాత్రమే కాదు... సమాజగమనంపై కూడా ఆయన చూపెంత నిశితమో ఈ వ్యాఖ్య పట్టి చూపుతుంది. స్టీఫెన్ హాకింగ్‌వంటి అరుదైన మేధావిని, అపు రూపమైన శాస్త్రవేత్తను కోల్పోవడం మానవాళి చేసుకున్న దురదృష్టం. -
హాకింగ్‌కు ఎందుకు నోబెల్ రాలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : భూమిపై మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని తొలిసారిగా హెచ్చరించి వారు ఇతర గ్రహాల్లో వీలయినంత త్వరగా నివాసాలు ఏర్పాటుచేసుకోవాలని హెచ్చరించిన తొలి భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. కాలం గుట్టును శోధించేందుకు యత్నించడమే కాకుండా, కృష్ణబిలాల రహస్యాలపై అహర్నిషలు కృషిచేసిన ఆయన బుధవారం కన్నుమూశారు. మానవాళికి అద్భుతమైన సేవలు అందించి, గొప్ప పరిజ్ఞానాన్ని, ఎవరూ ఊహించని రహస్యాల గుట్టును చెప్పిన ఆయనకు ఎందుకు నోబెల్ బహుమతి రాలేదని ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. బ్లాక్ హోల్ లు చనిపోతాయి అంటూ ఆయన వెల్లడించిన కొత్త సిద్ధాంతానికైనా నోబెల్ వచ్చి ఉండాలి కదా అని ప్రశ్నించుకుంటున్నారు. కృష్ణబిలాల గురించి సంక్షిప్తంగా.. బ్లాక్ హోల్స్‌ను తెలుగులో కృష్ణ బిలాలు అని అంటారు. ఆకాశంలో మనం చుక్కలుగా పిలుచుకునే నక్షత్రాలు వాటి స్వరూపం, వయసు, పదార్థ ద్రవ్య రాశుల ఆధారంగా రకరకాల మార్పులకు లోనవుతాయి. చివర దశకు చేరుకుంటాయి. కొన్ని నక్షత్రాలు వాటిలో ఉండే హైడ్రోజన్ పూర్తిగా అయిపోయాక శక్తిని విడుదల చేయలేనివిగా మారతాయి. దాంతో నక్షత్రాలలో ఉండే హీలియం తదితర పదార్థాల కేంద్రకాలను విడిగా ఉంచే ఉష్ణ శక్తి నశిస్తుంది. దాంతో ఆ పదార్థాలన్నీ అంతరంగికంగా గురుత్వాకర్షణ బలానికి గురై ఆవగింజంత పరిమాణం (చిన్న సైజు)లోకి కుంచించుకుపోతాయి. అయితే అన్ని నక్షత్రాలూ బ్లాక్ హోల్స్‌గా మారాలని ఏమీ లేదు. సూర్యుడికంటే సుమారు ఒకటిన్నర రెట్లు ఎక్కువ పరిమాణం కలిగినట్టివే కృష్ణబిలాలుగా మారతాయని ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత, భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ ఇదివరకే సిద్ధాంతీకరించారు. నోబెల్ ఎందుకు రాలేదు? 'హాకింగ్ చెప్పిన కృష్ణబిలాలు సిద్ధాంతాన్ని కొంత అనుమానాలతో కూడిన, ఊహించదగిన భౌతిక సిద్ధాంత కేటగిరిలోకి మాత్రమే చేర్చారు. దానిని ప్రామాణికంగా ఆమోదించదగ్గ మార్గం లేదు' అని ది సైన్స్ ఆఫ్ లిబర్టీ అనే నేషనల్ జాగ్రఫిక్ మేగజిన్ రచయిత తిమోతి ఫెర్రిస్ తెలిపారు. బ్లాక్ హోల్స్ అనేవి అంతమైపోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఒక అంచనాగా చెప్పాలంటే కొన్ని బిలియన్ సంవత్సరాలకుగానీ వాటికి ఏమీ జరగదు. ఇప్పటి వరకు ఏం జరగలేదు కూడా.. అన్నింటికంటే ముందే పుట్టిన ఒక నక్షత్రం సైజు పరిమాణంలోని కృష్ణబిలానికి కూడా ఇప్పటి వరకు ఏమీ కాలేదు' అని ఆయన చెప్పారు. సైద్ధాంతిక పరంగా నిరూపించేందుకు హాకింగ్ థియరీకీ అవకాశం లేకపోయినందునే ఆయనకు బహుశా నోబెల్ రాకపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత
-
నివ్వెరపోయిన టెక్ దిగ్గజాలు
భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ మరణ వార్తతో ప్రపంచం యావత్తూ విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా టెక్నాలజీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ టెక్ దిగ్గజాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగ ప్రముఖులతోపాటు, పలువురు రాజకీయ నేతలు హాకింగ్ కన్నుమూతపై సంతాపాన్ని ప్రకటించారు. వైజ్ఞానిక రంగానికి హాకింగ్ అందించిన సేవలు అమూల్యమైనవని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. క్లిష్టమైన సిద్ధాంతాలను, భావనలను ప్రజలకు మరింత అందుబాటులో తీసుకొచ్చిన ఆయన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. ఎన్ని అడ్డంకులున్నప్పటికీ, విశ్వంపై పూర్తి అవగాహన పొందేందుకు ఆయన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ సత్య నాదెళ్ల సంతాపాన్ని ప్రకటించారు. అద్భుతమైన శాస్త్రవేత్తను, మేధావిని ప్రపంచం కోల్పోయిందంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి ట్వీట్ చేశారు. నరాల వ్యాధి (అమ్యోట్రోఫిక్ లేటరల్ క్లిరోసిస్)తో బాధపడుతూ కన్నుమూసిన హాకింగ్ మోడరన్ కాస్మోలసీ రూపకర్తగా లక్షలాదిమంది ప్రేరణగా నిలుస్తారని పేర్కొన్నారు. కాగా బ్లాక్ హోల్‌పై కీలక పరిశోధనలు చేసిన విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హాకింగ్ ఆరోగ్య సమస్యలతో ఐన్‌స్టీన్ పుట్టిన రోజునాడే బుధవారం కన్నుమూశారు. హ్యాకింగ్‌కు రాబర్ట్, లూసీ, తిమోతి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. We lost a great one today. Stephen Hawking will be remembered for his incredible contributions to science – making complex theories and concepts more accessible to the masses. He’ll also be remembered for his spirit and unbounded pursuit to gain a complet…https://t.co/z1du859Gy2 — Satya Nadella (@satyanadella) March 14, 2018 The world has lost a beautiful mind and a brilliant scientist. RIP Stephen Hawking — Sundar Pichai (@sundarpichai) March 14, 2018 -
స్టీఫెన్ హాకింగ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. భౌతికశాస్త్రంలోని అనేక విషయాలపై స్టీఫెన్ అధ్యయనం చేశారని.. స్టీఫెన్ హాకింగ్ మానవాళికి విలువైన సమాచారాన్ని అందించారని కొనియాడారు. శరీరం సహకరించకున్నా, మేథోశక్తితో అద్భుత ఆవిష్కరణలు చేసినట్లు తెలిపారు. స్టీఫెన్ హాకింగ్ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. -
ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత
-
కాలం కథ ముగిసింది...
లండన్ : నిరాటంకంగా పరుగెత్తే కాలం.. ఒక్కసారే ఆగిపోయింది. తన గురించి ఎన్నెన్నో రహస్యాలను శోధించిన శాస్త్రవేత్తను తీసుకుని తిరిగి పయనమైపోయింది. అవును. విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుడు, కాలజ్ఞాని స్టీఫెన్ హాకింగ్ (76) మరిలేరు. ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం కన్నుమూశారు. లండన్‌లోని ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ దశాబ్ధాలుగా చక్రాల కుర్చీకే పరిమితమైనా, కంప్యూటర్ సాయంతో విశేష జీవితాన్ని గడిపారాయన. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో1942, జనవరి 8న జన్మించారాయన. హాకింగ్ పూర్తిపేరు స్టీఫెన్ విలియం హాకింగ్. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీల్లో భౌతిక శాస్త్రాన్ని ఔపోసనపట్టిన ఆయన.. కృష్ణబిలాల(కాలబిలాల)పై లోతైన అధ్యయం చేశారు. ఆ క్రమంలో కాలానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో హాకింగ్ రాసిన ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్’ పుస్తకం ప్రపంచంలోనే బెస్ట్‌సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది. భూగోళంపై మనిషి గనుగడకు కాలం తీరిపోనుందంటూ హెచ్చరించిన హాకింగ్.. వీలైనంత త్వరగా ఇతర గ్రహాలపై ఆవాసాలు నిర్మించాలని గట్టిగా కోరిన సంగతి తెలిసిందే. ‘‘మరణం తర్వాత జీవితం లేదు.. స్వర్గం అనేది కట్టుకథ’’ అని ఆయన తన పుస్తకంలో చెప్పారు. అయితే నిత్యం కొత్తలోకాలకు వెళ్లాలని కోరిన ఆయన.. మనకంటే ముందే అక్కడ ఉంటారని ఆశిద్దాం. హాకింగ్ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. -
దక్షిణ ధ్రువానికి దక్షిణాన ఏముంటుంది?
ఈ ప్రశ్న ‘.. మీనింగ్లెస్’ అంటారు స్టీఫెన్ హాకింగ్. భూ మండలానికి ఆవల చిట్టచివర్న ఉన్నది దక్షిణ ధ్రువమే అయినప్పుడు, దానికి మళ్లీ దక్షిణం వైపు ఏమిటీ అని ఆయన చికాకు, లేదా చిరునవ్వు. సాధారణంగా స్టీఫెన్ ఎప్పుడూ చికాగ్గా కనిపించరు. పోప్‌లా ప్రశాంతంగా ఉంటారు! ఎప్పుడైనా ఆ చిరునవ్వుకు చికాకు కూడా తోడయిందంటే ‘లాజిక్’కి అందని అమాయకత్వం ఏదో ఆయన్ని ఎదురుగా వచ్చి ప్రశ్నించిందనే మనం అర్థం చేసుకోవాలి! స్టీఫెన్ బ్రిటిష్ ఖగోళశాస్త్రవేత్త. ఇప్పుడున్న శాస్త్రవేత్తలలో మోస్ట్ రెస్పెక్టబుల్. ఇవాళ ఆయన పుట్టిన రోజు. 76వ బర్త్‌డే. విశ్వాంతరాళాల్లో ఏముందో చెప్పగలరు స్టీఫెన్ హాకింగ్. అంతేకాదు, ఏం లేదో కూడా చెప్పగలరు! ఎంతటి శాస్త్రవేత్త అయినా ఉన్నదానిని శోధించి చెప్పగలడు కానీ, ఏం లేదో ఎలా చెప్పగలడు? కానీ స్టీఫెన్ చెప్పారు. ‘దేవుడు లేడు’ అని చెప్పాడు. ఆయన నాస్తికుడు. అందుకని దేవుడు లేడు అని చెప్పలేదు. ఆయన లాజిక్‌కి దేవుడు అందలేదు. అందుకని చెప్పారు. ఎవరు దేనిని నమ్మితే దాని నుంచే కదా ప్రపంచాన్ని చూస్తారు. స్టీఫెన్ లాజిక్‌ని నమ్మారు. లాజిక్లోంచి ఈ విశ్వాన్ని చూశారు. అందులో దేవుడు కనిపించలేదు. అదే మాట చెప్పారు. అయితే ‘నాకు కనిపించలేదు’ అని చెప్పలేదు. ‘నేను నాస్తికుడిని’ అన్నారు. ‘నమ్మను’ అని ఆ మాటకు అర్థం. ‘ఒకవేళ దేవుడు నిజంగా కనిపించినా నేను నమ్మను’ అనేది అంతరార్థం. స్టీఫెన్ వంటి నిక్కచ్చి పరిశోధకులకు దేవుడు కనిపించినంత మాత్రాన సరిపోదు. తమ పరిశోధనల్లో దేవుడికి కనీసం పాస్ మార్కులైనా రావాలి. దేవుడికి అంటే.. దేవుడి ఉనికికి. రెండేళ్ల క్రితం నవంబర్‌లో ఈ భూగోళంపై ఒక అపూర్వమైన ఘటన సంభవించింది. రెండు భిన్న ధ్రువాలు ఒకదానికొకటి బాగా సమీపానికి వచ్చాయి. ఒక ధ్రువం పోప్ ఫ్రాన్సిస్. ఇంకో ధ్రువం స్టీఫెన్ హాకింగ్. వాటికన్ సిటీలో సైన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే అక్కడికి ప్రత్యేక అతిథిగా వచ్చారు స్టీఫెన్. ఆయన్ని ప్రత్యేకంగా పలకరించడానికి వచ్చారు పోప్ ఫ్రాన్సిస్. పోప్ రావడానికి సాధారణ కారణం కూడా ఒకటి ఉంది. కాన్ఫరెన్స్ని నిర్వహిస్తున్న ‘పాంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’.. పోప్ పరిధిలోనిదే. 1935లో అప్పటి పోప్ పాయెస్ ఆ అకాడమీని నెలకొల్పారు! మేథమేటిక్స్‌లో, ఫిజిక్స్‌లో, నేచురల్ సైన్సెస్‌లో అక్కడ నిరంతరం పరిశోధనలు జరుగుతుంటాయి. చాలా చిత్రంగా ఉంటుంది ఆలోచిస్తే. దేవుణ్ణి అంగీకరించని సైన్స్‌ని.. దేవుణ్ణి నమ్మేవారు అభివృద్ధి పరచడం!! ఆ రోజు కాన్ఫరెన్స్‌లో ‘బిగ్ బ్యాంగ్’ థియరీపై మాట్లాడారు స్టీఫెన్. మహా విస్ఫోటనం (బిగ్ బ్యాంగ్) జరిగి ఈ సృష్టి ఏర్పడిందన్నది కదా... థియరీ, దానిని సమర్థిస్తూ మాట్లాడారు స్టీఫెన్. ఎవరో అడిగారు.. ‘బిగ్ బ్యాంగ్‌కి ముందు ఏముండేది ఈ విశ్వంలో మిస్టర్ స్టీఫెన్?’ అని. అప్పుడే ఆయన అన్నారు.. ‘‘సౌత్ పోల్కి సౌత్‌లో ఏముంటుందీ?’’ అని. ‘దేవుడు లేడు’ అని నిరూపించడానికి స్టీఫెన్ శాస్త్రవేత్త కాలేదు. ‘దేవుడు ఉన్నాడు’ అని చెప్పడానికే పోప్ ఫ్రాన్సిస్ ఈ భూమిపై జన్మించారేమో.. అదీ చెప్పలేం. ‘ఉంటే చూపించు’ అని అడగడం లాజిక్. ‘చూడు ఉంటాడు’ అని చెప్పడం విశ్వాసం. భూ మండలానికి ఆవల ఉన్నట్లే మానవులలోని రెండు వ్యతిరేక ధ్రువాలు.. తర్కం, విశ్వాసం. రెండిటినీ కలిపే మాట ఒకటి చెప్పారు పోప్ ఫ్రాన్సిస్. ‘బిగ్ బ్యాంగ్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ గాడ్స్ లవ్’ అని. పైకి వేర్వేరుగా ఉన్నా, లోపల ఎక్కడో ఒకచోట కనెక్ట్ అయి ఉండటమే మానవ జీవితంలోని సౌందర్యం, సంపూర్ణత్వం. ఈ రెండూ కలిసి ఉన్నదే దైవత్వం. ∙మాధవ్ శింగరాజు -
బలాంగులు
నేడు ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్’ సందర్భంగా అంగ వైకల్యం ఆశయ సాధనకు అవరోధం కాదు. మానసిక వైకల్యం మనిషి పురోగతికి లోపం కాదు. జనాభాలో చాలామందికి ఎలాంటి శారీరక వైకల్యాలూ, మానసిక వైకల్యాలూ ఉండవు. మనశ్శరీరాలను బాధించే సమస్యలు ఏవీ లేకున్నా, జీవితం గడవటానికి ఏ లోటూ లేకున్నా పుట్టినది మొదలు పోయేలోగా జీవితంలో అలాంటి వాళ్లు సాధించేదేమీ ఉండదు. దృక్పథంలోని వైకల్యాల కారణంగానే చాలామంది నిరర్థకంగా బతుకులు లాగించేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల కంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన గల వికలాంగులే మెరుగైన వాళ్లు. కుంగదీసే వైకల్యాలు ఉన్నా, వివిధ రంగాల్లో ఎవరికీ తీసిపోని ఘనవిజయాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కొందరు ప్రముఖుల గురించి... స్టీఫెన్ హాకింగ్ సమకాలీన ప్రపంచంలో సాటిలేని మేటి మేధావిగా గుర్తింపు పొందిన మనతరం మహా శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. భౌతికశాస్త్రంలోను, అంతరిక్ష శాస్త్రంలోను ఆయన సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. స్టీఫెన్ హాకింగ్ 1942 జనవరి 8న ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ నగరంలో పుట్టాడు. తండ్రి ఫ్రాంక్, తల్లి ఇసోబెల్. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ఫ్రాంక్, ఇసోబెల్ ఒక మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేవారు. ఫ్రాంక్ పరాన్నజీవుల మీద పరిశోధనలు సాగించేవాడు. ఇసోబెల్ అక్కడే సెక్రటరీగా పనిచేసేది. అక్కడి పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు స్టీఫెన్ పుట్టాడు. పుట్టినప్పుడు సాధారణంగానే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. కాలేజీలో ఉన్న కాలంలోనే ఐన్‌స్టీన్‌కు సాటి వచ్చే మేధావిగా గుర్తింపు పొందాడు. సాటి విద్యార్థులే కాదు, అధ్యాపకులు సైతం స్టీఫెన్ మేధాశక్తికి అబ్బురపడేవారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న కాలంలో మోటార్ న్యూరాన్ డిసీజ్‌కు లోనయ్యాడు. క్రమక్రమంగా వ్యాధి శరీరాన్ని లొంగదీసుకుంటుండడంతో చాలా రోజులు డిప్రెషన్లో పడ్డాడు. ఇతరుల సాయం లేనిదే నడవలేని స్థితికి చేరుకున్నాడు. మాటల్లో స్పష్టత కోల్పోయాడు. అప్పట్లో స్టీఫెన్ హాకింగ్‌ను పరీక్షించిన వైద్యులు రెండేళ్లకు మించి బతకడం సాధ్యం కాదని పెదవి విరిచేశారు. అంతరిక్ష రహస్యాల అంతు తేల్చాలన్న హాకింగ్ సంకల్పం ముందు వైద్యుల అంచనాలు తల్లకిందులయ్యాయి. దాదాపు కదల్లేని స్థితిలో ఉన్నా, పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశాడు. పూర్తిగా వీల్‌చైర్‌కు పరిమితమైన స్థితిలో సైతం భౌతిక శాస్త్రంలో, అంతరిక్ష శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి ‘ఆడమ్స్ అవార్డు’ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను, సత్కారాలను పొందాడు. శారీరక పరిస్థితి వల్ల హాకింగ్ నిమిషానికి పదిహేను పదాలను మాత్రమే మాట్లాడగలడు. అయినా, ఏమాత్రం సడలని పట్టుదలతో ప్రస్తుతం డెబ్బై అయిదేళ్ల వయసులోనూ తన కాలాన్ని శాస్త్ర పరిశోధనలకే వెచ్చిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. హెలెన్ కెల్లెర్ ఊహ తెలియని బాల్యంలోనే కంటిచూపును, వినికిడి శక్తిని కోల్పోయినా మొక్కవోని దీక్షతో రచయిత్రిగా, ఉద్యమకారిణిగా, సామాజిక సేవకురాలిగా ఎదిగిన గొప్ప మహిళ హెలెన్ కెల్లెర్. అమెరికాలో అలబామా రాష్ట్రంలోని టస్కంబియా పట్టణంలో 1880 జూన్ 27న పుట్టిందామె. ఆమె తండ్రి చార్లెస్ ఆడమ్స్ అమెరికన్ సివిల్ వార్‌లో సైనికాధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత ఒక పత్రికకు సంపాదకుడయ్యాడు. తల్లి కేట్ ఆడమ్స్ సాధారణ గృహిణి. మాటలైనా సరిగా పలకడం రాని పంతొమ్మిది నెలల వయసులో హెలెన్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఫలితంగా కంటిచూపును, వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయింది. కాస్త ఎదుగుతున్న వయసులో తన మనసులోని మాటలను సైగల ద్వారా చెప్పడానికి ప్రయత్నించేది. మొదట్లో ఆమె సైగలను వాళ్ల ఇంట్లో పనిమనిషి కూతురు ఆరేళ్ల పసిపాప మార్తా వాషింగ్టన్ మాత్రమే అర్థం చేసుకోగలిగేది. హెలెన్ తనకు ఏడేళ్ల వయసు వచ్చేనాటికి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి తనకు తానుగానే అరవై రకాల సైగలను రూపొందించుకుంది. అప్పట్లో లారా బ్రిడ్గ్మాన్ అనే బధిరాంధ మహిళ సాధించిన విజయాల గురించి ప్రఖ్యాత రచయిత చార్లెస్ డికెన్స్ రాసిన వ్యాసం హెలెన్ తల్లి కేట్‌పై ప్రభావం చూపింది. ప్రయత్నిస్తే తన కూతురు కూడా విజయాలు సాధించగలదని ఆమె విశ్వసించింది. తొలుత ఒక వైద్యుడిని సంప్రదించి, ఆయన సూచనపై టెలిఫోన్ ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ వద్దకు కూతురిని తీసుకువెళ్లింది. గ్రాహంబెల్ అప్పటికే బధిర బాలల విద్య కోసం కృషి కొనసాగిస్తున్నాడు. అతని సలహాపై పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్‌ను ఆశ్రయించింది. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ హెలెన్ కోసం ఏన్ సులివాన్ అనే టీచర్‌ను కుదిర్చాడు. హెలెన్‌కు ఏన్ ఇంటి వద్దనే పాఠాలు చెప్పేది. పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి పాఠశాల విద్య పూర్తి చేసుకున్నాక మసాచుసెట్స్‌లోని ర్యాడ్‌క్లిఫ్ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసి, అమెరికాలోనే డిగ్రీ సాధించిన తొలి బధిరాంధ మహిళగా గుర్తింపు పొందింది. డిగ్రీ పూర్తయ్యాక ఏదో ఉద్యోగం చూసుకుని స్థిరపడిపోకుండా, సాటి వికలాంగుల అభ్యున్నతి కోసం అహరహం పాటుపడింది. సామాజిక కార్యకర్త జార్జ్ ఏ కెస్లర్‌తో కలసి మూగ, బధిర, అంధ బాలల చికిత్స కోసం, అందుకు సంబంధించిన వైద్య పరిశోధనల కోసం హెలెన్ కెల్లెర్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించింది. అమెరికాలోని సోషలిస్టు పార్టీలో చేరి, మహిళలకు ఓటు హక్కు, పేదరిక నిర్మూలన వంటి పలు సామాజిక సమస్యలపై పోరాటం సాగించింది. వక్తగా, రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించింది. బీథోవెన్ పాశ్చాత్య శాస్త్రీయ సంగీత ప్రపంచంలో మైలురాయిగా నిలిచిన జర్మన్ సంగీత విద్వాంసుడు లుడ్విన్ వాన్ బీథోవెన్ ఎప్పుడు పుట్టాడో వివరాలు తెలియవు. అయితే, 1770 డిసెంబర్ 17న బాప్టిజం స్వీకరించాడు. అప్పట్లో జర్మనీ అధీనంలో ఉన్న మెషెలిన్ అనే పట్టణంలో బీథోవెన్ బాల్యం గడిచింది. ఆ పట్టణం ఇప్పుడు బెల్జియంలో ఉంది. బధిరుడైన తర్వాత కూడా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన విద్వాంసుడిగా బీథోవెన్ పేరు చరిత్రలో సుస్థిరంగా నిలిచి ఉంది. తాత పేరు పెట్టుకున్న బీథోవెన్కు సంగీతం వారసత్వంగా అబ్బింది. బాన్ నగరంలో తండ్రి జోహాన్ చిన్న చిన్న సంగీత నాటక సంస్థల్లో పనిచేసేవాడు. బీథోవెన్ తన తండ్రి దగ్గరే సంగీతంలో తొలి పాఠాలు నేర్చుకున్నాడు. ఐదారేళ్ల వయసులోనే బీథోవెన్ సంగీతంలో అపారమైన ప్రతిభ చూపేవాడు. పియానో ముందు గంటల కొద్దీ గడిపేవాడు. ఆ వయసులోనే అతడు చేసే స్వర విన్యాసాలకు సంగీత పాఠాలు చెప్పే పెద్దలు సైతం దిగ్భ్రమ చెందేవారు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలోనే స్వయంగా మూడు సొనాటాలకు స్వరకల్పన చేశాడు. అప్పటికే సంగీత దిగ్గజంగా వెలుగుతున్న మోజార్ట్ను కలుసుకునేందుకు బీథోవెన్ వియన్నా బయలుదేరాడు. అయితే, కుటుంబ సమస్యల వల్ల రెండువారాలకే అక్కడి నుంచి వెనుదిరిగి రావాల్సి వచ్చింది. కొద్ది రోజులకే తల్లి మరణించింది. మానసికంగా కుంగిపోయిన తండ్రి తాగుడుకు బానిసయ్యాడు. చిన్న పిల్లలైన ఇద్దరు తమ్ముళ్ల బాధ్యత పూర్తిగా బీథోవెన్పై పడింది. వారి బాగోగులు చూసుకుంటూ ఐదేళ్లు బాన్లోనే ఉండిపోయాడు. బాధ్యతల నుంచి తేరుకున్నాక తిరిగి వియత్నాం చేరుకున్నాడు. మోజార్ట్ అప్పటికే కాలం చేయడంతో బీథోవెన్ తన జీవితకాలంలో మోజార్ట్ను కలుసుకోలేకపోయాడు. వియన్నాలో బీథోవెన్ జీవిక కోసం పిల్లలకు సంగీత పాఠాలు చెప్పేవాడు. కచేరీలు చేసేవాడు. మరోవైపు నిద్రాహారాలను పట్టించుకోకుండా సంగీతంలో ప్రయోగాలు కొనసాగించేవాడు. ఒకనాడు సంగీత సాధనలో ఉండగానే అకస్మాత్తుగా మూర్ఛపోయాడు. స్పృహవచ్చాక తాను వినికిడి శక్తి కోల్పోయినట్లు గ్రహించాడు. ఈ ఉపద్రవం 1798లో సంభవించింది. చికిత్స తీసుకుంటున్నా, వినికిడి శక్తి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో బీథోవెన్ నిరాశలో కూరుకుపోయి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. వైద్యుల సలహాపై వియన్నా శివారు పట్టణం హీలిజెన్స్టాట్కు మకాం మార్చాడు. నెమ్మదిగా మళ్లీ సంగీత సాధనలో పడ్డాడు. బీథోవెన్ 1824లో తొమ్మిదో సింఫనీని ప్రదర్శిస్తుండగా అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న అతడి వినికిడి శక్తి పూర్తిగా పోయింది. అయినా బీథోవెన్ సంగీతానికి దూరం కాలేదు. పూర్తి బధిరుడుగా మారిన తర్వాత తన సంగీతాన్ని తానే వినలేని స్థితిలో సైతం శ్రోతలను ఉర్రూతలూగించే స్వరకల్పనలు చేశాడు. పాశ్చాత్య సంగీత ప్రపంచంలో మైలురాయిగా నిలిచిపోయాడు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ పోలియో బాధితుడు. అధ్యక్ష పదవిని అధిష్ఠించడానికి అంగవైకల్యం ఆయనకు ఏమాత్రం అవరోధం కాలేదు. పైగా అమెరికా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్న నాయకుడిగా చరిత్రను సృష్టించడం విశేషం. అంతేకాదు, టీవీ తెరపై కనిపించిన తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ 1882 జనవరి 30న న్యూయార్క్‌లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు. తండ్రి జేమ్స్, తల్లి సారా. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ నాయనమ్మ మేరీ రెబెక్కా అమెరికా ఐదో అధ్యక్షుడు జేమ్స్ మన్రో భార్య ఎలిజబెత్ మన్రోకు సోదరి వరుస. ఉన్నతస్థాయి రాజకీయ సంబంధాలు గల సంపన్న కుటుంబం కావడంతో ఫ్రాంక్లిన్ బాల్యం బాగానే గడిచింది. మసాచుసెట్స్‌లోని గ్రాటన్ బోర్డింగ్ స్కూల్లోను, అక్కడకు చేరువలోని హార్వర్డ్ కాలేజీలోను అతని చదువు సంధ్యలు సాగాయి. హార్వర్డ్ కాలేజీ నుంచి చరిత్రలో పట్టా పుచ్చుకున్నాడు. తర్వాత కొలంబియా లా కాలేజీలో చదువుకున్నాడు. చదువు పూర్తయ్యాక ఒక వాల్‌స్ట్రీట్ కంపెనీలో కొంతకాలం పనిచేశాడు. బంధువుల అమ్మాయి అయిన ఎలినార్‌ను 1905లో పెళ్లాడాడు. వారికి ఐదుగురు పిల్లలు. ఫ్రాంక్లిన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనసాగాడు. యువ నాయకుడిగా దూసుకుపోతున్న రోజుల్లో 1921లో అకస్మాత్తుగా పోలియో బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కాళ్లు చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. నడవలేని పరిస్థితిలో ఇక ఇంటికి పరిమితం కావడమే మంచిదని ఫ్రాంక్లిన్ తల్లి సారా అభిప్రాయపడింది. అయితే, ఫ్రాంక్లిన్ భార్య ఎలినార్, స్నేహితురాలు లూయీ హోవె అతడికి ధైర్యం చెప్పారు. చికిత్స కోసం రకరకాల ప్రదేశాలకు తిరుగుతూనే డెమోక్రటిక్ పార్టీ నాయకులతో సంబంధాలు కొనసాగించేవాడు. అధ్యక్ష పదవికి 1928లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీపడ్డ స్మిత్‌కు మద్దతు పలికాడు. స్మిత్ ఇందుకు ప్రతిఫలంగా అదే ఏడాది న్యూయార్క్ గవర్నర్ ఎన్నికల్లో ఫ్రాంక్లిన్‌ను బరిలోకి దించాడు. అధ్యక్ష ఎన్నికల్లో స్మిత్ పరాజయం చెందినా, న్యూయార్క్ గవర్నర్ ఎన్నికల్లో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అతి స్వల్ప ఆధిక్యతతో గెలుపొందాడు. ఫ్రాంక్లిన్ గవర్నర్ అయిన ఏడాదిలోగానే ఆర్థికమాంద్యం దెబ్బకు వాల్‌స్ట్రీట్ కుదేలై, వేలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పరిస్థితి చక్కదిద్దడానికి ఆయన చరిత్రలోనే తొలిసారిగా నిరుద్యోగ బీమా ప్రవేశపెట్టారు. తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టి, 1932 నాటి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి 1933లో అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత మరో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లోనూ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తాను 1945లో మరణించేంత వరకు ఈ పదవిలో కొనసాగారు. ఫ్రాంక్లిన్ హయాంలోనే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. జపాన్ పెర్ల్ హార్బర్‌పై దాడి చేయడంతో అమెరికా జపాన్‌పై యుద్ధం ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉన్నప్పుడు పదవిలో కొనసాగుతుండగానే 1945 ఏప్రిల్ 12న ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కన్నుమూశారు. థామస్ అల్వా ఎడిసన్ ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతమైన ఆవిష్కర్తగా, విజయవంతమైన వాణిజ్యవేత్తగా గుర్తింపు పొందిన థామస్ అల్వా ఎడిసన్ ప్రమాదవశాత్తు బాల్యంలోనే బధిరుడయ్యాడు. అతడు సాధించిన శాస్త్ర సాంకేతిక, వ్యాపార విజయాలకు బధిరత్వం అవరోధం కాలేదు. థామస్ ఎడిసన్ 1847 ఫిబ్రవరి 11న అమెరికా ఓహాయో రాష్ట్రంలోని మిలాన్ నగరంలో శామ్యూల్, నాన్సీ దంపతులకు పుట్టాడు. వారి ఏడుగురు సంతానంలో థామస్ చివరివాడు. డచ్ సంతతికి చెందిన శామ్యూల్ పూర్వీకులు కెనడా నుంచి బతుకుదెరువు వెదుక్కుంటూ అమెరికాకు వలస వచ్చారు. శామ్యూల్ చిన్నా చితకా వ్యాపారాలు చేసేవాడు. మిలాన్‌లో వ్యాపారం దెబ్బతినడంతో కుటుంబంతో పాటు మిషిగాన్ చేరుకున్నాడు. అక్కడే థామస్‌ను స్కూల్లో చేర్చారు. ఎంత చెప్పినా అతడు పాఠాలను ఏమాత్రం తలకెక్కించుకోవడం లేదని టీచర్లు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లి నాన్సీ కొడుకును స్కూలు మాన్పించింది. ఇంట్లోనే అతడికి పాఠాలు బోధించడం ప్రారంభించింది. ఒకవైపు ఇంట్లో చదువుకుంటూనే ఇంటికి ఆసరాగా ఉండటానికి లోకల్ ట్రైన్లలో క్యాండీలు, న్యూస్‌పేపర్లు అమ్మేవాడు. పదహారేళ్ల వయసులో గ్రాండ్ ట్రంక్ రైల్వే సంస్థలో కొంతకాలం టెలిగ్రాఫ్ ఆపరేటర్‌గా పనిచేశాడు. ఆ పని మానేశాక మిషిగాన్‌లో వీధి పక్కన న్యూస్‌పేపర్లు అమ్మే హక్కులను సొంతం చేసుకున్నాడు. న్యూస్పేపర్ల అమ్మకాల కోసం నలుగురు అసిస్టెంట్లను నియమించుకున్నాడు. కాగితంపై టైప్‌రైటర్‌తో ముద్రించిన కథనాలతో ‘గ్రాండ్ ట్రంక్ హెరాల్డ్’ అనే స్థానిక పత్రికను తెచ్చాడు. ఒకవైపు వ్యాపారాలతో ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే, మరోవైపు సొంతగా శాస్త్ర సాంకేతిక ప్రయోగాలను కొనసాగించేవాడు. కొన్నాళ్లకు న్యూజెర్సీలోని నెవార్క్‌కు మకాం మార్చి, శాస్త్ర పరిశోధనలను మరింత ముమ్మరం చేశాడు. ఏ విద్యాసంస్థలోనూ అధికారికంగా చదువుకోకున్నా, స్వయంకృషితోనే శాస్త్రవేత్తగా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పురోగతినే మలుపుతిప్పిన విద్యుత్తు బల్బు, ఫోనోగ్రాఫ్, మోషన్ పిక్చర్, విద్యుత్ సరఫరా వ్యవస్థ, బ్యాటరీ, రబ్బర్ టైర్లు వంటి ఆవిష్కరణలను అందించాడు. అమెరికాతో పాటు పలు యూరోప్ దేశాల్లో తాను రూపొందించిన వస్తువులకు వందలాది పేటెంట్లు పొందిన ఎడిసన్ 1931 అక్టోబర్ 18న డయాబెటిస్తో బాధపడుతూ కన్నుమూశాడు. – పన్యాల జగన్నాథదాసు -
అగ్నిగోళంగా భూమి..ఇక బతకలేం..
బీజింగ్: భూగోళం 600 ఏళ్లలోపే అగ్నిగోళంలా, నిప్పుల బంతిగా మారుతుందని ప్రముఖ భౌతికశాస్ర్తవేత స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. పెరుగుతున్న జనాభా, విచ్చలవిడి విద్యుత్ వినియోగంతో మానవజాతి భూమిమీద అంతరించిపోతుందని చెప్పారు. మానవ జాతి సజీవంగా మిగలాలంటే జనం మరో గ్రహానికి వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. బీజింగ్‌లో జరుగతున్న టెన్సెంట్ ప్రపంచ ఇంధన సదస్సులో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌర వ్యవస్థకు వెలుపలి మండలానికి దగ్గరగా ఉన్న నక్షత్రానికి జీవజాతులు తరలేలా ఇన్వెస్టర్లు చొరవ చూపాలని హాకింగ్ కోరినట్టు ది సన్ పత్రిక వెల్లడించింది. అల్ఫా సెంటారి అనే నక్షత్రంలో భూమి మాదిరిగానే జీవజాలం మనుగడ సాగించవచ్చని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. రెండు దశాబ్ధాల్లో చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా కాంతి వేగంతో ఈ వ్యవస్థలోకి వెళ్లవచ్చని హాకింగ్ చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మానవ జాతిని మింగేస్తుందని హాకింగ్ ఇప్పటికే మానవాళిని హెచ్చరించారు. కృత్రిమ మేథతో మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆయన వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.