లండన్: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ ఏలియన్ల గురించి మరోసారి మానవాళిని హెచ్చరించారు. ఏదైనా కొత్త ప్రదేశాన్ని, జీవరాశులను కనిపెడితే మనం(మానవులు)సంతోషిస్తారని, ఏలియన్లు అలా భావించకపోవచ్చని అన్నారు. మనుషుల గురించి ఏలియన్లకు తెలిస్తే మన కంటే టెక్నాలజీ వినియోగంలో ఎన్నో రెట్లు ముందున్న వారు భూమిని నాశనం చేసే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యనించారు.
హ్యాకింగ్స్ నిర్మించిన సరికొత్త చిత్రం 'స్టీఫెన్ హ్యాకింగ్స్ ఫేవరేట్ ప్లేసెస్' ద్వారా ఈ మెసేజ్ ను ఆయన ప్రపంచానికి తెలియజేశారు. కొలంబస్ మొదటిసారి అమెరికాను కనుగొన్నప్పుడు అక్కడి వారు ఆయనపై దాడి చేసినట్లు.. ఏలియన్లు మానవుల గురించి తెలుసుకున్నప్పుడు కూడా అలానే ప్రవర్తించే అవకాశం ఉందని చెప్పారు.
స్టీఫెన్ హ్యాకింగ్స్ నిర్మించిన చిత్రం వీక్షించేవారిని ఆయన విశ్వంలోని ఐదు ప్రదేశాలకు అంతరిక్షనౌక ద్వారా తీసుకువెళతారు. భూమికి 16 కాంతి సంవత్సారాల దూరంలో ఉన్న, నివాసయోగ్యమైన గ్లీస్ 832సీ అనే గ్రహాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు. ఏదో ఒక రోజు సినిమాలో చూపినట్లు గ్లీస్ 832సీ లాంటి గ్రహం నుంచి భూమికి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఆ సిగ్నల్స్ కు సమాధానం ఇవ్వడంపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వయసు పెరిగేకొద్దీ భూమి మాత్రమే విశ్వంలో జీవరాశి కలిగిన గ్రహం కాదనే తన నమ్మకం బలపడుతోందని చెప్పారు. ప్రయోగాలతో యుక్తవయసును గడిపేసిన తాను ప్రస్తుతం ఏలియన్లను కనుగొనడానికి సాయం చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది కూడా విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయని హ్యాకింగ్స్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఏలియన్లతో సంబంధాలు వద్దు: హ్యాకింగ్
Published Sun, Sep 25 2016 3:54 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
Advertisement
Advertisement